మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట: నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ ముఖ్య నాయకులు & పోలీస్ శాఖ

చిలకలూరిపేట: నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ ముఖ్య నాయకులు & పోలీస్ శాఖ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

*MLA విడదల రజిని :- 

దీపావళి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజిని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని, ఈ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ఆకాంక్షించారు.

మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు :-

చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, దీపావళి తెలుగు లోగిళ్లలో ఆనందమయ కాంతులు వెదజల్లాలని ఆకాంక్షించారు. కార్తీక దీపకాంతులకు నాందిపలికే దీపావళిని సంబరంగా స్వాగతించాలి. తెలుగువారందరికీ సర్వ శుభాలు, శాంతి, సౌభాగ్యాలు భగవంతుడు ప్రసాదించాలన్నారు. మనిషిలో రాక్షసత్వం పోవాలని, మానవత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించేటప్పుడు, టపాసులు కాల్చేటప్పుడు శానిటైజర్ వాడకుండా జాగ్రత్త తీసుకోవాలని, టపాసులు కాల్చిన తర్వాత చేతులు కడుక్కోవటానికి సబ్బును ఉపయోగించoడి. సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా ఇంకా ఉనికిలో ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్:-

నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రతి కుటుంబాలలో వెలుగు నింపాలని ఆయన కోరారు.

టౌన్ సిఐ రాజేశ్వరరావు:- 

పట్టణ ప్రజలందరికీ చిలకలూరిపేట టౌన్ పోలీస్ శాఖ దీపావళి శుభాకాంక్షలు. ప్రజలందరూ దీపావళి టపాసులు కాల్చేటప్పుడు శానిటైజర్ వాడకుండా, చిన్నపిల్లల దూరంగా ఉంచుతూ సంబరాలు చేసుకోవాలి. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలి.




Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.