మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలో పరిస్థితి ఇలాగే ఉంటే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కర్ఫ్యూ సమయాన్ని పెంచుతాం

చిలకలూరిపేటలో పరిస్థితి ఇలాగే ఉంటే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కర్ఫ్యూ సమయాన్ని పెంచుతాం

https://chilakaluripetspeednews.blogspot.com/

గత కొన్ని రోజుల నుండి దేశం & రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనితో అత్యవసర టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసారు. పట్టణ తసీల్ధార్ మల్లికార్జునరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎవరు అత్యవసరం తప్ప బయటకి ఎవరు రావద్దు, అలాగే వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం అని తెలిపారు. 

టాస్క్ ఫోర్స్ కమిటీ పట్టణంలోని షాపుల పైనా కరోనా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అని,బైక్ పైన ముగ్గురు తిరిగితే వారి పైన కేసు నమోదు చేస్తాం అని, ఈ చలానా పంపుతాం అని తెలిపారు. షాపులు నిర్వహించేవారు మాస్క్ లు వాడాలి అని అలాగే కరోనా టెస్టులు చేపించుకోవాలి తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కర్ఫ్యూ సమయాలలు పంచుతాం అని తెలిపారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి గోపి నాయక్, ఎంపీడీఓ హేమలత దేవి,కమిషనర్ రవీంద్ర ,SI సుబ్బారావు పాల్గొన్నారు.    















































Share:

చిలకలూరిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకస్మిక పర్యటన

చిలకలూరిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకస్మిక పర్యటన 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకస్మికంగా పర్యటన. మొట్టమొదటిసారి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో చిలకలూరిపేట రావటంతో RTC బస్టాండ్ సమీపంలోని బీజేపీ కార్యాలయం కోలాహలంగా తయారు అయింది. చిలకలూరిపేట పట్టణంలోని  పలు సమస్యల పైనా పట్టణ బీజేపీ ఇంచార్జ్ రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావుతో చర్చించారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్ జిల్లా సెక్రెటరీ చెరుకూరి ప్రసాద్ మృతికి సంతాపం తెలిపారు. కరోనా నుండి తపించుకొని బ్లాక్ ఫంగస్ తో మృతి చెందటం బాధాకరం అని, అయన లేని లోటు పూడ్చలేనిది అని తెలిపారు. అనంతరం ప్రెస్ మీట్ఏర్పాటు చేసివైస్సార్సీపీ ప్రభుత్వం చేసే అధికార దుర్వినియోగం గురించి చర్చించారు. ఇసుక మాఫియా, గ్రైనేట్ మాఫియా తో రాష్ట్రము మొత్తం దోచేస్తున్నారు అని తెలిపారు. అనంతరం సాధినేని చౌదరయ్య గెస్ట్ హౌస్ నందు అధికారులతో మాట్లాడారు.  






























Share:

నాదెండ్ల మండలంలో నేడు 30-06-2021,బుధవారం నాడు భారీగా కేసులు నమోదు అయ్యాయి.

నాదెండ్ల మండలంలో నేడు 30-06-2021,బుధవారం నాడు భారీగా కేసులు నమోదు అయ్యాయి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

నాదెండ్ల మండలంలో నేడు 30-06-2021,బుధవారం నాడు భారీగా 17 కేసులు నమోదు అయ్యాయి. 
వాటి వివరాలు 

నాదెండ్ల గ్రామంలో - 1

చిరుమామిళ్ల గ్రామంలో - 3

కనపర్రు గ్రామంలో - 1

గణపవరం గ్రామంలో - 2

సంక్రాంతిపాడు గ్రామంలో - 10 గా నమోదు అయ్యాయి. 














Share:

చిలకలూరిపేట మండలం & యడ్లపాడు మండల గ్రామాలలో 30-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట మండలం & యడ్లపాడు మండల గ్రామాలలో 30-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలం & యడ్లపాడు మండల గ్రామాలలో 30-06-2021,బుధవారం నాడు మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. 


చిలకలూరిపేట మండల గ్రామాలలో మొత్తం  4 కేసులు నమోదు అయ్యాయి. 

మనుకొండవారిపాలెం గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

బొప్పూడి గ్రామంలో - 1

పసుమర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో 1 కేసు నమోదు అయ్యింది. 

లింగారావుపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యింది. 
















Share:

చిలకలూరిపేట - MLA రజిని,మైనింగ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమ్మకై దళితులకు అన్యాయం చేస్తున్నారు - నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుభ్రమణ్యం

చిలకలూరిపేట - MLA రజిని,మైనింగ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమ్మకై దళితులకు అన్యాయం చేస్తున్నారు - నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుభ్రమణ్యం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - యడవల్లి దళితులకు కేటాయించిన భూముల విషయంలో నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుభ్రమణ్యం మాట్లాడుతూ గనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, MLA రజిని కుమ్మకై దళితులకు అన్యాయం చేస్తున్నారు అని ఆరోపించారు. అలాగే 1975 లో అప్పటి గవర్నమెంట్ 416 ఎకరాలను దళితులకు కేటాయిస్తే రెండు సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వంలో పుల్లారావు సొసైటీ రద్దు చేసి ఇప్పుడు మళ్లీ రద్దు చెయ్యటం అన్యాయం అని అనటం ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నారు. అక్కడ భూములలో ఉన్న బ్లాక్ పెరల్ గ్రానైట్ రాయి కోసం ఈ రోజు దళితులకు అన్యాయం చేస్తున్నారు అని. దళితులకు అన్యాయం జరిగితే న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్షకి సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. 
















































Share:

