మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట :- కార్తీక మాసం విశిష్టత... పాటించాల్సిన నియమాలు..!!

చిలకలూరిపేట :- కార్తీక మాసం విశిష్టత... పాటించాల్సిన నియమాలు..!!

తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని 'ధర్మసింధువు' గ్రంథం తెలుపుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి.

శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

హరిహరాదులకు ప్రీతికరం... కార్తీక మాసం

మన భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే! అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ''ఆశుతోషుడు'' అనే బిరుదు వచ్చింది.

ఉపవాసం,స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి.విష్ణువును తులసి దళాలు, మల్లె ,కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి. శక్తిలేని వారు ఉదయం స్నానం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పళ్ళు తీసుకోవచ్చు.నారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీ మాసంలో చేసుకునే వ్రతాలు.

ఇవి చేస్తే మంచిది:

ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలా ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ,సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారంరోజైనా నియమనిష్టల తో ఉపవాసం ఉండి,గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభిం చే పుణ్యఫలాన్ని వర్ణిం చడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహారణలను బట్టి తెలుసుకోవచ్చు.

ఇవి చేయరాదు:

తామనం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం జోలికి పోరాదు.ఎవ్వరికీ ద్రోహం చేయరాదు.పాపపు ఆలోచనలు చేయకూడదు.దైవ దూషణ తగదు.దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు.కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.

కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన గతజన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌబాగ్యాలు సిద్దిస్తున్నాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం.





Share:

చిలకలూరిపేట బాణసంచా కొనుగోలుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నా తండ్రీ కొడుకులకు యాక్సిడెంట్

చిలకలూరిపేట బాణసంచా కొనుగోలుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నా తండ్రీ కొడుకులకు యాక్సిడెంట్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి నుండి చిలకలూరిపేట వచ్చే దారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని తండ్రీ కొడుకులకు గాయాలు.

వివరాల్లోకి వెళ్తే చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి చెందిన కరిముల్లా అతని కొడుకు ఖదీర్ దీపావళి సందర్భంగా టపాసులు కొనుగోలుకై చిలకలూరిపేట కు బయల్దేరారు. మార్గమధ్యలో చిలకలూరిపేట నుండి వస్తున్నా ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే కిందపడిపోయారు. ఢీకొన్న ద్విచక్ర వాహనం ఆపకుండా బొప్పూడి వైపు వెళ్లిపోయారు. వెనక వచ్చే వాహనదారుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను పరిశీలించారు. తండ్రి కరీముల్లా కు ఎడమ కాలు కి స్వల్ప గాయం, కుమారుడు ఖదీర్ కు తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం అయింది. వెంటనే అంబులెన్స్ సిబ్బంది చిలకలూరిపేట ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

Share:

ఆ రాష్ట్రాలలో పెట్రోల్ పై 12 రూ" డీజిల్ పై 17 రూ'' తగ్గిన ధరలు - మరి మన రాష్ట్రంలో ! ?

ఆ రాష్ట్రాలలో పెట్రోల్ పై 12 రూ" డీజిల్ పై 17 రూ'' తగ్గిన ధరలు - మరి మన రాష్ట్రంలో ! ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


దీపావళి బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ భారత ప్రభుత్వం పెట్రోల్ పై 5 డీజిల్ పై 10 రూపాయల వ్యాట్ తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం దారిలోనే మరికొన్ని రాష్ట్రాలు రాష్ట్ర వ్యాట్ తగ్గించారు. కర్ణాటక, గోవా, మణిపూర్, యానం, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాష్ట్రాలలో 7 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాయి దీంతో ఆ రాష్ట్రాల్లో పెట్రోల్ పై 12 రూపాయలు డీజిల్ పై 17 రూపాయల భారం తగ్గింది.

ఇదిలా ఉంటే ఆంధ్ర & తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ పన్ను తగ్గిస్తాయి ఏమో అని వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రాలో జగన్ సర్కార్ పెట్రోల్ పై 31 రూపాయలు, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పెట్రోల్ పై 26 రూపాయల vat వసూలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని సర్కార్ లు ఇంధన ధరల పై వ్యాట్ తగ్గిస్తే వాహనదారులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.



