మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలో గుట్కా, ఖైనీ విక్రయించేవారిని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు

 చిలకలూరిపేటలో గుట్కా, ఖైనీ విక్రయించేవారిని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో కృష్ణారెడ్డి డొంక నందు గుట్కా, ఖైనీ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసారు. అతని వద్ద నుండి 3500 పాకెట్లను సీజ్ చేసారు అధికారులు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిని కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  


































 

Share:

చిలకలూరిపేటలో ఇలా వ్యాక్సిన్ కోసం అని వెళ్తే కరోనా కచ్చితంగా వస్తుంది

చిలకలూరిపేటలో ఇలా వ్యాక్సిన్ కోసం అని వెళ్తే కరోనా కచ్చితంగా వస్తుంది
https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట శాలిపేట నందు ఉన్న డిస్పెన్సరీ వద్ద వ్యాక్సిన్ కోసం గుంపులు గుంపులుగా ప్రజలు. కరోనా భయంతో ప్రజలు వ్యాక్సిన్ బాట పట్టారు కానీ వెళ్ళే చోటే కరోనా ప్రమాదం పొంచి ఉన్నది అని అర్ధం చేసుకోలేకపోతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించమని రోజు టీవీలలో, మైకులలో,అవగాహన కలిపిస్తుంటే. వీరు మాత్రం ఇలా ! , వాక్సిన్ వేసుకుంటే కరోనా భయం తగ్గుతుంది కానీ వాక్సిన్ ఉన్న ఏరియాలో ఉంటే కరోనా రాదు అని ఎవరు చెప్పలేదు కదా ! వ్యాక్సిన్ ప్రక్రియ రెండు రోజులలో అయిపోతుంది అన్నట్లుగా ప్రజలు వ్యవహరిస్తున్నారు. దయచేసి ఇలా ఉన్న చోటే కరోనా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నాకు లేదు కదా అనుకుంటే పొరపాటే ప్రక్కవాడికి  ఉంటే మీరు ఏంచేస్తారు. వ్యాక్సిన్ వేపించుకున్నాం అని అనుకున్నటున్నారు కానీ దగర ఉండి కరోనని ఇంటికి తీసుకువెతున్నాం అని ఎవరు ఏలోచించటం లేదు అని తెలిపే చిత్రం ఇది.    



https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/


























Share:

చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ ను వైయస్ఆర్ కూరగాయల మార్కెట్ గా పేరు మార్పు

చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ ను వైయస్ఆర్ కూరగాయల మార్కెట్ గా పేరు మార్పు

https://chilakaluripetspeednews.blogspot.com/


ఒకప్పటి దేవాదాయ మినిస్టర్ అయిన కల్లూరి చంద్రమౌళిగారి చేతుల మీదుగా అప్పటి చిలకలూరిపేట పంచాయితీ లో మొదటిసారిగా ఎర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ కు గుర్తుగా చంద్రమౌళి కూరగాయల మార్కెట్ గా నామకరణం చేసారు. ఈ రోజు జరిగిన కౌంసిల్ సమావేశంలో షేక్ రాఫ్ఫాని గారి అధ్యక్షతన సభ్యుల ఆమోదం మేరకు చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరును వైయస్ఆర్ కూరగాయల మార్కెట్ గా పేరు మార్చారు. 

















Share:

యడ్లపాడు భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్

యడ్లపాడు భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/


యడ్లపాడు భూషయ్య నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్- వివరాల్లోకి వెళ్తే గరికపాడు చెక్ పోస్ట్ వద్ద TSRTC బస్సు నందు నిర్వహించిన తనిఖీలలో 100 రెమిడేసివర్ ఇంజక్షన్ లను తరలిస్తూ పట్టుబడ్డారు. వీటి విలువ దాదాపు బ్లాక్ మార్కెట్లో 45 లక్షలు ఉండవొచ్చు అని అంచనా. పోలీసులకు అందిన సమాచారం మేరకు హైదరాబాద్ నందు ల్యాండ్ మార్క్ హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్ డాక్టర్గా పనిచేస్తున్న భవ్య  ద్వారా తీసుకువస్తునట్లు సమాచారం. రేపు ఆమెని కూడా విచారించి ఎక్కడి నుండి తీసుకువచ్చారు అని విచారణ చెయ్యనున్నారు. అసలు కరోనా కేసులు ట్రీట్మెంట్ చెయ్యటనికి గుర్తింపు లేని హాస్పిటల్ నందు కరోనా రోగులకు ఎలా వైద్యం అందిస్తారు అని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అని తెలియచేసారు.  
















Share:

చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు - ఫుడ్ కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్

చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు - ఫుడ్ కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని 52 ఎకరాలో ఉన్న టిడ్కొ  ఇళ్లలో కరోనా కేర్ సెంటర్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న కరోనా రోగులతో మాట్లాడారు. అన్ని సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే అక్కడి వారు తమకి సరిఅయిన ఆహారం అందచేయటం లేదు అని, మంచినీటి వసతి సరిగా ఉండటం లేదు అని ఫిర్యాదు చేసారు. అక్కడే ఉన్న ఫుడ్ కాంట్రాక్టర్ పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ ఇళ్ళల్లో కూడా ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి ఆహారాన్ని మీరు తీసుకుంటారా, వాళ్ళు కూడా మనుషులే అని ఇంకొకసారి ఇలా జరిగితే కాంట్రాక్టు రద్దు చేస్తాం అని తెలిపారు. అలాగే ప్రతి రూమ్ లోను డాక్టర్ నెంబర్ ఉండేలా చూడాలి అని, వైద్య సదుపాయాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలి అని తెలిపారు.   













Share:

కరోనా టెస్ట్ చేపించుకొని రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారా !!! - రిపోర్ట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కరోనా టెస్ట్ చేపించుకొని రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారా !!! - రిపోర్ట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా RTPCR , రాపిడ్ టెస్ట్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనకి ఒక శాంపిల్ ఐడీ జెనరేట్ అవుతుంది. అది ID : 201758399(శాంపిల్) ఇలా ఉంటుంది. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి 

http://dashboard.covid19.ap.gov.in/ims/knowSampleStatus/ 

పైన ఇచ్చిన లింక్ క్లిక్ చేసి "సెలెక్ట్ సెర్చ్ టైప్" అని ఉంటుంది అందులో"శాంపిల్ ఐడి" పైన కిక్ చేసి పక్కనే "ఎంటర్ వాల్యూ" అని ఉంటుంది అందులో మీ ID నెంబర్ ఎంటర్ చేసి పక్కనే ఉన్న "సెర్చ్" పైన క్లిక్ చెయ్యండి. మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్ ) వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే మనకి రిపోర్ట్ స్టేటస్ వస్తుంది. 











