మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు - బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్

జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు -  బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం మొత్తం 10,143 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండరు పేరుతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ చూసిన నిరుద్యోగుల యువత తీవ్ర అసహనానికి గురి అయ్యారు. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ ను నిరసిస్తూ బీజేపీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సురేంద్రమోహన్ గారి ఆదేశాలతో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ నందు నిరసన దీక్ష చేపట్టారు. తక్షణమే ఈ జాబ్ క్యాలెండరు రద్దు చేస్తూ త్వరలో నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా ఖాళీగా ఉన్న 2,40,000 ఉద్యోగాల భర్తీ చేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండరు రిలీజ్ చెయ్యాలి అని నరసరావుపేట ఆర్టీఓ ఆఫీస్ నందు ఆర్టీఓ గారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్, జిల్లా నాయకులు నెమలికంటి బ్రహ్మం, వంశీ ,మురళి,నరేష్,జిల్లా ఉపాధ్యక్షుడు కాళ్ళ కోటేశ్వరావు, కామినేని హనుమంతురావు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/






























Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 25-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 25-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 12 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి. 

సుధావరిపాలెం లో - 1

సుభాని నగర్ లో - 1

పురుషోత్తమపట్నం లో - 1

సాంబశివ నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 8 కేసులు నమోదు అయ్యాయి. 

గోవిందపురం గ్రామంలో - 1

పసుమర్రు గ్రామంలో - 1

కమ్మవారిపాలెం గ్రామంలో - 2

మురికిపూడి గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 





















































Share:

మరో కంపెనీ గోవిందా ! - ఏపీ నుండి తరలిపోనున్న15 వేల కోట్ల రిలయన్స్ ప్రాజెక్టు

మరో కంపెనీ గోవిందా ! - ఏపీ నుండి తరలిపోనున్న15 వేల కోట్ల రిలయన్స్ ప్రాజెక్టు 

https://chilakaluripetspeednews.blogspot.com/

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో అభివృద్ధి కుంటుపడింది. కొత్తగా విడిపోయిన తరువాత చాలా పరిశ్రమలు ఏపీకి వచ్చాయి. కానీ 2019 ఎన్నికల అనంతరం పరిస్థితి అంతా మారిపోయింది. గత ప్రభుత్వం సంబంధించిన టెండర్లలో అవకతవకలు ఉన్నాయి అని భావించి, సీఎం జగన్ మోహన రెడ్డి రివర్స్ ట్రేండింగ్ మొదలుకొని రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావాలి అంటే భయం ఏర్పడే పరిస్థితి నెలకొన్నది. ఏపీ కన్నా తెలంగాణ, తమిళనాడు లో ప్రశాంతంగా ఉంటుందనో ఏమో మ్యానుఫ్యార్చిరింగ్ యూనిట్లు, ఐటీ హబ్బులు వెళ్లిపోయాయి. ఇపుడు పరిశ్రమలు స్టార్ట్ చేస్తే మళ్లీ ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని పెద్ద పెద్ద కంపినీలు వేరే రాష్ట్రాలకి తరలిపోయాయి. 
తాజాగా రిలయన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చెయ్యాలి అనుకున్న 15వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ - సెట్టాప్ బాక్ససులు, ఢాంగిల్స్ మ్యానుఫ్యార్చిరింగ్ యూనిట్లకు బ్రేకులు వేసింది ఆ సంస్థ, కారణం ఏంటి అంటే గత ప్రభుత్వంలో 136 ఎకరాలను కేటాయించారు, దానిని ఈ ప్రభుత్వంలో 75ఎకరాలకు కి తగ్గించారు. ఆ 75 ఎకరాల భూమి ఉన్న రైతులు కేసు వెయ్యటంతో ఇక్కడ మనకి పని అవ్వదు అని అనుకున్నారో ఏమో రిలియన్స్ సంస్థ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకునట్లు తెలుస్తుంది. 




























 



















































Share:

ఏపీలో మొట్టమొదటి డెల్టా ప్లస్ కరోనా కేసు నమోదు

ఏపీలో మొట్టమొదటి డెల్టా ప్లస్ కరోనా కేసు నమోదు 

https://chilakaluripetspeednews.blogspot.com/

అసలే కరొనతో అతలాకుతలం అయిన మన దేశంలో కొత్త వేరియంట్లు విజృభిస్తునాయి.కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ తో థర్డ్ వేవ్ మొదలవుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తొలిసారిగా ఏపీలో కొత్త డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ తిరుపతిలో మొట్టమొదటి కేసు నమోదు అయ్యింది అని తెలిపారు. అయితే అతను కోలుకున్నారు అని, అతని వల్ల ఈ వేరియంట్ ఎవ్వరికి సోకలేదు అని తేల్చారు. రోజుకో ఫంగస్ పుట్టుకు వస్తుంది అని, ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకొని థర్డ్ వేవ్ కి సిద్ధంగా ఉండాలి అని అయన కోరారు. 



































Share:

గుంటూరు జిల్లా - యుద్ధనికి అంతా సిద్ధం - కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదురుకుంటాం - డియంహెచ్ఓ

గుంటూరు జిల్లా - యుద్ధనికి అంతా సిద్ధం - కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదురుకుంటాం - డియంహెచ్ఓ 

https://chilakaluripetspeednews.blogspot.com/


కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రంగం అంతా సిద్ధంగా ఉన్నారు అని డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజషన్ అధికారి యాస్మిన్ తెలిపారు. థర్డ్ వేవ్ వస్తుంది అని ఎవరు భయపడవద్దు. ఈ లోపు చాల వరకు వ్యాక్సిన్ పూర్తి చేసేస్తాం. చాలా వరకు కంట్రోల్ అవుతుంది.వ్యాక్సిన్ తీసుకోవటం వలన కరోనా నుండి సేఫ్ గా బయటపడవచ్చు. థర్డ్ వేవ్ కు 186 ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి. అందులో 35 ఆసుపత్రులు చిన్నపిల్లల కోసం సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని సామాజిక ఆరోగ్యకేంద్రాలలో 10 పడకలకు ఆక్సిజన్ సప్లై ఉన్నాయి అని ఆమె తెలిపారు. 







































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.