మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

13వ తేదీ జరగవలసిన వైద్యుల సన్మాన కార్యక్రమం వాయిదా - చైర్మన్ రఫాని

13వ తేదీ జరగవలసిన వైద్యుల సన్మాన కార్యక్రమం వాయిదా - చైర్మన్ రఫాని

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- కరోనా సమయంలో కరోనా బారిన పడిన పేషెంట్లకు వైద్య సేవలు అందించిన వైద్యులకు 13వ తేదీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే  దసరా పండుగ సందర్భంగా కొంతమంది వైద్యులు అందుబాటులో ఉండటం లేరని తెలియటం వల్ల  ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మున్సిపల్ చైర్మన్ రఫాని తెలియజేశారు.  వైద్యులకు సన్మానం చేసే విషయంలో తర్వాత తేదీని ప్రకటిస్తామని మున్సిపల్ చైర్మన్ రఫాని తెలిపారు.



Share:

పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం దక్కటం నా అదృష్టం - MLA రజిని - బోయ‌పాలెం పార్వ‌తి దేవి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్రాల స‌మ‌ర్ప‌ణ‌

పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం దక్కటం నా అదృష్టం - MLA రజిని - బోయ‌పాలెం పార్వ‌తి దేవి అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్రాల స‌మ‌ర్ప‌ణ‌

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

జ్ఞానానికి అధిష్టాన దేవ‌త స‌రస్వ‌తి అని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ద‌స‌రా ఉత్స‌వాలు, మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో మంగ‌ళ‌వారం య‌డ్ల‌పాడు మండ‌లంలోని బోయ‌పాలెంలో వేంచేసి ఉన్న ప్ర‌సిద్ధ పార్వ‌తి దేవి అమ్మ‌వారికి ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని ప‌ట్టు వ‌స్త్రాలు అంద‌జేశారు. వ‌రుస‌గా రెండో ఏడాది కూడా ఉత్స‌వాల్లో భాగంగా ఎమ్మెల్యే అమ్మ‌వారికి వ‌స్త్రాలు బ‌హుక‌రించారు. ఈ స‌ద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తార‌ని తెలిపారు. సరస్వతి అమ్మ‌వారు బ్రహ్మ చైతన్యంతో హంసవాహనాన్ని అధిష్టించి ఉంటార‌ని తెలిపారు. సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుందన్నారు. బోయ‌పాలెంలోని పార్వ‌తి దేవి అమ్మ‌వారి ఆలయానికి వందేళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉంద‌ని తెలిపారు. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి ఆల‌యం త‌రువాత ఈ ప్రాంతంలో అత్యంత ప్రాశ‌స్త్యం క‌లిగిన ఆల‌యం బోయపాలెంలోని అమ్మ‌వారి ఆల‌య‌మేన‌ని చెప్పారు. ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించే గొప్ప అవ‌కాశం త‌న‌కు ద‌క్క‌డం త‌న అదృష్ట‌మ‌ని తెలిపారు. తొలుత ఎమ్మెల్యేను అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగతం ప‌లికారు. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో జడ్పీటీసీ ముక్తా వాసు,జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,స్థానిక సర్పంచ్ వడ్డేపల్లి నరసింహారావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని,ఎంపీటీసి సయ్యద్ సుభాని,బింజు బుల్లయ్య,ఉన్నవ సర్పంచ్ ఏసోబు, నాయకులు ఖాదర్ బాషా,శ్రీను నాయక్,గుత్తి సింగయ్య,పల్లపు లక్ష్మీనారాయణ, వంకదారి శ్రీనుబాబు,పందుల బుల్లెబ్బాయి,పఠాన్ అల్లావుద్దీన్, కామినేని రామకృష్ణ మరియు పలువురు పాల్గొన్నారు.



