మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ - చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్

విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ - చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- ఎయిడెడ్ స్కూల్స్ & కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు గాను అనంతపురంలో విద్యార్థులపై జరిగిన ఘటనలను నిరసిస్తూ చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మురారి మాట్లాడుతూ ఎయిడెడ్ కాలేజీ & స్కూల్స్ నందు పేద విద్యార్థులు మాత్రమే చదువుకుంటానని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 38, 42 జీవోలను తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన ఎయిడెడ్ కాలేజీలను & స్కూళ్ల పై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో "విద్యార్థులతో చెలగాటమా ఖబడ్దార్ ఖబడ్దార్" అనే నినాదంతో విద్యార్థులు పట్టణంలోని వీధులన్నీ మోత మోగించారు.

                                                VIDEO  మీకోసం 

Share:

విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము - చిలకలూరిపేట జనసేన పార్టీ

విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము -  చిలకలూరిపేట జనసేన పార్టీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశాలలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ నిన్న అనంతపురంలో ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలలో జరిగిన ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయుటను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల పై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ ను తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది అని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయి డెడ్ సంస్థల ద్వారా కొన్ని లక్షల పేద, మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాలకు వెళ్లారని, ఇప్పుడు ఆ సంస్థలు ప్రైవేటీకరణ చేయటం వలన ఐదు వేల రూపాయలు ఉండవలసిన ఫీజులు 20000 ,పాతిక వేలు అవటం వలన ఆ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై లాఠీ ఛార్జ్ చేయడం వల్ల ఆమె తలకు తీవ్ర గాయమైంది అని, అనేక మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి అన్నారు. ఎవరైతే ఈ దాడులకు పాల్పడిన పోలీసు అధికారులను తక్షణమే విధులు నుండి తొలగించవలసిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జి వో నెంబర్ 46 ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఏ అన్యాయం జరిగినా వారికి జనసేన పార్టీ  అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి సుభాని, మునీర్ హసన్, కాకుమాను రమేష్ ,భాష, మల్ల కోటి,అమరేశ్వరి, కోటేశ్వరమ్మ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.