మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట:- శివనామస్మరణతో మోత మోగిన పట్టణంలోని శివాలయాలు

చిలకలూరిపేట:- శివనామస్మరణతో మోత మోగిన పట్టణంలోని శివాలయాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుండే భక్తులు శివాలయాలకు పోటెత్తారు.చౌత్రా సెంటర్లోని శివాలయం పాటిమీద పెద్ద శివాలయాల్లో శివనామస్మరణతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం సోమవారం రోజున భక్తులు తెల్లవారుజామునే తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన పూర్తిచేసుకొని అనంతరం దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలలో పాల్గొని ఉపవాస దీక్ష చేపడతారు.


వీడియో మీకోసం 






Share:

చిలకలూరిపేట:- నిద్రలో మృతి చెందిన యువకుడు

చిలకలూరిపేట:- నిద్రలో మృతి చెందిన యువకుడు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం  బోయపాలెం నందు రంగనాయక నూలుమిల్లులో ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఒడిశాకు చెందిన గిరిదారిదాస్ (27) నూలు మిల్లు లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతనితో పాటు మిల్లు క్వార్టర్స్ లోనే అతని కుటుంబ సభ్యులు ఐదుగురు కలిసి ఉంటున్నారు. రోజులాగే శనివారం రాత్రి గదిలో నిద్రపోయాడు. ఆదివారం ఉదయం అతడు మేల్కొనకపోవటంతో కుటుంబ సభ్యులు అతను చనిపోయినట్లు గుర్తించారు. అయితే అతని మృతిపై అతని పెద్దమ్మ ఫిర్యాదు మేరకు మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి కారణం పోస్టుమార్టంలో తేలాల్సిఉంది.  యడ్లపాడు ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Share:

భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్ఘనిస్తాన్ - రేపటితో విరాటుడి T20 శకం ముగిసినట్లేనా !!!

భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్ఘనిస్తాన్ - రేపటితో విరాటుడి T20 శకం ముగిసినట్లేనా !!!

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ సాధించింది. అయితే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్ గెలవాల్సిందే కానీ న్యూజిలాండ్ గెలవడంతో రేపు జరగబోయే నమీబియా మ్యాచ్ లో భారత్ గెలిచినా సెమిస్ కి వెళ్లదు. పొద్దున నుండి భారత క్రికెట్ ప్రేమికులు ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని ఆకాంక్షించారు. కానీ న్యూజిలాండ్ గెలవడంతో భారత్ ఇంటి బాట పట్టింది.

ఇప్పటికే ఐపీఎల్ బెంగళూరు టీంకు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీ - అంతర్జాతీయ టి20 కెప్టెన్సీకి వైదొలుగుతున్నట్లు గతంలో పర్యటించాడు. అయితే రేపు జరగబోయే మ్యాచ్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీకి చివరి మ్యాచ్. T20 ఫార్మెట్లో లో కింగ్ మొత్తం 49 మ్యాచ్లకు సారథ్యం వహించగా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలుపొందలేదు. అందులో 29 సార్లు గెలవగా 16 సార్లు ఓడిపోయింది టీమిండియా.




Share:

మహా పాదయాత్రకు తండోపతండాలుగా వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక... - మీడియా సమావేశంలో CM పై విరుచుకుపడిన ప్రత్తిపాటి

మహా పాదయాత్రకు తండోపతండాలుగా వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక... - మీడియా సమావేశంలో CM పై విరుచుకుపడిన ప్రత్తిపాటి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


