మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

మృగాళ్లను శిక్షించేందుకు"కనిపిస్తే కాల్చివేత" ఉత్తర్వులు అమలు చేయాలి!..రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు

మృగాళ్లను శిక్షించేందుకు"కనిపిస్తే కాల్చివేత" ఉత్తర్వులు అమలు చేయాలి!..రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



ఉరిశిక్ష,ఎన్కౌంటర్ వీటికి ఉన్న శక్తి చాలా గొప్పది.ఉరిశిక్ష  అమలు చేయడం చట్టం.కానీ ఎన్కౌంటర్ చేయడం చట్టవ్యతిరేకమైన చర్య. కానీ చట్ట ప్రకారం ప్రభుత్వం వెంటనే ఎవరయినా మృగాడు తప్పు చేస్తే చట్టం ప్రకారం శిక్షించేందుకు ఉన్న అవకాశం"కనిపిస్తే కాల్చివేత"మాత్రమే. తప్పించుకోవడానికి ప్రయత్నించే తీవ్రమైన నేరాలు చేసే వారిని అదుపులోకి తీసుకునే వీలు దొరకని పరిస్థితి ఉన్నప్పుడు"పోలీసులు షూట్ ఎట్ సైట్"ఆర్డర్ జారీ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అదే విధానాన్ని చిన్నారులు,యువతులు,మహిళలను అత్యాచారం చేసి చంపిన మానవ మృగాలకు వర్తింపజేయాలని నవతరం పార్టీ డిమాండ్ చేస్తుంది.ఆరేళ్ళ చిన్నారిని హైదరాబాద్ లో అత్యాచారం చేసినా,అయేషా మీరా ను హాస్టల్లో మానభంగం చేసి చంపినా,గుంటూరు లో రమ్య ను నడిరోడ్డుపై నరికి చంపినా,ఢిల్లీలో నిర్భయ ను బస్సులో మానభంగం చేసి కిరాతకంగా చంపినా,సుగాలి ప్రీతి,దిశా లను మృగాళ్లు చంపినా ఇంకా అత్యాచారం హత్యకు గురై చనిపోయిన వారికి న్యాయం జరిగేందుకు నిందితులను  మన భారత దేశంలో న్యాయ పరంగా శిక్షించాలనేది ప్రభుత్వ ఆలోచన విధానం.అయితే దానిని ప్రజలు సమర్దించలేక పోవడం గురించి సమగ్రమైన చర్చలు జరగాలి.ప్రజా ప్రభుత్వం చట్టవ్యతిరేకమైన విధానాన్ని అమలు చేయడం కుదరదు.కానీ ఇలాంటివి జరిగిన ప్రతీసారి ఉరితీయాలని,ఎన్ కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేయడం చూస్తున్నాము.ఇటువంటివి జరిగినపుడు ప్రజల్లో ఉన్న ఆవేశం,భాద,అత్యాచారం జరిగిన కుటుంబంకు న్యాయం చేయడానికి సులభంగా ఉన్న ఓకే ఒక మార్గం"కనిపిస్తే కాల్చివేత".దీన్ని అమలు చేయాలి.చట్టం చేయాలి.ఉరిశిక్ష కాదు ఆలస్యంగా అమలు జరగడానికి,రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడానికి,ఎన్ కౌంటర్ కాదు చట్టవ్యతిరేకమైన ప్రభుత్వ విధానం అనటానికి.సరయిన చేయగలిగిన, చట్టబద్దత కలిగిన శిక్షా విధానం"షూట్ ఎట్ సైట్"నవతరం పార్టీ అధికారంలోకి వస్తే ఇదే చట్టం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది.న్యాయస్థానం అత్యవసర ఉత్తర్వులు క్రింద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయాలి.ప్రజలు ఆలోచించాలి,మృగాళ్లను శిక్షించేందుకు"కనిపిస్తే కాల్చివేత"అమలుకు ఉద్యమించాలి,ఇదే ప్రభుత్వ విధానం కావాలని డిమాండ్ చేయాలి.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.