మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ అందజేసిన మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు

చిలకలూరిపేట - ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ అందజేసిన మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు 

https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టంలోని ప్రగతి నర్సింగ్ హోంనకు ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ ను అందించారు మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు. ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ అంటే విద్యుత్ అంతరాయం లేకుండా ఉంటే ఇది నిరంతరం ఆక్సిజెన్ సప్లై చేస్తుంది, ఆక్సిజెన్ సిలిండర్ తో పని లేకుండా వాతావరంలోని గాలిని తీసుకొని ఆక్సిజెన్ ఉత్పత్తి చేస్తుంది. ప్రగతి హాస్పిటల్ డాక్టర్ కొల్ల అమర్ గారు మాట్లాడుతూ   ప్రస్తుతం ఆక్సిజన్ సీలిండర్లు కొరత ఉన్న ఈ సమయంలో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ చాలా ఉపయోగపడుతుంది. మర్రి రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. 




























Share:

అసభ్యపదజాలంతో ప్రతిపక్ష నాయకుడిని తిడుతున్నవాళ్ళని వదిలేసి వైద్యధికారులు ప్రకటించిన వైరస్ గురించి మాట్లాడిన చంద్రబాబు పైనా కేసు పెట్టటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము - ప్రత్తిపాటి

అసభ్యపదజాలంతో ప్రతిపక్ష నాయకుడిని తిడుతున్నవాళ్ళని వదిలేసి వైద్యధికారులు ప్రకటించిన వైరస్ గురించి మాట్లాడిన చంద్రబాబు పైనా కేసు పెట్టటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము - ప్రత్తిపాటి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చంద్రబాబు నాయుడి పైన పెట్టిన కేసును తీవ్రంగా ఖండిస్తున్నాము- పుల్లారావు , వివరాల్లోకి వెళ్తే

N - 440K  అనే ప్రమాదకర కరోనా వైరస్ ఏపీలో కనిపించింది అని చంద్రబాబు నాయుడు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అని ప్రతిపక్షనేత చంద్రబాబు గారి పైన కేసు నమోదు చేసారు. అయితే రాష్ట్రంలో రెమిడీసీవర్ , ఆక్సిజెన్ సమకూర్చటంలో విఫలం అయిన జగన్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మార్చటానికి కేసులు పెట్టి వాతావరణాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు. 

3 సార్లు ముఖ్యమంత్రి అయిన 40 సంవత్త్సరాలో రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని మీడియాలో ఒక మంత్రి ఇష్టం వచ్చినట్లు అసభ్యపదజాలంతో దూషిస్తున్న వారిని వదిలివేసి , వైద్యాధికారులే కొత్త వైరస్ ఏపీలో ఉన్నది అని ధ్రువీకరించిన వార్త ప్రస్తావన చేసిన చంద్రబాబునాయుడు పైన కేసు పెట్టటం ఏంటని ప్రశ్నించారు. ఆక్సిజెన్ లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు వారి పైన ద్రుష్టి పెట్టాలి అని తెలిపారు.  


























Share:

ఏపీలో ఇక పైన పెస్టిసైడ్స్ & వ్యవసాయాధారిత దుకాణాల పని వేళలలో మార్పు

ఏపీలో ఇక పైన పెస్టిసైడ్స్ & వ్యవసాయాధారిత దుకాణాల పని వేళలలో మార్పు 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా వలన రాష్ట్రం మొత్తం రెండు వారాలపాటు కర్ఫ్యూని విధించిన ప్రభుత్వం తాజాగా వ్యవసాయానికి అనుసంధానంగా ఉండే దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు పూర్తి మినహాయింపు ఇవ్వకుండా సమయంలో మార్పులు చేసింది. రేపు అనగా సోమవారం నుండి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచుకోవచ్చు, అమ్మకాలు కొనసాగించవచ్చు అని తెలిపినది. కనుక రేపటి నుండి ఎరువులు మందుల దుకాణాలు, పురుగుల మందుల దుకాణాలు , వ్యవసాయ పనిముట్లు అమ్మే షాపులు, వాటిని రిపేరులు చేసే షాపులు 7 to 6 వరకు తెరుచుకోనున్నాయి. 
కరోనా నియమాలు పాటిస్తూ అమ్మకాలు కొనసాగించాలి అని తెలియచేసారు. 




























Share:

చిలకలూరిపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన గోవెల్ బ్యాటరీస్ నిమ్మకాయల ( బొబిళ్ళ ) ప్రసాదు గారు

చిలకలూరిపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన గోవెల్ బ్యాటరీస్ నిమ్మకాయల  ( బొబిళ్ళ ) ప్రసాదు గారు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ముస్లిం సోదరుల ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసము సంధర్బముగా పట్టణములోని గోవెల్ బ్యాటరీస్ చిలకలూరిపేట యాజమాన్యం అయిన బొబ్బిళ్ళ ( నిమ్మకాయల ) ప్రసాదు గారి ఆధ్వర్యంలో 150 మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు. 150 మందికి వారానికి సరిపడా కూరగాయలు, ఉల్లిపాయలు, 2 కేజీల బాసుమతి రైస్, నూనె పాకెట్స్, ఇతర పదార్ధాలు అందజేశారు. ఈ సంధర్భంగా ప్రసాదు గారు మాట్లాడుతూ కరోనా కారణముగా ఈ సంవత్సరం ముస్లిం సోదరులు  రంజాన్ పండుగను ఎవరి ఇళ్లలో వాళ్ళు జరుపుకోవాలి. సాయంత్రం ప్రార్థన సమయాలలో మాస్క్ ధరించాలి అని కరోనా నియమాలు పాటిస్తూ పండుగని జరుపుకుందాం అని తెలిపారు.  పట్టంలోని రామకృష్ణ థియేటర్స్ పక్కనే ఉన్న గోవెల్ బ్యాటరీస్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసాదు గారు, నాయుడు హనుమంతురావు గారు మరియు ప్రసాదు గారి మిత్రులు, పట్టణంలోని బైక్ మెకానిక్స్ ,కారు మెకానిక్స్  పాల్గొన్నారు. 



