మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ - మూడు రోజులపాటు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, షాపులు స్వచ్ఛందంగా బంద్

కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ  - మూడు రోజులపాటు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, షాపులు స్వచ్ఛందంగా బంద్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

నాటి కన్నడ సినిమా ఇండస్ట్రీని, రాజకీయాలను కనుసైగలతో శాసించిన కంఠీరవ రాజ్ కుమార్ మూడవ కుమారుడు కన్నడ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్‌కుమార్ అకస్మాత్తుగా నిన్న మరణించడంతో యావత్ కర్ణాటక రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. సాధారణంగా ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులు చాలా యాటిట్యూడ్, రిచ్నెస్ మెయిటింగ్ చేస్తూ ఉంటారు. అయితే అది ఏమీ తనకు వంట పట్టించుకోకుండా చాలా సింపుల్ గా జీవితం సాగిస్తూ కన్నడ మరియు దక్షిణ భారతదేశం ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే తన మరణ వార్త విన్న భారతదేశం చిత్ర పరిశ్రమ అతనితో ఉన్నా అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అలాగే తమిళం, తెలుగు లో ఉన్న స్టార్ హీరోలతో మంచి సంబంధాలను ఏర్పరుచుకున్నారు. అయితే ఈరోజు నందమూరి బాలకృష్ణ పునీత్ పార్థివ దేహాన్ని చూడటానికి బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు. అయితే అక్కడ విగతజీవిగా ఉన్న పునీత్ ను చూసి ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. సాయంత్రానికి తెలుగు పరిశ్రమ నుండి ఎన్టీఆర్, చిరంజీవి,రాణా లాంటి ప్రముఖులు పునీత్ అంతిమయాత్ర లో పాల్గొననున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, మోహన్ బాబు మరియు చాలామంది ఇది సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల సంఘీభావం తెలిపారు.

ఆయన మృతి పట్ల కన్నడ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బెంగళూరు వ్యాప్తంగా వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ మూడు రోజుల పాటు బంద్ ప్రకటించారు. పునీత్ కుమార్తె అమెరికాలో చదువుతున్న కారణంగా ఆమె ఈరోజు సాయంత్రానికి బెంగళూరు చేరుకొన్నది. నిన్నటి సాయంత్రం నుండి కంఠీరవ స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసి పోయింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సినీ ప్రముఖులు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రముఖులు పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.







Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.