Share:

చిలకలూరిపేట నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB) కరొనతో మృతి చెందారు

చిలకలూరిపేట నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB) కరొనతో మృతి చెందారు

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేటలోని నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB ) (35) కరొనతో ఈ రోజు మృతి చెందారు. పట్టణములోని సుబ్బయ్యతోటలో నివాసం ఉంటున్న విజయ్ కుమార్ 20 రోజులుగా కరొనతో పోరాడుతూ ఈ రోజు విజయవాడలోని ప్రముఖ హాస్పిటల్ లో మృతి చెందారు. చిన్న వయసులోనే మృతి చెందటం ఆ ప్రాంత ప్రజలని కలచివేసింది. ఎన్నో సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, ఎంతో మందికి ఆర్ధికంగా ఆదుకున్న వ్యక్తి ఈ రోజు లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం సాయంత్రం విజయ్ మృతి దేహాన్ని తీసుకువచ్చి కరోనా కారణంగా త్వరగా అంతక్రియలు నిర్వహించారు. విజయ్ మృతి కారణంగా ఆ ప్రాంతం అంతా మూగబోయింది. 

                                                                              మీ అకాలమృతికి సంతాపం తెలుపుతూ                                                                                        CHILAKALURIPETA SPEED NEWS, Bad Boy's  Youth  


 

Share:

చిలకలూరిపేటలో సరిఅయిన పత్రాలు లేని ఆక్సిజెన్ సీలిండర్లు తీసుకువెళ్తున్న బొలెరో వాహనం స్వాధీనం

చిలకలూరిపేటలో సరిఅయిన పత్రాలు లేని ఆక్సిజెన్ సీలిండర్లు తీసుకువెళ్తున్న బొలెరో వాహనం స్వాధీనం 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఇవాళ ఉదయం తహసీల్దార్ సుజాతగారి ఆధ్వర్యంలో పలు ఆక్సిజెన్ స్టోరేజీల ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన గంటల సమయములోనే 45 సీలిండర్ల ఆక్సిజెన్ తరలిస్తున్న బొలెరో వాహనాని పట్టుకున్నారు. డిప్యూటీ తసీల్ధార్ నాగమలేశ్వరావు గారి విశ్వనాథ్ థియేటర్ సెంటర్ నుండి అటుగా వెళ్తున్న వాహనాని తనిఖీ చేసారు. సరిఅయిన పత్రాలు లేనందు వలన వాహనాన్ని తసీల్ధార్ కార్యాలయంలో ఉంచారు. వాహనాన్ని కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తెరలిస్తునట్లు తెలిపారు.













 

Share:

చిలకలూరిపేటలోని మెడికల్ షాప్స్, ఆక్సిజెన్ స్టోరేజ్ సెంటర్లలో తనిఖీలు - తసీల్ధార్ సుజాత గారు

చిలకలూరిపేటలోని మెడికల్ షాప్స్, ఆక్సిజెన్ స్టోరేజ్ సెంటర్లలో తనిఖీలు - తసీల్ధార్ సుజాత గారు 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని మెడికల్ షాపులలో, ఆక్సిజెన్ స్టోరేజ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని హాస్పిటలలో కరోనా రోగులకు ఇచ్చే రెమిడిసివిర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ లో 30,000 రూపాయలకు అమ్మతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుబ్బయ్యతోట లోని ఆక్సీజెన్ సిలిండర్ స్టోరేజ్ సెంటర్లలో కూడా తనిఖీలు నిర్వహించారు.తహసీల్దార్ సుజాత గారు, అర్బన్ CI బిలాలుద్దీన్  ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. 




















Share:

చిలకలూరిపేటలో కోవిడ్ నియమాలు పాటిస్తూ చిన్నరథం తిరునాళ్ల నిర్వహించారు

 చిలకలూరిపేటలో కోవిడ్ నియమాలు పాటిస్తూ చిన్నరథం తిరునాళ్ల నిర్వహించారు

https://chilakaluripetspeednews.blogspot.com/

27-04-2021 మంగళవారం నాడు చిలకలూరిపేటలోని బంగారపుకొట్లు బజార్ (షరాఫ్ బజార్ ) నందు ఉన్న శ్రీ సీతారామ స్వామి వారి చిన్నరధం తిరునాళ్ల నిర్వహించారు. కరోనా ఉదృతి  పెరుగుతున్న కారణంగా ఎవ్వరిని ఆహ్వానించకుండా పరిమితి సంఖ్యలో (20 మంది) తో కార్యక్రమాన్ని నిర్వహించారు. 23-04-2021 నుండి ఆలయ నిర్వాహకులు, అర్చకుల సమక్షంలో కళ్యాణోత్స్వమ్ నిర్వహిస్తూ రథం తిరునాళ్లతో కార్యక్రమాన్ని ముగిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా రథాన్ని 20 అడుగులు ముందుకు కదిలించి కార్యక్రమాన్ని పూర్తి చేసారు. 

VIdeo:-











Share:

చిలకలూరిపేటలో కరొన తో మృతి చెందిన మహిళకు మునిసిపల్ సిబ్బంది అంత్యక్రియలు

చిలకలూరిపేటలో కరొన తో మృతి చెందిన మహిళకు మునిసిపల్ సిబ్బంది అంత్యక్రియలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట గుర్రాలచావిడికి చెందిన మహిళకు(60) కరోనా సోకటంతో ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉంటు మంగళవారం చనిపోయారు. ఆమె అంత్యక్రియలు నిర్వహించటానికి బంధువులు ఎవరు ముందుకి రాక పోవటంతో మునిసిపల్ సిబ్బంది ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పట్టణ వైస్సార్సీపీ అధ్యక్షులు తల్హాఖాన్ గారు ఆ ప్రాంతంలోని ప్రజలను భయపడవద్దని, శానిటైజేషన్ చూపిస్తామని చెప్పారు. మునిసిపల్ సిబ్బంది ఆమె మృతిదేహాన్ని స్మశానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.  











Share:

చిలకలూరిపేటలో మంగళవారం నాడు కరోనా టెస్టుల కొరకు భారీగా వచ్చిన ప్రజలు - రిజిస్ట్రేషన్ ఫారంలు లేక ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదం

చిలకలూరిపేటలో మంగళవారం నాడు కరోనా టెస్టుల కొరకు భారీగా వచ్చిన ప్రజలు -  రిజిస్ట్రేషన్ ఫారంలు లేక ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదం 

https://chilakaluripetspeednews.blogspot.com/


చీరాల రోడ్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ రోజు కరోనా టెస్టులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ప్రజలు భారీగా తరలి వచ్చారు. హాస్పిటల్ బయట వరకు Q కట్టారు. అయితే సుమారు 400 మంది టెస్టులకి వచ్చారు అని అంచనా . హాస్పిటల్ సిబంది ముందస్తు చర్యలు తీసుకోకుండా అందరికి ఓపీ ఇచ్చారు. కానీ టెస్టులకు  మాత్రం 100 రెజిస్ట్రేషన్ ఫారంలు మాత్రమే ఉన్నాయి అని ఈ రోజుకి 100 మాత్రమే అని చెప్పారు. పొద్దున 7 గంటలకు వచ్చి ఇప్పటి వరకు మండుటెండలో నిలబడి ఇప్పుడు ఫోరంలు లేవు అంటారు ఏంటి అని కొంచంసేపు ఆసుపత్రి సిబ్బందికి ప్రజలకి వాగ్వివాదం జరిగింది. చివరకు హాస్పిటల్ డాక్టర్ గారి చొరవతో వచ్చిన అందరికి టెస్టులు చేస్తాం అని చెప్పారు.ప్రైవేట్ టెస్టుల వలన బయట మెడికల్ ఫెసిలిటీ లేదు. అందువలన అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చినట్టు చెప్పారు. 