https://chilakaluripetspeednews.blogspot.com/


https://chilakaluripetspeednews.blogspot.com/
























Share:

ఇక పైన రాష్ట్రంలో ప్రతి నెల ప్రతి ఇంటి నుండి నగరాలలో 120, మునిసిపాలిటీలలో 90, పంచాయితీలలో 60 రూపాయల వసూళ్లు - త్వరలో ఆమోదం

ఇక పైన రాష్ట్రంలో  ప్రతి నెల ప్రతి ఇంటి నుండి నగరాలలో 120, మునిసిపాలిటీలలో 90, పంచాయితీలలో 60 రూపాయల వసూళ్లు - త్వరలో ఆమోదం 

https://chilakaluripetspeednews.blogspot.com/

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మునిసిపాలిటీలలో, నగరపాలక సంస్థలలో సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ కోసం చార్జీలు వసూళ్లు చెయ్యనున్నారు. నగరపాలక సంస్థలలో, పురపాలక సంస్థలలో వేరు వేరుగా చార్జీలు వసూళు చెయ్యనున్నారు. 

నగరపాలక సంస్థలలో, మునిసిపల్ కార్పొరేషన్ లలో  అయితే ఇంటి ఇంటికి ప్రతి నెల 120 రూపాయల చొప్పున చార్జీలు వసూళ్లు చెయ్యనున్నారు. ఆలస్యం అయితే 15 రూపాయల పెనాలిటీ వసూళ్లు చేస్తారు. 500-1000 చదరపు అడుగుల హోటళ్లకు, రెస్టారెంట్లకు 1000 రూపాయలు, 1500 చదరపు అడుగులలో ఉన్న హోటళ్లకు, రెస్టారెంట్లకు 1500 రూపాయలు, చిన్న హోటళ్లకు 500 రూపాయలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు 300 రూపాయలు, 7 స్టార్ నుండి 5 స్టార్ హోటళ్లకు 15000, 3 స్టార్ హోటళ్లకు 10000, 50 గదులు ఉన్న హోటళ్లకు 5 వేలు, 20 నుండి 50 గదులు ఉన్న హోటళ్లకు 3 వేలు, హాస్టళ్లకు, మాల్స్, ఫంక్షన్ హాళ్లకు వేరువేరుగా, ఆలస్యం అయితే 100పెనాలిటీ చార్జీలు నిర్ణయించారు.


మునిసిపాలిటీలలో స్పెషల్, సెలక్షన్ గ్రేడులలో ఉన్న మునిసిపాలిటీలలో ఒకొక్క ఇంటికి ప్రతి నెలా 90 రూపాయలు, 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉన్న హోటళ్లకు 1000 రూపాయలు, బార్ అండ్ రెస్టారెంట్ లకు 2000 రూపాయలు, ప్రైవేట్ కమర్షియల్ కంప్లెక్సలకు 2500 రూపాయలు, ఫంక్షన్ హాళ్లకు 7500 రూపాయలు,కోల్డ్ స్టోరేజీలకు 1000 రూపాయలు, 40 పడకల నర్సింగ్ హోమ్ లకు 7500 రూపాయలు, చికెన్ మటన్ షాపులకు నెలకు 200 చొప్పున నిర్ణయించారు. 

గ్రేడ్ 2, నగర పంచాయితీలకు నెలకు ఇంటికి నెలకు  60 రూపాయలు , లేటు పెనాలిటీ 5 రూపాయలుగా నిర్ణయించారు. 

     


















Share:

చిలకలూరిపేట - నిత్యం రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న తిమ్మాపురం ప్రాంతః ప్రజలు - తాజాగా మరొకరు మృతి

చిలకలూరిపేట - నిత్యం రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న తిమ్మాపురం ప్రాంతః ప్రజలు - తాజాగా మరొకరు మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నుండి గుంటూరు జాతీయ రహదారి పైనా తిమ్మాపురం వద్ద రోజూ ఏదో ఒక రోడ్డు ప్రమాదం వలన ఎవరో ఒకరు మృతి చెందుతున్నారు. తాజాగా ఆదివారం ( ఈ రోజు ) విజయవాడ నుండి ఒంగోలు వెళ్తున్న ట్రాలీ ఆటో తిమ్మాపురం వద్ద డివైడర్ ను ఢీ కొని బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో పొదిలికు చెందిన నరసయ్య (80) అక్కడే మృతి చెందారు. మిగిలిన వారికీ గాయాలవ్వగా వారిని హాస్పిటల్కు తరలించారు. 

నిత్యం ఏదో ఒక ప్రమాదంతో ఆయా ప్రాంతః వాసులు భయాందోళనకు గురి అవుతున్నారు. చిలకలూరిపేట నుండి గుంటూరు మధ్యలో తిమ్మాపురం జంక్షన్ వద్ద మాత్రమే రోడ్డు వెడల్పు తక్కువగా, ప్రమాదాలకు అనుకూలంగా ఉంటుంది. అధికారులు దీని పైనా ద్రుష్టి పెట్టి తగుచర్యలు తీసుకోవాలి అని ఆ ప్రాంతః వాసులు తెలిపారు.   













Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.