మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - పట్టణాన్ని పలకరించి వెళ్లిన మేఘాలు,వరుణ దేవుడు

చిలకలూరిపేట - పట్టణాన్ని పలకరించి వెళ్లిన మేఘాలు,వరుణ దేవుడు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట -  పట్టణాన్ని వరుణ దేవుడు అలా పలకరించి వెళ్లారు . కొన్నిరోజులుగా పట్టణములో ఎండలు మండిపోతున్నాయి. లాక్ డౌన్ కారణంగా మధ్యాహ్నం 12 తరువాత ఎవరు బయటకి రాకపోవటంతో ఎండల తీవ్రత అర్ధం కావటం లేదు కానీ బయట ఎండలు మండిపోతున్నాయి. అయితే ఈరోజు 3 గంటల ప్రాంతంలో నల్లటి మొబ్బులతో చల్లటి వాతావరం ఏర్పడింది. అయితే దానికి తోడు తుపాను తలపించేలా గాలులు వీచాయి. దీనితో పట్టణములోని ప్రజలు కొంచం సేపు వాతావరణాన్ని ఆస్వాదించారు. చల్లటి గాలులు, చిన్న చిన్న వర్షపు చినుకులతో రోడ్లు అన్ని తడిచాయి. ఇంతలోనే మొబ్బులు మాయం గాలులు ఆగిపోయాయి . 






















Share:

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే 

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే



శ్యామ్ కలకడ రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ అభిమానులు, పార్టీ సోషల్ మీడియా, పార్టీ  ముఖ్యనేతలకు ఈ పేరు తెలియని వారు ఉండరు. వైస్సార్సీపీ పార్టీకి సోషల్ మీడియా వెన్నుముక గా చెప్పుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో నిలబెట్టిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు.
శ్యామ్ కలకడ సొంత ఊరు చిత్తూరు జిల్లా పీలేరు. వృత్తి రీత్యా సాఫ్టువేర్ ఇంజనీర్, బెంగళూర్ నందు ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్, ముఖ్యంగా తెలుగువారు ఎవరైనా బెంగళూర్ వచ్చారు అంటే అక్కడి వసతులకు, ఆహారానికి ఇబ్బందులు లేకుండా చూసుకునే వ్యకి ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి అనుకోకుండా 2010 నుండి రాజకీయాలకు దగ్గిరగా ఉండి వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి యువతను పార్టీకి దగ్గిర చేస్తూ , ముఖ్యంగా గత పాలకుల వైఫల్యాలను సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు తెలిసేలా చేసి పార్టీ ని యువతలో బలోపేతం చేసిన వ్యక్తి . అలా బెంగళూర్ వేదికగా వైస్సార్సీపీ పార్టీ తెలుగు ప్రజలకు చేరువ చెయ్యటంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ విషయాన్ని సొంత పార్టీ ముఖ్య నేతలే ఒప్పుకుంటారు.బెంగళూర్ వైస్సార్సీపీ ఐటీ వింగ్ శ్యామ్ కలకడ 

అయితే కరోనా కారణంగా శ్యామ్ నిన్న తుది శ్వాస విడిచారు. లక్షలాది మంది వైస్సార్సీపీ సోషల్ మీడియా డిపార్ట్మెంట్ సభ్యులు ఆయన మరణ వార్తను ట్రిండింగ్ చేసారు. ట్విట్టర్,ఫేసుబుక్కులలో ఎక్కడ చూసిన అతని పోస్థులే. పార్టీలో అంత చనువు ఉన్న ముఖ్య వ్యక్తి చనిపోతే సాయంత్రం వరకు కూడా సీఎం జగన్ స్పందించక పోవటం పార్టీ యువతను తీవ్రంగా కలచివేసింది. పార్టీ ఫాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని గురి అయ్యారు. పార్టీ ముఖ్య వ్వక్తి కరొనతో బాధపడుతుంటే మంచి వైద్యం అందించలేకపొయ్యారు అని. మంచి వైద్యం అందించి ఉంటే బ్రతికి ఉండేవాడు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్, ట్రేండింగ్ చేసారు అభిమానులు. ఎట్టకేలకు సాయంత్రం సమయానికి స్వయంగా సీఎం జగన్ శ్యామ్ భార్యకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. పార్టీ మీకు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. సీఎం జగన్ స్పందనకు పార్టీ యూత్ కొంచం శాంతించారు. అయిన శ్యామ్ మరణం పార్టీ సోషల్ మీడియా కి తెరనిలోటుగా భావిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/




ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే



https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/


https://chilakaluripetspeednews.blogspot.com/
























Share:

చిలకలూరిపేట - దేవాలయాలలో,గోశాలలో,పబ్లిక్ ప్లేసులలో శానిటైజేషన్ చేపడుతున్న - ABVP, బీజేపీ, భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్

చిలకలూరిపేట - దేవాలయాలలో,గోశాలలో,పబ్లిక్ ప్లేసులలో శానిటైజేషన్ చేపడుతున్న - ABVP, బీజేపీ, భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా అఖిల భారత విద్య పరిషత్ (ABVP ), బీజేపీ,భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు,యువకులు సంయక్తంగా పట్టణములోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో స్వచ్చంధంగా శానిటైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. పట్టణములోని దేవాలయాలు,గోశాలలు, మార్కెట్ పరిసర ప్రాంతాలు,పాఠశాలలో  వైరస్ వ్యాప్తి చెందకుండా  ఈ శానిటైజేషన్ చేపడుతున్నారు. రోజుకు ఒక ఏరియా చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ కార్యకార్యకమాలలో ABVP -  మురారి,బీజేపీ - వంశీ, ఫణి , ట్రస్ట్ -  కందుల రవి, నాయుడు ఫణి , సాయి, నరసరావుపేట పార్లమెంట్ ఓబీసీ ,మోర్చా ఉపాధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి, డీజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 




























 
Share:

ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే

ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే  

https://chilakaluripetspeednews.blogspot.com/
గూగుల్ పే ప్రస్తుత పరిస్థితులలో డిజిటల్ పేమెంట్స్ తెలియనివారు ఉండరు. ఫోన్ పే , గూగుల్ పే బ్యాంకు ట్రాన్సక్షన్ మరింత సులభతరం చేసాయి. బ్యాంకులకు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించటం  వలన సమయము కలిసి రావడంతో ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ మొగ్గు చూపుతున్నారు. పల్లెలు, పట్టణాలు,గ్రామాలూ అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్క చోట బడ్డీ కొట్టు నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు కూడా చాలా వరకు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి.     
అయితే డిజిటల్ పేమెంట్ ఆల్ఫాబెట్ కంపెనీ కి సంబంధించిన  గూగుల్ పే ఇప్పుడొక శుభవార్త తెలిపింది. త్వరలో అంతర్జాతీయ పేమెంట్స్ కి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి అమెరికా నుండి పేమెంట్స్ పంపుకోవటానికి వీలుగా ఎర్పాట్లు చేస్తున్నాము అని , అయితే అమెరికాలో కూడా గూగుల్ పే వాడే వారికి  మాత్రమే ఈ అవకాశం అని. త్వరలోనే అన్ని దేశాలలో ఈ ఫీచర్ని తీసుకువస్తాము అని తెలిపింది. 
గూగుల్ పే తీసుకున్న నిర్ణయానికి ఫోన్ పే ఎలా రెస్పాండ్ అవుతుందో చూదాం.  







































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.