మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - అంతా పసుపు మాయం - తిరునాళ్లను తలపించిన ప్రత్తిపాటి నామినేషన్ రోడ్ షో - ప్రత్తిపాటి ఆస్తుల విలువ ఎంత అంటే ?

చిలకలూరిపేట - అంతా పసుపు మాయం - తిరునాళ్లను తలపించిన ప్రత్తిపాటి నామినేషన్ రోడ్ షో - ప్రత్తిపాటి ఆస్తుల విలువ ఎంత అంటే ?

చిలకలూరిపేట - అంతా పసుపు మాయం - తిరునాళ్లను తలపించిన ప్రత్తిపాటి నామినేషన్ రోడ్ షో - ప్రత్తిపాటి ఆస్తుల విలువ ఎంత అంటే ?


చిలకలూరిపేట :- ప్రత్తిపాటి నామినేషన్ కార్యక్రమం అత్యంత కోలాహాలంగా భారీ రోడ్ షో తో జన సమీకరణతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ పసుపుమయం అయిపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ జన సమీకరణతో కార్యకర్తలు తిరునాళ్ళని తెలిపించే విధంగా ప్రత్తిపాటి పేరుని హోరెత్తించారు.

నిన్న జరిగిన భారీ రోడ్ షో ద్వారా అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం వలన చిలకలూరిపేటలో ప్రత్తిపాటి విజయం చాలా సులువుగా అవుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లోని ఎంపీటీసీ, జడ్పిటిసి,  గ్రామంలోని ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు భారీ ఎత్తున పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇదే ఉత్సాహం రెట్టింపు ఉత్సాహమై పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రత్తిపాటి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రోడ్ష అనంతరం ప్రత్తిపాటి తమనమినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.

ప్రత్తిపాటి నామినేషన్ అఫిడవిట్ లో సమర్పించిన ఆస్తుల వివరాలు

అభ్యర్థి: ప్రత్తిపాటి పుల్లారావు(TDP) 

భార్య: వెంకాయమ్మ

విద్యార్హతలు: బికాం

చరాస్తి విలువ: రూ.32.33కోట్లు

భార్య చరాస్తి విలువ: రూ.23.37కోట్లు

కేసులు : 13

అప్పులు: రూ.22.72కోట్లు

చేతిలో ఉన్న డబ్బులు: రూ. 1,55,011

బంగారం: 409.8గ్రాములు,

 భార్య కు 323.5గ్రాముల బంగారం.


మరిన్ని వార్తలు కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

Share:

రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించిన ప్రత్తిపాటి

రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించిన ప్రత్తిపాటి

రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించిన ప్రత్తిపాటి

పట్టణంలోని ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పర్వం మొదలైంది, నేడు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు నామినేషన్ దాఖలు చేయగా రేపు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భారీ ర్యాలీతో నామినేషన్ వేనున్నారు. అందులో భాగంగా నేడు ప్రత్తిపాటి స్వగృహంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికల్లో మంచి-చెడుల మధ్య యుద్ధంలో కూటమిదే విజయమన్నారు మాజీమంత్రి, కూటమి చిలకలూరిపేట అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. మంగళవారం చిలకలూరిపేట కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నేపథ్యంలో విజయం సాధించాలని సంకల్పిస్తూ పట్టణంలోని తన నివాసంలో సోమవారం సుదర్శన నరసింహస్వామి హోమం వైభవంగా నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ క్రతువులో ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి వెంకటకుమారి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు హోమాలు, వైదిక కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిపించారు. నారసింహ, సుదర్శన యంత్రాలతో హోమం నిర్వహించారు. హోమ ద్రవ్యాలను యజ్ఞ గుండాల్లో సమర్పించి పూర్ణాహుతి జరిపించారు. చిలకలూరిపేటతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు. పలువురు కుటుంబసభ్యులు ఈ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి చెడు గెలిచిన సందర్భాలు చరిత్రలోనే కాదు పురాణేతిహాసాల్లో ఎక్కడ వెదికినా కనిపించవన్నారు. కూటమి తరపున ప్రజాబలానికి దైవ సంకల్పం కూడా తోడు కావాలనే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ప్రత్తిపాటి.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5


Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో - పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ చాటిన విద్యార్థులు వీరే

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో - పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ చాటిన విద్యార్థులు వీరే

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో

బొప్పూడి గ్రామంలోని శ్రీ పూసల సుబ్బయ్య గుంటూరు వెంకటప్పయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని పరీక్షకు హాజరైన 58 మంది విద్యార్థులలో 51 మంది ఉత్తీర్ణులై 88% సాధించారు దీనిలో షేక్ అప్పాపురం షబ్బీర్ 571 షేక్ ఆసిఫ్ 554 కొమ్మూరి వాసవి 553 మార్కులు సాధించి ప్రథమ ద్వితీయ స్థానాలు పొందారు ఈ సందర్భంగా తల్లిదండ్రుల కమిటీ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ హైస్కూల్లో చదివిన కార్తీక్ రెడ్డి 585 మార్కులతో మండలం టాపర్గా నిలిచాడు.

