మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-202 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

 చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-202 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-2021 బుధవారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. 

వాటి వివరాలు. 

RTC బస్టాండు సమీపంలో - 2

సుబ్బయ్యతోట లో - 1 గా నమోదు అయ్యాయి.

Share:

మహిళలకు లబ్ది చేకూర్చే ప్రభుత్వం మన ప్రభుత్వం - MLA విడుదల రజిని

మహిళలకు లబ్ది చేకూర్చే ప్రభుత్వం మన ప్రభుత్వం - MLA విడుదల రజిని

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని గ‌ణ‌ప‌వ‌రం గ్రామం సొసైటీ బ్యాంకు ఆవ‌ర‌ణ‌లో మంగ‌ళ‌వారం డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణాల పంపిణీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఏకంగా 50 గ్రూపుల‌కు రూ.5 కోట్ల రుణాలు అంద‌జేశారు. కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ‌ణ‌ప‌వ‌రం సొసైటీ బ్యాంకు ప‌రిధిలో గణపవరం, అప్పాపురం, కనపర్తి, ఇర్లపాడు, ఆవిశాయపాలెం గ్రామాలు ఉన్నాయ‌ని, ఈ ఐదు గ్రామాల్లో క‌లిపి మొత్తం 563 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయ‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో న‌డిచే జీడీసీసీబీలోనే వీరంతా రుణాలు పొందాల‌నే గొప్ప సంక‌ల్పంతో తాము ప‌నిచేస్తున్నామ‌ని చెప్పారు. డ్వాక్రా రుణాల‌కు అత్య‌ల్ప వ‌డ్డీ కేవ‌లం 9 శాతం వ‌సూలు చేసేది ఒక్క జీడీసీసీ బ్యాంకు మాత్ర‌మేన‌ని, ఇత‌ర బ్యాంకులు 11, 12 శాతం వ‌ర‌కు వ‌డ్డీ వ‌సూలు చేస్తున్నాయ‌ని వివ‌రించారు. అందుకే డ్వాక్రా గ్రూపులు సొసైటీ బ్యాంకుల‌కు మారడంపై ప్ర‌భుత్వం దృష్టి సారించింద‌ని తెలిపారు. గ‌ణ‌ప‌వ‌రం గ్రామంలో  ఈ విష‌యంలో విజ‌యం సాధించ‌గ‌లిగామ‌ని చెప్పారు. ఈ ప‌రిధిలోని దాదాపు 100 గ్రూపుల‌ను ఇప్ప‌టికే ఇత‌ర బ్యాంకుల నుంచి గ‌ణ‌ప‌వ‌రం సొసైటీ బ్యాంకుకు మార్చ‌గ‌లిగామ‌ని పేర్కొన్నారు. ఇది నిజంగా మానిమేట‌ర్ల క‌ష్టానికి ప్ర‌తిఫ‌లమ‌ని చెప్పారు. సొసైటీల్లో డ్వాక్రా గ్రూపుల‌కు ఇత‌ర బ్యాంకుల కంటే ఎక్కువ మొత్తంలో లోన్లు ఇస్తార‌ని చెప్పారు. మ‌హిళ‌లు ఎంత అడిగితే అంత రుణం మంజూర‌య్యేలా తాను జీడీసీసీ బ్యాంకు చైర్మ‌న్‌, ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడ‌తాన‌ని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడుతూ

ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారి సార‌థ్యంలో మ‌హిళ‌ల‌కు వ‌రంలాంటి పాల‌న అందుతోంద‌ని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణమాఫీని చేసి చూపుతున్న ప్ర‌భుత్వం త‌మ‌ద‌న్నారు. ఇప్ప‌టికే వైఎస్సార్ ఆస‌రా ద్వారా తొలి విడ‌త న‌గ‌దును గతేడాది మ‌హిళామ త‌ల్లుల‌కు అందింద‌ని చెప్పారు. రెండో విడ‌త డ‌బ్బులు కూడా రేపు గురువారం రోజున ఆడ‌ప‌డుచుల‌కు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జ‌మ అవుతుంద‌ని పేర్కొన్నారు. త‌మ ప్ర‌భుత్వం డ్వాక్రా రుణాల‌పై ఏటా వ‌డ్డీ కూడా జ‌మ చేస్తోంద‌ని చెప్పారు. ఇప్ప‌టికే రెండేళ్ల‌కు క‌లిపి రూ.2,200 కోట్ల‌కుపైగా వ‌డ్డీని త‌మ‌ ప్ర‌భుత్వం డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అంద‌జేసింద‌న్నారు. అమ్మ ఒడి, జ‌గ‌నన్న విద్యా దీవెన‌, జ‌గ‌నన్న వ‌స‌తి దీవెన‌, వైఎస్సార్ చేయూత‌, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం.. ఇలా త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అన్ని ప‌థ‌కాలు కూడా మ‌హిళ‌ల‌కు నేరుగా ఆర్థిక ల‌బ్ధి చేకూర్చుతున్నాయ‌ని చెప్పారు. రేష‌న్ కార్డులు సైతం మ‌హిళ‌ల పేరుతోనే ఇస్తున్న ఏకైక ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని తెలిపారు. పేద‌లంద‌రికీ ఇళ్ల ప‌థ‌కం కింద ఇస్తున్న ఇళ్ల స్థ‌లాలు, క‌డుతున్న ఇళ్లు అన్నీ మ‌హిళ‌ల పేర్ల‌తోనే ఉంటున్న విష‌యం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని తెలిపారు.

