మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు మొత్తం 20 కరోనా కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు. 

నాదెండ్ల మండల గ్రామాలలో 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటి వివరాలు 

ఎండుగుంపాలెం గ్రామంలో - 2

చిరుమామిళ్ల గ్రామంలో - 2

గణపవరం గ్రామంలో - 6

సాతులూరు గ్రామంలో - 1

నాదెండ్ల గ్రామంలో - 5 

చంద్రవరం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 


యడ్లపాడు గ్రామంలో 2 కేసులు నమోదు అయ్యాయి 























































Share:

చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు.

చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు. 
చిలకలూరిపేట పరిధిలోని హైవే ఫీడర్ లైన్లు మరమ్మతులకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడును అని సి. హెచ్ రాంబొట్ల గారు తెలిపారు. NRT సెంటర్ నుండి హీరో షోరూం వరకు ఉన్న రోడ్లలో, గబ్బిటి వారి వీధి, మునిసిపాలిటీ ఆఫీస్ రోడ్, డైక్ మెన్ నగర్, కోర్టు బజార్, NRT సెంటర్ నుండి విజయాబ్యాంక్ రోడ్ వరకు ఉన్న అన్ని రోడ్డులలో, స్టేట్ బ్యాంకు, సిటీ యినియన్ బ్యాంకు హనుమాయమ్మ సత్రం, గాంధీపేట , హైస్కూల్ రోడ్డు నందు ఈ అంతరాయం ఏర్పడును.  









































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 14-06-2021,సోమవారం నాడు మొత్తం 12 కరోనా కేసులు నమోదు అయ్యాయి.వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో 8 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

వెంగళరెడ్డి నగర్ లో - 5

CR కాలనీ లో - 1

రెడ్ల బజార్ లో - 1

NRT సెంటర్ లో - 1 గా నమోదు అయ్యాయి 


చిలకలూరిపేట మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

దండమూడి గ్రామంలో - 1

గోవిందపురం గ్రామంలో - 2

వేలూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి 






































Share:

గుంటూరు జిల్లాలో గడించిన 48 గంటలలో 97,72,000 లక్షల విలువైన గుట్కా,ఖైనీ వంటి మత్తు పదార్ధాలు సీజ్ చేసాము - జిల్లా రురల్ SP విశాల్ గున్ని

గుంటూరు జిల్లాలో గడించిన 48 గంటలలో 97,72,000 లక్షల విలువైన గుట్కా,ఖైనీ వంటి మత్తు పదార్ధాలు సీజ్ చేసాము - జిల్లా రురల్ SP విశాల్ గున్ని 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు రురల్ SP విశాల్ గున్ని ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో గడించిన 48 గంటలలో మొత్తం 97,72,000 సరుకుని సీజ్ చేసారు. స్పెషల్ టీమ్ గా ఏర్పడి జిల్లాలోని చిలకలూరిపేట,తెనాలి, వినుకొండ, శావల్యాపురం, నరసరావుపేట పరిధిలోని పట్టణ, గ్రామా ప్రాంతాలలో ముమ్మరంగా సోదాలు చేసారు అని తెలిపారు. రాష్ట్రంలోని బహుశా ఇదే అతి పెద్ద ఆపరేషన్ గా చెప్పుకోవచ్చు. 

* చిలకలూరిపేట పట్టణంలో 40 బస్తాల గుట్కా, ఖైనీ, నకిలీ సిగిరెట్లు, 1 కేజీ గంజాయి సీజ్ చేసారు. వాటి విలువ సుమారు 63,20,000 గా ఉండవచ్చు. 

* నరసరావుపేట రురల్ పరిధిలో 54,128 ప్యాకెట్లు గుట్కాలను, ఇతర మత్తు పదార్ధాలను సీజ్ చేసారు, వాటి విలువ సుమారు 6,30,000 గా ఉండవచ్చు. 

* వినుకొండ పట్టణంలో 226 బస్తాల ఖైనీ, గుట్కాలను, పొగాకు పదార్ధాలను సీజ్ చేసారు. వాటి విలువ సుమారు 11,20,000 గా ఉండవచ్చు. 

* తెనాలి పట్టణ పరిధిలో 40 బస్తాల గుట్కాలను, ఇతర మత్తు పదార్ధాలను సీజ్ చేసారు, వాటి విలువ సుమారు 11,00,000 గా ఉండవచ్చు.

* శావల్యాపురం పట్టాన పరిధిలో 18 బస్తాల నిషేధిత పొగాకు సీజ్ చేసారు. వాటి విలువ 6,00,000 గా ఉండవచ్చు. 

