మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో "ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్" ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షులు ఆంజనేయులు గారు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం నుండి జిల్లాలోని అన్ని వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 9 గంటల నుండి  సాయంతం 6 గంటల వరకే తెరచి ఉంచాలి అని నిర్ణయించారు. ప్రతి ఒక్క షాప్ నందు నో మాస్క్ బోర్డు పెట్టాలి అని తెలిపారు. సోమవారం నుండి కఠినంగా అమలు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు.  
















 
Share:

చిలకలూరిపేటలో శుక్రవారం నాడు మాస్క్ లేని వారి పైనా అపరాధ రుసుము వసూళ్లు

చిలకలూరిపేటలో శుక్రవారం నాడు మాస్క్ లేని వారి పైనా అపరాధ రుసుము వసూళ్లు

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో శుక్రవారంనాడు ముసిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు సెంటర్లలో మాస్క్ లేకుండా తెరిగే వారి వద్ద నుండి అపరాధ రుసుము వసూల్ చేసారు. కరోనా ఉదృతి  పెరుగుతున్న కారణంగా ఈ కార్యక్రమాన్నిచేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని మాస్క్ లేకుండా బయట తిరిగితే ఫైన్ వసూళ్లు చేస్తారు అని తెలిపారు. ఈ రోజు పట్టణంలో 28 మంది వద్ద అపరాధరుసుము వసూళ్లు చేసారు. 28 మంది నుండి 4700 రూపాయలు వసూళ్లు చేసినట్లు తెలిపారు కమీష్నర్ రవీంద్ర గారు. ప్రతి ఒక్కరు కరోనా రూల్స్ పాటించాలి అని కరోనా కట్టడికి సహకరించాలి అని తెలిపారు   


















Share:

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

https://chilakaluripetspeednews.blogspot.com/
 

రంజాన్ నెల ప్రారంభమైన సంగతి అందరికి తెలిసినదే. అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అందరూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. రంజాన్ మాసం లో ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష పాటిస్తారు కావున వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే సందేహంలో ఉంటున్నారు. ఈ సందేహాలకు తెర దించుతూ ముస్లిం మత పెద్దలు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. వ్యాక్సిన్ పొట్టలోకి కాకుండా రక్తనాళాల్లో కి వెళ్తుంది కాబట్టి ఉపవాస దీక్ష భగ్నం కాదని నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. అందువలన మన పేట మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులకు ఈ విషయాన్ని చేరవేయండి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందువలన ప్రార్ధనలో పాల్గొనే ముందు మాస్క్ ధరించి, శానిటైజర్ వాడండి.   













Share:

చిలకలూరిపేటలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లిన కారు

 చిలకలూరిపేటలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లిన కారు 


https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో ఎన్ ఆర్ టి సెంటర్ నందు శుక్రవారం ఉదయం కారు అదుపుతప్పి రోడ్ పక్కనే వున్నా దుకాణం లోకివెళ్ళింది. వివరాలలోకి వెళ్తే పెదనందిపాడు మండలం అన్నారం గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా నరసరావుపేట వైపు నుండి వస్తూ ఎన్ ఆర్ టి సెంటర్ నందు రోడ్డు దాటుతున్న క్రమంలో ఒంగోలు వైపుగా వెళ్తున్న ఒక లారీ ఢీ కొనటంతో కారు అదుపుతప్పి సెంటర్ లోని రోడ్డు పక్కనే ఉన్న స్వాతి బిర్యాని పాయింట్ లోకి దూసుకువెళ్లింది. ఉదయం కావటంతో ఆ సమయంలో షాప్ తెరిచిలేదు కనుక ఆ సమయంలో ఎవరు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తపింది. కారు ఒక వైపు దెబ్బతిన్నది. 

నిన్న ఆ ప్రదేశానికి 10 అడుగుల దూరంలో మధ్యాహ్నం సమయంలో బైక్కు మంటలు చెలరేగాయి . ఈ రోజు కారు ప్రమాదం జరిగింది అని స్థానికులు చెప్తున్నారు.    











Share:

చిలకలూరిపేటలోని టిడ్కొ ఇళ్లలో 200 పడకలతో కరోనా కేర్ సెంటర్కు రంగం సిద్ధం

 చిలకలూరిపేటలోని టిడ్కొ ఇళ్లలో 200 పడకలతో కరోనా కేర్ సెంటర్కు రంగం సిద్ధం 


https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా కేసులు మళ్ళి పెరుగుతున్న క్రమంలో ఎమర్జెన్సీ సర్వీస్ కొరకు 200 పడకలతో కరోనా కేర్ సెంటర్ను మళ్ళి ప్రారంభించబోతున్నారు. పట్టణంలో ఉన్న హాస్పిటల్స్లో బెడ్లు తక్కువ ఉనందువలన ఎమర్జెన్సీ సర్వీస్ కొరకు పేటలోని టిడ్కొ ఇళ్లను కరోనా కేర్ సెంటర్లుగా మార్చనికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 200 పడకలను తరలించి ఆప్రాంతాన్ని శానిటేషన్ చేపిస్తున్నారు అధికారులు. 

























Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.