పట్టణంలోని పాఠశాలలో


ఈరోజు ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో  విజయభేరి మ్రోగించిన వికాస్ విద్యార్థులు ఏ శరణ్య, బాల సాయిరాం, అష్రఫ్.


ఈరోజు వెలువడిన 2023 -24 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వికాస్ విద్యార్థులు ఏ శరణ్య 600 కి 591 మార్కులు , బాల సాయిరాం 589,

Sk. Md. అశ్రాప్ 587

 స్కూల్ టాపర్లగా నిలిచారు.


 *ఈ పరీక్షకు మొత్తం 87 మంది విద్యార్థులు హాజరు కాగా 87 మంది  విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణత శాతం* సాధించి వికాస్ విజయ పతాకాన్ని ఎగురవేశారు. 


వీరిలో 590 కి పైగా మార్కులు సాధించిన వారు.....1

585 కి పైన...3 

580 కి పైన....7

 575 కి పైన.....14 

570 కి పైన...... 20 

550 కి పైన.......36 

500 కి పైన....... 61.


VIIT THE SCHOOL సుబ్బయ్య తోట, VIKAS SCHOOL

 పెదనందిపాడు రోడ్డు  క్యాంపస్లలో  విద్యార్థులు అద్భుతంగా ప్రతిభ కనబరిచారని విద్యాసంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్ తెలియజేశారు.


 నిరంతర కృషి పట్టుదల ఉంటే ఇలాంటి ఫలితాలు సాధించవచ్చని తెలియజేస్తూ  ఇంతటి చక్కని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, కష్టపడి పనిచేసినఉపాధ్యాయులను అదేవిధంగా *ప్రిన్సిపాల్స్ కల్పనా , ప్రమీల ను డైరెక్టర్లు దండా పవన్ కుమార్ , దండా రోజశ్రీ  అభినందించారు* మరియు విద్యార్థులకు మిఠాయిలు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.



నేడు ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో మోడరన్ విద్యాసంస్థల విద్యార్ధులు మరొక సారి వారి విజయ పరంపరని కొనసాగించారు. అత్యధికంగా నాయుడు వర్షిత 583 మార్కులు,షేక్ తస్నీమ్ 580 మార్కులు సాధించారు

మొత్తం పరీక్షకు హాజరైన 89 మంది విద్యార్ధులకు 27 మంది విద్యార్ధులకు 550కి పైగా, 50 మందికి పైగా 500 మార్కులను సాధించారు. 100శాతం ఉత్తీర్ణతతో 84 మంది ప్రధమ శ్రేణిలో 5గురు ద్వితీయశ్రేణి లో ఉత్తీర్ణత సాధించారు. 

గణితంలో నూటికి నూరు మార్కులు 10మంది, 90కి పైగా 50మంది. సైన్స్,సోషల్ లో 41మంది మార్కులు సాధించారు.ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్ధులను,ఉపాధ్యాయులను మోడరన్ విద్యాసంస్థల అధినేత చేబ్రోలు మహేష్ అభినందించారు.            

 కార్యక్రమంలో మోడరన్ విద్యాసంస్థల ఛైర్మన్  చేబ్రోలు మహేష్ ,గ్రీన్ వ్యాలీ కుమార్, ప్రిన్సిపాల్స్ సురేష్, ఫణికుమార్, హేమ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయిలు,విద్యార్ధినీ విద్యార్ధులు వారి తల్లిదండ్రులు పాల్గొని అందరినీ అభినందించారు.

కింది లింక్ ని ఫాలో అవ్వండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5


Share:

10,000 మంది కార్యకర్తలతో భారీ రోడ్ షో - నామినేషన్ దాఖలు చేసిన కావటి - అనంతరం ప్రత్తిపాటి పై ధ్వజమెత్తిన మనోహర్ నాయుడు

10,000 మంది కార్యకర్తలతో భారీ రోడ్ షో - నామినేషన్ దాఖలు చేసిన కావటి - అనంతరం ప్రత్తిపాటి పై ధ్వజమెత్తిన మనోహర్ నాయుడు