Share:

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

దీపావళి అంటేనే బాణాసంచా, దీపాల అలంకరణ, పూజా కార్యక్రమాలు లాంటివి ఉంటాయి. అందులో ముఖ్యంగా టపాసు లేకుండా దీపావళి జరుపుకోవాలంటే అది పండుగలాగే ఉండదు. అయితే గత సంవత్సరం కోవిడ్ కారణంగా దీపావళి బాణాసంచా విక్రయాలు కొంతమేర తగ్గాయి. అయితే ఈ సంవత్సరం ఎటువంటి లాక్ డౌన్ లేకపోవడంతో బాణాసంచా కాల్చటానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం నిప్పు లేకుండానే టపాసులు పేలుతున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా మీరు విన్నది నిజమే నిప్పు లేకుండా టపాసులు ఎలా పేలుతుంది అనుకుంటున్నారా !

టపాసులు కొనడానికి వెళ్లిన వినియోగదారులు ఈ మాటే అంటున్నారు. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం బాణసంచా డబల్ రేట్ ఉండటంతో సామాన్యులు టపాసులు కొనుగోలు చేయాలంటే ఆలోచిస్తున్నారు. ఒక సామాన్యుడు దీపావళి పండుగ రోజు సాయంత్రం సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని సాయంత్రం 7 సమయంలో కుటుంబంతో పాటు బాణాసంచా కాల్చుకోవాలని ప్రణాళిక వేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం బాణాసంచా రేట్లు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు 1000 & 1500 రూపాయలకు మనకు కావాల్సిన చిచ్చుబుడ్లు క్రాకర్స్ ఇతర టపాసులు లాంటివి తెచ్చుకొని మూడు రోజులపాటు సాయంత్రం సమయాల్లో వాటిని కాలుస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం తక్కువలో తక్కువ గా 4000 నుండి 5000 రూపాయల వరకు వెచ్చించవలసిన వస్తుంది. అమ్మకందారులు ట్రాన్స్పోర్టేషన్, పెరిగిన ఇంధన ధరలు వలన ఈ రేట్లు తప్పవని చెబుతున్నారు. ఏది ఏమైనా టపాసు లేని దీపావళి ఊహించుకోలేము కదా! 




Share:

చిలకలూరిపేట: నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ ముఖ్య నాయకులు & పోలీస్ శాఖ

చిలకలూరిపేట: నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ ముఖ్య నాయకులు & పోలీస్ శాఖ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

*MLA విడదల రజిని :- 

దీపావళి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజిని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని, ఈ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ఆకాంక్షించారు.

మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు :-

చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, దీపావళి తెలుగు లోగిళ్లలో ఆనందమయ కాంతులు వెదజల్లాలని ఆకాంక్షించారు. కార్తీక దీపకాంతులకు నాందిపలికే దీపావళిని సంబరంగా స్వాగతించాలి. తెలుగువారందరికీ సర్వ శుభాలు, శాంతి, సౌభాగ్యాలు భగవంతుడు ప్రసాదించాలన్నారు. మనిషిలో రాక్షసత్వం పోవాలని, మానవత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించేటప్పుడు, టపాసులు కాల్చేటప్పుడు శానిటైజర్ వాడకుండా జాగ్రత్త తీసుకోవాలని, టపాసులు కాల్చిన తర్వాత చేతులు కడుక్కోవటానికి సబ్బును ఉపయోగించoడి. సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా ఇంకా ఉనికిలో ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్:-

నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రతి కుటుంబాలలో వెలుగు నింపాలని ఆయన కోరారు.

టౌన్ సిఐ రాజేశ్వరరావు:- 

పట్టణ ప్రజలందరికీ చిలకలూరిపేట టౌన్ పోలీస్ శాఖ దీపావళి శుభాకాంక్షలు. ప్రజలందరూ దీపావళి టపాసులు కాల్చేటప్పుడు శానిటైజర్ వాడకుండా, చిన్నపిల్లల దూరంగా ఉంచుతూ సంబరాలు చేసుకోవాలి. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలి.




Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.