Share:

18.7 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే రజిని

18.7 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే రజిని.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిల‌క‌లూరిపేట‌: ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని స్థానిక త‌న కార్యాల‌యంలో మంగ‌ళ‌వారంముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 33 మందికి రూ.18.7 ల‌క్ష‌ల విలువైన చెక్కుల‌ను  ల‌బ్ధిదారుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద‌ల ఆనంద‌మే ధ్యేయంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్నార‌ని తెలిపారు. రోగాల బారిన ప‌డి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని తెలిపారు. గ‌తంలో రోగాల బారిన ప‌డి ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందిన వేలాది మందికి నియోజ‌క‌వ‌ర్గంలో సీఎంఆర్ ఎఫ్ కింద ఆర్థిక సాయం అంద‌జేశామ‌ని చెప్పారు. తాజాగా య‌డ్ల‌పాడు మండ‌లం సొల‌స గ్రామానికి చెందిన రెడ్డిమాసు అరుణ‌కుమారికి రూ.1.5ల‌క్ష‌ల ఆర్థిక సాయం వ‌చ్చిన‌ట్లు చెప్పారు. య‌డ్ల‌పాడు మండ‌లం కారుచోల‌కు చెందిన క‌ల్లూరి సుబ్బారావుకు రూ.1.4ల‌క్ష‌లు, సుభాని న‌గ‌ర్‌కు చెందిన షేక్ మ‌స్తాన్‌వ‌లికి రూ.1.4ల‌క్ష‌లు, య‌డ్ల‌పాడు మండ‌లం ఉన్న‌వ గ్రామానికి చెందిన కొండెపాటి ప్ర‌సాద్‌కు రూ.ల‌క్ష‌, య‌డ్ల‌పాడుకు చెందిన య‌ర‌ప‌న మ‌ల్లీశ్వ‌రికి రూ.ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఇంత పెద్ద మొత్తాల్లో ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల మంజూరు త‌మ ప్ర‌భుత్వంలోనే సాధ్య‌మ‌ని చెప్పారు. ఆప‌ద‌లో ఉన్న ప్ర‌తి ఒక్కరికి ఏదో ఒక ప‌థ‌కం ద్వారా జ‌గ‌న‌న్న ఆప‌న్న హ‌స్తం అందిస్తున్నార‌ని తెలిపారు. రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రికి నేడు ఏదో ప‌థ‌కం ద్వారా ఆర్థిక సాయం అందుతోంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేద‌ని వెల్ల‌డించారు. ఇంత గొప్ప ప్ర‌భుత్వానికి ప్ర‌జల మ‌ద్దతు ఎల్ల‌ప్పుడు ఉంటుంద‌ని, త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స‌ర్పంచి, మున్సిపల్ ఎన్నిక‌లే అందుకు నిద‌ర్శ‌మ‌ని ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. కార్య‌క్ర‌మంలో మున్సిపల్ చైర్మన్ రఫాని,జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,ఎంపీపీ దేవినేని శంకరరావు,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, రాష్ట్ర ముస్లిం డైరెక్టర్ దరియా వలి, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి,షేక్ ఖాజా భాను,బిట్రా రాజేంద్ర,పుల్లగూర అనురాధ,మస్తాన్ వలి,యూసుబ్,తోట నాగలక్ష్మి,నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి, మద్దూరి భాస్కర్ రెడ్డి,శ్రీను,బ్రహ్మయ్య,ముక్తుమ్,హుజాఫా,జాజుల రామారావు,మరియు పలువురు పాల్గొన్నారు.



Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 12-10-202 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

చిలకలూరిపేట పట్టణంలో నేడు 12-10-202 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలో నేడు 12-10-2021 మంగళవారం నాడు మొత్తం  2 కేసులు నమోదు అయ్యాయి. 

వాటి వివరాలు.

రహమత్ నగర్ - 1

RTC కాలనీ - 1 గా నమోదు అయ్యింది.

* sponsored by RUDRA BRAND CHILAKALURIPET *

లక్ష్మి గణపతి ఆయిల్ మిల్స్ వారి - రుద్రా బ్రాండ్ ఆయిల్ చిలకలూరిపేట స్వచ్ఛమైన వేరుశెనగ నూనె - కొబ్బరినూనె లభించును. chilakaluripetSpeedNews అనే ప్రోమోకోడ్ ఉపయోగించి 10 రూపాయల డిస్కౌంట్ పొందగలరు.






Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.