10,000 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన కావటి

చిలకలూరిపేట :- నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నామినేషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా నేడు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటీ మనోహర్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరి మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు 10,000 మందితో కలిసి అంగరంగ వైభవంగా సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కావటి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఈరోజున స్వచ్ఛందంగా  నామినేషన్ కార్యక్రమానికి పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజలంతా మరలా జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతిజ్ఞ చేసుకున్నారన్నారు. ప్రజలు కనివిని ఎరుగని రీతిలో జగనన్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలు ఇంటి వద్దకే పంపిన ఘనత జగనన్నకే దక్కుతుందని తెలియజేశారు.  ఎన్నికల ప్రచారంలో మేము పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కరూ మాకు జగనన్న ఈ ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారని జగనన్న మేము ఓట్ల రూపంలో రుణం తీర్చుకోని జగనన్ననే మరల ముఖ్యమంత్రిగా చేసుకుంటామన్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం మేము జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేపించుకున్నామన్నారు. అదేవిధంగా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు కూడా లబ్ధి పొందామని స్వచ్ఛందంగా ప్రతిపక్ష పార్టీలు వారు కొంతమంది పరోక్షంగా కొంతమంది ప్రత్యక్షంగా వైసీపీ కి మద్దతు తెలుపుతున్నారన్నారు. ఖచ్చితంగా రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కావటి అనే నేను అత్యధిక మెజార్టీతో చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగురు వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా మూడు పర్యాలు చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ప్రత్తిపాటి పుల్లారావు పనిచేశారని ఈ మూడు పర్యాలో పేట అభివృద్ధికి నోచుకోక పోగా ఎన్నో అవస్థలు ప్రజలు పడ్డారని కావటి తెలియజేశారు. ఈరోజున నామినేషన్ కార్యక్రమానికి వచ్చే మా నాయకులను కొంతమంది టీడీపీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వదిలేది లేదని తెలిపారు. పుల్లారావు అనే వాడు 2019లో ఓడిపోతే నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రజలను, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వేరే రాష్ట్రంలో తలదాచుకున్నారన్నారు. పేటలో పుల్లారావు అతని భార్య వెంకాయమ్మ చేసిన అరాచకాలు పేట ప్రజలు ఇంకా మర్చిపోలేదని కావటి గుర్తు చేశారు. చివరికి ఆర్యవైశ్యులు దీపావళి మందులు అమ్ముకుంటే వాళ్ల దగ్గరికి కూడా పుల్లారావు అతని భార్య వెంకాయమ్మ అధికారులు పంపించి షాపులు మూపించి వాళ్ళని నానారకాలుగా ఇబ్బందులకు గురి చేశారని తెలియజేశారు. పుల్లారావు గతంలో వైసిపి తీర్థం పుచ్చుకుందామని ప్రయత్నాలు చేస్తే అవి జగనన్న దగ్గర పారకపోయేసరికే మరలా చంద్రబాబు దగ్గరికి వెళ్లి కాళ్ళ వేల పడి టిడిపి టికెట్ తీసుకున్నారని తెలిపారు. పుల్లారావు మాట్లాడుతూ నేను స్థానికుడిని కాదు అని తెలియజేస్తున్నారు. కానీ పుల్లారావు ఎక్కడ నుంచి వచ్చారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ప్రకాశం జిల్లా బొబ్బేపల్లి నుంచి సొసైటీ చైర్మన్గా ఓడిపోతే చిలకలూరిపేట వచ్చి ఎన్టీఆర్ హయాంలో టీడీపీ టికెట్ తెచ్చుకొని రాజకీయ రంగం ప్రవేశం చేసిన నీచమైన రాజకీయ జీవిత చరిత్ర పుల్లారావుదని కావటి తెలిపారు. పుల్లారావు ఈరోజున ఎన్ని బూటకపు మాటలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కనీసం పుల్లారావు కి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి రేపు జరిగే ఎన్నికల్లో ఉంటుందని కావటి తెలిపారు.

క్రింది లింకు పై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

చిలకలూరిపేట మద్యం మత్తులో కారుని ఢీకొన్న ఆటో

చిలకలూరిపేట మద్యం మత్తులో కారుని ఢీకొన్న ఆటో


చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డి పాలెం వద్ద మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ కారును ఢీకొన్న ఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పర్చూరు నుంచి నరసరావుపేట వెళ్తున్న ట్రావెల్స్ కారున, నరసరావుపేట నుండి చీరాల వెళుతున్న ఆటో పోల్రెడ్డిపాలెం సమీపంలోని అమృత పంజాబీ దాబా వద్ద ఢీకొన్నది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడగా కారు కుడివైపు ముందుభాగం ప్రమాదానికి గురైంది. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ ఘటన జరిగినట్టు స్థానికులు తెలిపారు.

