మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘం

వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట : చీరాల రోడ్డు లో గల బాపూజీ వృద్ధుల సేవా ఆశ్రమంలో అఖిల భారత అవినీతి నిర్మూలన& వినియోగదారుల సంఘము సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ఎం వెంకట రాం ప్రసాద్ అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది మాదాసు భానుప్రసాద్ గారు మాట్లాడుతూ వినియోగ దారుల హక్కుల గురుంచి తెలుయజేశారు.వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి అన్నారు. గ్యారంటీ, వారంటీ బిల్లులను భద్రపరుచుకోవాలి. మోసపోయిన సందర్భంలో వినియోగదారుల జిల్లా కమిషన్ ను సంప్రదించి వ్యాపారి నుండి నష్ట పరిహారం పొందవచ్చు అన్నారు. అర్యవైస్య సంఘం అధ్యక్షుడు పటేల్ మాట్లాడుతూ ఓటు హక్కు నిజాయితీగా వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అవినీతి నిర్మూలన ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్నారు. అవినీతి కి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కొనుగోలు దారులందరు వినియోగదారులే. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కోసం మా సంస్థ కృషి చేస్తుందన్నారు.ధరల్లో వ్యత్యాసం,అధిక ధరలు అమ్మడం,కల్తీ సరుకులు అమ్మడం,నకిలీ వస్తువులు అంట గడితే,తూకాల్లో మోసం చేస్తే వినియోగదారుల సంస్థను సంప్రదిస్తే అండగా ఉండి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాం అన్నారు. ఈ సందర్భంగా నూతన నియోజకవర్గ కమిటీని ఎన్నుకోవడమైనది.

అఖిల భారత అవినీతి నిర్మూలన&వినియోగదారుల సంఘము నియోజకవర్గ అధ్యక్షులు గా  మురికి పూడి ప్రసాద్, ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ జబ్బార్, ప్రధాన కార్యదర్శి గా పి.సురేష్ కుమార్,కార్యదర్శిగా పి.శ్రీనివాస రావు,సహాయ కార్యదర్శి గా నిడమానూరు రవి కుమార్, భవిరిసెట్టీమణి, కార్యవర్గ సభ్యులు గా ఎంవి ఎస్ గుప్తా,భలే.శ్రీనివాస్,ఎన్. రవీంద్ర, గౌరవ సలహాదారు లుగా ఎం.భానుప్రసాద్, ఏ. రామ కృష్ణ, డాక్టర్ టి.కృష్ణ ప్రసాద్ లు ఏక గ్రీవముగా ఎన్నికయ్యారు.ఎన్నికైన సభ్యులందరికీ రాష్ట్ర అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలియజేశారు.



Share:

చిలకలూరిపేట :- చెరువు రోడ్లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు - ఈ సమస్యను పట్టించుకునేవారు లేరా అని విమర్శలు

చిలకలూరిపేట :- చెరువు రోడ్లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు - ఈ సమస్యను పట్టించుకునేవారు లేరా అని విమర్శలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


చిలకలూరిపేట పట్టణంలోని చెరువు రోడ్ లో వాకింగ్ కి వెళ్లే వారికి ఇక్కట్లు తప్పేలా లేవు. వివరాల్లోకి వెళితే గత కొంత కాలంగా మంచినీరు చెరువు వెళ్లి దారులు భయంకరంగా మారాయి. వాహనదారులు మరియు వాకింగ్ కి వెళ్లే వారు ఇబ్బందులకు గురి అవుతున్నారు. కోటప్ప కొండ వైపు నుండి చెరువు రోడ్డు మీదుగా వైయస్సార్ కాలనీ రోడ్డు నుండి నరసరావుపేట రోడ్డులోకి ప్రతిరోజు పొద్దున మరియు సాయంత్రం సమయాలలో సుమారు 20 నుండి 30 టిప్పర్ వాహనాలు గ్రానైట్ లోడుతో వెళుతుంటాయి. దీంతో చెరువు రోడ్డు మొత్తం దెబ్బ తిన్నది. స్థానికుల సమాచారం మేరకు ఆయా గ్రానైట్ సంబంధించిన వారు రోడ్డుపై కంకరతో చదును చేపించారు.  అయినప్పటికీ వాహనాల టైర్లు కంకరలో ఇరుక్కు పోవటంతో సదరు గ్రానైట్ ఫ్యాక్టరీలో మిగిలిపోయిన డస్ట్ ని తీసుకువచ్చి రోడ్లపై పోశారు. దీంతో రోడ్డంతా దుమ్ముతో మరియు గుంతలతో వాహనదారులు & వాకింగ్ కి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. అయితే దీనిపై మున్సిపల్ శాఖ దృష్టిపెట్టి సమస్యను పరిష్కరించే వలసిందిగా వాకింగ్ కు వెళ్లేవారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే ఏరియాలో కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతున్న  సమయంలో ఇలాంటి  పరిస్థితులు తీవ్రప్రభావాన్ని చూపిస్తాయని. అలాగే పట్టణంలోనే ప్రశాంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణం చెరువు రోడ్ లోనే ఉంటుందని దానిని ఇలా నాశనం చేయవద్దని వారు కోరారు.






Share:

చిలకలూరిపేట మండలం :- ఆగి ఉన్న లారీని ఢీకొన్న గ్యాస్ సిలిండర్ లారీ - క్లీనర్ మృతి

 చిలకలూరిపేట మండలం :-  ఆగి ఉన్న లారీని ఢీకొన్న గ్యాస్ సిలిండర్ లారీ - క్లీనర్ మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండలం తాతపూడి జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న లారీని గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే ఒంగోలు నుండి విజయవాడ వైపు వెళుతున్న లారీ టైర్ పడటంతో డ్రైవర్ దానిని తాతపూడి జాతీయ రహదారి పక్కనే ఉన్న బస్టాండ్ వద్ద ఆపారు. ఆయా లారీ కి సంబంధించిన క్లీనర్ పగిలిన టైర్లను మార్చి వేరే టైర్ మార్చే క్రమంలో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న మరో లారీ వెనక నుండి వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొన్న ది. ఈ సమయంలో క్లీనర్ లారీ కింద టైర్ మారుస్తూ ఉన్నాడు. ఇంతలో ఈ ఘటన జరగడంతో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్ ఇబ్బంది క్లీనర్ మృతి చెందినట్లు తెలిపారు. అలాగే గాయపడిన లారీ డ్రైవర్ ని గుంటూరు జిజిహెచ్ కి తరలించారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల ఆ సమయంలో జరిగినట్లు స్థానికులు తెలిపారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.