చిలకలూరిపేట - మురికిపూడి మాజీ సర్పంచ్ కొమ్మనబోయిన దేవయ్య మృతి

చిలకలూరిపేట - మురికిపూడి మాజీ సర్పంచ్ కొమ్మనబోయిన దేవయ్య మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట మండల గ్రామం అయిన మురికిపూడి గ్రామ మాజీ సర్పంచ్ కొమ్మనబోయిన దేవయ్య మంగళవారం రాత్రి మృతి చెందారు. మురికిపూడి గ్రామంలో తనకంటూ ఒక గుర్తింపు తీసుకున్న నాయకుడు మృతి చెందటం పట్ల గ్రామం ప్రజలు సంతాపం తెలిపారు. అలాగే అయన కుటుంబంలో ఉంచిన భౌతికాయాన్ని MLA రజిని, విడదల గోపి నివాళి అర్పించారు. అలాగే కుటుంబసభ్యులను పరామర్శించారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/































Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు భారీ కరోనా కేసులు నమోదు - 30-06-2021,బుధవారం

చిలకలూరిపేట పట్టణంలో నేడు భారీ కరోనా కేసులు నమోదు -  30-06-2021,బుధవారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుంటే మన చిలకలూరిపేటలో మాత్రం ఈ రోజు విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోయాయి. 30-06-2021, బుధవారం పట్టణంలో నాడు భారీగా కేసులు నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట పట్టణంలో నేడు 17 కేసులు  నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 

మదర్ థెరిస్సా కాలనిలో - 2

గాంధీ పేటలో - 1

పండరీపురం 4వ లైన్లో - 4

సాంబశివనగర్ లో - 3

మార్కండేయ నగర్ లో - 4

గుండయ్యతోటలో - 3 గా నమోదు అయ్యాయి. 





























 
Share:

చిలకలూరిపేట - వాదోపవాదాల మధ్య రసాభాసగా కొనసాగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం.

చిలకలూరిపేట - వాదోపవాదాల మధ్య రసాభాసగా కొనసాగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మునిసిపల్ సమావేశంలో కొంచం సేపు రసాభాసగా మారింది. టీడీపీ , వైస్సార్సీపీ కౌన్సిల్ సభ్యుల మధ్య ప్రోటోకాల్ పాటించటం లేదు అన్న విషయంలో కొంచం సేపు వాదోపవాదం నడిచింది. వెంటనే సభాధ్యక్షులు రఫాని కలుగజేసుకొని సభ్యులు హుందాగా ప్రవర్తించాలి అని సమయాన్ని వృధా చెయ్యవద్దు అని కోరారు. వార్డులలో జరిగే కార్యక్రమాలకి టీడీపీ కౌన్సిలర్లని ఎందుకు పిలవటం లేదు అని ఇది ప్రోటోకాల్ కి విరుద్ధం అని కొత్త కుమారి ప్రశ్నించారు. కౌన్సిలర్లు ఉండగా ఇంచార్జులు ఏమిటి అని కౌన్సిలర్లు గా ప్రజల వద్ద గెలవని వారికీ ఇంచార్జ్ పోస్టు ఏంటి అని ప్రశ్నించారు.సమావేశంలో మాకు అవకాశం ఇవ్వటం లేదు అని గంగా శ్రీనిసరావు అడగగా గత టీడీపీ సమావేశంలో కూడా మీరు అలాగే మాకు అవకాశం ఇవ్వలేదు అని ఛైర్మెన్ రఫాని అనగా దానికి టీడీపీ సభ్యులు గతంలో మేము అలాగే చేసాం అని ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తారా అని సమాధానం ఇచ్చారు. ఇంకా కొనసాగుతుంది. 


 క్రింద లింక్ పైన క్లిక్ చేసి వార్త పొందండి. 






























Share:

చిలకలూరిపేట - అడ్డరోడ్డు సెంటర్ నందు ఆర్చి నిర్మాణ ప్రతిపాదన నిలిపివేయండి - మునిసిపల్ కౌన్సిల్ నందు టీడీపీ కౌన్సిలర్లు

చిలకలూరిపేట - అడ్డరోడ్డు సెంటర్ నందు ఆర్చి నిర్మాణ ప్రతిపాదన నిలిపివేయండి - మునిసిపల్ కౌన్సిల్ నందు టీడీపీ కౌన్సిలర్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ హాళ్లు నందు ఈ రోజు అనగా బుధవారం నాడు జరిగిన కౌన్సిల్ సమావేశంలో 45 అంశాలతో కూడిన అజండాతో కౌన్సిల్ పారంభించారు. ఈ సమావేశమలో మునిసిపల్ కౌన్సిల్ అంతా సభ్యులతో నిండిపోయింది. చెర్మన్ రఫాని అధ్యక్షతన మొదలైన సభలో పలు ముఖ్యమైన అంశాల గురించి ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా పురపాలక నిధులు తక్కువగా ఉన్నందు వలన అడ్డ రోడ్డు రోడ్డు సెంటర్ నందు ప్రతిపాదనలో ఉన్న ఆర్చి నిర్మాణాన్ని నిలిపివేయాలి అని టీడీపీ సభ్యులు తెలిపారు. అలాగే సింగల్ టెండర్లను అనుమతించకూడదు అని టీడీపీ సభ్యుడు గంగా శ్రీనివాసరావు తెలిపారు. టెండర్ వెయ్యటానికి ఎవరు రానందున వచ్చిన సింగిల్ టెండర్ ఆమోదిస్తున్నట్లు రఫ్ఫాని తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్లకు ఆమోదం తెలిపారు. అలాగే అధికారుల ఆదేశాలతో గణపవరం లోని అర్బన్ హెల్త్ సెంటర్ను నిలిపివేసినట్లు తెలిపారు.మునిసిపల్ షాపుల వేలం గడువు పెంచాలి అని టీడీపీ సభ్యులు కోరారు. ఇంకా కౌన్సిల్ కొనసాగుతుంది. 