క్రింది లింకు పై క్లిక్ చేయండి
Share:

చిలకలూరిపేటలో వైసీపీకి మరో బిగ్ షాక్

 చిలకలూరిపేటలో వైసీపీకి మరో బిగ్ షాక్

చిలకలూరిపేటలో వైసీపీకి మరో బిగ్ షాక్

చిలకలూరిపేట వైసీపీకి మరో ఎదురు దెబ్బ నిన్నటిదాకా కాబట్టి మనోహర్ నాయుడుతో ప్రచారంలో పాల్గొన్న చిలకలూరిపేట రూరల్ జెడ్పీటీసీ కోడే సుధారాణి వారి కుటుంబ సభ్యులతో వైసీపీని వీడి పత్తిపాటి ఆదేశాలతో నారా  లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు.

ఆమె అధికార పార్టీ వైసీపీ జడ్పిటిసి అయినా దగ్గర నుంచి ప్రజలకు చేసింది ఏమీ లేదు దుర్మార్గులని నమ్మి మోసపోయాం ప్రజలు మమ్మల్ని నమ్మి జడ్పిటిసి గెలిపిస్తే ప్రజలకు ఏమి చేయలేకపోయాం అనే ఆవేదన బాధ జడ్పిటిసి లో ఉంది.

మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా అభివృద్ధి ప్రజలకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీయే అని నిర్ణయించుకుంది అందుకోసమే వారి కుటుంబ సభ్యులతో వెళ్లి నారా లోకేష్ గారి సమక్షంలో కలిసి చిలకలూరిపేటకు విడుదల రజిని చేసిన అన్యాయాలు అరాచకాలు అక్రమాలు ఏ విధంగా అవినీతి చేసి దోచుకుందు నారా లోకేష్ సమక్షంలో తెలియపరిచి.

వైసీపీని వీడి జడ్పిటిసి కోడే సుధారాణి వారి కుటుంబ సభ్యులు టిడిపిలో చేరారు అభివృద్ధి కోసం నిత్యం కష్టపడే నాయకుడు ప్రత్తిపాటితోనే నడుచుకుంటాం అంటూ వారి కుటుంబ సభ్యులు నారా లోకేష్ సమక్షంలో విన్నవించుకున్నారు.

మరిన్ని వివరాల కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

నేడు 11 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ఫలితాలు ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చెక్ చేయండి.

నేడు 11 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ఫలితాలు ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చెక్ చేయండి.

నేడు 11 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ఫలితాలు కోసం ఇక్కడ చెక్ చేయండి.


 AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్ అప్‌డేట్‌లు: ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ (BIEAP) మొదటి మరియు రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని భావిస్తున్నారు.

అధికారిక విడుదల ప్రకారం, బోర్డు కార్యదర్శి AP ఇంటర్ ఫలితాలను 2024 ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశంలో ప్రకటిస్తారు. ఫలితాలను BIEAP అధికారిక వెబ్‌సైట్‌లలో bie.ap.gov.in మరియు bieap.apcfssలో యాక్సెస్ చేయవచ్చు. .in. 

సాధారణంగా, బోర్డు గత సంవత్సరాల ట్రెండ్‌లను అనుసరించి రెండు తరగతుల (ఇంటర్మీడియట్ 1వ మరియు 2వ సంవత్సరం) ఏకకాలంలో ఫలితాలను ప్రకటిస్తుంది.

LiveMintలో అన్ని AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్ అప్‌డేట్‌లను ఇక్కడ చూడండి.

 ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

మొదటి సంవత్సరం పరీక్షలలో, 2,66,326 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, ఇది 61% ఉత్తీర్ణత రేటును సూచిస్తుంది, అయితే రెండవ సంవత్సరం పరీక్షలలో 2,72,001 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, ఇది 72% ఉత్తీర్ణత రేటును ప్రతిబింబిస్తుంది.

AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: మార్క్‌షీట్‌లో సమాచారం ఉంటుంది..

మార్క్‌షీట్‌లో చేర్చబడిన సమాచారంలో విద్యార్థి పేరు, AP ఇంటర్ హాల్ టికెట్ నంబర్, పొందిన మొత్తం మార్కులు, వ్యక్తిగత సబ్జెక్టులలో సాధించిన గ్రేడ్‌లు, ఫలితాల స్థితి మరియు ఏవైనా అదనపు సంబంధిత వివరాలు ఉంటాయి.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీస అర్హత మార్కులను స్కోర్ చేయాలి

AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: BIEAP ప్రకారం, విద్యార్థులు AP క్లాస్ 11వ ఫలితం 2024 మరియు AP 12వ ఫలితం 2024లో ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో కనీసం 33 మార్కులు (కనీస అర్హత మార్కులు) స్కోర్ చేయాలి.

AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: 1వ, 2వ సంవత్సరం ఫలితాలను ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి?

AP ఇంటర్ ఫలితాలు 2024ను యాక్సెస్ చేయడానికి, అవి ప్రచురించబడిన తర్వాత, ఈ దశలను అనుసరించండి:

resultsbie.ap.gov.in లేదా bie.ap.gov.inకి నావిగేట్ చేయండి.

