మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

 చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం  పట్టివేత 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో అక్రమంగా  రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. వివరాలలోకి వెళ్తే బుధవారం పట్టణంలోని శాంతినగర్ లో ఓ మిని లారీ లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు అనే సమాచారం తెలుసుకున్న పోలీసులు . హుటాహుటిన అక్కడికి చేసుకొని వాహనాన్ని అర్బన్ పోలీసుస్టేషన్ కి తరలించారు. ఆయా వాహనంలో సుమారు 150 క్వింటా బియ్యం ఉన్నట్లు సమాచారం. 

Share:

ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు లేదా నేరుగా కలవొచ్చు --- MLA రజని

 ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు లేదా నేరుగా కలవొచ్చు --- MLA రజని 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మున్సిపల్ తొలి సమావేశంలో చాలా సమస్యలపైనా చర్చించారు. అలాగే రోడ్లు , నీటి సమస్యల పైనా చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి అధ్యక్షలుగా రఫాని గారు, ఎక్స్ అఫీషియా సభ్యురాలి హోదా లో MLA రజని గారు పాల్గొన్నారు. రఫాని గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కౌన్సిలర్ తమ వార్డు పైన పూర్తి అవగాహనా కలిగి ఉండాలి అని, వార్డు లో ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తెలుసుకురావాలి అని, పార్టీలకు అతీతంగా కలసి చిలకలూరిపేట పట్టణాన్ని అభివృద్ధి పధంలో తెలుసుకు వెళ్లాలి అని అన్నారు. ఇప్పటికే మానుకొండవారిపాలెం కి 75 లక్షలు , పసుమర్రు కి 2 కోట్లు, గణపవరంకి 5 కోట్లు తో పరిశుద్ధ,త్రాగునీరు సమస్యల పరిష్కారానికి అంచనా వేసి ప్రభుత్వానికి పంపటం జరిగింది అని చెప్పారు. పార్టీ ఏది అయినా ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉండాలి అని, చౌకబారు మాటలతో దిగజారుడు తనగా ఉండకూడదు అని, ప్రజలలో మంచి పేరు తెచ్చుకొని ముందుకు సాగాలి అని  అన్నారు. 

MLA రజని మాట్లాడుతూ వార్డు సమస్యలు ఏవైనా చైర్మెన్ గారికి లేదు అంటే తన దృష్టికి తెలుసుకురావాలి అని,  ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు అని, ప్రజలు తమ సమస్యలని తీరుస్తారు అని మిమ్మల్ని ఎన్నుకున్నారు అని, ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి అని, పాత బకాయిగా ఉన్న 82 కోట్ల రూపాయలని సిఎం జగన్ గారితో మాట్లాడటం జరిగింది అని ఆ భారం మన మున్సిపాల్టీ పైన పడకుండా తగు చర్యలు తీసుకుంటాం అని, కౌన్సిలర్లలో చాలా వరకు కొత్త వారు కనుక ఒక రోజు సభ్యుల హక్కులు, విధులు, సమస్యలని ఎలా ప్రస్తావించాలి, అనే అంశాల పైనా శిక్షణ ఇస్తారు అన్నారు. 

అలాగే సభ్యులు తమ తమ  వార్డులలో సమస్యలను చైర్మెన్ దృష్టికి తీసుకువచ్చారు.     

Share:

చిలకలూరిపేట 52 ఎకరాలలో 6500 ఇల్లు శిధిలం చేసిన అసమర్ధ నాయకురాలివి -- టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలలో టీడీపీ నాయకులు

 చిలకలూరిపేట 52 ఎకరాలలో  6500 ఇల్లు శిధిలం చేసిన అసమర్ధ నాయకురాలివి -- టీడీపీ 40వ  ఆవిర్భావ వేడుకలలో టీడీపీ నాయకులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులూ , అభిమానుల మధ్య టీడీపీ పట్టాన అధ్యక్షులు పఠాన్ సమ్మద్ ఖాన్ పార్టీ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులూ మాట్లాడుతూ 4000 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక్క మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుగారికి మాత్రమే సాధ్యం అన్నారు. అలాగే 52 ఎకరాలలో ఎర్పాటు చేసిన 6500 ఇళ్ల నిర్మాణం 90%  పూర్తి అయినా మిగిలిన 10 % నిర్మాణాలని పూర్తిచేయకుండా శిధిలా లుగా మిగిల్చిన ఘనత ఒక్క రజనికి మాత్రమే సాధ్యం అని అన్నారు . అలాగే పట్టణంలో త్రాగు నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ఎన్టీఆర్ సృజల పధకం ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసారు సదరు ప్లాంట్ సామాగ్రిని తూకం వెయ్యటానికి కూడా పనికిరాకుండా చేసారు అని అన్నారు. ప్రత్తిపాటి హయాం లో వచ్చిన కేంద్రీయ విశ్వ విద్యాలయం, గురుకుల పాఠశాల, మైనారిటీ విద్యార్థుల వసతి నివాసం, ఎస్సి సాంఘిక సంక్షేమ విద్యాలయం, పురపాలక సంఘం అనుమతు పొందిన రోడ్ల్ , డ్రైనేజీలు రాబోవు మూడు సంవత్సరాలలో పూర్తిచేసి MLA గా మీ కనీస ధర్మం పాటించాలి అని అన్నారు. ప్రత్తిపాటి ని విమర్శిస్తే మీ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది అని అనుకుంటే అది మీ భ్రమే అని, ఇక MLA  భర్త కుమారస్వామి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య  ఆధిపత్య పోరు తట్టుకోలేక ఏమి మాట్లాడుతున్నాడో తనకే అర్ధం కావటం లేదు అని, మైనారిటీ వర్గానికి పురపాలక మున్సిపల్ ఛైర్మెన్ సీటు MLA రజని ఇవ్వలేదు అని , కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇవ్వవలసి వచ్చింది అని, 30 సీట్ల మెజారిటీ ఇచ్చిన పురప్రజలకి న్యాయం చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యూత్ నాయకులూ, సీనియర్ నాయకులూ, అభిమానులు పాల్గొని ర్యాలీ గా నర్సరావుపేట సెంటర్ నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసారు. 

