మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేటలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేటలో టిడిపి, వైఎస్ఆర్సిపి కార్యకర్తల మధ్య సీసాలు,రాళ్లతో దాడి - భారీ ట్రాఫిక్ జామ్

నరసరావుపేట :- 2024 ఎలక్షన్ పల్నాడు జిల్లాలో చాలా రసవంతంగా జరిగేలా ఉన్నాయి. పొద్దున వరకు హాట్ టాపిక్ గా నిలిచిన చిలకలూరిపేట రాజకీయం, ఉన్నట్టుండి ఒక్కసారిగా నరసరావుపేటలో కూడా రాజకీయాలు వేడెక్కాయి.

వివరాల్లోకి వెళితే నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పార్టీ కార్యక్రమంలో భాగంగా ఐదో వార్డ్ క్రిస్టియన్ పాలెం లో ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఒకరినొకరు బాహబాహీ కి దిగారు. అది కాస్త ముదిరి సీసాలు రాళ్లతో దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనల్లో టిడిపి కార్యకర్తలకు గాయాలు అవ్వగా వారిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ఈ ఘటనకు నిరసనగా టిడిపి శ్రేణులు భారీ ఎత్తున గడియార స్తంభం సెంటర్ వద్ద భారీ ర్యాలీని చేపట్టారు. దీంతో నరసరావుపేటలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


Follow this link:

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp



Share:

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు

 చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు


చిలకలూరిపేట :- చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడుని ప్రకటించిన వైసీపీ అధిష్టానం. ఇవాళ ఉదయం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో గందరగోళం నెలకొన్నది. పార్టీలోని ముఖ్య నేతలు అంతా చర్చించుకుని లోకల్ లో బలమైన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్టానాన్ని కోరారు. అయినప్పటికీ గుంటూరు మేయర్ గా పనిచేస్తున్నటువంటి కావటి మనోహర్ నాయుడుని చిలకలూరిపేట అభ్యర్థిగా ఖరారు చేశారు. స్థానిక వ్యక్తులను కాకుండా బయట వారికి అవకాశం ఇస్తే 30 మంది వైసిపి కౌన్సిలర్లు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. 
మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే మనోహర్ నాయుడు గుంటూరులోనే ఉన్న విడదల రజిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.


Follow 


Share:

చిలకలూరిపేట :- మల్లెల రాజేష్ టికెట్ విషయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన తెలిపిన వైసీపీ కార్యకర్తలు

చిలకలూరిపేట :- మల్లెల రాజేష్ టికెట్ విషయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన తెలిపిన వైసీపీ కార్యకర్తలు

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp


చిలకలూరిపేట :- పట్టణంలోని బ్యాంకు కాలనీ నందు ఉన్న వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా మల్లెల రాజేష్ నాయుడు అసెంబ్లీ రేసు నుంచి తప్పిస్తున్నారు అన్న పరిణామాలకు మనస్థాపానికి గురైన ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని నిరసనను తెలియజేశారు. రాజేష్ నాయుడు కి టికెట్ ఇవ్వకపోతే తాము పెట్రోల్ పోసుకొని ఆత్మహతికి పాల్పడతామని వారు తెలిపారు. మల్లెల రాజేష్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమయమనం పాటించాలని ఇలాంటి అవాంతర ఘటనకు పాల్పడవద్దని టికెట్టు తనకు దక్కిన దక్కకపోయినా చిలకలూరిపేట నుంచి ఎవరు నుంచున్న కూడా కార్యకర్తలందరూ వైసిపి గెలుపుకి పనిచేయాలని ఆయన తెలిపారు.