వీడియో:-































Share:

చిలకలూరిపేటలో ఇద్దరు మెప్మా ఉద్యోగులు కరొన తో మృతి

 చిలకలూరిపేటలో ఇద్దరు మెప్మా ఉద్యోగులు కరొన తో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరొనతో ఇద్దరు మెప్మా ఉద్యోగులు మృతి. వివరాలోకి వెళ్తే గుంటూరు కార్పొరేషన్ మెప్మా సిటీ మెషిన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ పట్టణంలోని సాంబ శివ నగరులో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, మంగళగిరి లో మెప్మా సిటీ మెషిన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తు మండలంలోని తాతపూడి గ్రామంలో నివాసం ఉంటున్న విజయరాజులు గారు. వీరు ఇరువురు కరోనా వలన సోమవారం నాడు మృతి చెందారు. 









Share:

చిలకలూరిపేటలో కరోనా టెస్టుల కధ

 చిలకలూరిపేటలో కరోనా టెస్టుల కధ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా విలయతాండవం చేస్తుంది.  రోజు ఎవరో ఒకరు కరొనతో మృతి చెందుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే అసలు టెస్టులు ఎక్కడ చేస్తున్నారో ఎవ్వరికి తెలియదు. సోమవారం నాడు కరోనా టెస్టులు చేపించుకుందాం అని చీరాల రోడ్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళితే " సార్ ఈ రోజు సోమవారం టెస్టులు చెయ్యరు సార్ , మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం మాత్రమే చేస్తారు  " అని అక్కడి సిబంది చెప్పారు. అంటే మిగిలిన రోజులలో టెస్టులు చెయ్యరా అని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే రోజు సోషల్ మీడియాలో, వార్తలలో చిలకలూరిపేటలో ప్రతి రోజు 10 కేసులు, 15 కేసులు వచ్చాయి అని వార్తలు  వస్తుంటే అసలు టెస్టులు చెయ్యకుండా కేసులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్నారు. రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ,పేదవారు ప్రైవేట్ లాబ్స్ లలో టెస్టులు చేపించుకుందాం అంటే 3000 లేనిదే RTPCR  టెస్టు లేదు, 3000 లేనిదే సిటీ స్కాన్ లేదు అని అసలే కరొన వల్ల ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉంది. ఇప్పుడు ఈ టెస్టులు కి అంత డబ్బులు కట్టలేక కరోనా లక్షణాలు ఉన్న కాని అలాగే జీవనం సాగిస్తున్నారు. 

ఇప్పటికి అయినా ప్రతి రోజు టెస్టులు నిర్వహించాలి అని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.  


 











Share:

చిలకలూరిపేటలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు నిలిపివేత

చిలకలూరిపేటలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు నిలిపివేత 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా డ్రైవింగ్ లైసెన్సులు, లెర్నింగ్ లైసెన్సులు, 27-04-2021 నుండి 31-05-2021 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి టెస్టులు నిలిపివేస్తునట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (M V I )  నాగేశ్వరరావు గారు తెలిపారు. ఏపీ రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకునట్లు చెప్పారు. 1-06-2021 న టెస్టుల నిర్వహణ ఎప్పుడు మొదలవుతుందో తెలియచేస్తాము అని చెప్పారు. 
















Share:

దేశంలో ఆక్సిజెన్ నిల్వలు లేక కరోనా రోగులు చనిపోతుంటే - ఎగుమతులు శాతం మాత్రం రేటింపుగా ఉంది.

దేశంలో ఆక్సిజెన్ నిల్వలు లేక కరోనా రోగులు చనిపోతుంటే - ఎగుమతులు శాతం మాత్రం రేటింపుగా ఉంది. 

https://chilakaluripetspeednews.blogspot.com/

భారతదేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న, ప్రజలు ఆక్సిజన్ నిల్వలు లేక రోగులకు ఆక్సిజన్ సరిపోక ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన లెక్కల ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలలో ఏకంగా 9300 మెట్రిక్ టన్నుల ఆక్సిజెన్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది రెండింతలకన్నా ఎక్కువ. వీటిలో చాలా వరకు మన చుట్టుపక్క దేశాలకు ముఖ్యంగా బంగ్లాదేశ్ కు ఎగుమతి చేసినట్లు తెలిపారు. ముందు దేశ ప్రజల ఆరోగ్యం ముఖ్యం అని దేశ ప్రజలు వాపోతున్నారు.  

















Share:

చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి

చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా కేసులు మాత్రమే కాదు మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ రోజు పట్టణంలోని స్థానికంగా ఎన్ ఆర్ టి సెంటర్లోని ఒక అపార్టుమెంట్ నందు నివాసం ఉంటున్న పొన్నూరు గణపతి (61) కరొనతో మృతి చెందారు. గత కొన్ని రోజులగా కరొనా తో గుంటూరు లోని ప్రముఖ హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటూ ఈ రోజు మృతి చెందారు. 

గత కొన్ని రోజులగా ఇద్దరు పాస్టర్లు, యంగ్ గోల్డ్ వ్యాపారి, ఇప్పుడు ఇంకొకరు మృతి చెందటంతో పట్టణంలో ప్రజలు బయాందోనలో ఉన్నారు. 










Share:

కరోనా రాకుండా ఉండాలి అంటే 1 సరిపోదు 2 మాస్కులు వాడాలి

కరోనా రాకుండా ఉండాలి అంటే 1 సరిపోదు 2 మాస్కులు వాడాలి


https://chilakaluripetspeednews.blogspot.com/


దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్న క్రమంలో ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా ఆసక్తి విషయాలు పంచుకున్నారు. దేశంలో కరోనా ఉదృతి ఆపాలి అంటే మాస్క్ వాడాలి అని. అది కూడా ఒక మాస్క్ సరిపోదు అని 2 మాస్కులు వాడాలి అని తెలిపారు. క్లాత్, సర్జికల్ మాస్క్ వాడేవారు 2 ఖచ్చితంగా వాడాలి అని తెలిపారు.  
















Share:

చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్

చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్ 


https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేటలో కరోనా కేసులు రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ రోజు అనగా 21-04-2021 బుధవారం నుండి పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించాలి కమిషనర్, ఎంపీడివో, పోలీసుశాఖ వారికీ  ఆదేశాలు జారీ చేసారు తసీల్ధార్ సుజాత గారు. 