సమావేశమలోని తరువాత వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

చిలకలూరిపేట - వాదోపవాదాల మధ్య రసాభాసగా కొనసాగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం. 











































Share:

చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి డాక్టరేట్

 చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి డాక్టరేట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/
చిలకలూరిపేట నియోజవకవర్గ పరిధి యడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన వ్యక్తికి డాక్టరేట్ లభించింది. కారుచోల గ్రామానికి చెందిన సయ్యద్ జిలాని కి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలం నుండి డాక్టరేట్ లభించింది.పెద్ద పెద్ద మ్యానుఫ్యాచరింగ్ పరిశ్రమలలో ఉత్పత్తులు తయారీ సమయం, ఖర్చు తగ్గించటం పట్ల చేసిన పరిశోధనకు ఈ డాక్టరేట్ వచ్చినట్లు తెలిపారు. 

















































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు మొత్తం 23 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమోదు అయ్యాయి. 

గుండయ్యతోట లో - 1

మార్కండేయనగర్ లో - 3 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో భారీగా 19 కేసులు నమోదు అయ్యాయి. 

మురికిపూడి గ్రామంలో - 7

వేలూరు గ్రామంలో - 5

గోవిందపురం గ్రామంలో - 3

యడవల్లి గ్రామంలో - 2

తాతపూడి గ్రామంలో - 1

పసుమర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 


 







































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు మొత్తం 27 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 


నాదెండ్ల మండల గ్రామాలలో 18 కేసులు నమోదు అయ్యాయి. 


చిరుమామిళ్ల గ్రామంలో - 3

కనపర్రు గ్రామంలో - 3

సంక్రాంతిపాడు గ్రామంలో - 6

నాదెండ్ల గ్రామంలో - 6 గా నమోదు అయ్యాయి. 



యడ్లపాడు మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి. 


జాలాది గ్రామంలో - 1

మైదవోలు గ్రామంలో - 2

లింగారావుపాలెం గ్రామంలో - 1

బోయపాలెం గ్రామంలో - 5 గా నమోదు అయ్యాయి. 











































Share:

ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గా ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు - పత్తిపాటి

ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గా ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు - పత్తిపాటి 

https://chilakaluripetspeednews.blogspot.com/


ఏపీలో చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మంగళవారం నాడు సాధన దీక్షకు పిలుపునిచ్చారు. అయితే గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం అని విమర్శించారు. అలాగే రెండు సంవత్సరాల క్రితం పూర్తి చేసిన టిడ్కొ ఇళ్లను ఎంత వరకు ప్రజలకు అందజేయలేదు అని,ఇళ్ల స్థలాల్లో ఘరానా మోసం జరిగింది అని దాని పైన సిబిఐ ఎంక్వీయిరి వెయ్యాలి అని అన్నారు. కరోనా తో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి అని., అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 10 వేల ఆర్ధిక సాయం చెయ్యాలి అని, అమరావతి రైతు దీక్షను పట్టించుకోవటం లేదు అని, పోలీసులు MLA కనుసైగలలో మెలుగుతూ అన్యాయాన్ని ప్రశ్నించిన వారి పైన కేసులు పెడుతున్నారు అని, రాష్ట్రము మొత్తం పేకాట క్లబ్బులతో కళకళలాడుతుంది అని అన్నారు.అసలు జగన్ మోహనరెడ్డికి ఒక్క రోజు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కూడా లేదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు తో పటు జివి ఆంజనేయులు,యరపతినేని శ్రీనివాస్, శ్రావణకుమార్,పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాస్, రవీంద్ర, పార్టీ జిల్లా స్థాయి నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు 



































Share:

చిలకలూరిపేటలో కమీష్నర్ ఆదేశాలతో కఠినంగా అమలుచేస్తున్న కర్ఫ్యూ

చిలకలూరిపేటలో కమీష్నర్ ఆదేశాలతో కఠినంగా అమలుచేస్తున్న కర్ఫ్యూ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో మునిసిపల్ కమిష్నర్ ఆదేశాలతో పట్టణంలోని అన్ని దుకాణాలు సాయంత్రం 6 తరువాత పూర్తిగా మూసివేస్తున్నారు. SI , CI లు రెండు బృందాలుగా ఏర్పడి పట్టణంలోని అన్ని వ్యాపార దుకాణాలను మూయించారు. అలాగే 6 తరువాత వ్యాపారాలు కొనసాగిస్తున్న దుకాణదారుల పైనా అపరాధ రుసుము వసూళ్లు చేస్తున్నారు. పట్టణంలోని పలు కూడళ్లలో మాస్క్ లేకపోయినా, అనవసరంగా బయట తిరిగిన చర్యలు చేపడుతున్నారు.  































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 28-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 28-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 28-06-2021,సోమవారం నాడు మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 

నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 11 కేసులు నమోదు అయ్యాయి. 

గణపవరం గ్రామంలో - 1

సంకురాత్రిపాడు గ్రామంలో - 3

నాదెండ్ల గ్రామంలో - 7 గా నమోదు అయ్యాయి. 


యడ్లపాడు మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి. 

లింగారావు పాలెం గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 


















































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 28-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 28-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 28-06-2021,సోమవారం నాడు మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 



చిలకలూరిపేట పట్టణంలో 5 కేసులు నమోదు అయ్యాయి. 

పండరీపురం లో - 4

రజక కాలనీ లో - 1 గా నమోదు అయ్యాయి. 



చిలకలూరిపేట మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి. 

