మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

 చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు


చిల‌క‌లూరిపేట రెండో శ‌నివారం సంద‌ర్భంగా రేపు 13-11-2021 చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలం గ్రామాల నందు విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిపివేసే స‌మ‌యం వివ‌రాల‌ను విద్యుత్‌శాఖ డీఈఈ సీహెచ్ రాంబొట్లు శుక్ర‌వారం తెలిపారు. విద్యుత్ వినియోగ‌దారులు గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని కోరారు. విద్యుత్‌  స‌ర‌ఫ‌రా నిలిపివేసే ప్రాంతాల వివ‌రాలివే..

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిల‌క‌లూరిపేట నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల, మండలాల గ్రామాలలో

చిల‌క‌లూరిపేట మండ‌లంలో...

చిలకలూరిపేట రూరల్ మండలం లోనీ మద్దిరాల33/11కేవీ సబ్స్టేషన్ లోని గోపాలంవారి పాలెం ఫీడెర్ మరమ్మత్తులు కారణంగా గోపాలంవారి పాలెం , యూ టి, యడవల్లి కట్టుబడివారిపాలెం గ్రామములో లోని  గృహ, వాణిజ్య, చిన్న మరియు బారి పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల  వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

నాదెండ్ల మండ‌లంలో...

గణపవరం 33/11కేవీ సబ్ స్టేషన్ లో   ఫీడర్లు  మరమత్తులు కారణంగా నాదెండ్ల మండలం లోని గణపవరం, నాదెండ్ల, అప్పాపురం, చిరుమామిల్ల, తూబాడు, సంకురాత్రిపాడు  జంగాలపల్లి,సంకురాత్రిపాడు గ్రామాలకు మరియు గణపవరం గ్రామములోని పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. 

 యడ్లపాడు మండలంలో...

యడ్లపాడు మండలం లోని తిమ్మాపురం , బోయపాలెం, వంకాయలపాడు , జాలాది, మైదవోలు, జగ్గాపురం, కారుచొల, గుత్తవారిపాలెంగ్రామం లోని గృహ, వాణిజ్య, చిన్న మరియు బారి పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల  వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

చిలకలూరిపేట టౌన్ లో విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాల కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/2021/11/13112021-9-2.html?m=1




Share:

చిలకలూరిపేట పట్టణంలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

 చిలకలూరిపేట పట్టణంలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట పట్టణంలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిల‌క‌లూరిపేట రెండో శ‌నివారం సంద‌ర్భంగా రేపు 13-11-2021 చిలకలూరిపేట టౌన్ నందు విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిపివేసే స‌మ‌యం వివ‌రాల‌ను విద్యుత్‌శాఖ డీఈఈ సీహెచ్ రాంబొట్లు శుక్ర‌వారం తెలిపారు. విద్యుత్ వినియోగ‌దారులు గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని కోరారు. విద్యుత్‌  స‌ర‌ఫ‌రా నిలిపివేసే ప్రాంతాల వివ‌రాలివే..

చిల‌క‌లూరిపేట టౌన్ నందు

చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని మద్దినగర్,A1  ఫీడర్ విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని మద్దినగర్, చీరాల రోడ్డు, రహమత్ నగర్,కోమరవల్లిపాడు, శ్రీనివాస కాలనీ, దాసరి కాలనీ, ప్రభుత్వ వైద్యశాల రోడ్డు, వెంకటప్పయ్య కాలనీ , బాలాజీ థియేటర్ రోడ్డు, క్రిస్టియన్ పేట, వెంకటాఛారి నగర్, వెంగళరెడ్డి నగర్, యం వి నారాయణపురం, ఆర్ టి సి కాలనీ, రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్డు, కృష్ణమహల్ రోడ్డు, గుర్రాల చావిడి, కొల్లారామారావుహాస్పిటల్ నుండి కలామందిర్ రోడ్డు వరకు మరియు టౌన్2 పరిధిలోకి పురుషోత్తమపట్టణం, అడ్డరోడ్డు సెంటర్ బొందిలిపాలెం, గుండయ్యతోట, వడ్డెరపాలెం, పందరిపురం, కృష్ణనగర్ ప్రాంతములకు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.



Share:

విద్యార్థులపై పోలీసుల లాఠీ చర్యకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన - చిలకలూరిపేట విద్యార్థి JAC

విద్యార్థులపై పోలీసుల లాఠీ చర్యకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన - చిలకలూరిపేట విద్యార్థి JAC

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం కొనసాగించాలని..చిలకలూరిపేట విద్యార్థి జెఎసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు సిద్దు , జగదీష్ కోరారు. శుక్రవారం స్థానిక ఎన్ ఆర్ టీ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థి జేఏసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ విద్యాసంస్థలను యధావిధిగా కొనసాగించాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో లోపాలు ఉంటే ప్రభుత్వం సరిదిద్దాలి కానీ పూర్తిగా వ్యవస్థను తీసివేయడం సమంజసం కాదని తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈ అంశంపై నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయటం అన్యాయమన్నారు. పోలీసుల లాఠీఛార్జి కి వ్యతిరేకంగా నవంబర్ 15వ తేదీన చిలకలూరిపేట మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి అనంతరం తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో విద్యార్థి జేఏసీ నాయకులు బొంతా భగత్ సింగ్,బి.సాయి,  ఎం.ఫణి, కిరణ్ ,వి.మణి , యం.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.



Share:

చిలకలూరిపేట:- ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి క్లీనర్ మృతి

చిలకలూరిపేట:- ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి క్లీనర్ మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట బెంగళూరు నుండి విజయవాడ కు వెళుతున్న లారీలో ఉన్న క్లీనర్ ఫిట్స్ రావడంతో లారీ లో నుంచి క్రిందపడి మృతి చెందిన ఘటన చిలకలూరిపేటలో జరిగింది. ఎస్ ఆర్ ఎమ్ టి పార్సిల్ కు సంబంధించిన లారీ విజయవాడ నుండి బెంగళూరు కు సరుకు దించి రిటర్న్ వస్తుండగా... చిలకలూరిపేట గణపవరం మధ్య ఉన్న కుప్ప గంజి వాగు బ్రిడ్జి పైన గుంటూరుకు చెందిన క్లీనర్ కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి మరణించినట్టుగా డ్రైవర్ రవి బాబు తెలిపారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీస్ వారు దర్యాప్తు చేపట్టారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.