మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

దీపావళి అంటేనే బాణాసంచా, దీపాల అలంకరణ, పూజా కార్యక్రమాలు లాంటివి ఉంటాయి. అందులో ముఖ్యంగా టపాసు లేకుండా దీపావళి జరుపుకోవాలంటే అది పండుగలాగే ఉండదు. అయితే గత సంవత్సరం కోవిడ్ కారణంగా దీపావళి బాణాసంచా విక్రయాలు కొంతమేర తగ్గాయి. అయితే ఈ సంవత్సరం ఎటువంటి లాక్ డౌన్ లేకపోవడంతో బాణాసంచా కాల్చటానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం నిప్పు లేకుండానే టపాసులు పేలుతున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా మీరు విన్నది నిజమే నిప్పు లేకుండా టపాసులు ఎలా పేలుతుంది అనుకుంటున్నారా !

టపాసులు కొనడానికి వెళ్లిన వినియోగదారులు ఈ మాటే అంటున్నారు. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం బాణసంచా డబల్ రేట్ ఉండటంతో సామాన్యులు టపాసులు కొనుగోలు చేయాలంటే ఆలోచిస్తున్నారు. ఒక సామాన్యుడు దీపావళి పండుగ రోజు సాయంత్రం సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని సాయంత్రం 7 సమయంలో కుటుంబంతో పాటు బాణాసంచా కాల్చుకోవాలని ప్రణాళిక వేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం బాణాసంచా రేట్లు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు 1000 & 1500 రూపాయలకు మనకు కావాల్సిన చిచ్చుబుడ్లు క్రాకర్స్ ఇతర టపాసులు లాంటివి తెచ్చుకొని మూడు రోజులపాటు సాయంత్రం సమయాల్లో వాటిని కాలుస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం తక్కువలో తక్కువ గా 4000 నుండి 5000 రూపాయల వరకు వెచ్చించవలసిన వస్తుంది. అమ్మకందారులు ట్రాన్స్పోర్టేషన్, పెరిగిన ఇంధన ధరలు వలన ఈ రేట్లు తప్పవని చెబుతున్నారు. ఏది ఏమైనా టపాసు లేని దీపావళి ఊహించుకోలేము కదా! 




Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.