IPE 1వ సంవత్సరం ఫలితం లేదా IPE 2వ సంవత్సరం ఫలితం కోసం ఎంపికను ఎంచుకోండి.

లాగిన్ పేజీలో మీ పుట్టిన తేదీ మరియు హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి. మీ ఫలితాలను సమీక్షించండి.

భవిష్యత్ సూచన కోసం కాపీని ప్రింట్ చేయడం లేదా స్కోర్‌లను సేవ్ చేయడం మంచిది.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?

AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 కోసం మీ స్కోర్‌లను తనిఖీ చేయడానికి, ఈ దశలను అనుసరించండి: bie.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

హోమ్‌పేజీలో AP ఇంటర్ ఫలితాలు 2024 కోసం అందించిన లింక్‌పై క్లిక్ చేయండి.

మీ ఆధారాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ చేయండి.

మీ AP ఇంటర్మీడియట్ ఫలితాల స్కోర్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

AP ఇంటర్ ఫలితాల మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేయండి. భవిష్యత్ సూచన కోసం మార్క్ షీట్ యొక్క హార్డ్ కాపీని ఉంచండి.

AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: మార్క్‌షీట్‌లో సమాచారం ఉంటుంది..

మార్క్‌షీట్‌లో చేర్చబడిన సమాచారంలో విద్యార్థి పేరు, AP ఇంటర్ హాల్ టికెట్ నంబర్, పొందిన మొత్తం మార్కులు, వ్యక్తిగత సబ్జెక్టులలో సాధించిన గ్రేడ్‌లు, ఫలితాల స్థితి మరియు ఏవైనా అదనపు సంబంధిత వివరాలు ఉంటాయి.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: రాష్ట్ర స్కాలర్‌షిప్‌లను పొందడానికి 90% కంటే ఎక్కువ స్కోర్ చేసిన అభ్యర్థులు

AP ఇంటర్ ఫలితాలు 2024: ఈ ఫలితాల్లో 90% కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కాలర్‌షిప్‌లను పొందేందుకు అర్హులని గమనించడం ముఖ్యం.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఫలితాలను తనిఖీ చేయడానికి వెబ్‌సైట్‌ల జాబితా

AP ఇంటర్ ఫలితాలు 2024: విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోగల వెబ్‌సైట్‌ల జాబితా ఇక్కడ ఉంది

results.gov.in


results.bie.ap.gov.in


examsresults.ap.nic.in


results.apcfss.in bie.ap.gov.in


AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: తేదీ మరియు సమయాన్ని తనిఖీ చేయండి 

2024కి సంబంధించిన AP ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు ఈరోజు ఏప్రిల్ 12, 2024 ఉదయం 11 గంటలకు ప్రకటించబడతాయి. మరిన్ని వివరాల కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఫలితాలను తనిఖీ చేయడానికి వెబ్‌సైట్‌ల జాబితా

AP ఇంటర్ ఫలితాలు 2024: విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోగల వెబ్‌సైట్‌ల జాబితా ఇక్కడ ఉంది


results.gov.in


results.bie.ap.gov.in


examsresults.ap.nic.in


results.apcfss.in bie.ap.gov.in

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: రాష్ట్ర స్కాలర్‌షిప్‌లను పొందడానికి 90% కంటే ఎక్కువ స్కోర్ చేసిన అభ్యర్థులు

AP ఇంటర్ ఫలితాలు 2024: ఈ ఫలితాల్లో 90% కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కాలర్‌షిప్‌లను పొందేందుకు అర్హులని గమనించడం ముఖ్యం.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీస అర్హత మార్కులను స్కోర్ చేయాలి

AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: BIEAP ప్రకారం, విద్యార్థులు AP క్లాస్ 11వ ఫలితం 2024 మరియు AP 12వ ఫలితం 2024లో ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో కనీసం 33 మార్కులు (కనీస అర్హత మార్కులు) స్కోర్ చేయాలి.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?

AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 కోసం మీ స్కోర్‌లను తనిఖీ చేయడానికి, ఈ దశలను అనుసరించండి: bie.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

హోమ్‌పేజీలో AP ఇంటర్ ఫలితాలు 2024 కోసం అందించిన లింక్‌పై క్లిక్ చేయండి.

మీ ఆధారాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ చేయండి.

మీ AP ఇంటర్మీడియట్ ఫలితాల స్కోర్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

AP ఇంటర్ ఫలితాల మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేయండి.

భవిష్యత్ సూచన కోసం మార్క్ షీట్ యొక్క హార్డ్ కాపీని ఉంచండి..


మీరు చిలకలూరిపేట వారైతే క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

చిలకలూరిపేట :- తెలుగుదేశం పార్టీలో చేరిన ప్లంబర్స్ యూనియన్ కు చెందిన 300 మంది ప్లంబింగ్ కార్మికులు

 చిలకలూరిపేట :- తెలుగుదేశం పార్టీలో చేరిన ప్లంబర్స్ యూనియన్ కు చెందిన 300 మంది ప్లంబింగ్ కార్మికులు

చిలకలూరిపేట :- తెలుగుదేశం పార్టీలో చేరిన ప్లంబర్స్ యూనియన్ కు చెందిన 300 మంది ప్లంబింగ్ కార్మికులు

 చిలకలూరిపేట:-  తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు ఆద్వర్యంలో,శ్రీ గంగా భవాని ప్లంబర్స్ యూనియన్ అద్యక్షులు నిశ్శంకర పిచ్చేశ్వరరావు గారి నాయకత్వంలో యూనియన్ కు చెందిన 70 కుటుంబాలకు చెందిన300 మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పాత ఆంధ్రా బ్యాంకు ప్రాంగణంలో మాజీ మంత్రి వర్యులు,రాష్ర్ట పార్టీ ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో వీరందరూ పార్టీలో చేరడం జరిగింది. ఈ సంధర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్లంబింగ్ కార్మికులు ఒక్క రోజు పని చేయకుంటే మొత్తం ప్రజా జీవనం స్తంభించి పోతుందని, మీ కష్టాలు నాకు బాగా తెలుసునని,మీ యూనియన్ సభ్యులకు నా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.యూనియన్ అద్యక్షులు పిచ్చేశ్వర రావు పుట్టిన రోజు జన్మ దిన కేక్ ను ప్రత్తిపాటి పుల్లారావు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మా భవన కార్మికులను అన్యాయం చేసిన ఘనుడు జగన్ రెడ్డి ఎంతోమందిని కొట్టను పెట్టుకున్న దుర్మార్గుడు రాక్షసుడు జగన్ రెడ్డి భావన కార్మికుల పనులను విచ్చలవిడితనంగా అవినీతి చేసిన చరిత్ర జగన్ రెడ్డికి తగ్గుతుంది ఎంతోమంది కష్టం చేసే పని చేసుకునే వారి ప్రాణాలు తీసిన ఇలాంటి దుర్మార్గున్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయం.

ఒక్క అవకాశం అంటే విడుదల రజిని జగన్ రెడ్డిని నమ్మి మోసపోయాం. ఎప్పటికీ ఎల్లప్పుడూ పత్తిపాటితోనే నడుచుకుంటాం తెలుగుదేశం పార్టీ నీడలోనే ఉంటాం ఈ పార్టీలోనే అభివృద్ధి చెందే విధంగా పనులు చేసుకొని బ్రతుకుతాం అంటూ మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి

ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి

ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి

చిలకలూరిపేట - రాష్ట్రంలో ముస్లిం సోదరుల నమ్మకం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ఆ విషయాన్ని మరుగున పరిచి, విభజించి పాలించాలని చూస్తోన్న వైకాపా కుయుక్తులపై అప్రమత్తత, సంయమనంతో ఉండాలని ఆయన సూచించారు. బుధవారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెబుతునే జగన్ కుట్రలను ప్రతిఒక్కరు జాగ్రత్తగా గమనించాలని కోరారు. దువా చదివి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలును గెలిపించేందుకు ముస్లింల ఆశీస్సులు అందించాలని కోరారు. నిజానికి ఎన్‌ఆర్సీ, సీఏఏ, ట్రిపుల్ తలాక్‌, కశ్మీర్‌కు సంబంధించిన 370 ఆర్టికల్‌పై లోక్‌సభ, రాజ్యసభలో బలపరిచింది వైసీపీనే అని మండిపడ్డారు ప్రత్తిపాటి. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా నష్టం జరగలేదని స్పష్టం చేసిన ఆయన కొందరు స్వార్థంకోసం ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరోజైనా ముస్లిం మైనార్టీలకు సంక్షేమం, అభివృద్ధి అందిందంటే తెలుగుదేశం ఉన్నప్పుడు మాత్రమే జరిగిందన్నారు ప్రత్తిపాటి. ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకబడ్జెట్, ఏటా రంజాన్‌ తోఫా ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో హజ్ హౌస్‌తో పాటు రూ.25 కోట్లతో కడపలోనూ హజ్ హౌస్ నిర్మాణానికి కృషి చేశామన్నారు. తెలుగుదేశంతోనే షాదీఖానాలు వచ్చాయన్న ప్రత్తిపాటి  గతంలో దుల్హన్ పథకాన్నీ వైకాపా నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ విద్యాదీవెనలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మసీదుల ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజమ్‌లకు రూ.2 వేల గౌరవ వేతనం ఇచ్చిందీ తెలుగుదేశం పార్టీ అనే అన్నారు ప్రత్తిపాటి. మసీదులు, దర్గాల మరమ్మతులు, శ్మశానవాటికలకు రూ.50 కోట్ల గ్రాంట్ ఇచ్చామన్నారు. ముస్లింల 4% రిజర్వేషన్ల కోసం రూ.6 కోట్లు ఖర్చు చేసి కాపాడింది చంద్రబాబే అని స్పష్టం చేశారు. అందుకే ఈ రోజుకీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముస్లిం మైనార్టీల్లో చంద్రబాబు, తెలుగుదేశం అంటే అంత గౌరవం అన్నారు ప్రత్తిపాటి. జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ నమ్మకాన్ని కదల్చలేరని కూటమి ప్రభుత్వం రాగానే ముస్లిం సోదరులకు మరింత సంక్షేమాన్ని అందించి తీరతామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట - రెండు రోజులలో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతాం - పారిశుద్ధ్య కార్మికులు

