చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు
చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు
నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్
నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్
నరసరావుపేట :- 2024 ఎలక్షన్ పల్నాడు జిల్లాలో చాలా రసవంతంగా జరిగేలా ఉన్నాయి. పొద్దున వరకు హాట్ టాపిక్ గా నిలిచిన చిలకలూరిపేట రాజకీయం, ఉన్నట్టుండి ఒక్కసారిగా నరసరావుపేటలో కూడా రాజకీయాలు వేడెక్కాయి.
వివరాల్లోకి వెళితే నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పార్టీ కార్యక్రమంలో భాగంగా ఐదో వార్డ్ క్రిస్టియన్ పాలెం లో ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఒకరినొకరు బాహబాహీ కి దిగారు. అది కాస్త ముదిరి సీసాలు రాళ్లతో దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనల్లో టిడిపి కార్యకర్తలకు గాయాలు అవ్వగా వారిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అనంతరం ఈ ఘటనకు నిరసనగా టిడిపి శ్రేణులు భారీ ఎత్తున గడియార స్తంభం సెంటర్ వద్ద భారీ ర్యాలీని చేపట్టారు. దీంతో నరసరావుపేటలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Follow this link:
https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp
చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు
చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు
చిలకలూరిపేట :- మల్లెల రాజేష్ టికెట్ విషయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన తెలిపిన వైసీపీ కార్యకర్తలు
చిలకలూరిపేట :- మల్లెల రాజేష్ టికెట్ విషయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన తెలిపిన వైసీపీ కార్యకర్తలు
చిలకలూరిపేట :- పట్టణంలోని బ్యాంకు కాలనీ నందు ఉన్న వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా మల్లెల రాజేష్ నాయుడు అసెంబ్లీ రేసు నుంచి తప్పిస్తున్నారు అన్న పరిణామాలకు మనస్థాపానికి గురైన ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని నిరసనను తెలియజేశారు. రాజేష్ నాయుడు కి టికెట్ ఇవ్వకపోతే తాము పెట్రోల్ పోసుకొని ఆత్మహతికి పాల్పడతామని వారు తెలిపారు. మల్లెల రాజేష్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమయమనం పాటించాలని ఇలాంటి అవాంతర ఘటనకు పాల్పడవద్దని టికెట్టు తనకు దక్కిన దక్కకపోయినా చిలకలూరిపేట నుంచి ఎవరు నుంచున్న కూడా కార్యకర్తలందరూ వైసిపి గెలుపుకి పనిచేయాలని ఆయన తెలిపారు.
Follow
దమ్ముంటే విడదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు
దమ్ముంటే విడదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు
చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం
చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం
చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి పార్టీలో రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది. ఇప్పటికే చిలకలూరిపేట సమన్వయకర్తగా ఉన్నటువంటి మల్లెల రాజేష్ నాయుడు పోటీపై భిన్నభిప్రాయాలు చర్చిలు జరుగుతూ ఉండటం దీనికి కారణం. సమన్వయకర్తగా రాజేష్ నాయుడు పేరు ప్రకటించినప్పటి నుండి కూడా వారానికి 10 రోజులకు ఒకసారి పోటీ చేసే వ్యక్తిపై భిన్నభిప్రాయాలు వ్యక్తం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పుకార్లను షికారులుగా చేసేది ప్రత్యథి పార్టీ అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదేమో... సొంత పార్టీలోని నేతలు, క్యాడర్ పోటీ చేసే వ్యక్తి మారుతారని మొదటి నుంచి ప్రచారం చేయడంతో 2019 ఎలక్షన్ తర్వాత బలంగా ఉన్న క్యాడర్ ఏ వర్గం వైపు ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. తాజాగా నేడు వైయస్ఆర్సీపీ 14 ఆవిర్భావ వేడుకలలో సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు వ్యాఖ్యలు చర్చనీయాంసంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "కొత్తవారు వస్తుంటారు పోతుంటారు, నేను లోకల్ గెలిచినా ఓడినా నేను మీతోనే ఉంటాను" అని ఎలాగైనా సరే వైసిపి తరఫున తాను పోటీ చేసి తీరుతానని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో టికెట్ ఖరారు పై ఇంకా స్పష్టత రాలేదని పోటీ చేసే అభ్యర్థిని మారుస్తున్నారని ఉదయం నుంచి ఈ వార్త ధారాళంగా పట్టణ ప్రధాన సెంటర్లలో మారుమోగుతుంది. కొన్ని రోజుల క్రితం అంబటి రాంబాబు తీసుకువస్తారని ఇప్పుడు తాజాగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు నీ చిలకలూరిపేట వైపు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని బోగొట్ట. ఏది ఏమైనా ఈ పరిణామాలతో వైసిపి కేడర్ గందరగోళం లో పడిందని చర్చించుకుంటున్నారు. మర్రి రాజశేఖర్, జాన్ సైదా, మల్లెల రాజేష్ నాయుడు కొంతమంది బలమైన లీడర్స్ ఉండగా బయట నుండి వ్యక్తులను తీసుకురావడం సబబేనా అని పార్టీలోని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
Follow this link to join my WhatsApp group:
ఈశ్వర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ హత్యని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి, అసలు హత్యకు దారి తీసిన కారణం ఇదేనా ?
