మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజుల వేడుకల్లో భాగంగా ఈరోజు...

చిలకలూరిపేట - ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజుల వేడుకల్లో భాగంగా ఈరోజు...

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ రూరల్ మండలం అయిన మురికిపూడి,గోపాలంవారిపాలెం గ్రామాల యందు ఉన్న ప్రాథమిక విద్యా కేంద్రం, అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి అక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా జరుగుతున్న సేవా సమర్పణ కార్యక్రమం లో భాగంగా నియోజకవర్గ ఇంచార్జ్ రాష్ట్ర ఓబిసి ప్రోగ్రాం కన్వీనర్ శ్రీనివాసరావు,రూరల్ మండల మైనార్టీఅధ్యక్షులు పోతవరం సుభాని, ఉపాధ్యక్షులు మద్దిరాల సుభాని, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గాత్రం సాంబశివరావు గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక విద్యా కేంద్రాలను కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయని తెలియజేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పట్టణ ఉపాధ్యక్షుడు డి పుల్లయ్య, పట్టణ యువ మోర్చా అధ్యక్షులు నందిగామ రాజు, సీనియర్ నాయకులు అన్నపరెడ్డి లక్ష్మణ్ ,పొత్తూరి బ్రహ్మానందం, పట్టణ ఓబీసీ మోర్చా కార్యదర్శి జే రాయుడు తో పాటుగా అక్కడి స్కూలు టీచర్లు అందరూ నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు.








Share:

చిలకలూరిపేట మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-యస్టీయూ ( స్టేట్ టీచర్స్ యూనియన్)

చిలకలూరిపేట మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-యస్టీయూ ( స్టేట్ టీచర్స్ యూనియన్)

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని ని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంకై యస్టీయూ( స్టేట్ టీచర్స్ యూనియన్) నిరంతరం కృషి చేస్తుందని యస్టీయూ రాష్టృకమిటీ కన్వీనర్ పోటు.శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు రాష్టోృపాధ్యాయ సంఘం చిలకలూరిపేట పట్టణశాఖ సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పట్టణ అద్యక్షులు వినుకొండ అక్కయ్య, ప్రధాన కార్యదర్శి మేకల.కోటేశ్వరరావు, ఆర్ధికకార్యదర్శి కుంభా.ఏడుకొండలు ,ఈ.శామ్యూల్ పాల్గొన్నారు.గత75సంవత్సరాలుగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పై యస్టీయూ ఉద్యమకార్యాచరణ చేపట్టి అనేక సమస్యలను పరిష్కరించిందని నేడు ఉపాధ్యాయులు పొందుతున్న అన్ని సౌలభ్యాలు అనేకమంది ఉపాధ్యాయుల పోరాట ఫలితమేనన్నారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులందరూ యస్టీయూ పట్ల చూపుతున్న ఆదరణే 75వసంతాలుగా సంఘం విరాజిల్లుతుందన్నారు. రాష్టృ ప్రభుత్వం 55% ఫిట్ మేంట్ తో పీఆర్సీ ప్రకటించాలని,ఉపాధ్యాయులకు నెల వారీ పదోన్నతులు కల్పించాలని,పెండింగ్ డీ,ఏ.లు విడుదల చేయాలన్నారు. మనబడి,నాడునేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ,ఎల్స్ మంజూరుచేయాలన్నారు.

Share:

చిలకలూరిపేట - S.A.N రాజు గారి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు - మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు

 చిలకలూరిపేట - S.A.N రాజు గారి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు - మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట - S.A.Nరాజు స్వగ్రామం కట్టమూరులో పార్థివ దేహాన్ని సందర్శించిన ప్రత్తిపాటి.తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకుడు S.A.N రాజు  సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. గుండెపోటు కారణంగా మృతి చెందిన రాజు మృతదేహాన్ని వారి స్వగృహం అయినా సత్తెనపల్లి మండలం కట్టమూరుకు తరలించడం జరిగింది. S.A.N రాజు మరణవార్త తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు హుటాహుటిన కట్టమూరు బయలుదేరి వెళ్లి రాజు పార్థివదేహాన్ని సందర్శించడం జరిగింది. రాజు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, పార్టీలో ఎంతోకాలం నుండి పనిచేస్తూ, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాడుతూ, పార్టీలో ఎదుగుతున్న సమయంలో ఆకస్మికంగా మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. రాజు మృతి పార్టీకి పూడ్చ లేని లోటు అని, వ్యక్తిగతంగా తను మంచి సన్నిహితుడిని కోల్పోయానని తెలిపారు. రాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రత్తిపాటి తెలియజేశారు. రాజు మృతదేహానికి నివాళులు అర్పించిన వారిలో మానం వెంకటేశ్వర్లు, నెల్లూరి సదాశివరావు, షేక్ కరిముల్లా, ఇనగంటిజగదీష్, నాతాని ఉమామహేశ్వర రావు, భీమవరపు సుబ్బారావు,పఠాన్ సమద్ ఖాన్, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజిమదన్మోహన్, ముద్దన నాగేశ్వరరావు,మద్దూరి వీరా రెడ్డి, షేక్ అబ్దుల్ ఖుమీర్, S.S.సుభాని, పావులూరి శ్రీనివాస రావు, గంగా శ్రీనివాస రావు, దగ్గుమల్లి సాంబశివరావు, అంబటిసోంబాబు, కొండా వీరయ్య, జరుగుమల్లి చెన్నయ్య, గేరా రాజశేఖర్, అందేలా శౌరి, మద్దుమాల రవి, పిల్లి కోటి, బొంతా వేణు, కేసానుపల్లి రమేష్, V. సుబ్బారావు, నూలు రాజేష్, గట్టుపల్లి  మాణిక్యరావు, లెనిన్, ముకిరి వీరాoజనేయులు, రాజేష్, ఇనగంటి బెజిమాన్, గుర్రం నాగ పూర్ణ చంద్రరావు, ఆవుల గోపి, ఈవూరిబ్రహ్మానందo, G.V.H.S ప్రసాద్, మద్ది బోయిన శివ, జంగా వినాయకరావు, షేక్ ఖాజా మోహిద్దిన్, మురకొండ మల్లి బాబు, షేక్ అజారుద్దీన్,  MBT వహబ్, కందుల రమణ, తూబాటి శ్రీహరి, అమరా రమాదేవి, పోపూరి లక్ష్మి, అచ్చుకోల భాస్కర్ రావు, తొండపి వెంకయ్య,అరె మల్లికార్జున్ రావు, నామ్ పల్లి రమేష్, కుప్పాల శ్రీనివాస రావు,సీతారామిరెడ్డి, మారెళ్ళ అప్పారావు, మండవ వెంకట్రావు, యలమందల పోతురాజు, గుమ్మా ప్రసాద్, తిరుపతయ్య, షేక్ బాజీ, షేక్ రఫీ( మాజీ 14va ప్రెసిడెంట్ వార్డు), షేక్ భారీ సైదా, తన్నీరు పుల్లారావు, ఏలూరి నాగేశ్వర రావు, S.M.ఉమర్, పూర్ణసింగ్, A.మాదవ, నరవర్యబాలాజీ సింగ్, తాళ్లూరి భార్గవ్, షేక్  రఫీ, వేల్పూరి రమేష్, అమరా మణి, కొండా శ్రీను తదితరులు ఉన్నారు.

Share:

చిలకలూరిపేట - అంబులెన్సులో ప్రసవం - ఆడపిల్ల జననం..

చిలకలూరిపేట - అంబులెన్సులో ప్రసవం - ఆడపిల్ల  జననం.. 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట  నియోజకవర్గ పరిధి లోని నాదెండ్ల మండలం గురజవోలు గ్రామంలోని రాగివరపు సుప్రియ (20) ప్రసవ నొప్పులతో బాధపడుతూ యడ్లపాడు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. వెంటనే యడ్లపాడు 108 అంబులెన్సు సంఘటన స్థలానికి చేరుకొని సుప్రియ అనే మహిళలను పరీక్షించి నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో సాతులూరు సమీపములో ఉదయము ఆరు గంటల సమయంలో సుప్రియ ప్రసవించడం జరిగింది.. ఆడపిల్లకు జన్మనిచ్చింది.  సుప్రియ కు ఇది రెండో కాన్పు,వీరిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అంబులెన్స్ లో నే సుఖప్రసవం చేసినందుకు EMT: J.దుర్గారావు పైలెట్ జి రాము లకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.  విషయము తెలుసుకున్న ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్ బి కోటేశ్వరరావు, జిల్లా మేనేజర్ సత్యనారాయణ  యడ్లపాడు 108సిబ్బంది EMT:J.దుర్గా రావు, పైలెట్ జి. రాములను అభినందించడం జరిగింది.  




Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.