 * పట్టణములోని, మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న దుకాణాలు అన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాన్నం 1 వరకు మాత్రమే తెరిచి ఉంచాలి అని,
 * రెస్టారెంట్, హోటల్స్ పార్సెల్ మాత్రమే అనుమతి. 
 * టీ షాప్స్ కు అనుమతులు లేవు కావున తెరవకూడదు. 
 * శ్రీ రామ నవమి పండుగను ఎవరి ఇంటిలో వారే చేసుకోవాలి, పబ్లిక్ లో చేసుకోవటానికి అనుమతులు లేవు. 
 * పట్టణంలో,గ్రామాలలో జాతరలు,తిరునాళ్లలు  జరుపుకోవటానికి అనుమతులు లేవు. 
 * ముఖ్యంగా మాస్క్ లేకుండా బయట తిరిగితే 100 రూపాయల అపరాధ రుసుము వసూళ్లు చేస్తారు. 
 * తోపుడు బళ్ళు ఒకే చోట ఉండకుడదు. 
* ఫంక్షన్స్ , ఇతర కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి. 

     పైన నిబంధనలు పాటించనివారు IPC సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు అని తెలిపారు. 













Share:

చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు

 చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు మంగళవారం నాడు MLA , తహసీల్దార్,కమిషనర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా మార్కెట్ మూసివేసి విశాలమైన మైదానంలో స్టాల్ ఎర్పాటు చేసిన అక్కడకు కూడా ప్రజలు గుంపులు గుంపులు గా వస్తారు. గత అనుభవాల దృష్ట్యా మార్కెట్ అక్కడ ఉంచి మొత్తం 80 షాపులలో 40 ఒక రోజు 40 ఇంకొక రోజు ఎర్పాటు చేసుకుంటూ, షాప్ వదిలి షాప్ తెరచి ఆలా అమ్మకాలు సాగిస్తాం అని తెలియచేసారు. అలాగే గత లాక్ డౌన్ లో హోల్సేల్ మార్కెట్ పెద్ద మార్కెట్ యార్డ్ నందు ఎర్పాటు చేసారు. ఆ సమయంలో అక్కడ నుండి కురగాయలు కొనుగోలు చేసి సంతలో ఎర్పాటు చేసిన రిటైల్ మార్కెట్ వెళ్లే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి మార్కెట్ వ్యక్తిని కోల్పోయాము అని తెలియచేసారు. ఈసారి వ్యవసాయ చిన్న మార్కెట్ యార్డ్ నందు హోల్ సేల్ కి అనుమతి ఇచ్చి రిటైల్ ను ప్రస్తుత మార్కెట్ నందు నిర్వహించుకుంటాం అని తెలియచేసారు. 

కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితిలో మార్కెట్ ఖాళీ చేసి 15 రోజుల పాటు శానిటైజేషన్ చెయ్యాలి అని. రిటైల్ దుకాణాలు అన్ని విశాలమైన మైదానాలలో మార్చాలి అని తెలియచేసారు. ఈ సమావేశంలో గుడిపల్లి భూషయ్య, కామయ్య, MNR శ్రీను, R  శ్రీనివాసరావు, కంచర్ల ప్రసాద్, గంటల రవి, CSR, వలీ,మరియు ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.    





















Share:

చిలకలూరిపేటలో సర్ధార్ గౌతు లచ్చన్న వర్ధంతి నిర్వహించిన గౌడ యూత్, బీసీ సంఘ నాయకులు

చిలకలూరిపేటలో సర్ధార్ గౌతు లచ్చన్న వర్ధంతి నిర్వహించిన గౌడ యూత్, బీసీ సంఘ నాయకులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని గౌడ కళ్యాణ మండపం నందు స్వతంత్ర సమర యోధుడు, బీసీ వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన శ్రీ సర్ధార్ గౌతు లచ్చన్న గారి 15వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. సర్ధార్ అంటే గుర్తు వచ్చేది రెండే పేర్లు 1 సర్ధార్ వల్లభాయ్ పటేల్, 2 సర్ధార్ గౌతు లచ్చన్న గారు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పలు సార్లు మంత్రిగా చేసారు. బ్రిటిష్ వారికీ వ్వతిరేకంగా 1932 లో జరిగిన శాసన ఉల్లంఘన  ఉద్యమాల్లో పాల్గొని 5 నెలల పటు జైలు జీతాన్ని గడిపారు. 1930 లో గాంధీ గారి పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహము లో పాల్గొని బారువా సమీపంలో ఉన్న ఉప్పు నీటితో ఉప్పు తయారు చేసి ఆ డబ్బులతో ఉద్యమాన్ని నడిపారు. తన  96 వ ఏటా కన్నుమూశారు  అని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యకమాలొ చిలకలూరిపేట గౌడ్ యూత్, బీసీ సంఘ నాయకులూ పాల్గొన్నారు 













Share:

చిలకలూరిపేటలో పేకాటరాయుళ్ల - 16 మందిని అరెస్ట్

 చిలకలూరిపేటలో పేకాటరాయుళ్ల - 16 మందిని అరెస్ట్  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో పేకాట స్థావరాల పైనా సీఐ బిలాలుద్దీన్ ఆధ్వర్యంలో  దాడులు నిర్వహించారు . వివరాల్లోకి వెళితే పట్టణములోని పండరీపురంలోని ఒక అపార్టుమెంట్ నందు పేకాట ఆడుతున్నారు అని సమాచారంతో సీఐ ఆ ప్రాంతాన్ని చేరుకొని తనిఖీలు చేసారు. ఆ సమయంలో 16 మంది పేకాట రాయుళ్లని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1.6 లక్షల నగదు ,16 సెల్ ఫోనులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ బిలాలుద్దీన్ గారు మాట్లాడుతూ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. 























Share:

చిలకలూరిపేటలో రేపటి నుండి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి - కళ్యణ మండపాలు, మార్కెట్, సినిమా హాళ్లు పైన ఆంక్షలు

చిలకలూరిపేటలో రేపటి నుండి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి - కళ్యణ మండపాలు, మార్కెట్, సినిమా హాళ్లు పైన ఆంక్షలు 
https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా ఆంక్షలు పైన నోటీసు రిలీజ్ చేసారు తసీల్ధార్ సుజాత గారు . తక్షణమే ఆంక్షలు అమలులోకి రావని అని చెప్పారు. పట్టణంలోని రురల్,అర్బన్, పరిధిలో గల కళ్యాణ మండపాలను తక్షణమే మూసివేయ్యాలి అని, అలాగే సినిమా హాళ్లలో 50% సీట్ ఆక్యుపెన్సీ తో కొనసాగించాలి అని. మార్కెట్ ను తక్షణమే మూసివేసి విశాలంగా ఉండే మైదానాలో స్టాల్స్ ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ప్రతి ఒక్కరు మాస్క్ వాడాలి అని సూచించారు.  





















Share:

ఏపీలో టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు

 ఏపీలో టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా కారణంగా ఇప్పటికే 1-9 తరగతులకు ఎగ్జామ్స్ లేకుండా ఫై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వెయ్యకుండా వాటి టైం టేబుల్ రిలీజ్ చేసారు. 

పదవ తరగతికి :- సాధారణంగా ఉండే 11 పరీక్షలను 7 పరిక్షలుగా కుదించారు. 