చిలకలూరిపేట - రెండు రోజులలో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతాం - పారిశుద్ధ్య కార్మికులు

చిలకలూరిపేట - రెండు రోజులలో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతాం - పారిశుద్ధ్య కార్మికులు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన చేపట్టారు.

గత మూడు నెలలుగా  మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్  యునియన్(AITUC) నాయకులు మాట్లాడుతూ మూడు నెలలుగా మున్సిపల్ అధికారులు తమకు జీతాలు ఇవ్వకపోవడం వలన కుటుంబ పోషణ భారంగా మారిందని, అద్దె ఇళ్లల్లో ఉంటున్న తమను ఇంటి ఓనర్లు ఖాళీ చేయించడం జరుగుతుందని తెలిపారు.

గత కొద్ది కాలంగా పాడైపోయిన పారిశుధ్య పనిముట్లను వెంటనే బాగు చేయాలని, క్రొత్త పారిశుద్ధ్య పనిముట్లను కొని ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.

సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారికి అందజేయడం జరిగినది.

రెండు రోజులలో చిలకలూరిపేట మున్సిపల్ అధికారులు పెండింగ్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతామని తెలిపారు.

క్రింది లింక్ పై క్లిక్ చేయండి 


https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

 ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం సాతులూరి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఫిరంగిపురం గ్రామానికి చెందిన ఒడిశా బాల చిన్నారావు అనే వ్యక్తి సాతులూరు మీదుగా నరసరావుపేట వెళ్తుండగా నరసరావుపేట నుంచి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు చిన్నారావు స్కూటీని ఢీకొనడంతో తల బలంగా రోడ్డుకు తగిలి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచార మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకున్నా పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

క్రింది లింకు పై క్లిక్ చేయండి

Share:

చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?

చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?

చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?

చిలకలూరిపేట :- రాష్ట్ర రాజకీయమంతా ఒకలా ఉంటే చిలకలూరిపేటలో మాత్రం మరో రకంగా ఉంటుంది. అన్ని పార్టీలకు లాగానే కాంగ్రెస్ పార్టీలో కూడా రెండు వర్గాలు అసెంబ్లీ అసెంబ్లీ సీట్ కోసం పోటీపడ్డారు. వీటన్నిటికి తెరదించుతూ నేడు చిలకలూరిపేట కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది ఖరారు అయ్యింది. ఎన్నో సంవత్సరాలుగా దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నా కూడా ఎప్పటినుండో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న మద్దుల రాధాకృష్ణకు పార్టీ అధిష్టానం సీటు ఖరారు చేసింది. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీ నుండి బయటికి వచ్చి షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాయుడు వాసుకు పార్టీ అధిష్టానం మొండి చేయి చూపించింది. అనూహ్యంగా తెరమీదకు వచ్చిన నాయుడు వాసుకు ప్రజాబలం అంతంత మాత్రం ఉండటంతో పాటుగా పార్టీని నమ్ముకొని ఉన్న రాధాకృష్ణకు సీటు ఇవ్వకపోతే అతని అనుచర వర్గం అసంతృప్తిలోనయే అవకాశం ఉండటంతో ఎప్పటినుండో పార్టీలో కష్టపడుతున్న రాధాకృష్ణకు సీటు ఖరారు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.

గతంలో 2019 ఎలక్షన్లలో చిలకలూరిపేట తరపున పోటీ చేసిన మద్దుల రాధాకృష్ణకు 1473 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగారు. పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ పార్టీలో ఉన్న నాయకులను చిన్నచిన్న లీడర్లను పక్క పార్టీలోకి వెళ్లకుండా కాపాడటంలో రాధాకృష్ణ సఫలీకృతుడయ్యాడు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిగా రాధాకృష్ణకు మంచి పేరు ఉంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా లేనప్పటికీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి నూతన ఉత్సాహం మొదలైందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి.