ఈశ్వర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ హత్యని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి, అసలు హత్యకు దారి తీసిన కారణం ఇదేనా ?
మేనల్లుడే కాలయముడయ్యాడు. వ్యక్తిగత కక్షతో సొంత మామను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. మాజీ ప్రిన్సిపాల్ మూర్తిరావు హత్య కేసు.. అనంతను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈలోపు మరో విషాదం చోటు చేసుకుంది. భర్త మృతి తట్టుకోలేక.. ఆయన భార్య శోభ సైతం గుండెపోటుతో కన్నుమూశారు.
పోలీసులు తెలిపిన సమాచారం మేరకు… అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్‌టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ పనిచేశారు. ఐదారు నెలలుగా కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు.
భార్య కళ్లెదుటే దారుణం..
జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం ఎదురుగా మూర్తిరావుకు షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. అన్నింటినీ అద్దెకు ఇచ్చేసి నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబసభ్యులతో కలసి ఉంటున్నారు. ఈ క్రమంలో తన ఇంట్లో నివాసముంటున్న మణికంఠ ఇల్లు ఖాళీ చేసి ఆదివారం మూర్తిరావుకు ఫోన్ చేశాడు. వచ్చి ఇంటిని పరిశీలించుకుని తాళం తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో తన భార్య శోభాతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు.
అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు (58) గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా… నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు.
హతుడి పక్కనే కూర్చొని..
మూర్తిరావును హతమార్చిన అనంతరం నేరుగా ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్‌కు ఆదిత్య వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, నేరుగా మూర్తిరావు మృతదేహం వద్దకు చేరుకుని పక్కనే కూర్చొని ఉండిపోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్‌లర్‌లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.
వివాదరహితుడు
మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్‌టీయూఏలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి పీహెచ్‌డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్‌టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ… శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్ ఉద్యోగిగా స్థిరపడ్డారు.
Follow this link to join my WhatsApp group:
ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య
ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య
చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి
చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి
మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?
మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?
మరిన్ని వార్తలను వేగంగా పొందడం కోసం క్రింది లింకు పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?
చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?
చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం
చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం
కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి - నేలకొరిగిన యడవల్లి ప్రభ
కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి - నేలకొరిగిన యడవల్లి ప్రభ
పల్నాడు జిల్లా :- 2024 కోటప్పకొండ తిరునాళ్ల కోలాహలం రంగ రంగ వైభవంగా జరిగింది. తిరుణాల ముగించుకొని వస్తున్న సమయంలో ఈటీ వద్ద యడవల్లికి చెందిన తెలుగు యువత ప్రభ నేలకొరిగింది. ఈ ఘటనలో రెండు ట్రాక్టర్లు ధ్వంసం అవ్వగా... ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన వ్యక్తిని హుటాహుటిన వైద్యశాలకు తరలించారు.
అంగరంగ వైభవంగా కోటప్పకొండ తిరణాలను ముగించుకొని తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ప్రభలు నిర్వాహకులు తమ సాయశక్తుల ఎటువంటి అపశృతి జరగకుండా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్ని కొన్ని సమయంలో చిన్నచిన్న అపశృతులు జరగటం మామూలే అయినప్పటికీ అంత భారీ ఖర్చులతో భారీ ప్రభలను నిర్మించి ఇలాంటి అపసృతులు జరగటం నిర్వాహకులకు కలవర పెడుతుంటాయి.
Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
ఈ నెల 17న చిలకలూరిపేటలో 10 లక్షల మందితో తెలుగుదేశం & జనసేన అతిపెద్ద భారీ బహిరంగ సభ - అచ్చం నాయుడు
ఈ నెల 17న చిలకలూరిపేటలో 10 లక్షల మందితో తెలుగుదేశం & జనసేన అతిపెద్ద భారీ బహిరంగ సభ - అచ్చం నాయుడు
చిలకలూరిపేట :- ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారానికి స్పీడును పెంచాయి. అందులో భాగంగా ఇప్పటికే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నారా లోకేష్ ఆధ్వర్యంలో యువగళం కార్యక్రమం పూర్తి చేయగా, నారా భువనేశ్వరి కూడా తన వంతు పార్టీ గెలుపుకై పనిచేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో శంఖారావం, రా కదలిరా, జయహో బిసి వంటి భారీ బహిరంగ కార్యక్రమాలను నిర్వహించగా అందులో భాగంగానే ఈ నెల 17న చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ & జనసేన ఆధ్వర్యంలో అతిపెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ సభ రాజకీయ చరిత్రలోనే మరువలేని ఘట్టంగా ఉంటుందని అచ్చం నాయుడు తెలిపారు. ఈ చిలకలూరిపేట సభ నుండి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ కి సంబంధించి కీలక ప్రకటనలో చేయనున్నట్లు అచ్చం నాయుడు. అన్ని జిల్లాల టిడిపి తమ్ముళ్లు & జన సైనికులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: