మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

యడ్లపాడు భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్

యడ్లపాడు భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/


యడ్లపాడు భూషయ్య నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్- వివరాల్లోకి వెళ్తే గరికపాడు చెక్ పోస్ట్ వద్ద TSRTC బస్సు నందు నిర్వహించిన తనిఖీలలో 100 రెమిడేసివర్ ఇంజక్షన్ లను తరలిస్తూ పట్టుబడ్డారు. వీటి విలువ దాదాపు బ్లాక్ మార్కెట్లో 45 లక్షలు ఉండవొచ్చు అని అంచనా. పోలీసులకు అందిన సమాచారం మేరకు హైదరాబాద్ నందు ల్యాండ్ మార్క్ హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్ డాక్టర్గా పనిచేస్తున్న భవ్య  ద్వారా తీసుకువస్తునట్లు సమాచారం. రేపు ఆమెని కూడా విచారించి ఎక్కడి నుండి తీసుకువచ్చారు అని విచారణ చెయ్యనున్నారు. అసలు కరోనా కేసులు ట్రీట్మెంట్ చెయ్యటనికి గుర్తింపు లేని హాస్పిటల్ నందు కరోనా రోగులకు ఎలా వైద్యం అందిస్తారు అని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అని తెలియచేసారు.  
















Share:

చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు - ఫుడ్ కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్

చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు - ఫుడ్ కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని 52 ఎకరాలో ఉన్న టిడ్కొ  ఇళ్లలో కరోనా కేర్ సెంటర్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న కరోనా రోగులతో మాట్లాడారు. అన్ని సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే అక్కడి వారు తమకి సరిఅయిన ఆహారం అందచేయటం లేదు అని, మంచినీటి వసతి సరిగా ఉండటం లేదు అని ఫిర్యాదు చేసారు. అక్కడే ఉన్న ఫుడ్ కాంట్రాక్టర్ పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ ఇళ్ళల్లో కూడా ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి ఆహారాన్ని మీరు తీసుకుంటారా, వాళ్ళు కూడా మనుషులే అని ఇంకొకసారి ఇలా జరిగితే కాంట్రాక్టు రద్దు చేస్తాం అని తెలిపారు. అలాగే ప్రతి రూమ్ లోను డాక్టర్ నెంబర్ ఉండేలా చూడాలి అని, వైద్య సదుపాయాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలి అని తెలిపారు.   













Share:

కరోనా టెస్ట్ చేపించుకొని రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారా !!! - రిపోర్ట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కరోనా టెస్ట్ చేపించుకొని రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారా !!! - రిపోర్ట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా RTPCR , రాపిడ్ టెస్ట్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనకి ఒక శాంపిల్ ఐడీ జెనరేట్ అవుతుంది. అది ID : 201758399(శాంపిల్) ఇలా ఉంటుంది. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి 

http://dashboard.covid19.ap.gov.in/ims/knowSampleStatus/ 

పైన ఇచ్చిన లింక్ క్లిక్ చేసి "సెలెక్ట్ సెర్చ్ టైప్" అని ఉంటుంది అందులో"శాంపిల్ ఐడి" పైన కిక్ చేసి పక్కనే "ఎంటర్ వాల్యూ" అని ఉంటుంది అందులో మీ ID నెంబర్ ఎంటర్ చేసి పక్కనే ఉన్న "సెర్చ్" పైన క్లిక్ చెయ్యండి. మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్ ) వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే మనకి రిపోర్ట్ స్టేటస్ వస్తుంది. 











Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.