మా ప్రభుత్వ హ‌యాంలో రూ.20.23 కోట్ల నిధులు

గ‌ణ‌ప‌వ‌రం సొసైటీ అధ్య‌క్షుడు కాట్రు ర‌మేష్ మాట్లాడుతూ త‌మ ప్ర‌భుత్వ హయాంలో ఇప్ప‌టివ‌ర‌కు సొసైటీ నుంచి రూ.20.23 కోట్లు అంద‌జేసిన‌ట్లు తెలిపారు. త‌మ త్రిస‌భ్య క‌మిటీ అధికారం చేప‌ట్టిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు సుమారు రూ.7 కోట్ల రుణాలు అంద‌జేశామ‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్,కొమరవల్లి పాడు సొసైటీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు, కౌన్సిలర్లు తులం సుధాకర్,పిల్లి సాగర్,ఆదం వలి నాయకులు కెల్లంపల్లి సుందరరావు, గాలి బుచ్చయ్య,బొప్పూడి రామారావు,బొంతా ప్రభుదాస్,మలిశెట్టి సుబ్బారావు,మండలనేని వెంకటేశ్వర్లు,ఆముదాలపల్లి అంజి,మరియు పలువురు పాల్గొన్నారు.





Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో పిడుగుపాటు - ఇద్దరికి తీవ్రగాయాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో పిడుగుపాటు - ఇద్దరికి తీవ్రగాయాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం కారుచోల గ్రామం వద్ద పిడుగుపాటు వల్ల ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారుచోల పరిధిలోని పొలాల్లో మిర్చి పంటలు కలుపు తీస్తున్న ఇద్దరు మహిళలకు నాలుగడుగుల దూరంలో పిడుగు పడటంతో నందిగం రావమ్మ కవిత అనే అత్తా కోడలు గాయాల పాలయ్యారు.

Share:

పెట్రోల్ & డీజిల్ భగభగ - గ్యాస్ సిలిండర్లపై మళ్లీ బాదుడు

పెట్రోల్ & డీజిల్ భగభగ - గ్యాస్ సిలిండర్లపై మళ్లీ బాదుడు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

06-10-2021 అసలే పెట్రోల్ డీజిల్ రేట్లు రాకెట్ లాగా ఆకాశంలో దూసుకు వెళ్తుంటే దానికి తోడు తాజాగా వంట గ్యాస్ LPG పై 15 రూపాయలు పెంచుతున్నట్లు పెట్రోలియం కంపెనీలు తెలిపాయి. గత నెలలో డొమెస్టిక్ సిలిండర్లపై 25 రూపాయలు కమర్షియల్ 19 కేజీల సిలిండర్లపై 43 రూపాయలు పెంచారు. అయితే తాజాగా డొమెస్టిక్ సిలిండర్లపై 15 రూపాయలు పెంచుతున్నట్లు తెలిపాయి. ఇటు పెట్రోల్ డీజిల్ పై 33 పైసలు పెంచుతున్నట్లు ఇంధన శాఖ తెలియజేశారు. పెరిగిన సిలిండర్ల ధరలు ఈరోజు నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ పెరిగే, పెట్రోల్ & డీజిల్ గ్యాస్ సిలిండర్ల ధరలు వలన సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


Share:

భర్త మరణ వార్త విని గుండెపోటుతో భార్య మృతి

భర్త మరణ వార్త విని గుండెపోటుతో భార్య మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గంగవరపు చిన్న పాపారావు (61) అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందిన వార్త విని భార్య రమాదేవి (57) గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతి చెందారు.

వివరాల్లోకి వెళితే ! ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అంబటిపూడి గ్రామానికి చెందిన చిన్న పాపా రావు & రమాదేవి భార్యాభర్తలు. అయితే గత కొంత కాలంగా పాపారావు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజుల క్రితం పాపారావు చిలకలూరిపేటలో నివాసం ఉంటున్న కుమార్తె వద్దకు వచ్చి ఉంటున్నాడు. ఈరోజు పాపారావు తీవ్ర అస్వస్థతకు గురిఅవ్వటంతో వెంటనే కూతురు అల్లుడు పాపారావును గుంటూరులోని హాస్పటల్కు తరలించారు. అప్పటికే పాపారావు మార్గమధ్యంలోనే మృతి చెందారు. దీంతో కుమార్తె తండ్రి మరణ వార్తను తల్లికి ఫోన్లో చెప్పడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెనూ స్థానిక హాస్పటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది. తండ్రి చనిపోయిన రెండు గంటల్లో తల్లి చనిపోవడంతో కూతురు కన్నీరు మున్నీరయ్యారు.


                                     *Advertisement*



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.