మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్


చిలకలూరిపేట:- పట్టణంలో పరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజా మేనిఫెస్టోని అమలు చేయాలని కమిటీ కన్వీనర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు. ఈరోజు కార్యాలయంలో "పది" అంశాలతో కూడిన మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలకమైన "పది" అంశాలపై పోటీ చేసే అభ్యర్థులు వారి అభిప్రాయాలను  తెలియజేయాలని కోరారు.

1. పట్టణంలో మంచినీటి సరఫరాకు కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ రోజు విడిచి రోజు మున్సిపల్ నీరు వదులుతున్నారు, ఇంకా అనేక ప్రాంతాలకు ట్యాంకర్లతో  నీటి సరఫరా చేస్తున్నారు.

2. పట్టణంలోని ఏరియా హాస్పిటల్ లో ”వెంటిలేటర్ అంబులెన్స్” మరియు బ్లడ్ బ్యాంక్  ల కొరత ఉన్నవి.

3. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయవలసి ఉన్నది.

4. పట్టణంలో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయవలసిన అవసరం తీవ్రంగా ఉన్నది.

5. పట్టణంలో బస్సు షెల్టర్స్ కొరత కారణంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు, గర్భిణీలు, బాలింతలు పొత్తిళ్లలో పిల్లలను పెట్టుకొని మండుటెండలో బస్సుల కోసం వేచి ఉంటున్నారు.

6. అద్దె ఇంట్లో నివసించే కుటుంబాలలో ఎవరైనా కాలం చేస్తే, వారి అంతిమ సంస్కార నిమిత్తమై వివిధ కారణాల రీత్యా కొందరు ఇంటి ఓనర్లు అభ్యంతర తెలుపుచున్నారు. కనుక, స్మశాన వాటిక సమీపంలో రెండు గదులు ఏర్పాటు చేయవలసి అవసరం ఉన్నది.

7. పట్టణంలో ఉన్న “రెండు కోర్టు”లలో “ఒకటి” అద్దె భవనంలో ఇరుకుగా మున్సిపల్ బిల్డింగ్లో పై అంతస్తులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలుసు. స్థలం ఏర్పాటు చేసినచో హైకోర్టు వారు నిర్మాణ ఖర్చులు భరించగలరు, స్థలం కొరత ఉన్నది.

8. పట్టణంలో నాలుగు ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అవసరం ఉన్నవి.

9. పట్టణంలో వాకింగ్ ట్రాక్స్ లేని కారణంగా రోడ్లపై వాకింగ్ చేస్తూ యాక్సిడెంట్స్ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు విధితమే, కనుక వాకింగ్ ట్రాక్స్ మరియు పట్టణ ప్రజల ఆహ్లాదానికి మంచి పార్క్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది.

10. నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు మరియు సినీ నటుల  ఫ్లెక్సీలు, ప్రజలకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నందున, అలాంటి ఫ్లెక్సీల ఏర్పాటును నియంత్రించవలసి ఉంది.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మురకొండ వెంకటరావు, శనగవరపు హరి ప్రసాద్, తమ్మిరిశ కృష్ణ ప్రసాద్, గంగసాని వెంకటేశ్వర రెడ్డి, T. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశంలోకి చేరికల జోరు పెరిగింది. పట్టణంతో పాటు గ్రామాల నుంచి చేరికల సందడి మొదలైంది. ఓం వైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు అధికార పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి వరుస కడుతున్నారు. తాజాగా సోమవారం మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో చిలకలూరిపేట 14వ వార్డు కౌన్సిలర్ షేక్ జమీల, కొత్తపాలెం సర్పంచ్ మొలమంటి సుబ్బారావు, అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు కొండబోయిన కోటయ్య వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చిలకలూరిపేటలోని నివాసంలో ప్రత్తిపాటి పుల్లారావు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి ప్రత్తి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైసీపీ విధానాలు నచ్చక చాలామంది ఆ పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి చేరుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో  యడ్లపాడు జడ్పిటీసీ సభ్యుడు ముక్తా వాసు, మునిసిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,  మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, జాలాది సుబ్బారావు, చెమిటిగంటి పార్వతి, బిట్రా రాజేంద్ర ప్రసాద్, గాలి బుచ్చయ్య , ఎం.వి రత్నారెడ్డి, పంగులూరి వెంగళరాయుడు, తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, యాదాల సుజాత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి జనార్దన్ రావు, మద్దిబోయిన దుర్గారావు, మొలమంటి అంకుల్, రాటనాల అంకారావు, తేళ్ల సుబ్బారావు, నెల్లూరి సదాశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Share:

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం - యువకుడు మృతి

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం -  యువకుడు మృతి

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం -  యువకుడు మృతి

చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు వివరాల్లోకి వెళితే.. కుమ్మరి కాలనీకి చెందిన రావూరి రామకృష్ణ(27) అనే యువకుడు మరొక స్నేహితుడు డేనియల్(22) తో కలిసి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సంజీవ్ నగర్ లోని స్నేహితుడిని కలిసి కుమ్మరి కాలనీలోని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. పాత విజయ బ్యాంక్ వద్ద జాతీయ రహదారిపైకి వస్తుండగా అదే సమయంలో ఒంగోలు నుండి గుంటూరు వెళుతున్న పాల వ్యాను యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని రోడ్డుకి అవతల వైపుగా వెళ్లి ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డు ఇనుప గ్రిల్స్ ను ఢీకొని వాహనం ఆగింది. ఈ ఘటనలో రామకృష్ణ తలకు తీవ్ర గాయమై రక్తశ్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు డేనియల్ వెన్నెముక విరగడంతో తీవ్ర గాయాలతో కదలని స్థితిలో ఉన్నాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. తీవ్ర గాయాలైన మరో యువకుడుని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికుల సమాచారం. రామకృష్ణ మృతితో కుమార్ కాలనీలోని స్వగృహం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి.

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం -  యువకుడు మృతి


మద్యం మత్తులో వాహనాలు నడపరాదు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల

కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల 

కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల

కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది.

కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల (YS Sharmila) నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టింది.

రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. అయితే సీనియర్ నేత రఘువీరా రెడ్డి మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. మాజీ ఎంపీ పల్లం రాజును కాంగ్రెస్ అధిష్టానం కాకినాడ నుంచి బరిలోకి దింపనుంది. ఏపీలో 117 అసెంబ్లీ,17 లోక్ సభ స్థానాలపై సీఈసీలో చర్చ జరిగింది. వీటిలో 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టింది. నంద్యాల, తిరుపతి,అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్ సభ స్థానాలను పెండింగ్‌లో ఉంచింది.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన:- 

 కడప నుంచి బరిలో YS షర్మిల

 రాజమండ్రి నుంచి - గిడుగు రుద్రరాజు

  బాపట్ల నుంచి జెడి శీలం 

 కాకినాడ నుంచి పళ్ళం రాజు 

అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్

 విశాఖ నుంచి సత్యారెడ్డి 

 ఏలూరు నుంచి లావణ్య

 రాజంపేట నుంచి నజీర్ అహ్మద్ 

 చిత్తూరు బరిలో చిట్టిబాబు 

 హిందూపురం నుంచి షాహిన్ 

 ఎన్నికల్లో పోటీకి దూరంగా రఘువీరారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్న రఘువీరారెడ్డి 

మొత్తం 58 అసెంబ్లీ స్థానాలు పెండింగ్. 8 లోక్సభ స్థానాలు పెండింగ్.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.