మానుకొండవారిపాలెం గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 3 గా నమోదు అయ్యాయి. 



















































Share:

చిలకలూరిపేట పట్టణంలో వ్యభిచారం గుట్టురట్టు

చిలకలూరిపేట పట్టణంలో వ్యభిచారం గుట్టురట్టు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్యతోటలోని సచివాయం ప్రక్కనే అనుకోని ఉన్నఇంట్లో వ్యభిచారం జరుగుతుంది అనే సమాచారంతో టౌన్ SI నరసదాసు వ్యభిచారం గుట్టు రట్టు చేసారు. పోలీసులు రంగప్రవేశం చెయ్యటంతో ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు విషయం తెలుసుకుకొని అవాక్కయ్యారు. చిలకలూరిపేటలోనే సుబ్బయ్యతోటలో ఇలాంటి సంఘటనలు జరగటం గతం ఎప్పుడు ఇలా జరగలేదు అని వాపోయారు. ప్రశాంతంగా ఎటువంటి హడావిడి లేకుండా ఫ్యామిలీస్ ఉంటే ఇలాంటి ప్రాంతంలో ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వారు ఎటువంటి వారో తెలుసుకొని ఇవ్వాలి అని ఆ ప్రాంతం వాసులు చర్చించుకుంటున్నారు. పోలీస్ వారు అరెస్ట్ చేసిన వారిలో నలుగురు పురుషులు, నిర్వాహకురాలితో కలిపి 3 మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. మహిళలలో ఇద్దరిది చిలకలూరిపేట కాగా ఒక మహిళది గుంటూరు, అలాగే నలుగురి పురుషులలో ముగ్గురిది చిలకలూరిపేట కాగా మరొకరిది నరసరావుపేట గా గుర్తించారు.   


































Share:

చిలకలూరిపేట - జాబ్ క్యాలెండర్ వ్యతిరేకంగా మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన బీజేపీ జిల్లా జనరల్ సెకరేటరీ పులుగుజ్జు మహేష్ ముందస్తు అరెస్ట్

 చిలకలూరిపేట - జాబ్ క్యాలెండర్ వ్యతిరేకంగా మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన బీజేపీ జిల్లా జనరల్ సెకరేటరీ పులుగుజ్జు మహేష్ ముందస్తు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట -  రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండరు కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు కేతినేని సురేంద్ర మోహన్ ఆదేశానుసారం రాష్ట్రంలోని మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి పులుపునిచ్చారు. అయితే మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన జిల్లా జనరల్ సేకరేటరీ పులుగుజ్జు మహేష్ తో పాటుగా, చిలకలూరిపేట టౌన్ ప్రెసిడెంట్ నందిగం రాజుని చిలకలూరిపేట పోలీస్ వారు ఆదివారం రాత్రి సమయంలో వారి ఇంటి వద్ద అరెస్ట్ చేసి నిర్బంధించారు. పులుగుజ్జు మహేష్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండరును రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్లో 2,40,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చెయ్యాలి అని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోయాయి ఇంకొకరిపైనా ఆధారపడి జీవిస్తున్నారు అని, జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల యువకులలో విశ్వసనీయత కోల్పోతుంది అని తెలిపారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/


https://chilakaluripetspeednews.blogspot.com/























Share:

ఏపీలో జులై 1 నుండి ఈ 5 జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలో కర్ఫ్యూ సడలింపు.

ఏపీలో జులై 1 నుండి ఈ 5 జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలో కర్ఫ్యూ సడలింపు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా కేసులు తగ్గుతున్న వేళా రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు చెయ్యాలి అని జగన్ సర్కార్ నిర్ణయించుకుంది. పాజిటివిటీ రేట్ 5% కన్నా తక్కువగా ఉన్న8 జిల్లాలలో మినహా మిగిలిన 5 జిల్లాలలో కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుంది అని తెలిపారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ,చిత్తూరు, ప్రకాశం జిల్లాలో తప్ప మిగిలిన 8 జిల్లాలలో ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు సడలింపు ఉంటుంది అని. జులై 1 నుండి 7 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి అని తెలిపారు. 











































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 27-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 27-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి 

NRT సెంటర్లో - 1

గండిపేట లో - 1

వెంకటరెడ్డి నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి 

వేలూరు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి. 







































Share:

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖరారు - ఆంధ్రాలో తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సహం

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖరారు - ఆంధ్రాలో తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సహం 

https://chilakaluripetspeednews.blogspot.com/

తెలంగాణ పీపీసీ చీఫ్ నాటకానికి తెరపడింది. సీనియర్ నేతలను కాదని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించింది. పార్టీలో సీనియర్ నాయకుల మందకూడి చర్యల వలన తెలంగాణాలో కాంగ్రెస్ చాల వెన్నకి వెళ్ళిపోయింది. పార్టీలో యువరక్తం కోసం అని రాహుల్, సోనియా ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.కొత్త రాష్ట్రము ఏర్పాటు కల్పించిన పార్టీ ఈ రోజు కనుమరుగు అవుతున్న క్రమంలో మళ్లీ తెలంగాణాలో కాంగ్రెస్ అంచెలంచెలుగా ఎదిగి ముందుకు సాగుతుందో లేదో చూదాం. 

తెలంగాణాలో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఖరారు అవ్వగానే తెలంగాణాలో కన్న ఆంధ్రాలో తెలుగు తమ్ములు ఆనందంతో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పైన ఉన్న అభిమానాన్ని హల్చల్ చేస్తున్నారు. 2017 వరకు తెలంగాణాలో టీడీపీ కి వెన్నుముకగా ఉంటూ కొన్ని పరిస్థితుల దృష్ఠ్య కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఆనాడు సీఎంగా ఉన్న చంద్ర బాబు ని కలిసి పార్టీ నుండి బయటికి వచ్చారు. కానీ పార్టీ పైన కానీ నాయకులను కానీ ఈ రోజు తప్పుగా మాట్లాడకపోవటం, ఆ పార్టీలో ఉన్న జీవితం ఇచ్చిన పార్టీ ప్రేమను మర్చిపోవకపోవటం తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డిని అభిమానిస్తూ ఉంటారు. 

