మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం - చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ యూనియన్

రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం - చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ యూనియన్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు లో జరిగిన సిద్ధం సభలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది యువకులు అత్యుత్సాహంతో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీకృష్ణకు తీవ్రమైన గాయాలయ్యాయి. సిద్ధం సభను న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ పై ఇలాంటి దాడి చేయడంతో ప్రజా సంఘాలు, ఆంధ్ర జర్నలిస్టుల అసోసియేషన్ తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేశాయి. 

 రాప్తాడు లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై జరిగిన దాడిని చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ నందు కలకత్తా, చెన్నై జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించి కెమెరామెన్ పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ వరకు జర్నలిస్టులు అందరూ ర్యాలీగా వెళ్లి సీనియర్ అసిస్టెంట్ మస్తాన్ వలికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే  ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పుల్లగూర భక్తవత్సలరావు మాట్లాడుతూ రాప్తాడు లో సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై దాడి చేయడం జగన్ ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్య అన్నారు. ఇండియాలోనే ఫోర్త్ ఎస్టేట్ అని పిలవబడే మీడియాకి ఈ రోజున వైయస్ జగన్ పాలనలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని దీనిపై వెంటనే ముఖ్యమంత్రి స్పందించి దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని భక్తవత్సలరావు తెలిపారు. స్టేట్ కౌన్సిల్ మెంబర్ మస్తాన్ వల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభలో స్వయానా మీడియాపై దాడి జరిగితే దీనికి ముఖ్య మంత్రి బాధ్యత వహించి వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి ఈనాడు విలేఖరి పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏపీడబ్ల్యూజే తరఫున మస్తాన్ వలీ డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు  అన్నలదాసుశేషగిరిరావు, సెక్రటరీ షేక్.అబ్దుల్ సత్తార్, ఏపీడబ్ల్యూజే జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లాబక్షు,ఎలక్ట్రాన్ మీడియా కార్యదర్శి మల్లాల కోటేశ్వరరావు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఎన్.బాబ్జీరావ్, నారాయణస్వామి ఆంధ్రజ్యోతి,  పోపూరి వెంకట్రావు,  షేక్.ఫక్రుద్దీన్,ఆలపాటిఆంజనేయులు, కుప్పం.కళ్యాణ్ చక్రవర్తి చుక్కా. విజయ్ కుమార్, విజయ్, ఉప్పల.బాలు, బొందలపాటి.వాసు , మురళి , దాసు, జగదీష్, సిద్ధిక్, నారాయణస్వామి,సలాసం శ్రీనివాసరావు,వెంకట్రావు,జరుగుల శ్రీనివాసరావు, మనోజు, మరియు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.