మాజీ మంత్రి ప్రత్తిపాటి ఇంట్లో ఎర్పాటు చేసిన మీడియా సమావేశంలో - అమరావతి రైతులు తలపెట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్ర అడ్డుకునే ప్రయత్నం కుట్రకు తెరలేపింది -  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసుల్ని అడ్డంపెట్టుకొని పాదయాత్ర అడుగడుగునా అడ్డంకులు కలుగజేసి, ఆరు రోజులు గుంటూరు జిల్లాలో తండోపతండాలుగా ప్రజలు రావటం చూసి మహాపాదయాత్ర ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక జగన్ మోహన్ రెడ్డి పోలీస్ అధికారులను అడ్డంపెట్టుకుని దుర్మార్గమైన ఆలోచనలకి తెరలేపుతున్నారు. ఆ రైతులు కన్నీరు పెట్టి దగ్గర బాగుపడ్డటు చరిత్రలో లేదు. అమరావతి రైతులు పాదయాత్ర అడ్డుకోవాలనే పన్నాగం పన్నాడు. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 35 వేల ఎకరాలు ఉంటే రాజధానికి బాగుంటుందని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. అమరావతిలో ఇల్లు కట్టుకుందామని మాటలు చెప్పాడు. నిజమేనని నమ్మి అమరావతి రైతులు ఆనాడు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాటమార్చి రైతులను బాధలకు గురి చేసి, వారు చేస్తున్న దీక్షలు కూతవేటు దూరంలో ఉన్న పట్టించుకోకుండా పోలీస్ అధికారులను అడ్డంపెట్టుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలి. అమరావతి రైతులు తిరుపతి దేవస్థానానికి వెళుతుంటే పోలీసులు అడ్డం పెట్టుకొని వ్యవహరించటం చాలా దుర్మార్గమైన చర్య. హైకోర్టు అమరావతి రైతులు పర్మిషన్ తెచ్చుకున్నారు. ప్రభుత్వాన్ని అడిగితే ఇవ్వలేదు. ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని గ్రహించాలి. ఇది ఒక అమరావతి రైతులే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరు అమరావతి రైతులకు అండగా ఉండాలి. అని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై  విరుచుకుపడ్డారు.గతంలో ప్రభుత్వాలు పేదలకు 1983 నుంచి గృహాలు & స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, ఆ స్థలాల మీద 10 వేల నుంచి 15 వేల రూపాయల కట్టమని పేద ప్రజలను భయభ్రాంతులకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. పేద ప్రజల దగ్గరికి వెళ్లి వాలంటరీ వారు డబ్బులు కట్టాల్సిందే కావాలంటే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. అని ప్రజల్ని ఎప్పుడూ ఇచ్చిన గృహాలు స్థలాల మీద ఇలా టాక్స్ వెయ్యటం ఎంతో ఘోరమైన చర్య జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు గృహాలు కట్టిస్తాం, స్థలాలు ఇస్తాం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు డబ్బులు వసూలు చేయటం దారుణం‌ అని, కట్టిన గృహాలు సాక్షాత్తు చిలకలూరిపేట 52 ఎకరాలలో 4600 గృహాలు నిర్మాణం పూర్తయి ఉంటే ఇంతవరకు లబ్ధిదారులకు అందించలేదు. పాడుబడ్డ విధంగా ఆ గ్రహాలు ఇప్పుడు ఉన్నాయి. అధికారంలోకి రాకముందు మేము అధికారంలో రావడంతో అన్ని రుణమాఫీ, గృహాలకు రూపాయి కట్టే పని  లేకుండా చేస్తామని చెప్పి, పేద ప్రజల చేత ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. పేద ప్రజల ఏమో అప్పోసప్పో చేసి యాభై రెండు ఎకరాల గృహాల కోసం డబ్బులు కొంత డబ్బులు కట్టారు. ఆ డబ్బులు వడ్డీలు కట్టలేక ఈ గృహాలు రాక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇలా వాలంటరీ వారిచేత పేద ప్రజల దగ్గర డబ్బులు ముక్కుపిండి వసూలు చెయ్యటం ఎంత  దుర్మార్గమైన చర్య. ఈ చర్య కు తెర లెపేలా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించటం ఎంత దారుణమైన చర్య, అంటూ తక్షణమే పేదలకు న్యాయం జరిగేలా ఉండాలి. వారి గృహాల వారికి అందించాలి. డబ్బులు వసూలు చేయటం తక్షణమే ఆపివేయాలి. అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారి పై  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విరుచుకుపడ్డారు.




Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.