రేవంత్ రెడ్డి ప్రస్థానం :- 

1969 నవంబర్ 8 న అప్పటి ఉమ్మడి ఆంధ్ర, ఇప్పటి తెలంగాణ లోని పలమర్రు జిల్లా కొండారెడ్డి పల్లిలో జన్మించారు. 2006లో జడ్పీటీసీ గా , 2007-09 వరకు MLC గా, 2009లో టీడీపీ నుండి MLA గా, 2014లో టీడీపీ నుండి కొడంగల్ లో మళ్లీ MLA గా, 2017 లో టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరి 2018 ఎన్నికలలో కొడంగల్ లో ఓడిపోయారు, 2018 లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వెంటనే 2019 మల్కాజ్గిరి ఎంపీ గా గెలిచి 2021 లో TPPC  చీఫ్ అయ్యారు.  






































Share:

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్లో పూల వ్యాపారం చేసుకునే వ్యక్తి శానిటైజర్ తాగి మృతి

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్లో పూల వ్యాపారం చేసుకునే వ్యక్తి  శానిటైజర్ తాగి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో బెల్లంకొండ వాసు అనే యువకుడు మార్కెట్ సెంటర్లోని మైదానంలో పూలు అమ్ముకుంటూ బాబుగారి తోటలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. సదరు యువకుడు దీర్ఘకాళికా వ్యాధితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసైన ఆ యువకుడి భార్య అతనిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎవరు పట్టించుకునే వారు లేక సరిగ్గా ఇంటికి రాకుండా పూర్తిగా మద్యానికి బానిసై 21వ తారీఖున సాయంత్రం సమయంలో మద్యం కొనుక్కోవడానికి డబ్బులు లేక శానిటైజర్ కొనుక్కొని తాగాడు. సదరు యువకుడు తీవ్ర అస్వస్తతకు గురి అవ్వటంతో అతనిని గుంటూరు GGH కి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. 





































Share:

చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్

చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో శనివారం రోజున మునిసిపల్ కౌన్సిల్ హాలు నందు  శానిటరీ మేస్త్రులు, సేకరేటరీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మునిసిపల్ కమిష్నర్ రవీంద్ర గారు మాట్లాడుతూ పట్టణంలో గత వారం రోజుల కరోనా రిపోట్స్ చూసుకునట్లు అయితే పోజిటివిటీ రేట్ 9.2 % మించి ఉండటంతో పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాము అని అయన తెలిపారు. అలాగే పట్టణంలోని వర్తక వ్యాపారాలు, చిల్లరకొట్టు వ్యాపారాలు కరోనా టెస్టులు చేపించుకునేలా చర్యలు తీసుకోవాలి అని. అలాగే సాయంత్రం 6 గంటల తరవాత వ్యాపారాలు పూర్తిగా ఆపివెయ్యాలి అని,లేనిచో అపరాధ రుసుము వసూళ్లు చెయ్యాలి అని అయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్క్ లు తప్పని సరిగా వాడాలి అని అయన తెలిపారు. 































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 26-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 26-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 



చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమవుదు అయ్యాయి.


సుబ్బయ్యతోట లో - 1

మార్కండేయ నగర్ లో - 2

కుమ్మరి కాలనీ లో - 1 గా నమోదు అయ్యాయి 


చిలకలూరిపేట మండల గ్రామాలలో 5 కేసులు నమోదు అయ్యాయి. 



మనుకొండవారిపాలెం గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 


















































Share:

జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు - బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్

జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు -  బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం మొత్తం 10,143 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండరు పేరుతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ చూసిన నిరుద్యోగుల యువత తీవ్ర అసహనానికి గురి అయ్యారు. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ ను నిరసిస్తూ బీజేపీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సురేంద్రమోహన్ గారి ఆదేశాలతో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ నందు నిరసన దీక్ష చేపట్టారు. తక్షణమే ఈ జాబ్ క్యాలెండరు రద్దు చేస్తూ త్వరలో నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా ఖాళీగా ఉన్న 2,40,000 ఉద్యోగాల భర్తీ చేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండరు రిలీజ్ చెయ్యాలి అని నరసరావుపేట ఆర్టీఓ ఆఫీస్ నందు ఆర్టీఓ గారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్, జిల్లా నాయకులు నెమలికంటి బ్రహ్మం, వంశీ ,మురళి,నరేష్,జిల్లా ఉపాధ్యక్షుడు కాళ్ళ కోటేశ్వరావు, కామినేని హనుమంతురావు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/






























Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 25-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 25-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 12 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి. 

సుధావరిపాలెం లో - 1

సుభాని నగర్ లో - 1

పురుషోత్తమపట్నం లో - 1

సాంబశివ నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 8 కేసులు నమోదు అయ్యాయి. 