జూన్ 7 - ఫస్ట్ లాంగ్వేజ్ ,

జూన్ 8 - సెకండ్ లాంగ్వేజ్,

జూన్ 9 - ఇంగ్లీష్,

జూన్ 10 - గణితం,

జూన్ 11 - భౌతిక శాస్త్రం,

జూన్ 12 - జీవ శాస్త్రం,

జూన్ 14 - సోషల్ ,

ఇంటర్ :- మే 5-22 వరకు ఫస్ట్ ఇయర్,

                  మే 5-23 వరకు సెకండ్ ఇయర్ 

















Share:

ఏపీలో విద్యార్ధులకి రేపటి నుండి సెలవలు - టెన్త్, ఇంటర్కు మినహాయింపు

 ఏపీలో విద్యార్ధులకి రేపటి నుండి సెలవలు - టెన్త్, ఇంటర్కు మినహాయింపు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోజు పాఠశాలలోని విద్యార్థులు కరోనా భారీన పడటం లేదా ఉపాధ్యాయులు కరోనా బారిన పడటం చూస్తూనే ఉంటున్నాం . వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని రేపటి నుండి అంటే మంగళవారం 19-04-2021 నుండి 1-9 తరగతుల వరకు పాఠశాలలకు సెలవలు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.  స్కూలు సెలవలు ఇచ్చారు కానీ కరోనా రెస్ట్ తీసుకోదు పిల్లలని బయటకి పంపకుండా ఇంటి వద్దనే  ఉంచండి  














Share:

చిలకలూరిపేటలో ఈ రోజు సోమవారం నాడు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం - సామాన్య ప్రజలకి కాదు

చిలకలూరిపేటలో ఈ రోజు సోమవారం నాడు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం  - సామాన్య ప్రజలకి కాదు 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు  ఈ రోజు కేవలం ఫ్రంట్ లైన్ వర్కర్స్ మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు నోడల్ అధికారి గోపి నాయక్ గారు. పట్టణంలోని పోలీస్,ఎంపీడీఓ,ఎంఆర్ఓ, మున్సిపల్,ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులకి,ప్రైవేట్ ఆరోగ్య సిబందికి సాయంత్రం 7 గంటల వరకు ఈ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలకి ఈ రోజు ఇవ్వటం లేదు అని స్పష్టం చేసారు. అలాగే సామాన్యులు కరోనా దృష్ట్యా ఆయా ప్రదేశాల వైపు రావొద్దు అని సూచించారు పట్టణములోని రజక కాలనీ లోని ఆరోగ్యకేంద్రం, నాదెండ్ల, యడ్లపాడు, పీ హెచ్ సి లలో ఈ వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. 























Share:

రేపు 19-04-2021 ఫీజు రేయింబర్సమెంట్ డబ్బులు విడుదల - నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలోకి

రేపు 19-04-2021 ఫీజు రేయింబర్సమెంట్ డబ్బులు విడుదల - నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలోకి 


https://chilakaluripetspeednews.blogspot.com/


ఎప్పటి నుండో విద్యార్థులు ఎదురు చూస్తున్నా జగనన్న విద్య దీవెన పధకం కింద ఫీజు రేయింబర్స్మెంట్ డబ్బులను రేపు అనగా 19-04-2021 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కాలేజీ, స్కూల్ యాజమాన్యాలకు కాకుండా నేరుగా తల్లుల బ్యాంకు ఖాతా కి తరలిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా 10 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. ఇప్పటికే కాలేజీల యాజమాన్యం పలు సార్లు విద్యార్ధులకి ఫీజు కట్టమని నోటీసులు పంపించారు.














Share:

చిలకలూరిపేట- మురికి కాలవలో పసిపాప మృతుదేహం కలకలం

చిలకలూరిపేట- మురికి కాలవలో పసిపాప మృతుదేహం కలకలం 


https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణంలోని పోలిరెడ్డిపాలెం మదర్ థెరిస్సా కాలనీ లోని ఒక మురికి కాల్వలో పసిపాప మృతుదేహం కలచివేసింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు, మున్సిపల్ సిబ్బంది మృతుదేహాన్ని బయటకు తీశారు. నెలల పాప ని ఇలా కాలవలో పడేయటం స్థానికులని కలచివేసింది. ఈ దుర్మార్గపు చర్యకు కారణం కనుకునే పనిలో పడ్డారు స్థానికులు. 
















Share:

చిలకలూరిపేట విద్య సంఘం అధ్యక్షులుగా ఎన్నిక అయిన కార్యవర్గాన్ని గారిని సత్కరించిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు

చిలకలూరిపేట విద్య సంఘం అధ్యక్షులుగా ఎన్నిక అయిన కార్యవర్గాన్ని గారిని సత్కరించిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట లో  గడిచిన విద్య సంఘం ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని సత్కరించారు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు. అధ్యక్షునిగా తేళ్ల సుబ్బారావు గారు, ఉపాధ్యక్షునిగా ఘంటా జగన్నాధం గారు, సెక్రెటరీ గా మైలవరపు శివానంద కుమార్ గారు, సంయుక్త కార్యదర్శి గా బేతంచర్ల రామకోటీశ్వరావు గారు, కోశాధికారిగా బచ్చు రామలింగేశ్వరావు గారు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.  ఈ సందర్భంగా పుల్లరావు గారు మాట్లాడుతూ 5 సార్లు ఎన్నిక అయిన 14 సంవత్సరాల నుండి విద్య సంఘం అధ్యక్షునిగా ఎన్నిక అయిన తేళ్ల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సేవలు గుర్తు చేసుకొని ఇలాగే మరింత అభివృద్ధి పధంలో ముందుకి సాగాలి అని తెలిపారు.  
















Share:

బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద కూరగాయలతో లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా

బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద కూరగాయలతో లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద  కూరగాయలతో వెళ్తున్న అప్పి ఆటో బోల్తా పడింది. వివరాలలోకి వెళ్తే గోవింద పురం కి చెందిన పెద్ద వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పొలం లో పండిన కూరగాయలను తీసుకొని మార్టూరు మార్కెట్ కి వెళ్లే దారిలో ఆంజనేయస్వామి గుడి వద్ద జాతీయ రహదారి పైన ఒంగోలు వైపు వెళ్తున్న లారీ అప్పి ఆటోని ఢీ కొన్నది. ఆటో అదుపుతప్పి రోడ్ పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది. ఈ సమయంలో ఆటో లో ప్రయాణిస్తున్న వ్యక్తి మరియు డ్రైవర్ గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనం సిబ్బంది అక్కడకి వచ్చి గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. 



















