మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

మహిళా చదువు - అభివృద్ధి మెరుగు * ఆర్థికంగా వెనుకబడి టాలెంట్ ఉన్నా బాలికల విద్యాభివృద్ధికి నా వంతు సాయం చేస్తాను - సీఐ రాజేశ్వర రావు

మహిళా చదువు - అభివృద్ధి మెరుగు * ఆర్థికంగా వెనుకబడి టాలెంట్ ఉన్నా బాలికల విద్యాభివృద్ధికి నా వంతు సాయం చేస్తాను - సీఐ రాజేశ్వర రావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని ఆది ఆంధ్ర కాలనీ లో ఏర్పాటుచేసిన మహిళ బాలికల రక్షణ మరియు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు అందులో భాగంగా టౌన్ సీఐ రాజేశ్వరరావు మహిళల చదువు వారి యొక్క ఒక అభివృద్ధి అపోహల పై మాట్లాడుతూ సమాజంలో మహిళల చదువు ఎంతో ఉపయోగకరమని, మహిళలు చదువుకోవడం వలన సమస్యలు ఏర్పడతాయి... అన్నా అపోహల నుండి బయటకి రావాలని, తాను ప్రభుత్వ ఉద్యోగిని అయినప్పటికీ సొంత ఊరికి దూరంగా ఉండి విధులను నిర్వహిస్తున్నామని, కానీ మహిళలు చదువుకోవడం వలన స్థానికంగానే అనేక ఉద్యోగ సదుపాయాలు ఉన్నాయని. ఉదాహరణకు ఏఎన్ఎంలు ,వాలంటీర్లను చూపిస్తూ కష్టపడి చదవడం వలన సొంత ఊరిలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నారని, అలాగే స్త్రీలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నెలకు లక్ష నుండి మూడు లక్షల వరకు జీతం సంపాదిస్తున్నారని, గుర్తు చేశారు. టాలెంట్ ఉండి ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు తన వంతు సహాయంగా కృషి చేస్తానని. ఈ సందర్భంగా సిఐ రాజేశ్వరరావు తెలిపారు. అలాగే దిశ చట్టంపై అవగాహన కలిగించారు. మహిళలు అభద్రతా భావాన్ని తొలగించుకోవాలని స్త్రీ ఒక శక్తిగా ఉండాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు తెలియజేశారు.



Share:

చిలకలూరిపేట:- విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు - సభ్యుల వివరాలు ఇవే

చిలకలూరిపేట:- విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు  - సభ్యుల వివరాలు ఇవే

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గంలోని పాఠశాలలు కళాశాలలోని విద్యార్థులు వారి యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం పట్టణంలోని విద్యార్థులు అందరూ కలిసి 10/11/2021 న‌ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) (నాన్ పొలిటికల్) ఏర్పాటు చేసుకున్నారు. ఈ అందులో భాగంగా విద్యార్థులకు వారి యొక్క హక్కులను తెలియజేస్తూ - హక్కులకు భంగం కలిగించే ఏ చర్యను సహించబోమని వాటిపై న్యాయ పోరాటం చేసి సాధించుకుంటామని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ జేఏసీ కమిటీ ఏ పార్టీలకు సంబంధం లేదని విద్యార్థుల హక్కులను పరిరక్షించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ జేఏసీ విద్యార్థులందరికీ భవిష్యత్తుకు ఉపయోగపడేది లాగా పనిచేయాలని అని వారు తీర్మానించుకున్నారు. ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రెసిడెంట్ గా సి ఆర్ కాలేజీ కి సంబంధించిన విద్యార్థి యు.సిద్దు, వైస్ ప్రెసిడెంట్ గా రోహిణి డిగ్రీ కళాశాల కు సంబంధించిన విద్యార్థి మేకపోతుల. నాగేశ్వరరావు, ఎం. సాయి తేజ, సెక్రెటరీగా గుడిపల్లి. జగదీష్, జాయింట్ సెక్రటరీగా మాదాసు. పృథ్వీరాజ్, ఎ. త్రినాధ్, ట్రెజరీ గా మండాది ఫణి, నెంబర్లుగా భగత్ సింగ్, పి. మహేష్, మురారి (DRNS), మస్తాన్ వలీ, ఆలీ బాబు గా తన 13 మంది సభ్యుల తో జేఏసీ ని ఏర్పాటు చేశారు.



Share:

అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత !!!

అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత !!!

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈరోజు 11వ రోజు కి చేరింది అందులో భాగంగా ప్రకాశం జిల్లా చదలవాడ ఊర్లో రైతులు పాదయాత్ర కొనసాగిస్తుండగా. పోలీసులు ఒక్కసారిగా లాఠీఛార్జ్ చేశారు. రైతులకు మద్దతు తెలపడానికి వచ్చిన స్థానిక రైతుల పై కూడా లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో సంతనూతలపాడు గ్రామానికి చెందిన నాగార్జున అనే వ్యక్తి గాయాలయ్యాయి. రైతులను పాదయాత్ర చేయకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఘటన లోని రైతు మాట్లాడుతూ న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమానికి ప్రతి ఊరు నుండి వేలాదిమంది ప్రజలు రైతులు మద్దతు తెలుపుతున్నారని. శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటూ ఉండే మాపై లాఠీ ఛార్జ్ చేయడం సముచితం కాదని వారు తెలిపారు.



Share:

దొంగ దొరికాడు - చాకచక్యంగా పట్టుకున్న టౌన్ పోలీస్ శాఖ

దొంగ దొరికాడు - చాకచక్యంగా పట్టుకున్న టౌన్ పోలీస్ శాఖ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట ఈనెల 8 వ తారీఖున పండరీపురం 8 వ లైను నందు అంబటిపూడి శారద అనే మహిళ నడుచుకుంటూ వెళుతుండగా .. అది గమనించిన చైన్ స్నచర్ వెనకనుండి వచ్చి అమాంతం ఆమె మెడలోని మూడు సవర్ల బంగారపు గొలుసును లాక్కొని వెళ్ళిపోయాడు. వెంటనే టౌన్ పోలీస్ శాఖకు విషయం తెలియజేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా దుండగుడు పట్టణంలోని సంజీవ్ నగర్ కు చెందిన బత్తుల నాగేంద్రబాబు గా గుర్తించారు. పోలీసు విచారణలో తాను పెయింట్ వర్క్ చేస్తుంటాడని, అప్పుల బాధతో ఇలాంటి చర్యకు పాల్పడ్డాడని తెలిపాడు. పోలీసులు బంగారు గొలుసును రికవరీ చేశారు. కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే దొంగను పట్టుకోవడంతో సీఐ రాజేశ్వరరావు టౌన్ ఎస్ఐ ఫిరోజ్ ను అభినందించారు.



Share:

చిలకలూరిపేట:- పొలాల్లోకి దూసుకు వెళ్ళిన RTC బస్సు

చిలకలూరిపేట:- పొలాల్లోకి దూసుకు వెళ్ళిన RTC బస్సు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నుండి నరసరావుపేట బయలుదేరిన నరసరావుపేట డిపో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకుపోయింది. నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వచ్చి దారిలో అమీన్ సాహెబ్ పాలెం సమీపంలోని బసిక పురం గ్రామం వద్ద బస్సు అదుపు తప్పి పొలాల్లో కి వెళ్ళింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అనంతరం వెనక నుండి వచ్చే ఆర్టీసీ బస్సు లో మిగిలిన ప్రయాణికులను ఎక్కించి బస్సు డ్రైవర్ నరసరావుపేట డిపో కి ఘటనను వివరించారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.