ఈ అక్రమ నిషేధిత మత్తు పదార్ధాలను బెంగుళూరు నుండి తరలిస్తున్నట్లుగా సమాచారం అందుకున్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి కర్ణాటక మరియు వేరే రాష్ట్రాలకి పంపించి ఈ అక్రమ దందా కి చెక్ పెట్టాలి అని చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న SI లు,సీఐ ,DSP లకు ప్రత్యేకంగా శుభాకాంషలు తెలిపారు. 
ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిస్తే వెంటనే జిల్లా హెల్ప్ లైన్ నెంబర్ 8866268899 నంబర్లకు కాల్ చెయ్యండి అని తెలిపారు. 

ముఖ్యంగా ఇలాంటి సమయాలలో పోలీసువారికి సహకరిస్తున్న మీడియా వారికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.


https://chilakaluripetspeednews.blogspot.com/

















































Share:

ఆగని పెట్రోల్ వీర బాదుడు 😱

 ఆగని పెట్రోల్ వీర బాదుడు 😱

https://chilakaluripetspeednews.blogspot.com/

దేశంలో పెట్రోల్ వీరబాదుడు కొనసాగుతుంది. పెట్రోల్ పైన 29 పైసలు, డీజిల్ పైన 30 పైసలు పెరిగాయి. సామాన్యులు పెట్రోల్ రేట్ల దాడికి తమ వాహనాలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. ఆయిల్ ధర పెరగటం వలన నిత్యావసర సరుకుల రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఢిల్లీ లో పెట్రోల్ - 96.41 గా డీజిల్ 87.28 గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ - 100.20 గా డీజిల్ - 95.14 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ - 101.35 గా డీజిల్ 95.72 గా ఉంది. మే 4 నుండి ఎప్పటి వరకు 24 సార్లు రేట్లు పెరిగాయి. 





































Share:

అక్రమ మద్యం,గుట్కా వ్యాపారం,పేకాట శిబిరాలు,రేషన్ మాఫియా,కేబుల్ మాఫియా,దొంగ బంగారం,ఇసుక మాఫియా లకు చిలకలూరిపేట అడ్డాగా మారింది - టీడీపీ నేతలు

అక్రమ మద్యం,గుట్కా వ్యాపారం,పేకాట శిబిరాలు,రేషన్ మాఫియా,కేబుల్ మాఫియా,దొంగ బంగారం,ఇసుక మాఫియా లకు చిలకలూరిపేట అడ్డాగా మారింది - టీడీపీ నేతలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట టీడీపీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణంలో జరుగుతున్న అక్రమాల గురించి చర్చించారు టీడీపీ నేతలు. అధికారం అడ్డం పెట్టుకొని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు అని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చిలకలూరిపేట అక్రమాలకు అడ్డాగా మారిపోయింది అని తెలిపారు. గత లాక్ డౌన్ లో అక్రమ మద్యం వలన అరెస్ట్ చేసిన ఎక్ససైజ్ అధికారులకు అధికార పార్టీ నేతల నుండి కేసులు లేకుండా చూడాలి అని వత్తిడి తీసుకు వచ్చారు అని గుర్తు చేసారు. ఆయా అధికారిని బదిలీ చేసారు అని,ఓగెరు వాగులోని అక్రమ ఇసుక మాఫియా చాపక్రింద నీరులా సాగిపోతుంది అని. ఇక అక్రమ మద్యం, గుట్కా వ్యాపారాలు అయితే రేచిపోయి చెలరేగుతున్నారని, ఒక్కొక్కరి దగిర సుమారు 50 నుండి కోటి రూపాయ సరుకు దొరుకుతుంది అంటే చిలకలూరిపేట కేంద్రంగా రాష్ర వ్యాప్తంగా ఈ అక్రమ దందా జరుగుతుంది అని, పేకాట శిబిరాలు అయితే అచంగా అధికార పార్టీ నేతలే దగిర ఉండి నడిపిస్తున్నారు అని, రేషన్ మాఫియా కి అంతే లేదని రేషన్ డీలర్ల నుండి అక్రమ రేషన్ అమ్మే వారి వరకు అందరూ అధికార పార్టీ నేతలే అవటం విశేషం. దొంగ బంగారం గుట్టు చప్పుడు కాకుండా ఎదేచ్చగా సాగిపోతుంది అని. గతంలో పని చేసిన రురల్ SI కి అక్రమ బంగారం చొరవ చూపటం వలన VR కి పంపించారు అని, కేబుల్ మాఫియా అంటే ప్రజలందరూ డబ్బులు చెల్లించి టీవీ ప్రసారాలు చూదాం అనుకుంటే లోకల్ ఛానల్లో అధికార పార్టీ భజన తప్ప ఇంకేమి ఉండదు అని దీనితో ప్రజలు విసిగిపోయి DTH లను ఏర్పాటు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి అని, పార్టీకి అండగా ఉన్న దళితుల భూములను లాక్కున్నారని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని కచ్చితంగా గుణపాఠం చెప్తారు అని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ నెల్లూరి సదాశివరావు, టీడీపీ సీనియర్ నాయకులూ, ముఖ్య నాయకులూ పాల్గొన్నారు. 
























































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.