మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్

చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్ 


https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేటలో కరోనా కేసులు రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ రోజు అనగా 21-04-2021 బుధవారం నుండి పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించాలి కమిషనర్, ఎంపీడివో, పోలీసుశాఖ వారికీ  ఆదేశాలు జారీ చేసారు తసీల్ధార్ సుజాత గారు. 

 * పట్టణములోని, మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న దుకాణాలు అన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాన్నం 1 వరకు మాత్రమే తెరిచి ఉంచాలి అని,
 * రెస్టారెంట్, హోటల్స్ పార్సెల్ మాత్రమే అనుమతి. 
 * టీ షాప్స్ కు అనుమతులు లేవు కావున తెరవకూడదు. 
 * శ్రీ రామ నవమి పండుగను ఎవరి ఇంటిలో వారే చేసుకోవాలి, పబ్లిక్ లో చేసుకోవటానికి అనుమతులు లేవు. 
 * పట్టణంలో,గ్రామాలలో జాతరలు,తిరునాళ్లలు  జరుపుకోవటానికి అనుమతులు లేవు. 
 * ముఖ్యంగా మాస్క్ లేకుండా బయట తిరిగితే 100 రూపాయల అపరాధ రుసుము వసూళ్లు చేస్తారు. 
 * తోపుడు బళ్ళు ఒకే చోట ఉండకుడదు. 
* ఫంక్షన్స్ , ఇతర కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి. 

     పైన నిబంధనలు పాటించనివారు IPC సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు అని తెలిపారు. 













Share:

చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు

 చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు మంగళవారం నాడు MLA , తహసీల్దార్,కమిషనర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా మార్కెట్ మూసివేసి విశాలమైన మైదానంలో స్టాల్ ఎర్పాటు చేసిన అక్కడకు కూడా ప్రజలు గుంపులు గుంపులు గా వస్తారు. గత అనుభవాల దృష్ట్యా మార్కెట్ అక్కడ ఉంచి మొత్తం 80 షాపులలో 40 ఒక రోజు 40 ఇంకొక రోజు ఎర్పాటు చేసుకుంటూ, షాప్ వదిలి షాప్ తెరచి ఆలా అమ్మకాలు సాగిస్తాం అని తెలియచేసారు. అలాగే గత లాక్ డౌన్ లో హోల్సేల్ మార్కెట్ పెద్ద మార్కెట్ యార్డ్ నందు ఎర్పాటు చేసారు. ఆ సమయంలో అక్కడ నుండి కురగాయలు కొనుగోలు చేసి సంతలో ఎర్పాటు చేసిన రిటైల్ మార్కెట్ వెళ్లే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి మార్కెట్ వ్యక్తిని కోల్పోయాము అని తెలియచేసారు. ఈసారి వ్యవసాయ చిన్న మార్కెట్ యార్డ్ నందు హోల్ సేల్ కి అనుమతి ఇచ్చి రిటైల్ ను ప్రస్తుత మార్కెట్ నందు నిర్వహించుకుంటాం అని తెలియచేసారు. 

కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితిలో మార్కెట్ ఖాళీ చేసి 15 రోజుల పాటు శానిటైజేషన్ చెయ్యాలి అని. రిటైల్ దుకాణాలు అన్ని విశాలమైన మైదానాలలో మార్చాలి అని తెలియచేసారు. ఈ సమావేశంలో గుడిపల్లి భూషయ్య, కామయ్య, MNR శ్రీను, R  శ్రీనివాసరావు, కంచర్ల ప్రసాద్, గంటల రవి, CSR, వలీ,మరియు ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.    





















Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.