Follow 

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

దమ్ముంటే విడదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు

దమ్ముంటే విడదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు

దమ్ముంటే విడుదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు

చిలకలూరిపేట :- నియోజకవర్గంలోని రాజకీయం వేడెక్కింది. మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ నందు ఆయన తన ఆవేదనను వెలగక్కారు. 2019 నుండి పార్టీకి కొమ్ము కాసి పనిచేస్తున్న వైసిపి కుటుంబ సభ్యులను అన్యాయం చేస్తున్నారని.. నాడు మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానంటే తాము అందరం కష్టపడి పని చేశామని. పార్టీ గెలిచిన తర్వాత మంత్రి రజిని వల్ల మర్రి రాజశేఖర్ కు మొండి చేయి మిగిలిందని. కార్యకర్తలందరం వరుసలు పెట్టి పిలుచుకునేంత సన్నిహితంగా ఉంటామని కానీ ఈరోజు ఎక్కడో గుంటూరు విజయవాడ నుండి వ్యక్తులను తీసుకొచ్చి చిలకలూరిపేట నియోజకవర్గంలో నిలబెడతామంటే తాము ఒప్పుకోమని ఆయన తెలిపారు. పార్టీ నాకు కాకపోయినా చిలకలూరిపేటలో ఉండే బలమైన వ్యక్తికి టికెట్ ఇస్తే తాము అందరం కలిసి గెలిచి చూపిస్తామని ఆయన తెలిపారు. మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే తన తరఫునుంచి 20 కోట్ల రూపాయలు పార్టీకి ఖర్చు పెడతానని ఆయన తెలియజేశారు. కాబట్టి మనోహర్ నాయుడు గుంటూరు నుండి దమ్ముంటే విడుదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన సవాలు విసిరారు. తనకు రజిని వద్ద నుండి 6 కోట్ల రూపాయలు డబ్బు రావాల్సి ఉంటే దాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి తో మాట్లాడితే డబ్బులు ఇస్తుందో ఇవ్వదో వదిలేసేయ్ అని అన్నారని వాపోయారు.

Follow

Share:

చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం

చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం

చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం

చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి పార్టీలో రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది. ఇప్పటికే చిలకలూరిపేట సమన్వయకర్తగా ఉన్నటువంటి మల్లెల రాజేష్ నాయుడు పోటీపై భిన్నభిప్రాయాలు చర్చిలు జరుగుతూ ఉండటం దీనికి కారణం. సమన్వయకర్తగా రాజేష్ నాయుడు పేరు ప్రకటించినప్పటి నుండి కూడా వారానికి 10 రోజులకు ఒకసారి పోటీ చేసే వ్యక్తిపై భిన్నభిప్రాయాలు వ్యక్తం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పుకార్లను షికారులుగా చేసేది ప్రత్యథి పార్టీ అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదేమో... సొంత పార్టీలోని నేతలు, క్యాడర్ పోటీ చేసే వ్యక్తి మారుతారని మొదటి నుంచి ప్రచారం చేయడంతో 2019 ఎలక్షన్ తర్వాత బలంగా ఉన్న క్యాడర్ ఏ వర్గం వైపు ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. తాజాగా నేడు వైయస్ఆర్సీపీ 14 ఆవిర్భావ వేడుకలలో సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు వ్యాఖ్యలు చర్చనీయాంసంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "కొత్తవారు వస్తుంటారు పోతుంటారు, నేను లోకల్ గెలిచినా ఓడినా నేను మీతోనే ఉంటాను" అని ఎలాగైనా సరే వైసిపి తరఫున తాను పోటీ చేసి తీరుతానని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో టికెట్ ఖరారు పై ఇంకా స్పష్టత రాలేదని పోటీ చేసే అభ్యర్థిని మారుస్తున్నారని ఉదయం నుంచి ఈ వార్త ధారాళంగా పట్టణ ప్రధాన సెంటర్లలో మారుమోగుతుంది. కొన్ని రోజుల క్రితం అంబటి రాంబాబు తీసుకువస్తారని ఇప్పుడు తాజాగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు నీ చిలకలూరిపేట వైపు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని బోగొట్ట. ఏది ఏమైనా ఈ పరిణామాలతో వైసిపి కేడర్ గందరగోళం లో పడిందని చర్చించుకుంటున్నారు. మర్రి రాజశేఖర్, జాన్ సైదా, మల్లెల రాజేష్ నాయుడు కొంతమంది బలమైన లీడర్స్ ఉండగా బయట నుండి వ్యక్తులను తీసుకురావడం సబబేనా అని పార్టీలోని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.


Follow this link to join my WhatsApp group:

 https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.