Share:

మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో MLA రజనిని , చైర్పర్సన్ రఫ్ఫాని ని సత్కరించిన TDP కౌన్సిలర్లు

మున్సిపల్ కౌన్సిల్  సమావేశంలో MLA రజనిని , చైర్పర్సన్ రఫ్ఫాని ని సత్కరించిన TDP కౌన్సిలర్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఈ రోజు నిర్వహించిన తొలి మున్సిపల్ సమావేశంలో టీడీపీ తరుపున గెలుపొందిన 8 వార్డుల కౌన్సలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ చైర్మెన్ షేక్ రఫాని గారిని మరియు MLA రజని గారిని సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఎన్నిక అయినా టీడీపీ,వైస్సార్సీపీ కౌన్సిలర్లకు అభినందనలు తెలియచేసారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

Share:

చిలకలూరిపేటలో నేడు తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - పట్టణంలోని పలు అభివృద్ధి , మరమత్తుల కార్యక్రమాలకి కాంట్రాక్టు టెండర్లు పైన చర్చలు

చిలకలూరిపేటలో నేడు  తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - పట్టణంలోని పలు అభివృద్ధి , మరమత్తుల  కార్యక్రమాలకి కాంట్రాక్టు టెండర్లు పైన చర్చలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు అంశాల పైనా చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా పట్టణంలో మంచినీటి పైపుల లీకేజీలు , రోడ్ల మరమ్మతులు, పట్టణాన్ని పరిశుబ్రముగా ఉంచటం, పొట్టి శ్రీరాముల,YS రాజశేఖర్ రెడ్డి  విగ్రహం ఏర్పాట్లు,  మంచినీళ్ల పైపు లైన్ లేని వార్డులకు ఆయా పైపు లైన్ ఏర్పాటు. పలు అభివృద్ధి కార్యకర్మల పైనా చర్చలు. కాంట్రాక్టు టెండర్ల పైన చర్చలు జరిగే అవకాశం ఉంది  

Share:

చిలకలూరిపేట మండలంలోని దండమూడిలో -- పేకాట రాయుళ్లు

చిలకలూరిపేట మండలంలోని దండమూడిలో -- పేకాట రాయుళ్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలో రూరల్ SI భాస్కర్ గారి  ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో దండమూడి గ్రామంలో పేకాట స్థావరాల పైనా దాడులు నిర్వహించారు. గ్రామ శివారు పొలాలలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 34 వేల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా SI భాస్కర్ మాట్లాడుతూ రూరల్ పరిధిలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పైన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు అని అన్నారు. 

Share:

చిలకలూరిపేట లో మంగళవారం సాయంత్రం భాస్కర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రయిలర్ - భారీగా పాల్గొన్న జనసైనికులు, మెగా అభిమానులు

చిలకలూరిపేట లో మంగళవారం సాయంత్రం భాస్కర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రయిలర్ - భారీగా పాల్గొన్న జనసైనికులు, మెగా అభిమానులు

https://chilakaluripetspeednews.blogspot.com/

పవన్  కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రయిలర్ నిన్న మంగళవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని థియేటర్స్ లో రిలీజ్ అయింది. అందులో భాగంగా మన చిలకలూరిపేట లోని భాస్కర్ సినిమాస్ లో రిలీజ్ అయింద. పెద్ద ఎత్తున మెగా అభిమానులు,  జన సైనికులు పాల్గొని కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. అలాగే జన సేన పార్టీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గడియారస్థంభం సెంటర్లో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేసారు. 

చిలకలూరిపేట లో మంగళవారం సాయంత్రం భాస్కర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రయిలర్ - భారీగా పాల్గొన్న జనసైనికులు, మెగా అభిమానులు

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.