Share:

చిలకలూరిపేటలో సోమవారం నుండి 9 నుండి 6 వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి

చిలకలూరిపేటలో సోమవారం నుండి 9 నుండి 6 వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టంలోని మునిసిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలు విషయాలు చర్చించారు. ఈ సమావేశంలో చైర్మెన్ రఫాని గారు, వైస్ చైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు గారు, కమిష్నర్ రవీంద్ర గారు,ది  ఛాంబర్ ఆఫ్ కామర్స్ పట్టణ అధ్యక్షులు కూనల సుబ్రమణ్యం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా రోజు రోజుకి విస్తరిస్తున్న క్రమంలో పట్టణంలోని అన్ని వ్యాపార దుకాణాలు స్వచ్చందంగా  సోమవారం నుండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం  6 గంటల వరకు మాత్రమే తెరిచివుంటాము అని తెలిపారు. పట్టణ ప్రజలు ఇది గమనించి సహకరించవలసినదిగా కోరారు. అలాగే ప్రతి దుకాణంలో నో మాస్క్ నో సేల్ బోర్డు పెట్టాలి తెలిపారు . కరోనా నియమాలి తప్పకుండా పాటించాలి అని తెలిపారు. 

















 
Share:

మురికిపూడిలో అసైన్ట్ భూముల విషయం ఒకే పార్టీ చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

మురికిపూడిలో అసైన్ట్ భూముల విషయం ఒకే పార్టీ చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామము నందు శుక్రవారం నాడు రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని జమ్మలమడక ఆదిబాబు అసైన్ట్ భూముల విషయం మాట్లాడటానికి అదే గ్రామాని చెందిన ఆరుమళ్ల వెంకట శివ అనే వ్వక్తి  ఇంటి వద్దకు వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో భూముల విషయం అడగగా వారి మధ్య మాటలు దాటి వెంకటశివ ఆదిబాబుని నెట్టాడు. ఆ సమయంలో ఆదిబాబు పక్కనే ఉన్న కాలవలో పడ్డాడు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాటతో ఘర్షణ వాతావరం నెలకొన్నది. ఇరువర్గాలు రురల్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువర్గాలు ఒకే పార్టీ కావటం విశేషం. 


















 
Share:

తమిళ స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటుతో కన్నుమూత

తమిళ స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటుతో కన్నుమూత

https://chilakaluripetspeednews.blogspot.com/

తమిళ సినీ పరిశ్రమకి చెందిన స్టార్ కమెడియన్ వివేక్ (59) ఈ రోజు తెల్లవారు జామున 4:35 గంటలకు మరణించినట్లు వైద్యులు తెలిపారు. శుక్రువారం ఉదయం 11 గంటల సమయంలో తీవ్ర గుండెనొప్పితో చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించటంతో మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న చిత్ర పరిశ్రమ దిగ్బ్రతికి లోనైనది. తెలుగులో డబ్బింగ్ సినిమాలతో పరిచయం అయ్యారు. అపరిచితుడు, శివాజీ ది బాస్ లాంటి సినిమాలో చాల తెలుగు డబ్బింగ్ మూవీస్ నందు నటించారు. 














Share:

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో "ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్" ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షులు ఆంజనేయులు గారు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం నుండి జిల్లాలోని అన్ని వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 9 గంటల నుండి  సాయంతం 6 గంటల వరకే తెరచి ఉంచాలి అని నిర్ణయించారు. ప్రతి ఒక్క షాప్ నందు నో మాస్క్ బోర్డు పెట్టాలి అని తెలిపారు. సోమవారం నుండి కఠినంగా అమలు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు.  
















 
Share:

చిలకలూరిపేటలో శుక్రవారం నాడు మాస్క్ లేని వారి పైనా అపరాధ రుసుము వసూళ్లు

చిలకలూరిపేటలో శుక్రవారం నాడు మాస్క్ లేని వారి పైనా అపరాధ రుసుము వసూళ్లు

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో శుక్రవారంనాడు ముసిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు సెంటర్లలో మాస్క్ లేకుండా తెరిగే వారి వద్ద నుండి అపరాధ రుసుము వసూల్ చేసారు. కరోనా ఉదృతి  పెరుగుతున్న కారణంగా ఈ కార్యక్రమాన్నిచేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని మాస్క్ లేకుండా బయట తిరిగితే ఫైన్ వసూళ్లు చేస్తారు అని తెలిపారు. ఈ రోజు పట్టణంలో 28 మంది వద్ద అపరాధరుసుము వసూళ్లు చేసారు. 28 మంది నుండి 4700 రూపాయలు వసూళ్లు చేసినట్లు తెలిపారు కమీష్నర్ రవీంద్ర గారు. ప్రతి ఒక్కరు కరోనా రూల్స్ పాటించాలి అని కరోనా కట్టడికి సహకరించాలి అని తెలిపారు   


















Share:

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

https://chilakaluripetspeednews.blogspot.com/
 

రంజాన్ నెల ప్రారంభమైన సంగతి అందరికి తెలిసినదే. అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అందరూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. రంజాన్ మాసం లో ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష పాటిస్తారు కావున వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే సందేహంలో ఉంటున్నారు. ఈ సందేహాలకు తెర దించుతూ ముస్లిం మత పెద్దలు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. వ్యాక్సిన్ పొట్టలోకి కాకుండా రక్తనాళాల్లో కి వెళ్తుంది కాబట్టి ఉపవాస దీక్ష భగ్నం కాదని నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. అందువలన మన పేట మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులకు ఈ విషయాన్ని చేరవేయండి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందువలన ప్రార్ధనలో పాల్గొనే ముందు మాస్క్ ధరించి, శానిటైజర్ వాడండి.   













Share:

చిలకలూరిపేటలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లిన కారు

 చిలకలూరిపేటలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లిన కారు 


https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో ఎన్ ఆర్ టి సెంటర్ నందు శుక్రవారం ఉదయం కారు అదుపుతప్పి రోడ్ పక్కనే వున్నా దుకాణం లోకివెళ్ళింది. వివరాలలోకి వెళ్తే పెదనందిపాడు మండలం అన్నారం గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా నరసరావుపేట వైపు నుండి వస్తూ ఎన్ ఆర్ టి సెంటర్ నందు రోడ్డు దాటుతున్న క్రమంలో ఒంగోలు వైపుగా వెళ్తున్న ఒక లారీ ఢీ కొనటంతో కారు అదుపుతప్పి సెంటర్ లోని రోడ్డు పక్కనే ఉన్న స్వాతి బిర్యాని పాయింట్ లోకి దూసుకువెళ్లింది. ఉదయం కావటంతో ఆ సమయంలో షాప్ తెరిచిలేదు కనుక ఆ సమయంలో ఎవరు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తపింది. కారు ఒక వైపు దెబ్బతిన్నది. 

నిన్న ఆ ప్రదేశానికి 10 అడుగుల దూరంలో మధ్యాహ్నం సమయంలో బైక్కు మంటలు చెలరేగాయి . ఈ రోజు కారు ప్రమాదం జరిగింది అని స్థానికులు చెప్తున్నారు.    











