మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - విజయబ్యాంక్ సమీపంలో మరొక రోడ్డు ప్రమాదం - బైకుని ఢీ కొట్టిన కార్

చిలకలూరిపేట - విజయబ్యాంక్ సమీపంలో మరొక రోడ్డు ప్రమాదం - బైకుని ఢీ కొట్టిన కార్


చిలకలూరిపేట విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన కారు ఈరోజు అనగా శనివారం ఉదయం అంబులెన్స్ ఆటో యాక్సిడెంట్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే - సాయంత్రం 9 గంటల సమయంలో పట్టణంలో సుభాని నగర్కు చెందిన ఖాజావలి అనే వ్యక్తి విజయ బ్యాంక్ సెంటర్ నుండి పండరీపురం వైపు వెళ్లే సమయంలో చెన్నై నుండి గుంటూరు వైపుకు వెళుతున్న కారు ఢీకొన్నది. ఈ సమయంలో ఖాజావలి గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సదరు కారు సంబంధించిన వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒకే రోజు విజయ బ్యాంక్ సెంటర్లో రెండు ఘటనలు జరగటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.



Share:

చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త

చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను పొలంలో చంపిన ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గూడవల్లి కిరణ్ అనే వ్యక్తి అప్పాపురం గ్రామానికి చెందిన బుజ్జి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే గత 12 సంవత్సరాలుగా వీరు అప్పాపురం లోనే ఉంటూ వ్యవసాయం మీద జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి నుండో కిరణ్కు భార్య పైన వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానం ఉండేది. అనుమానం రోజురోజుకు పెరిగి శనివారం ఉదయం భార్యతో పాటు పొలానికి మందు చల్లడానికి వెళ్లారు. 11 గంటల సమయంలో కిరణ్ బంధువులకు ఫోన్చేసి ఉన్నట్టుండి తన భార్యకు ముక్కులో నుండి రక్తస్రావంతో పడిపోయిందని తెలిపాడు. అక్కడికి చేరుకున్న బంధువులు ఆమె తలపై ఉన్న గాయంతో పాటుగా మేడపైన ఉన్న గొర్ల గుర్తుల ఆధారంగా ఆమెను హత్య చేసి ఉంటారని భావించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిశీలించగా విచారణలో కిరణ్ తన భార్యను హత్య చేశాడని పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేసుకున్నారు.





Share:

ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??

ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవని విలేకర్ల సమావేశంలో తెలిపారు. అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆదివారం నుండి 4 గంటలు కరెంటు కోతలు ఉంటాయి అనే వార్త చెక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు ఈ వార్తపై స్పందిస్తూ కరెంటు కోతలు వాస్తవమే కానీ రోజుకి 4 గంటల కరెంటు కోత ఉంటుందని, అది కూడా ఆదివారం నుండి అమలులోకి వస్తుంది అనే వార్త అవాస్తవమని తెలిపారు. ప్రజలెవరూ ఇలాంటి వార్తలను నమ్మవద్దని వారు తెలిపారు. ప్రస్తుతానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏమీ ఉండదని. సీఎం జగన్ ప్రజలెవరూ ఇబ్బందులకు గురి అవకుండా చూడాలని చెప్పినట్లు వారు తెలిపారు. గ్రామాలలో సాయంత్రం 6 నుండి 10 వరకు పట్టణాలలో రాత్రి 9 నుండి 12 వరకు నగరాలలో రాత్రి 11 నుండి మూడు గంటల వరకు కరెంటు కోతలు ఉంటాయని అవాస్తవమైన వార్త చెక్కర్లు కొడుతుంది.దయచేసి ఎవరు నమ్మవద్దు అని వారు తెలిపారు.







Share:

చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్

 చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్

చిలకలూరిపేట పట్టణంలోని విజయ బ్యాంక్ ముందు ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోని అంబులెన్స్ ఢీకొన్నది. వివరాల్లోకి వెళ్తే కలకత్తా నుండి చెన్నై వెళ్తున్న అంబులెన్స్ విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోను ఢీ కొట్టినది. ఆ సమయంలో ఆటో ఉన్న డ్రైవర్ షేక్ ఇస్మాయిల్ కు గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఇస్మాయిల్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో జాతీయ రహదారి మొత్తం ట్రాఫిక్తో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న సీఐ రాజేశ్వరరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.