Share:

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్


చిలకలూరిపేట:- పట్టణంలో పరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజా మేనిఫెస్టోని అమలు చేయాలని కమిటీ కన్వీనర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు. ఈరోజు కార్యాలయంలో "పది" అంశాలతో కూడిన మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలకమైన "పది" అంశాలపై పోటీ చేసే అభ్యర్థులు వారి అభిప్రాయాలను  తెలియజేయాలని కోరారు.

1. పట్టణంలో మంచినీటి సరఫరాకు కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ రోజు విడిచి రోజు మున్సిపల్ నీరు వదులుతున్నారు, ఇంకా అనేక ప్రాంతాలకు ట్యాంకర్లతో  నీటి సరఫరా చేస్తున్నారు.

2. పట్టణంలోని ఏరియా హాస్పిటల్ లో ”వెంటిలేటర్ అంబులెన్స్” మరియు బ్లడ్ బ్యాంక్  ల కొరత ఉన్నవి.

3. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయవలసి ఉన్నది.

4. పట్టణంలో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయవలసిన అవసరం తీవ్రంగా ఉన్నది.

5. పట్టణంలో బస్సు షెల్టర్స్ కొరత కారణంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు, గర్భిణీలు, బాలింతలు పొత్తిళ్లలో పిల్లలను పెట్టుకొని మండుటెండలో బస్సుల కోసం వేచి ఉంటున్నారు.

6. అద్దె ఇంట్లో నివసించే కుటుంబాలలో ఎవరైనా కాలం చేస్తే, వారి అంతిమ సంస్కార నిమిత్తమై వివిధ కారణాల రీత్యా కొందరు ఇంటి ఓనర్లు అభ్యంతర తెలుపుచున్నారు. కనుక, స్మశాన వాటిక సమీపంలో రెండు గదులు ఏర్పాటు చేయవలసి అవసరం ఉన్నది.

7. పట్టణంలో ఉన్న “రెండు కోర్టు”లలో “ఒకటి” అద్దె భవనంలో ఇరుకుగా మున్సిపల్ బిల్డింగ్లో పై అంతస్తులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలుసు. స్థలం ఏర్పాటు చేసినచో హైకోర్టు వారు నిర్మాణ ఖర్చులు భరించగలరు, స్థలం కొరత ఉన్నది.

8. పట్టణంలో నాలుగు ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అవసరం ఉన్నవి.

9. పట్టణంలో వాకింగ్ ట్రాక్స్ లేని కారణంగా రోడ్లపై వాకింగ్ చేస్తూ యాక్సిడెంట్స్ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు విధితమే, కనుక వాకింగ్ ట్రాక్స్ మరియు పట్టణ ప్రజల ఆహ్లాదానికి మంచి పార్క్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది.

10. నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు మరియు సినీ నటుల  ఫ్లెక్సీలు, ప్రజలకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నందున, అలాంటి ఫ్లెక్సీల ఏర్పాటును నియంత్రించవలసి ఉంది.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మురకొండ వెంకటరావు, శనగవరపు హరి ప్రసాద్, తమ్మిరిశ కృష్ణ ప్రసాద్, గంగసాని వెంకటేశ్వర రెడ్డి, T. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశంలోకి చేరికల జోరు పెరిగింది. పట్టణంతో పాటు గ్రామాల నుంచి చేరికల సందడి మొదలైంది. ఓం వైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు అధికార పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి వరుస కడుతున్నారు. తాజాగా సోమవారం మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో చిలకలూరిపేట 14వ వార్డు కౌన్సిలర్ షేక్ జమీల, కొత్తపాలెం సర్పంచ్ మొలమంటి సుబ్బారావు, అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు కొండబోయిన కోటయ్య వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చిలకలూరిపేటలోని నివాసంలో ప్రత్తిపాటి పుల్లారావు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి ప్రత్తి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైసీపీ విధానాలు నచ్చక చాలామంది ఆ పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి చేరుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో  యడ్లపాడు జడ్పిటీసీ సభ్యుడు ముక్తా వాసు, మునిసిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,  మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, జాలాది సుబ్బారావు, చెమిటిగంటి పార్వతి, బిట్రా రాజేంద్ర ప్రసాద్, గాలి బుచ్చయ్య , ఎం.వి రత్నారెడ్డి, పంగులూరి వెంగళరాయుడు, తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, యాదాల సుజాత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి జనార్దన్ రావు, మద్దిబోయిన దుర్గారావు, మొలమంటి అంకుల్, రాటనాల అంకారావు, తేళ్ల సుబ్బారావు, నెల్లూరి సదాశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.