మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించిన తసీల్ధార్ సుజాత గారు

 చిలకలూరిపేట కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించిన తసీల్ధార్ సుజాత గారు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో ప్రముఖ వైద్యశాల అయిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సోమవారం నాడు తసీల్ధార్ సుజాత గారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరా గురించి, ఒకొక్క బెడ్ కు ఎంత వసూళ్లు చేస్తున్నారు. అని వివరాలు అడిగి  తెలుసుకున్నారు. ఆసుపత్రి పైన ఫిర్యాదులు రావటంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తసీల్ధార్ సుజాత గారితో పాటుగా ఎంపీడీఓ, ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు  

















Share:

ఇలా చేస్తే చిలకలూరిపేటలో మరణాలను తగ్గించవచ్చు

 ఇలా చేస్తే చిలకలూరిపేటలో మరణాలను తగ్గించవచ్చు 

https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణంలో రోజురోజుకి మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా యువకులు, చిన్న, పెద్ద అనే తేడాలేకుండా అందరిని తీసుకువెళ్లిపోతుంది. ఇది ఎలా ఉంటే ఏదో స్టేట్ గవర్నమెంటో , లేదా సెంట్రల్ గవర్నమెంటో సహాయం చేసే వరకు మనం వేచి చూస్తే మన అనుకున్న వాళ్లకు అందరూ దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. దీని కోసం ఒక చిన్న ప్లాన్ నచ్చితే పాటించండి. 

చిలకలూరిపేటలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో ఆర్ధికంగా బలపడిన వాళ్ళు ఉంటారు, వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ ప్లాన్ అంతా ఆధారపడి ఉంటుంది. ప్రతి వార్డు కౌన్సిలర్ వాళ్ళ వాళ్ళ వార్డులలో ఆర్ధికంగా ఉన్న వాళ్ళ దగిర నుండి వార్డు మొత్తం మీద ధాతల రూపంగా డబ్బులు పోగుచేసి ( ఎవరిని ఇబ్బంది పెట్టకుండా). అన్నదానం, రక్త దానం, గోదానం, కన్నా ప్రాణ వాయువు దానం ముఖ్యం అని తెలియ చేయండి. ఆక్సిజెన్ కాన్సన్ట్రేషన్లు వార్డుకి 5 వచ్చేలా కొనాలి. మనం రోజుకి ఆక్సిజెన్ లేక పేట మొత్తం మీద 10 మంది చనిపోతున్నారు అనుకుందాం. 38 వార్డులు * 5 ఆక్సిజెన్ కాన్సన్ట్రేషన్లు = 190 ఆక్సిజెన్ కాన్సన్ట్రేషన్లు వస్తాయి. వీటి వల్ల చాలా మందిని రక్షించిన వాళ్ళము అవుతాము. 

ఈ అంశాన్ని శాసనసభ్యురాలు గారికి కానీ, మునిసిపల్ కమిష్నర్ గారికి కానీ, ఛైర్మెన్ గారికి కానీ వివరించండి. తప్పుగా అనుకోకుండా మొన్న విజయోత్సవ ర్యాలీ ఖర్చు మొత్తం మునిసిపల్ బిల్లు పెట్టి ఆమోదించారు. అలాగే దీన్ని కూడా  అలాగే చేసి వార్డుకి మునిసిపాలిటీ  పరంగా 2 ఆక్సిజెన్ కాన్సన్ట్రేషన్లు ఇచ్చిన మిగిలినవి దాతల రూపంలో తీసుకొని వార్డులోని ప్రజలకు ఉపయోగించి వారి ప్రాణాలను కాపాడినవాళ్ళం అవుతాం. ఎన్నికలలో చాల డబ్బు ఖర్చు చేస్తున్నాం, ఎన్నో ఎన్నో దానాలు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. 

రాష్ట్రంలో ఏ ప్రాంతం వారు అయిన ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాల ఆర్గనైజషన్స్, స్వచ్చంద సంస్థలు, ట్రస్టులు, అసోసియేషన్లు, కమిటీలు,  చాలా ఉన్నాయి. వాళ్ల్లు అందరూ ఒకసారి ఈ ప్రయత్నం చేసి చూడండి. 


ఒక్క వార్డు లో అయినా ఈ ప్లాన్ అమలు చేస్తారు అని ఆశిస్తూ - CHILAKALURIPET SPEED NEWS 

    



















Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.