మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐకు అందజేసిన లోక్ సత్తా పార్టీ నాయకులు

చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐకు అందజేసిన లోక్‌ సత్తా పార్టీ నాయకుపాల్గొన్నారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:-  రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐ రాజేశ్వరరావుకు లోక్ సత్తా పార్టీ నాయకులు అందజేశారు. 

* కళ్యాణి సెంటర్, విజయ బ్యాంక్ సెంటర్, నరసరావుపేట సెంటర్ మరియు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఎదురు, విధిగా ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

* వేకువజాము వేళలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదు అవుతున్నందున విధిగా ఆయా వేళల్లో పైన పేర్కొన్న నాలుగు ప్రధాన సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు విధులలో ఉండే లాగున ఏర్పాటు చేయాలి.

* రోజు రోజుకి ఇబ్బడిముబ్బడిగా ట్రాఫిక్ పెరుగుతున్నందున విధిగా చిలకలూరిపేట కు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలి.

* డ్రైవర్ల వ్యక్తిగత అవసరాల కోసం వాహనాల పార్కింగ్ ను ఊరి చివరన స్థలాన్ని కేటాయించడం కానీ, మరేదైనా నిర్దేశించిన ప్రదేశంలో వాహనాలను నిలుపుకొనుటకు అవకాశం కల్పించాలి.

* సర్వీస్ రోడ్లు ఆక్రమణకు గురై పాడైనందున మరమ్మతులు నిర్వహించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవలయును.

* వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, మహిళలు నరసరావుపేట సెంటర్, కళ్యాణి సెంటర్ లలో నడిచి రోడ్డు దాటే వారికోసం ప్రత్యేకముగా నాలుగు వైపుల నుండి రోడ్డు దాటు అవకాశం కల్పించాలి.

* తిమ్మాపురం సెంటర్ నుండి గణపవరం వాగు వరకు డివైడర్ పై మొక్కల కుండీలు ఏర్పాటు, లేదా ఏదైనా ఒక రేకును వాహనాల లైటింగ్ ఒకదాని మీద ఒకటి పడకుండా ఏర్పాటు చేయాలి.

* హైవే పెట్రోలింగ్ వారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో  నిరంతరం పర్యవేక్షించ గలగాలి.

* చిలకలూరిపేట హైవే పై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున,  రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు  అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పనిచేసే వారితో రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలి.

* ఆగి ఉన్న లారీలను 'ఢీ' కొట్టడం ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నందున ఎట్టి పరిస్థితుల్లో వేకువజాము వేళల్లో లారీలను హైవేపై ఆపకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

పై సూచనలను కలిగిన వినతిపత్రాన్ని సిఐ రాజేశ్వరరావుకు కు అందజేసి ప్రజల ప్రాణాలను కాపాడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు మాదాసు భానుప్రసాద్

లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్

ఈ కార్యక్రమంలో మురికిపూడి ప్రసాద్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పటేల్, సాంబయ్య, శిఖాకొల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట:- రేషన్ డీలర్లు ఖాళీ బియ్యం గోతాలను బయట విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేస్తాము - డిప్యూటీ తాసిల్దారు నాగమల్లేశ్వరరావు

చిలకలూరిపేట:- రేషన్ డీలర్లు ఖాళీ బియ్యం గోతాలను బయట విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేస్తాము - డిప్యూటీ తాసిల్దారు నాగమల్లేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట చౌక ధరల దుకాణాలలో (రేషన్ దుకాణాల్లో) ప్రజా పంపిణీ కోసం ఉపయోగించే బియ్యం గోతాలు తిరిగి ప్రభుత్వానికి అందజేయాలని చిలకలూరిపేట పౌరసరఫరాల డిప్యూటీ తాసిల్దార్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. గణపవరం లోని కొన్ని రేషన్ డిపోలలో తనిఖీలు నిర్వహించి సూచనలు చేశారు. ఒక్కొక్క గోతానికి 20 రూపాయల చొప్పున ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా బయట మార్కెట్లలో విక్రయిస్తే ఆయా డీలర్లపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.


Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-2021 శనివారం నాడు మొత్తం  2 కేసులు నమోదు అయ్యాయి. 

వాటి వివరాలు. 

బొబ్బిలి సత్యనారాయణ వీధి - 1

సుధా వారి పాలెం - 1 గా నమోదు అయ్యాయి.

Share:

చిలకలూరిపేట:- హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ రాజేశ్వరరావు - ప్రతి నెల నా వంతు సాయాన్ని అందజేస్తాను

చిలకలూరిపేట:- హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ రాజేశ్వరరావు - ప్రతి నెల నా వంతు సాయాన్ని అందజేస్తాను

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట రోష్ని సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐ.వి బాధిత పిల్లలకు ప్రతినెల పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట టౌన్ సిఐ రాజేశ్వరరావుగారి చేతుల మీదగా పౌష్టికాహార పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని తెలిపారు. అలాగే తన వంతు సాయాన్ని ప్రతి నెల అందజేస్తానని తెలిపారు. మంచిగా చదువుకొని పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.