మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట మార్కెట్ యార్డు నందు పాములు కలకలం - వారం రోజులలో మూడు సార్లు - భయాందోళనలో కూరగాయల వర్తక సంఘ వ్యాపారులు

చిలకలూరిపేట మార్కెట్ యార్డు నందు పాములు కలకలం - వారం రోజులలో మూడు సార్లు - భయాందోళనలో కూరగాయల వర్తక సంఘ వ్యాపారులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట - పట్టణంలోని RTC బస్టాండ్ ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డు నందు పాములు హడావిడి ఎక్కువ అయింది.వర్షాకాలం కావటంతో యార్డు చుట్టుపక్కల ఉన్న పొలాల నుండి పాములు యార్డులోకి ప్రవేశిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. కరోనా కారణంగా కూరగాయల మార్కెట్ వర్తకులను యార్డులోకి తరలించారు. అయితే తెల్లవారు జామున 3 గంటలకల్లా వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి సర్దుకొనే సమయంలో పాములు ఎక్కడ ఎక్కడ ఉంటాయో అని బయాందోనళకు గురి అవుతున్నారు వ్యాపారులు. తాజాగా 5 గంటలకు వర్తకులు షాపులు మూసివేస్తుండగా ఇంతలో సుమారు 5 అడుగుల పాము ఒక వ్యక్తిపై దాడి చెయ్యబోయింది వెంటనే స్పందించిన సదరు వ్యక్తి అందరిని పిలువగా పాముని చంపివేశారు. ఇది ఎలా జరగటం మూడవసారి. అయితే సదరు వ్యాపారులు కరోనా పేరు చెప్పి మమ్మల్ని ఊరికి దూరంగా ఉన్న ఈ యార్డులో ఉంచారు. అసలే వ్యాపారాలు లేక బ్రతుకు బండి మోయలేకపోతుంటే ఇప్పుడు ఈ పాముల వలన ప్రాణభయం ఏర్పడుతుంది అని వాపోయారు. ఇప్పటికి అయిన శాసనసభ్యురాలు మా యందు దయ ఉంచి మార్కెట్ నందు యధావిధిగా వ్యాపారాలు కొనసాగించటానికి అనుమతులు ఇవ్వండి, కొట్టు మార్చి కొట్టు లేదా రోజుకి ఒక వరుసగా కోట్లు పెట్టుకొని జనల రద్దీ లేకుండా కరోనా నియమాలు పాటిస్తూ, మార్కెట్ మొత్తానికి కరోనా గుంపులు గుంపులుగా లేకుండా ఉండేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటాము అని తెలిపారు. 
Share:

చిలకలూరిపేట పట్టణంలో 19-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణంలో 19-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 19-07-2021,సోమవారం నాడు మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి. 

చౌత్ర సెంటర్ నందు - 4 కేసులు నమోదు అయ్యాయి. 

 ఈ రోజు నుండి కరోనా ఆంక్షలు సడలింపు ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తమై కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ కరోనా తీవ్రతకు అడ్డుకట్ట వేదాం . 
























Share:

రెండు సంవత్సరాల వ్యవధిలో ఇద్దరు CIలు,ఇద్దరు కమిషనర్లు,ఇద్దరు తహసీల్ధార్లు మార్చటం చిలకలూరిపేట ప్రజలు ఎన్నడూ చూడలేదు - రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు

రెండు సంవత్సరాల వ్యవధిలో ఇద్దరు CIలు,ఇద్దరు కమిషనర్లు,ఇద్దరు తహసీల్ధార్లు మార్చటం చిలకలూరిపేట ప్రజలు ఎన్నడూ చూడలేదు - రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు

https://chilakaluripetspeednews.blogspot.com/


ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జరిగిన పత్రికా సమావేశంలో రాష్ట్ర ఓబిసి ప్రోగ్రాం కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని,ఆరు నెలలకు ఒక పోలీసు అధికారి ఎందుకు మారుతున్నారు ప్రజలకు తెలియజేయాలని అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల్లో ఇద్దరు మున్సిపల్ కమిషనర్ మారారని,తాసిల్దారు కూడా ఇద్దరు మారారని ఈ విధమైన పరిస్థితిని గతంలో ఎప్పుడూ కూడా చిలకలూరిపేట ప్రజలు చూడలేదని దీనిపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిలకలూరిపేట ఎమ్మార్వో సెలవ మీద వెళ్లగా నాదెండ్ల మండల తాసిల్దార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలకు కావలసిన ఇన్కమ్ సర్టిఫికెట్,కాస్ట్ సర్టిఫికెట్ విషయాల మీద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలియజేశారు.కేవలం ఎడవల్లి భూముల సమస్య పరిష్కరించడం కొరకు ఆయన తాసిల్దార్ గా వ్యవహరిస్తున్నారని ప్రజలు అందరూ అనుకుంటున్నారు. అంతేగాని పూర్తిస్థాయి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదని ప్రజలకు అందుబాటులో లేరని ఈ విధంగా చేయటంవల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటన్నింటిపై స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని ఆయన తెలియజేశారు. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా అధికారులను మార్చిన సందర్భాలు లేవని ఆయన గుర్తు చేశారు. సమస్యలను గాలికొదిలేసి కేవలం ఆర్భాటాలు శిలాఫలకాలు ప్రచారాలకు మాత్రమే పరిమితం అవుతున్నారని ఆయన దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ ఉపాధ్యక్షులు డి పుల్లయ్య, ఓబీసీ మోర్చా నాయకులు అన్నపరెడ్డి లక్ష్మణ్, యువ నాయకులు వి వంశీ, ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Share:

చిలకలూరిపేట - RTC బస్సు సమయాలలో మార్పు - బక్రీదు పండుగకు సామూహిక ప్రార్థనలు అనుమతులు లేవు - ఇన్సిడెంట్ కమాండర్

చిలకలూరిపేట - RTC బస్సు సమయాలలో మార్పు - బక్రీదు పండుగకు సామూహిక ప్రార్థనలు అనుమతులు లేవు - ఇన్సిడెంట్ కమాండర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/


సోమవారం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఇన్సిడెంట్ కమాండర్ మాట్లాడుతూ కర్ఫ్యూ సమయాన్ని తగ్గించారు. అలాగే RTC బస్సు పని వేళలను మార్చాలని అని RTC అధికారులకు సూచించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటలకల్లా బస్సులన్నీ డిపోకు చేరేలా ప్రణాళిక చెయ్యాలి అని తెలిపారు.అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు ఆటోలలో,ఇతర ప్రయాణాలు చేసే వాహనాలలో రద్దీ లేకుండా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలి అని తెలిపారు. 

త్వరలో ముస్లిం సోదరుల పండుగ బక్రీద్ రానుండటంతో మసీదు ప్రదేశాలలో సామూహిక ప్రార్థనలకు అనుమతులు లేవు అని కనుక ఎవరి ఇళ్లలో వారి పండుగ జరుపుకోవాలి అని. అలాగే మసీదు సమీపంలో హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజేషన్ చేపించాలి అని తెలిపారు. 

వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ప్రక్రియ ముందుకి తీసుకువెళ్లాలి అని. వార్డులలో వాలంటీర్లు,AMNలు,ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది కరోనా చైన్ బ్రేక్ చేసే విధంగా చర్యలు చెప్పటాలి అని తెలిపారు. 



























Share:

నేటి నుండి చిలకలూరిపేటలో కరోనా ఆంక్షలు తగ్గింపు - ఉదయం 6 నుండి సాయత్రం 5 వరకు పని వేళలు - ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జునరావు

నేటి నుండి చిలకలూరిపేటలో కరోనా ఆంక్షలు తగ్గింపు - ఉదయం 6 నుండి సాయత్రం 5 వరకు పని వేళలు - ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జునరావు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో కొనసాగుతున్న కరోనా ఆంక్షల సమయాలలో మార్పు చేస్తున్నట్లు ఈ రోజు సోమవారం నాడు జరిగిన టాస్క్ ఫోర్స్  కమిటీ సమావేశంలో ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జునరావు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవాలి అని. సాయంత్రం 5 తర్వాత నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానున్నట్లు అయన తెలిపారు. అన్ని వ్యాపార,వాణిజ్య దుకాణాలలో నో మాస్క్ నో సేల్ బోర్డు పెట్టాలి అని కరోనా ప్రోటోకాల్ పాటించని వారి పైన కఠిన చర్యలు తప్పవని తెలిపారు.యువకులు క్రీడాకారులు ఆటలు ఆడరాదు అని ఆలా ఆడేవారి పైనా కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు.  





























Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.