గోవిందపురం గ్రామంలో - 1

పసుమర్రు గ్రామంలో - 1

కమ్మవారిపాలెం గ్రామంలో - 2

మురికిపూడి గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 





















































Share:

మరో కంపెనీ గోవిందా ! - ఏపీ నుండి తరలిపోనున్న15 వేల కోట్ల రిలయన్స్ ప్రాజెక్టు

మరో కంపెనీ గోవిందా ! - ఏపీ నుండి తరలిపోనున్న15 వేల కోట్ల రిలయన్స్ ప్రాజెక్టు 

https://chilakaluripetspeednews.blogspot.com/

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో అభివృద్ధి కుంటుపడింది. కొత్తగా విడిపోయిన తరువాత చాలా పరిశ్రమలు ఏపీకి వచ్చాయి. కానీ 2019 ఎన్నికల అనంతరం పరిస్థితి అంతా మారిపోయింది. గత ప్రభుత్వం సంబంధించిన టెండర్లలో అవకతవకలు ఉన్నాయి అని భావించి, సీఎం జగన్ మోహన రెడ్డి రివర్స్ ట్రేండింగ్ మొదలుకొని రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావాలి అంటే భయం ఏర్పడే పరిస్థితి నెలకొన్నది. ఏపీ కన్నా తెలంగాణ, తమిళనాడు లో ప్రశాంతంగా ఉంటుందనో ఏమో మ్యానుఫ్యార్చిరింగ్ యూనిట్లు, ఐటీ హబ్బులు వెళ్లిపోయాయి. ఇపుడు పరిశ్రమలు స్టార్ట్ చేస్తే మళ్లీ ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని పెద్ద పెద్ద కంపినీలు వేరే రాష్ట్రాలకి తరలిపోయాయి. 
తాజాగా రిలయన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చెయ్యాలి అనుకున్న 15వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ - సెట్టాప్ బాక్ససులు, ఢాంగిల్స్ మ్యానుఫ్యార్చిరింగ్ యూనిట్లకు బ్రేకులు వేసింది ఆ సంస్థ, కారణం ఏంటి అంటే గత ప్రభుత్వంలో 136 ఎకరాలను కేటాయించారు, దానిని ఈ ప్రభుత్వంలో 75ఎకరాలకు కి తగ్గించారు. ఆ 75 ఎకరాల భూమి ఉన్న రైతులు కేసు వెయ్యటంతో ఇక్కడ మనకి పని అవ్వదు అని అనుకున్నారో ఏమో రిలియన్స్ సంస్థ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకునట్లు తెలుస్తుంది. 




























 



















































Share:

ఏపీలో మొట్టమొదటి డెల్టా ప్లస్ కరోనా కేసు నమోదు

ఏపీలో మొట్టమొదటి డెల్టా ప్లస్ కరోనా కేసు నమోదు 

https://chilakaluripetspeednews.blogspot.com/

అసలే కరొనతో అతలాకుతలం అయిన మన దేశంలో కొత్త వేరియంట్లు విజృభిస్తునాయి.కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ తో థర్డ్ వేవ్ మొదలవుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తొలిసారిగా ఏపీలో కొత్త డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ తిరుపతిలో మొట్టమొదటి కేసు నమోదు అయ్యింది అని తెలిపారు. అయితే అతను కోలుకున్నారు అని, అతని వల్ల ఈ వేరియంట్ ఎవ్వరికి సోకలేదు అని తేల్చారు. రోజుకో ఫంగస్ పుట్టుకు వస్తుంది అని, ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకొని థర్డ్ వేవ్ కి సిద్ధంగా ఉండాలి అని అయన కోరారు. 



































Share:

గుంటూరు జిల్లా - యుద్ధనికి అంతా సిద్ధం - కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదురుకుంటాం - డియంహెచ్ఓ

గుంటూరు జిల్లా - యుద్ధనికి అంతా సిద్ధం - కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదురుకుంటాం - డియంహెచ్ఓ 

https://chilakaluripetspeednews.blogspot.com/


కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రంగం అంతా సిద్ధంగా ఉన్నారు అని డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజషన్ అధికారి యాస్మిన్ తెలిపారు. థర్డ్ వేవ్ వస్తుంది అని ఎవరు భయపడవద్దు. ఈ లోపు చాల వరకు వ్యాక్సిన్ పూర్తి చేసేస్తాం. చాలా వరకు కంట్రోల్ అవుతుంది.వ్యాక్సిన్ తీసుకోవటం వలన కరోనా నుండి సేఫ్ గా బయటపడవచ్చు. థర్డ్ వేవ్ కు 186 ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి. అందులో 35 ఆసుపత్రులు చిన్నపిల్లల కోసం సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని సామాజిక ఆరోగ్యకేంద్రాలలో 10 పడకలకు ఆక్సిజన్ సప్లై ఉన్నాయి అని ఆమె తెలిపారు. 







































Share:

చిలకలూరిపేట - నాదెండ్ల,యడ్లపాడు మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట - నాదెండ్ల,యడ్లపాడు మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

నాదెండ్ల మండల గ్రామాలలో 6 కేసులు నమోదు అయ్యాయి. 

గణపవరం గ్రామంలో - 5

కనపర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. 

































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

పండరీపురం లో - 2 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 5 కేసులు నమోదు అయ్యాయి. 

పసుమర్రు గ్రామంలో - 1

బొప్పూడి గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 



















































Share:

చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ వర్తకసంఘం ఆధర్యంలో ఘనంగా MLA పుట్టినరోజు వేడుకలు - 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి

చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ వర్తకసంఘం ఆధర్యంలో ఘనంగా MLA పుట్టినరోజు వేడుకలు - 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట కూరగాయల వర్తకసంఘం ఆధ్వర్యంలో MLA విడదల రజిని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విడదల గోపి, మునిసిపల్ చెర్మన్ రఫాని, యార్డ్ చెర్మన్ బొల్లెద్దు చిన్న ముఖ్య అతిధులుగా విచ్చేసి 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి చేసారు. కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కరోనా విజృంభిస్తున్న సమయంలో మునిసిపల్ సిబ్బంది చేసిన సేవలు వెలకట్టలేనివి అని మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు.పట్టణంలో ఇలాంటి ఇబ్బంది పరిస్థితులు వచ్చిన చిలకలూరిపేట కూరగాయల వర్తకసంఘం తరుపున తమ వంతు కృషి చేసాము, చేస్తూనే ఉంటాము అని తెలిపారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. 











































Share:

