మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

నేడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిలకలూరిపేట నియోజకవర్గంలో "నిజం గెలవాలి" యాత్ర

చిలకలూరిపేట:- టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన కుటుంబాలకు అండగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన "నిజం గెలవాలి" యాత్రలో భాగంగా... నేడు చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు గ్రామానికి చేరుకోనున్నారు. చంద్రబాబు అరెస్టుపై మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించిన ఎడ్లపాడు ఎస్టి కాలనీకి చెందిన మొగిలి సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించడానికి నారా భువనేశ్వరి నేడు చిలకలూరిపేట నియోజకవర్గం చేరుకోనున్నారు.

మరిన్ని వివరాలకై క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

మంత్రి రజిని అండ చూసుకొని మామ భూకబ్జాలకు పాల్పడుతున్నారు - వైసిపి నేత జాలాది సుబ్బారావు

మంత్రి రజిని అండ చూసుకొని మామ భూకబ్జాలకు పాల్పడుతున్నారు - వైసిపి నేత జాలాది సుబ్బారావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట :- పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల అనంతరం వైసీపీ నేత జాలాది సుబ్బారావు మాట్లాడుతూ... చిలకలూరిపేటలో మంత్రి విడుదల రజిని అండ చూసుకొని వారి మామ అయిన విడుదల లక్ష్మీనారాయణ భూకబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఓగేరు వాగు పక్కన ఉన్న గొర్రెల సంత వద్ద చిలకలూరిపేట టు పసుమర్తి రోడ్డు మధ్యలో అడ్డంగా గోడ కట్టడం వలన తారు రోడ్డు సాంక్షన్ అయినా కూడా రోడ్డు వేసే కార్యక్రమం ఇంతవరకు చేపట్ట లేదంటే దానికి కారణం రోడ్డుకి మధ్యలో అడ్డంగా గోడ కట్టడం. దాని వలన రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయాయని, గోడను తొలగించాలంటే కోటి రూపాయలు ఇస్తే కానీ గోడను తొలగించమని విడుదల లక్ష్మీనారాయణ డిమాండ్ చేసినట్లు జాలాది సుబ్బారావు తెలిపారు. ఈ విషయం మంత్రిగారి దృష్టికి తీసుకొని వెళ్లడానికి చాలా సార్లు ప్రయత్నించామని సరైన స్పందన లేకపోవడంతో ఇబ్బందులు గురవుతున్నామని ఆయన తెలిపారు. పసుమర్తి టు చిలకలూరిపేట రోడ్డు వేస్తే రవాణా సౌకర్యానికి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

100 KGFలు కన్నా గొప్ప సంపద మన ఆంధ్ర KGBలో - మన వాటా మనకు దక్కితే 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు

100 KGFలు కన్నా గొప్ప సంపద మన ఆంధ్ర KGBలో - మన వాటా మనకు దక్కితే 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్:- కేజీబీ అనగానే అదెక్కడుందా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావచ్చు. కేజీబీ అంటే కృష్ణ గోదావరి బేసిన్ అంటే కాకినాడ తీరంలోని సముద్ర జలాలలో ONGC నిర్వహించిన పరిశోధనలో మన బంగాళాఖాతంలో భారీ ఎత్తున చమురు నిల్వలు సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ తెలిపారు. ప్రతిరోజు 35 వేల నుంచి 45 వేల బేర్ల చమురుని మనం ఉత్పత్తి చేయవచ్చని పరిశోధనలో తేలింది. ఈ గ్యాస్ మరియు ఆయన ద్వారా వచ్చే లాభాలలో 50% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందాలని. మన వాటా మనకు వస్తే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో నుంచి బయటపడవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు.

పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సహజ సంపద - ప్రజల హక్కు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు మరియు ప్రజా సంఘాల నేతలు, ఉద్యమ నాయకులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన హక్కుల గురించి వివరించుతూ ... ఏ రాష్ట్రం నుంచి అయినా సహజ సంపద వలన లాభాలు వస్తాయో ఆ లాభాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి 50% లాభాలను ఇవ్వాలని యాక్ట్ ఉన్నా కూడా మన రాష్ట్రానికి మన వాటా వినటం లేదని వారు తెలిపారు. రాష్ట్ర మరియు కేంద్ర రాజకీయ నాయకులు వలన లాభాలను మనం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతి రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ విషయాన్ని చేర్చాలని నాయకులు తీర్మానించుకున్నారు. ఈ లాభాలను మనం పొందగలిగితే రాష్ట్ర అప్పుల భారం ఎంతో కొంత తీరుతుందని దీని ద్వారా వంద రూపాయలకే ఇంటికి గ్యాస్ సిలిండర్ అందజేయవచ్చు అని దీని పెట్టి అవగాహన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వాళ్ళు పిలుపునిచ్చారు.

Share:

సొంత వైసిపి పార్టీ నేతల స్థలంలో గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు - టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్

సొంత వైసిపి పార్టీ నేతల స్థలంలో గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు - టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట - మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనంతరం టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సొంత వైసిపి పార్టీ కౌన్సిలర్ స్థలంలో మంత్రిగారి మామ అన్యాయంగా గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారని, బహిరంగ సభలలో వేలకోట్ల అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే గుంటూరు వెళ్లిపోయారని ఆయన ధ్వజమెత్తారు. కౌన్సిల్లో సమస్యల గురించి చెప్పుకుంటే మున్సిపల్ చైర్మన్ సభలో నుంచి వెళ్లిపోయారని వారు తెలిపారు.

మరినీ వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట - మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట :- పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ రఫాని ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. అలాగే టిడిపి, వైసిపి కౌన్సిల్ సభ్యులు తమ వాదపవాదాలను చైర్మన్ కు తెలియజేశారు. ఈ సమావేశంలో టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని, చిలకలూరిపేట మున్సిపాలిటీని అవినీతిమయంగా కుంభకోణాల మున్సిపాలిటీగా మార్చేశారని ఆయన ఏదేవా చేశారు. అలాగే ఈ మూడు సంవత్సరాల్లో కోటి రూపాయలు ఒకసారి 50 లక్షలు ఒకసారి కొన్ని రోజుల క్రితం 15 లక్షల రూపాయల కుంభకోణం జరిగితే మున్సిపల్ చైర్మన్ రఫాని చేతులెత్తేసారని ఆయన తెలిపారు. మన జరిగిన వైసీపీ సభలో పట్టణంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరగకపోగా వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పుకోవటం సిగ్గుచేటని ఆయన తెలిపారు. వీటిపై సమీక్ష నిర్వహించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.