మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - మన మంచినీటి చెరువును కాపాడేవారు లేరా - మునిసిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు.

చిలకలూరిపేట - మన మంచినీటి చెరువును కాపాడేవారు లేరా - మునిసిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలోని ప్రజలందరి దాహం తీరుస్తూ వారి నిత్య అవసరాలు  తీరుస్తున్న మన అందరి జీవనాధారం పట్టణ శివారులలో ఉన్న మన మంచినీటి చెరువు. ఇంతమందికి జీవనాధారం అయిన మంచినీటి చెరువుకు భద్రత కరువైంది. గత కొంత కాలం క్రితం చెరువు చెరువులో అకృత్యాలు ఎక్కువ అయిపోయాయి.పట్టణంలో ఇన్ని లక్షల దాహం తీరుతున్న మన మంచినీటి చెరువును పట్టించుకునే నాధుడు లేరా అని అక్కడికి వచ్చిన పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికి అయినా మునిసిపల్ కమిష్నర్ చెరువు దగ్గిర పరిస్థితిని సమీక్షించాలి అని ప్రజలు కోరుతున్నారు. సాయంత్రానికి చెరువులో గేదెలు,మేకలు జలకాలాడటం పట్ల పట్టణ ప్రజలు ఒకింత అభద్రతకు లోనవుతున్నారు. అధికారులు వీటి పైనా తగిన చర్యలు తీసుకోవాలి అని సామాన్యులు కోరుకుంటున్నారు. 



 
Share:

చిలకలూరిపేట టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వరరావు

చిలకలూరిపేట టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వరరావు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట టౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న బిలాలుద్దీన్ ను పేకాట నిర్వహణ విషయంలో అధికారులు విఆర్ కి పంపారు. అయితే ఇంకమీదట జి.రాజేశ్వరావు గారు టౌన్ సీఐగా బాధ్యతలు నిర్వహించనున్నారు.శుక్రువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. టౌన్ పోలీస్టేషన్ నందు పోలీస్ అధికారులు స్వాగతం పలికారు. గతంలో ఆయన మొదటిగా 2004 లో అచ్చంపేట SI గా మొదలై రేపల్లె,చెరుకుపల్లి ప్రాంతాలలో SI గా విధులు నిర్వహించి తరువాత మాచర్ల CIగా , నరసరావుపేట దిశా పోలీసుస్టేషన్లో CI గా పనిచేస్తూ ఇప్పుడు మన చిలకలూరిపేటకి CIగా వచ్చారు. 












Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021,శుక్రువారం నాడు మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

డైక్ మెన్ నగర్ లో - 1

పోలిరెడ్డిపాలెం లో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండలంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

సందెపూడి గ్రామంలో - 2

నాదెండ్ల మండలంలో 13 కేసులు నమోదు అయ్యాయి. 

గిరిజవోలు గ్రామంలో - 8

నాదెండ్ల గ్రామంలో - 5 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో  ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. 

Share:

చిలకలూరిపేట - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిలకలూరిపేట - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారిపైనా కారు ఢీ కొని వ్యక్తి మృతి. వివరాలలోకి వెళ్తే పట్టణానికి చెందిన దేవరకొండ రాంబాబు తాతపూడి వైపు నుండి ద్విచక్ర వాహనం పైన పట్టణం వైపు వస్తుండగా వెనుక నుండి TS07GP4448 బ్లాక్ బెంజ్ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్నది. రాంబాబు బైక్ పైనుండి క్రిందపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు ఆ వ్యక్తి మృతిచెందారు.



























Share:

చిలకలూరిపేట పట్టణంలోని ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ జోన్ - మునిసిపల్ కమిషనర్

చిలకలూరిపేట పట్టణంలోని ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ జోన్ - మునిసిపల్ కమిషనర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని డైక్ మెన్ కాలనీ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర. గత రెండు రోజులగా ఆ ప్రాంతంలో 12 కేసులు నమోదు అవ్వగా కమిషనర్ కరోనా విస్తరించకుండా కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అలాగే బాధితులను క్వారంటైన్ సెంటర్కు తరలించారు.అలాగే ఆ ప్రాంతం అంతా హైపోక్లోరిక్ సోడియం తో శానిటైజేషన్ చేపించారు. వారం రోజులపాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి అని తెలియజేసారు. 














Share:

నేడు చిలకలూరిపేట నియోజకవర్గంలో కోవిషిల్డ్ ఎన్ని ఎన్ని డోసులు ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!

నేడు చిలకలూరిపేట నియోజకవర్గంలో కోవిషిల్డ్ ఎన్ని ఎన్ని డోసులు ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021 శుక్రువారం నాడు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే 45 సంవత్సరాలు దాటినా ప్రభుత్వ ఉపాయధ్యాయులకు మొదటిడొసు, రెండవ డోసు,పాలు ఇచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు మాత్రమే వ్యాక్సిన్ వెయ్యనునట్లు నోడల్ డాక్టర్ గోపీనాయక్ తెలిపారు. 

యడ్లపాడు పీహెచ్ సీ పరిధిలో - 600

నాదెండ్ల పీహెచ్ సీ పరిధిలో - 500

గణపవరం పీహెచ్ సీ పరిధిలో - 500

కావూరు పీహెచ్ సీ పరిధిలో - 800 

పురుషోత్తమపట్నం యుపీహెచ్ సీ పరిధిలో - 200

రజక కాలనీ పీహెచ్ సీ పరిధిలో - 300

సుబ్బయ్యతోట పీహెచ్ సీ పరిధిలో - 200

పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ లో - 500 మందికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచారు. 













































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.