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత 

https://chilakaluripetspeednews.blogspot.com/q


చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగి మన తెలుగు వారి స్థాయిని దేశం నలుమూలలా చాటి చెప్పే విధంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలలో తన ఆలోచనలతో చాకచక్యంగా వాటిని అధిగమించిన మన IAS మైలవరపు కృష్ణ తేజ  మరో అరుదైన  ఘనత సాధించారు. కృష్ణ తేజకు ప్రతిష్ఠాత్మకం అయిన బుక్ ఆఫ్ అఛీవర్స్ నందు చోటు దక్కటం కృష్ణ తేజ కీర్తిని మరో స్థాయికి తీసుకువెళ్ళింది అని చెప్పాలి.  ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో IAS గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 ఆగష్టు నెలలో కేరళలో వచ్చిన వరదలలో మన కృష్ణ తేజ తన ఆలోచనలతో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ నిర్వహించిన ఆపరేషన్ కుట్టనాడు ఆ రాష్ట్రం చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సమయంలో కేరళలో కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను తన భుజాల పైన వేసుకొని ఎంతో చాకచక్యంగా ఆ ఆపరేషన్ పూర్తి చేసారు.లక్షల మంది జీవితాల గురించి అలోచించి నిర్ణయం తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అంతటి క్రిటికల్ పరిస్థితులలో ఒక్క తప్పిదం జరిగినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే వారు కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆనాడు చేపట్టిన ఆపరేషన్ కుట్టనాడు కి గాను బుక్ అఫ్ అఛీవర్స్ నందు మన కృష్ణ తేజకు చోటు దక్కింది. బుక్ అఫ్ అఛీవర్స్ అంటే అసాధ్యాన్ని సాధించిన అరుదైన వ్యక్తుల గురించి అందులో పంచుకుంటారు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన మన చిలకలూరిపేట ముద్దు బిడ్డ IAS మైలవరపు కృష్ణ తేజకు అభినందనలు తెలుపుకుంటున్నాము.  
అలాగే కరోనా వీరవిజృభిస్తున్న సమయంలో కూడా కేరళ ప్రభుత్వం మన కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి కరోనా కట్టడికి కృషి చేసారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యత వ్యవహిరిస్తు తన ఆలోచనలతో నిర్ణయాలతో కరోనా తీవ్రతని తగ్గించారు. 

Book of Achievers 


కేరళలోని మన కృష్ణ తేజ ఆఫీస్ నందు పని చేసే ఉద్యోగి అయన గురించి ఏమి అన్నారో అయన మాటలలోనే 

మనం నిత్యం ఎంతో మంది అధికారుల అవినీతి గురించి వింటూనే వుంటాం.డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉద్యోగాల్లో చేరేవారు కొంతమంది అయితే, ప్రజలకు సేవచేయాలని వచ్చేవారు మరికొంతమంది. అలాంటి ఒక వ్యక్తి గురించి నేను విన్నది, చూసింది...........
  
    జీవితంలో కొంతమందిని కలసినందుకు గర్వ పడుతుంటాం.అలాంటి ఒక వ్యక్తి గురించి, ఈయన పేరు కృష్ణతేజ మైలవరపు.కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం అల్లెప్పే సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.నేను అనుకోకుండా ఒక రోజు ఎన్నికల విధుల్లో బాగంగా అల్లెప్పేకి వెళ్ళటం జరిగింది.అప్పుడే ఈయన్ని కలిసే అదృష్టం దక్కింది.

    అదృష్టం అని ఎందుకు అంటున్నానంటే....

 🔹ప్రజలకు ఏదోకటి చేయాలనే సంకల్పం.
 🔹ఒక అధికారిగా పాలనలో తనదైన ముద్ర చూపించాలనే ఉత్సాహం.
 🔹 ఎదుటి మనిషితో నేను ఒక అధికారిని అనే గర్వం లేకుండా మాట్లాడే మనస్తత్వం, ఎదుటి               వారికి ఇచ్చే గౌరవం.
 🔹 సర్వీసులో చేరిన ముడేళ్లకే దేశ వ్యాప్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి.

         ఆయన గురించి అక్కడి ప్రజలు,అధికారులు చెప్పిన కొన్ని విషయాలు...........

 🔹 గతంలో వరదలు వచ్చిన సమయంలో కుట్టు నాడు ప్రాంతంలో వరద భీభత్సాన్నీ                            ముందుగానే ఊహించి ఆయన చేపట్టిన రేస్కూ ఆపరేషన్.
 🔹 కేవలం 48 గంటల్లో రెండున్నర లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం.
 🔹సమర్దవంతంగా శిబిరాల నిర్వహణ.
 🔹 తరువాత తిరిగి వారిని స్వస్థలాలకు తరలించంటం.
 🔹వరదల అనంతరం ఆయన చేపట్టిన  I AM FOR ALLEPPEY అనే కార్యక్రమం.
 🔹వరదల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు తిరిగి కొత్త ఇళ్లు ఇవ్వటం.
 🔹పిల్లల బడుల ఆధునికీకరణ, రక్షిత త్రాగునీరు ఏర్పాటు.
 🔹 ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి కల్పించడం.
 🔹I AM FOR ALLEPPEY ద్వారా ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది.
 🔹 ఇంకా ఇటువంటివి మరెన్నో........... 

అంటూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. 










































Share:

చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు.

చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలో ఈ రోజు 24-06-2021 MLA విడదల రజిని పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణంలోని పలు సెంటర్లలో MLA ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలు వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే మోడ్రన్ మాల్ వద్ద భారీ ఎత్తున రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు. కూరగాయల మార్కెట్ వర్తక సంఘం తరుపున నిరు పేదలకు   బట్టలు పంచారు. ఎరువుల కొట్ల బజారులో కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వాడ వాడల ఈ రోజు రజిని పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు. వార్డు స్థాయి వ్యక్తుల నుండి పార్టీ సీనియర్ నాయకులు వరకు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. MLA పుట్టిన రోజుతో పట్టణం అంతా పండుగ వాతావరం అలుముకుంది. 
























































Share:

చిలకలూరిపేట నియోజకవర్గం - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు

చిలకలూరిపేట నియోజకవర్గం - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 6 కేసులు నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

సొలస గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 

నాదెండ్ల మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి 

గణపవరం గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 



































 

Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో 9 కేసులు నమోదు అయ్యాయి 

సి ఆర్ కాలనీ లో - 1

సుభాని నగర్ లో - 3

మార్కండేయ నగర్ లో - 2

సాంబశివ నగర్ లో - 1

వెంగళరెడ్డి కాలనీ - 2 గా నమోదు అయ్యాయి 

చిలకలూరిపేట మండల గ్రామంలో 6 కేసులు నమోదు అయ్యాయి 

బొప్పూడి గ్రామంలో - 1

కట్టుబడివారిపాలెం గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 1

గోవిందపురం గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 

























































Share:

చిలకలూరిపేట - పాతబాకీ విషయంలో ఘర్షణ - కత్తితో దాడి

చిలకలూరిపేట - పాతబాకీ విషయంలో ఘర్షణ - కత్తితో దాడి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - మండలంలోని కావూరి గ్రామంలో బుధవారం ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ కత్తి తో దాడి చేసేలా దారి తీసింది. వివరాలలోకి వెళ్తే కావూరు గ్రామంలో రామారావు, కందుల రమేష్ అనే వ్యక్తి వద్ద నుండిడబ్బులు తీసుకున్నాడు. చాలా రోజులుగా అడుగుతుండగా డబ్బులు ఇవ్వకపోవటంతో గొడవ ముదిరి ఇద్దరు బహ బాహికి దిగారు. ఇంతలో రమేష్ కత్తితో రామారావు పైనా దాడి చేసాడు. ఈ ఘర్షణలలో రామారావుకి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికుల సహాయంతో రామారావును చిలకలూరిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువచ్చారు.  





































Share:

చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ కు చేరుకున్న 2021-2022 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు

చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ కు చేరుకున్న 2021-2022 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - 2021-2022 విద్య సంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు RVSCVS హైస్కూల్ కు వచ్చేశాయి. మంగళవారం సాయంత్రం సమయంలో పాఠ్యపుస్తకాలు తీసుకొని APSRTC కార్గో వాహనం RVSCVS హైస్కూల్ కి చేరాయి. ఇక్కడ నుండి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపినీ చేయనునంట్లు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ( MEO ) ఎల్. లక్ష్మి గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1 నుండి 10 వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు RVSCVS హైస్కూల్ నాకు చేరుకున్నాయి. ఇక్కడ నుండి త్వరలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు రెండు సంవత్సరాలు చదువుకి దూరం అయ్యారు. ఈ సంవత్సరం అయిన కరోనా తగ్గి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఉండాలి అని కోరుకుందాం. 

https://chilakaluripetspeednews.blogspot.com/





































Share:

చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి... - ఇద్దరు నిందితులు అరెస్ట్

చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి...  -  ఇద్దరు నిందితులు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ నాదెండ్ల గ్రామా శివారులలోని NSP కాలువ నందు మే నెల 8 వ తారీఖున గుర్తు తెలియని పెట్రోల్ తో తగలబడిన మృతిదేహానికి సంబంధించిన మిస్టరీని ఛేదించారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే పని పట్ట లేక ఆకతాయిగా తీరుతూ ఉండే నాదెండ్ల లోని పెదమాల పల్లికి చెందిన అశోక్ అనే వ్యక్తి తో పటు బాల సంతోష్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి కలిసి ఈ దారుణానికి ఒడికట్టారు. 

 నాదెండ్ల గ్రామంలో గ్రానెట్ వ్యాపారం చేసే నారాయణ అనే వ్యక్తి ని వీరిరువురు కలసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నారాయణ చేతికి వున్న రెండు ఉంగరాలు, అంతని స్కూటీ ని దొంగిలించాలి అని పధకం వేశారు. అశోక్ పైన చిలకలూరిపేట, అద్దంకి పరిసర గ్రామాలలో దొంగతనం చేసినట్లుగా 15 కేసులు దాకా ఉన్నాయి. అలాగే ఏ మధ్య కాలంలో ఆక్సిడెంట్ జరిగి దొంగతంలో యాక్టీవ్ గా పాల్గొనలేకపోతున్నాడు. అయితే నారాయణ వేలి ఉంగరాలు అమ్ముకొని కాలం గడపవచ్చు అనుకున్నాడు. రోజులాగే బహిర్భుమికి వెళ్లే నారాయణను సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మాటు వేసి ఉంగరాలతో పాటు 8000 నగదు దొంగిలించారు. విషయం బయటపడుతుంది అని బయపడి అంతని మర్మగాల పైనా  ఇష్టం వచ్చినట్లుగా కొట్టటం వలన నారాయణ అక్కడికి అక్కడే చనిపోయాడు. వెంటనే పెట్రోల్ తీసుకువచ్చి అతని పైన పోసి తగలబెట్టారు.

కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసారు.వారి వద్ద నుండి రెండు ఉంగరాలు,ఒక స్కూటీ రికవరీ చేసారు. కేసుని ఛేదించిన SI సతీష్ ను, ASI రవి చంద్ర ను, హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు, దేవరాజు, కానిస్టేబుల్ శివప్రసాదు, హోంగార్డ్ మధు బాబులను CI సుబ్బారావు గారు అభినందించారు.   

































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.