మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

వైసీపీ ఎంపీ బాలసౌరి రాజీనామా - జనసేనలో చేరిక

వైసీపీ ఎంపీ బాలసౌరి రాజీనామా - జనసేనలో చేరిక


ఆంధ్రప్రదేశ్ :- మచిలీపట్నం వైఎస్ఆర్సిపి ఎంపీ వల్లభనేని బాలశౌరి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు.వల్లభనేని బాలశౌరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో తెనాలి లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు. ఆయన 2009లో నరసరావుపేట లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. బాలశౌరి అక్టోబర్ 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి,2014లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2019లో మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం నుండి గెలిచి రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.ఆయన ప్రస్తుతం సభార్డినెట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు.వల్లభనేని బాలశౌరి 2024 జనవరి 13న వైసీపీకి రాజీనామా చేశాడు. 

వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో తనకంటూ ఒక మార్కును చూపిస్తూ రాజకీయాలలో తను సత్తా చాటారు. గత కొన్ని రోజులుగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో జరిగిన పరిణామాల వల్ల అసహనానికి లోనవటంతో పాటు గుంటూరు నుండి కానీ మచిలీపట్నం నుండి కానీ ఎంపీ సీటును ఆశిస్తూ ఉన్నట్లు అనుచరులు చెప్పారు. కానీ ఇప్పటికే ఆయా స్థానాలకు వేరే వాళ్ళని కేటాయించడంతో తను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తన అనుచరులు తెలిపారు. త్వరలోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేనలో చేరుతున్నాను అని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

బాలసౌరి రాజకీయ ప్రస్థానం 2024 వరకు :-

పోటీ చేసిన స్థానాలు

1)తెనాలి లోకసభ నియోజకవర్గం 2004 గెలుపు,

2)నరసరావుపేట లోకసభ నియోజకవర్గం 2009 ఓటమి,

3)గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం 2014 ఓటమి,

4)మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం 2019 గెలుపు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.