మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట: యువకుడు అనుమానాస్పద మృతి

చిలకలూరిపేట: యువకుడు అనుమానాస్పద మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామం లో నివాసం ఉంటున్న ఒరిస్సాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఒరిస్సా రాష్ట్రం భద్రం గ్రామానికి చెందిన రమేష్ మాలిక్ సర్వేశ్వర్ మాలిక్ లు గ్రామంలోని ఒక కంపెనీలో పని పనిచేస్తూ గణపవరం గ్రామంలోని సినిమా హాల్ సెంటర్ నందు అద్దెకు ఉంటున్నారు. అయితే రమేష్ మాలిక్ కు శనివారం ఉదయం చాతి నొప్పి రావడంతో సర్వేశ్వర మాలిక్ దగ్గర్లో ఉన్న మెడికల్ షాప్ నందు గ్యాస్ టాబ్లెట్ తీసుకొని వచ్చి రమేష్ హాలిక్ కు ఇచ్చాడు. ఆ టాబ్లెట్ వేసుకున్న రమేష్ మాలిక్ ఉన్నట్టుండి ఒక్కసారిగా మృతిచెందాడు. విషయం గమనించిన సదరు సర్వేశ్వర్ మాలిక్ మృతదేహాన్ని బయటకు తీసుకు వస్తూ పారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇది గమనించిన రమేష్ మాలిక్ బంధువైన ప్రమోద్ మాలిక్ గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసు వారు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం వచ్చిన నివేదిక ఆధారం ప్రకారం రమేష్ మాలిక్ను పథకం ప్రకారం చంపబడ్డాడ లేదా నిజంగానే అనారోగ్యంతో మృతి చెందాడా అనే విషయం తెలియాల్సి ఉంది.



Share:

రోశయ్య ఎలా చనిపోయారంటే ? ఎక్కడ చనిపోయారంటే ?

రోశయ్య ఎలా చనిపోయారంటే ? ఎక్కడ చనిపోయారంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య ఈరోజు ఉదయం చనిపోయిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ఆయన గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అనుకున్నారు. అయితే హైదరాబాదు అమీర్పేట లోని తన సొంత గ్రామంలో ఉంటున్నారు. ప్రతిరోజు ఇంటి బయట ఉన్న వరండాలో కూర్చొని పేపర్ తిరగేయటం, శ్రేయోభిలాషులతో కలిసి వారితో ముచ్చటించడం అలవాటు. అదేవిధంగా ఈరోజు ఉదయం అలాగే వరండాలో కూర్చొని పేపర్ తిరగేస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు రోశయ్య ని చూసి అవాక్కయ్యారు. ఆయన నోటి నుండి రక్తస్రావం అవ్వటంతో పాటుగా అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన వారు హుటాహుటిన బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పటల్ కు తరలించారు. హాస్పటల్ లోని డాక్టర్లు చెప్పిన సమాచారం మేరకు ఆయన హాస్పిటల్ కి వచ్చే మార్గమధ్యంలోనే మరణించారని వారు తెలిపారు. ఆయన మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ని వివిధ పార్టీ నాయకులు తో పాటు తమిళనాడు , కర్ణాటకలోని ప్రభుత్వాలు కూడా ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.



Share:

ఏపీ: కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం పై అభ్యంతరాలు

ఏపీ: కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం పై అభ్యంతరాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సొంత పేర్లను పెట్టుకోవటం పై ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రఘురామకృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏపీ లోని జగన్మోహన్ రెడ్డి తమ సొంత పథకంగా పేర్లు పెట్టుకోవడం పై కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్మృతి ఇరానీ స్పందించారు.

జగనన్న గోరుముద్ద, జగనన్న పాల వెల్లువ, వైయస్సార్ సంపూర్ణ పోషణ అనే పలు పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవటం పై ఆమె స్పందిస్తూ ... కేంద్ర ప్రభుత్వాల పథకాలపై రాష్ట్ర ప్రభుత్వాల సొంత పేర్లను & నచ్చిన పేర్లను పెట్టుకోవడం కుదరదని అలాగే MP రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుకు సమాధానం చెప్పాలని ఆమె కోరారు. అలాగే దీనిపైన నివేదిక కోరింది.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.