మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

నరసరావుపేట ఎంపీ - పయ్యనమేటు ?

 నరసరావుపేట ఎంపీ - పయ్యనమేటు ?

పలనాడు జిల్లా :- నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయల రాబోవు ఎన్నికలకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది సందిగ్ధత ఏర్పడింది. పార్లమెంట్ పరిధిలో తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకోవడంలో సఫలమయ్యారు. అయితే వైఎస్ఆర్సిపి అధిష్టానం నరసరావుపేట నుంచి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే దానికి సదరు ఎంపీ ససేమీరా అనటంతో క్యాంప్ ఆఫీస్ లోని ముఖ్య నేతలు ఖంగుతున్నారు. అయితే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను గుంటూరు పార్లమెంటు నుండి పోటీ చేయమని అధిష్టానం కోరిందని కానీ తాను నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని కరాకండిగా తెలియజేశారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో తాను చేయాల్సిన పనులు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని వాటన్నిటిని తాను పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో తాను గుంటూరు నుండి పోటీ చేయనని నరసరావుపేట నుంచి మాత్రమే పోటీ చేస్తానని తెలియజేశారు. గతంలో చిలకలూరిపేట శాసనసభ్యురాలుగా ఉన్న మంత్రి విడదల రజినికి మరియు ఎంపీకి మధ్య ఉన్న విభేదాల వలన పార్లమెంటు పరిధిలోని చాలా పనులు ఆటంకం కలిగాయని ఇప్పుడు మళ్లీ గుంటూరు నుంచి పోటీ చేస్తే అదే విడదల రజిని కూడా గుంటూరు పశ్చిమ నుండి పోటీ చేయడం తర్వాత వచ్చే పరిణామాలు దృష్ట్యా ఎంపీ గుంటూరు నుంచి పోటీ చేయకూడదని అనుకుంటున్నారని పలువురి అభిప్రాయం. మెయిన్ రోడ్, చిన్నరథం సెంటర్, చిలకలూరిపేట.



Share:

వైసీపీకి షాక్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు

వైసీపీకి షాక్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు 

ఆంధ్రప్రదేశ్ :- గత కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తన మార్కును చాటి విస్తృతంగా పర్యటన చేసిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు తిరిగి అదే పార్టీకి షాక్ ఇవ్వటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయానికి అభిమానులు ఒకింత షాక్కి గురయ్యారు. కొన్ని నెలల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరిన అంబటి రాయుడు గుంటూరు, విజయవాడ కాన్స్టెన్సీ లో టికెట్ ఆశించడం జరిగింది. అయితే ఆ రెండు కాన్స్టెన్సీలో గెలుపు రాయులకు టికెట్లు కన్ఫర్మ్ చేయడంతో అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తాను వైసిపి నుండి బయటకు వస్తున్నట్లు కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండి తర్వాత కార్యాచరణను ప్రకటిస్తారని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.