మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

ప్రత్తిపాటి శరత్ శరత్ త్వరగా విడుదల కావాలని శాంతినిలయం చర్చిలో ప్రార్థనలు

ప్రత్తిపాటి శరత్ శరత్ త్వరగా విడుదల కావాలని శాంతినిలయం చర్చిలో ప్రార్థనలు.

ప్రత్తిపాటి శరత్ శరత్ త్వరగా విడుదల కావాలని శాంతినిలయం చర్చిలో ప్రార్థనలు.


చిలకలూరిపేట :- రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాక్షస పాలనకు చిరునామాగా మారారని చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు అన్నారు. మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చిలకలూరిపేట 32వ వార్డు శాంతినగర్‌లోని శాంతినిలయం చర్చిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శరత్ క్షేమంగా ఉండాలని.. త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు దయతో వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసుల నుంచి శరత్ నిర్దోషిగా బయటకు వస్తారని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌రెడ్డి ఏపీఎస్‌డీఆర్‌ఐని అడ్డంపెట్టుకొని శరత్‌పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేయడం, బెదిరించడం, లొంగకపోతే కేసులు పెట్టడం అధికారపార్టీకి మాములైందన్నారు. శరత్‌ను అక్రమ నిర్బంధం నుంచి విడుదల చేయాలని తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - బి.సి భవనానికి కేటాయించిన స్థలానికి ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలపై వినతి

 చిలకలూరిపేట - బి.సి భవనానికి కేటాయించిన స్థలానికి ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలపై వినతి

చిలకలూరిపేట - బి.సి భవనానికి కేటాయించిన స్థలానికి ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలపై వినతి

 చిలకలూరిపేట:-  జాతీయ బీసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  మాజీ మంత్రి,నర్సరావు పేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి మల్లెల రాజేష్ నాయుడుకు మంగళవారం వినతిపత్రం అందించడం జరిగింది. పట్టణ ములోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో భాగంగా కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా  జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మాదాసు పృధ్వీరాజ్ సాయి, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి ఆలా శివ గోపి,మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాచపూడి వెంకట్ మాట్లాడుతూ  నరసరావుపేట రోడ్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలో బి.సి సామాజిక వర్గానికి 53 సెంట్లు భూమి, భవన నిర్మాణానికి కేటాయించడం జరిగిందని, ఆ స్థలం ముందు కొంతమంది  శాశ్వత రేకుల షెడ్లు, చిన్న..చిన్న పాకాల నిర్మాణాలు చేపడుతున్నారని, ఇవి తొలగించాలని సంబంధిత అధికారులకు తెలియపరిచిన కాలయాపన చేస్తున్నారని వాపోయారు. మునుముందు భవన నిర్మాణం చేపట్టేటప్పుడు, ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిన్న చిన్న సమస్యలను సర్దుకుపోతూ పార్టీ గెలుపుకి పని చేద్దాం - చిలకలూరిపేట సభలో అనిల్ కుమార్ యాదవ్

 చిన్న చిన్న సమస్యలను సర్దుకుపోతూ పార్టీ గెలుపుకి పని చేద్దాం - చిలకలూరిపేట సభలో అనిల్ కుమార్ యాదవ్

చిన్న చిన్న సమస్యలను సర్దుకుపోతూ పార్టీ గెలుపుకి పని చేద్దాం - చిలకలూరిపేట సభలో అనిల్ కుమార్ యాదవ్

చిలకలూరిపేట:-  పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వైయస్సార్సీపి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, చిలకలూరిపేట వైయస్ఆర్సిపి సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు మరియు పార్టీలోని ముఖ్య కార్యకర్తలు, నాయకులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ చిలకలూరిపేటలో వైఎస్ఆర్సిపి కేడర్ చాలా బలంగా ఉంటుందని. చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకుపోయి పార్టీ గెలుపుకి కృషి చేద్దామని. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా రాజేష్ నాయుడు గెలుపుకై కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 45 రోజులు కార్యకర్తలు సమయమును పాటిస్తే ఆ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లాలో ఉన్న ఏడికి ఏడు ఎమ్మెల్యేలను ఒక ఎంపీ స్థానాన్ని గెలిచి జగన్మోహన్ రెడ్డి కి మనం అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నో కష్టాలు పడి తాను రెండుసార్లు ఎమ్మెల్యేని అయ్యానని ఒకసారి మంత్రిగా కూడా పని చేశానని కష్టం విలువ తనకు తెలుసునని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని అదే వైఎస్ఆర్సిపి ముఖ్య అజెండా అని ఆయన తెలిపారు.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.