Share:

చిలకలూరిపేటలోని టిడ్కొ ఇళ్లలో 200 పడకలతో కరోనా కేర్ సెంటర్కు రంగం సిద్ధం

 చిలకలూరిపేటలోని టిడ్కొ ఇళ్లలో 200 పడకలతో కరోనా కేర్ సెంటర్కు రంగం సిద్ధం 


https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా కేసులు మళ్ళి పెరుగుతున్న క్రమంలో ఎమర్జెన్సీ సర్వీస్ కొరకు 200 పడకలతో కరోనా కేర్ సెంటర్ను మళ్ళి ప్రారంభించబోతున్నారు. పట్టణంలో ఉన్న హాస్పిటల్స్లో బెడ్లు తక్కువ ఉనందువలన ఎమర్జెన్సీ సర్వీస్ కొరకు పేటలోని టిడ్కొ ఇళ్లను కరోనా కేర్ సెంటర్లుగా మార్చనికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 200 పడకలను తరలించి ఆప్రాంతాన్ని శానిటేషన్ చేపిస్తున్నారు అధికారులు. 

























Share:

చిలకలూరిపేటలోని రాగన్నపాలెం నందు డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు

చిలకలూరిపేటలోని రాగన్నపాలెం నందు డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు

https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణములోని రాగన్నపాలెంలో కరోనా కారణంగా పాస్టర్ మృతి చెందారు. ఆయన అంతిమ సంస్కరాలకి హాజరైన పలువురు కరోనా అనుమానితులుగా ఉన్న సందర్భంలో స్థానికుల కోరిక మేరకు నిన్న గురువారం నాడు కరోనా  టెస్టులు నిర్వహించారు. ఈ సందర్బంగా నోడల్ అధికారి   గోపి నాయక్ గారు మాట్లాడుతూ రాగన్నపాలెం చుట్టుపక్కల ఎవరైనా కరోనా అనుమానితులు ఉంటే వచ్చి టెస్టులులలో పాల్గొని పాజిటివ్ వస్తే తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు   

























Share:

అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!!

 అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!! 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణములో కరోనా కేసుల వివరాలు నిజమైనవేన అంటే కాదు అని చెప్పాలి. ఎందుకు అంటే ఒకప్పుడు కరోనా టెస్టులు ఎక్కడ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ లోనో లేక రజక కాలనీ లోని ఆరోగ్య కేంద్రం లోనో లేక పద్మా సాలిపేట డిస్పెన్సరీ నందు అని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి అసలు లేదు ఎక్కడ టెస్టులు చేస్తున్నారో కూడా సరిఅయిన ఇన్ఫర్మేషన్ లేదు. కరోనా అనుమానం ఉన్నవారు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ నందు టెస్టులు చేపించుకుంటున్నారు. అసలు అవన్నీ లెక్కలోకి వస్తాయా అంటే అదీలేదు. కానీ మనకి మాత్రం ఒక్కటి తెలుసు ఏదో ఒక న్యూస్ వెబ్సైట్స్ లో పేటలో అన్ని కేసులు, ఇన్ని కేసులకు అని లేదా ఎవరో ఒకరు ఆ న్యూస్ ని వాట్సాప్ స్టేటస్ గా   పెడితే తెలుసుకుంటున్నాం. పేట లో ఏ వీధి లో వెతికిన వీధికి ఇద్దరు చొప్పున హోమ్ కోరంటైన్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇవ్వని తెలియకుండా పేటలో 9 కేసులు వచ్చాయిట , 20 వచ్చాయట అని మాస్కలు వేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతూ కరోనా వాహకాలుగా మారుతున్నారు ప్రజలు. 

ఆక్సిజెన్ అంధక చనిపోయారు పాపం, ఇంటి మొత్తానికి ఒకడే అబ్బాయి కరోనా వలన చనిపోయాడు అనే మాటలు చెప్పుకుంటూ బాధపడతాం కానీ ఎవ్వరు సరిగ్గా కరోనా నియమాలు పాటించటంలేదు.మీరు ఈ రోజు మాస్క్ లేకుండా మీరు తిరిగితే ఒకరి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. రెండు సంవత్సరాలో విద్య దూరం అయ్యారు విద్యార్థులు. సరిగ్గా జాబ్ కి వెళ్లే సమయానికి ఈ రెండు సంవత్సరాల విలువ అప్పుడు వారికీ  అర్ధం అవుతుంది వారికీ. దయచేసి మనం మన చిలకలూరిపేటని కరోనా ఫ్రీ గా మార్చుకోవటానికి కృషి చేయాలి. దేశం మొత్తం లాక్ డౌన్ పెట్టిన మన పేట లో మాత్రం కరోనా జోన్ లేని ఊరుగా తయారు చేసి బాధ్యత మన అందరిపైనా ఉంది.     









Share:

చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనానికిలో చెలరేగిన మంటలు

 చిలకలూరిపేటలో  ద్విచక్ర వాహనానికిలో చెలరేగిన మంటలు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్ నందు ద్విచక్ర వాహనానికి మంటలు వ్యాపించాయి. స్థానికంగా ఉండే ఒక వ్యక్తి నరసరావుపేట సెంటర్ నందు కిచిడి తినేందుకు వచ్చి వాహనాన్ని కిచిడి సెంటర్ ముందు పార్క్ చేసి వెళ్లి వచ్చిన క్రమంలో సదరు వాహనదారుడు  ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేసి ముందుకి వెళ్లే సమయంలో అనూహ్యంగా వాహనంలో మంటలు చెలరేగాయి. వాహనదారుడు బైక్ ను క్రిందపడ వేసి భయంతో దూరంగా పరుగుతీసాడు.ఇదంతా చుసిన స్థానికులు వాహనం పైన నీరు చల్లి మంటలు అదుపుచేశారు. 





Share:

చిలకలూరిపేటలో రేపు 15-04-2021 గురువారం ఈ ప్రాంతాల వారికి కరెంటు కోత

 చిలకలూరిపేటలో రేపు 15-04-2021 గురువారం  ఈ ప్రాంతాల వారికి  కరెంటు కోత 

https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణంలో రేపు గురువారం 15-04-2021న మరమ్మతుల కారణంగా  విద్యుత్ సరఫరా అంతరాయం ఎర్పడుతుంది. పట్టణంలోని చౌత్రసెంటర్ , షరాఫ్ బజార్,యల్లయ్య హోటల్ రోడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్,పద్మసాలిపేట , గబ్బిటివారి వీధి, హైస్కూల్ రోడ్ , శివాలయం బజార్,మెయిన్ రోడ్ నందు రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు  విద్యుత్ అంతరాయం ఎర్పడుతుంది. 









Share:

చిలకలూరిపేట టీడీపీ పార్టీ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 130 వ జయంతి వేడుకలు

 చిలకలూరిపేట టీడీపీ పార్టీ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  గారి 130 వ జయంతి వేడుకలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని టీడీపీ పార్టీ ఆఫీస్ నందు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 130 వ జయంతి వేడుకలు ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తేళ్ల సుబ్బారావు గారు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సి రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ గారు మాట్లాడుతూ  న్యాయవాదిగా,ఆర్ధికవేత్తగా,రాజ్యాంగ నిర్మాతగా భారతీయ్యుల గుండెలో ఎప్పటికి చెరగని ముద్రవేసుకున్నారు అన్నారు. అలాగే ఈరోజు రిజర్వేషన్ ద్వారా వెనకబడిన వర్గాల ప్రజలు ఎంత లబ్ది పొందుతున్నారో అవన్నీ అంబెడ్కర్ గారి వలన అని ఆయనని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులూ, పెద్దలు, పాల్గొని జయప్రదం చేసారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. 













