మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

గెలిచి & ఓడిన భారత్ - నేటి మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై

గెలిచి & ఓడిన భారత్ - నేటి మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2021 భాగంగా ఈరోజు భారత్ నమీబియాల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచి ఫీలింగ్ ఎంచుకున్న భారత్. మొదటి బ్యాటింగ్ కు దిగిన నమీబియా 20 ఓవర్ లకు గాను 8 వికెట్ల కష్టానికి 132 పరుగులు చేసింది. నమీబియా మొదట తడబడి 100 లోపే స్కోర్ నమోదు చేస్తుంది - అని అందరూ అనుకున్నారు. కానీ 132 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ లక్ష్యఛేదనలో 152 ఓవర్లకే ఫినిష్ చేశారు. గెలిచిన ఓడటం ఏంటి అనుకోవచ్చు - కానీ భారత్ సెమీ ఫైనల్స్ వెళ్లాలంటే మరొక మ్యాచ్ గెలవాల్సి ఉంది. కానీ భారత్ అంతకుముందే రెండు మ్యాచ్లను ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలిచిన భారత్ మాత్రం సెమీ ఫైనల్కు వెళ్లదు.

2021 టి-20లో భారత్ కు ఇది చివరి మ్యాచ్. దీంతోపాటుగా విరాట్ కోహ్లీ కి కెప్టెన్గా తన చివరి మ్యాచ్. అలాగే కోచ్ గా ఉన్న రవి శాస్త్రి కి కూడా ఇది చివరి మ్యాచ్. తరువాత జరగబోయే టి 20 లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. అలాగే టీమిండియాకు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పగ్గాలు చేపట్టనున్నారు.




Share:

రోడ్డు ప్రమాదం - దారి మధ్యలో ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనం లోనే ఆస్పత్రికి చేరిన టౌన్ సిఐ రాజేశ్వరరావు

రోడ్డు ప్రమాదం - దారి మధ్యలో ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనం లోనే ఆస్పత్రికి చేరిన టౌన్ సిఐ రాజేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట కావూరు గ్రామానికి చెందిన దంపతులు కుమార్ తో కలిసి చిలకలూరిపేట నుండి స్వగ్రామమైన కావూరికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా మార్గమధ్యలో కొండ్రుపాడు వద్ద ఆటో ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో భార్య భర్తలు దుర్గాప్రసాద్, హైమావతి గాయపడ్డారు. అదే సమయంలో లో నరసరావుపేట నుంచి చిలకలూరిపేట కి వస్తున్న టౌన్ సిఐ రాజేశ్వరరావు ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను తన వాహనంలో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానికులు సీఐ రాజేశ్వరరావు తీసుకున్న తక్షణ నిర్ణయానికి, మానవతా దృక్పథానికి హ్యాట్సాఫ్ తెలిపారు.





Share:

విద్యార్థుల తలలు పగిలేలా కొట్టించడం జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం - రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్.

విద్యార్థుల తలలు పగిలేలా కొట్టించడం జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం - రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో TNSF రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్  మోహన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం. అనంతపురంలోఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. విద్యార్థుల పై లాఠీఛార్జ్ చేసిన పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? విద్యార్థి ఉద్యమాలు అణిచి వెయ్యాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయం. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఇచ్చిన జిఓలు రద్దు చెయ్యాలి, లేకుంటే విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని తెలియజేశారు.



Share:

చిలకలూరిపేట పట్టణంలో పలు ట్రాఫిక్ ప్రాంతాలలో అర్బన్ సిఐ ఉక్కు పాదం - ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని ప‌క్షంలో చ‌ర్య‌లు తప్పవు

చిలకలూరిపేట పట్టణంలో పలు ట్రాఫిక్ ప్రాంతాలలో అర్బన్ సిఐ ఉక్కు పాదం - ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని ప‌క్షంలో చ‌ర్య‌లు తప్పవు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

పట్టణంలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలు నిలిపి ఉండడంతో అలాంటి స్థలాలను అర్బ‌న్ సీఐ రాజేశ్వ‌ర‌రావు గుర్తించారు. ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్రధానంగా మార్కెట్ సెంటర్ లోని మెయిన్ బ‌జార్‌లో ట్రాఫిక్ పోలీస్‌ను నియ‌మించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్ లలో రోడ్లపైకి పార్కింగ్ వెహికల్స్ రాకుండా బోర్డులు ఏర్పాటు చేశారు. వాహన దారుల వల్ల పాదచారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అర్బన్ సిఐ రాజేశ్వరరావు పేర్కొన్నారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.