Share:

చిలకలూరిపేటలో కరోనా వాక్సిన్ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!

చిలకలూరిపేటలో కరోనా వాక్సిన్ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!

https://chilakaluripetspeednews.blogspot.com/


నిన్న మొన్నటిదాకా వాక్సిన్ అంటే అంతగా మొగ్గుచూపని పట్టణవాసులు కరోనా కేసుకు రోజు రోజుకి పెరుగుతున్నందువల్ల  ఈ రోజు బుధవారం నాడు మొదలుపెట్టిన వాక్సినేషన్ ప్రక్రియకు జనాలు బారులు తీరారు . అయితే వాక్సిన్ ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు అంటే " పట్టణంలోని AMG బాయ్స్ హాస్టల్ వద్ద రజక కాలనీ లోని ఆరోగ్యకేంద్రం నందు మరియు సుబ్బయ్యతోట - పద్మసాలిపేట డిస్పెన్సరీ నందు, అన్ని వార్డు,గ్రామా సచివాలయాలలో వ్యాక్సిన్ వేస్తున్నారు " ఈ రోజు ప్రారంభించిన వాక్సిన్ ప్రక్రియను ఛైర్మెన్ రాఫ్ఫాని గారు, కమిష్నర్ రవీంద్ర గారు  పరిశీలించారు. అలాగే నోడల్ వైద్యధికారి గోపీనాయక్ గారు పట్టణంలో వాక్సిన్ ప్రక్రియ ప్రారంభం అయినది ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకోవాలి అని తెలిపారు.  













Share:

చిలకలూరిపేట రంగన్నపాలెంలోని వాసులకి కరోనా కలకలం - పాస్టర్ మృతితో చర్చి వెళ్లిన వాళ్లలో భయాందోలన

చిలకలూరిపేట రంగన్నపాలెంలోని వాసులకి కరోనా కలకలం - పాస్టర్ మృతితో చర్చి వెళ్లిన వాళ్లలో  భయాందోలన 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణములోని రాగన్నపాలెంలో స్థానికంగా ఉన్న ఒక చర్చ్ నందు పాస్టర్గ్ ఉంటున్న వ్యక్తి అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఈస్టర్ పండుగ నాడు రాగన్నపాలెం చర్చ్ నందు ప్రార్ధన నిర్వహించటానికి వచ్చిన వేలూరు గ్రామానికి చెందిన పాస్టర్  పని ముగించుకొని రాగన్నపాలెం ఉన్న పాస్టర్ని పలకరించి వేలూరు వెళ్లిపోయారు. శనివారం నాడు రాగన్నపాలెం పాస్టర్ కరొనతో  మృతి చెందారు. ఆయన స్వగ్రామం వూనురు. అంతిమసంస్కారాలకి ఆయనను పూనూరుకి తరలించారు. ఆయన అంతిమసంస్కరరాలకి రాగన్నపాలెం నుండి 50 మందికి పైగా పాల్గొన్నారు. వేలూరు పాస్టర్ కి ఆరోగ్యం బాగోలేక మంగళవారం నాడు మృతి చెందారు. ఆయనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినది.ఇక రాగన్నపాళెం వాసులకి భయం పట్టుకుంది.స్థానికులు రాగన్నపాలెం నందు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి శానిటైజ్ చెయ్యాలి అని అధికారులని కోరారు.  










Share:

అన్నంబొట్లవారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

అన్నంబొట్లవారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు మృతి 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పాటిమీద ప్రాంతం నుండి పర్చూరు మండలం శ్యామలవారిపాలెం గ్రామం నందు మిరపకాయల కోతకు కూలీ పనికి వెళ్తుటారు. ఈ క్రమంలో 10 మంది కూలీలు కలిసి వెతున్న ఆటో అన్నంబొట్లవారిపాలెం వచ్చేసరికి వాటర్ ట్యాంక్ వద్ద ఆగి ఉన్న ఆటో ని డీ కొట్టాడు డ్రైవర్ అంకమ్మరావు. ఆటోలో ఉన్న మహిళా ఫరింభి అక్కడకిఅక్కడే మృతి చెందారు. మిగిలిన వారు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు హుటా హుటిన వచ్చిన 108 సిబంది అక్కడికి చేరుకొని క్షతగాత్రులని పేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. 









Share:

13-04-2021 మంగళవారం నాడు చిలకలూరిపేటలో నియోజకవర్గంలో 20 కేసులు , రాష్ట్రంలో 4,228 కరోనా కేసులు , జిల్లాలో 622 కేసులు

13-04-2021 మంగళవారం  నాడు  చిలకలూరిపేటలో నియోజకవర్గంలో 20 కేసులు, రాష్ట్రంలో 4,228 కరోనా కేసులు , జిల్లాలో 622 కేసులు

https://chilakaluripetspeednews.blogspot.com/

రాష్ట్ర వ్యాప్తగా , జిల్లా వ్యాప్తంగా మంగళవారం  నాడు భారీ గా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తగా 4228 కేసులు నమోదుకాగా, జిల్లాలో 622 కేసులు నమోదు అయ్యాయి. ఇక చిలకలూరిపేట నియోజకవర్గం లో 20 కేసులు నమోదు అయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే మళ్ళీ ఆంక్షలు తప్పవు. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు తినేవాళ్లు పరిస్థితి చాల దారుణంగా అవుతుంది. కావున మాస్క్ వాడండి . సోషల్ డిస్టెన్స్ పాటించండి. చిలకలూరిపేట కరోనా ఫ్రీగా ఉండటానికి మన అందరం సహకరించుదాము . 


నాదెండ్లలో 2 కేసులు,సాతులూరు 2 కేసులు , గణపవరం 5 కేసులు , పసుమర్రు గ్రామం లో 2 కేసులు, ఈవూరివారిపాలెం 1 కేసు, యడ్లపాడు 4 కేసులు , లింగారావు పాలెం 1 కేసు, పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి. 



















Share:

చిలకలూరిపేటలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం ఏర్పాటుకు శంఖుస్థాపన

 చిలకలూరిపేటలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం ఏర్పాటుకు శంఖుస్థాపన 


https://chilakaluripetspeednews.blogspot.com/

మొన్న జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశం లో ఛైర్మెన్ రఫాని గారు చౌత్రసెంటర్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చెయ్యటానికి ఆమోదం తెలిపారు. అలాగే ఉగాది పర్వదినము రోజున చౌత్రసెంటర్ నందు ఆంజనేయ స్వామి గుడి వద్ద  పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం శంఖుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో విడదల గోపి గారు, ఛైర్మెన్ రఫాని గారు, వైస్ ఛైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారు ఆనాడు చేసిన త్యాగాలని తలుచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ని గుర్తుచేసుకున్నారు  ఈ కార్యక్రమానికి వార్డ్ కౌసిలర్లు , వైస్సార్సీపీ నాయకులూ పాల్గొన్నారు . 

https://chilakaluripetspeednews.blogspot.com/





















Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.