మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

ప్రత్తిపాటికి‌ TDP కుటుంబం అండగా ఉంటుంది - అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.

ప్రత్తిపాటికి‌ TDP కుటుంబం అండగా ఉంటుంది -  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.

ప్రత్తిపాటికి‌ TDP కుటుంబం అండగా ఉంటుంది -  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.


చిలకలూరిపేట నియోజకర్గం :-  మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి గెలుపు ఖాయమైన నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం ఆయన కుమారుడిని అక్రమంగా అరెస్టుచేసి  వేధింపులకు పాల్పడుతోందన్నారు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి. చిలకలూరిపేట నివాసంలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసిన ఆయన వారి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. ఆయనతో పాటు నరసరావుపేట నియోజకవర్గ తెదేపా నేత నల్లపాటి రాము, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ప్రత్తిపాటి నివాసానికి తరలివచ్చారు.  ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ చిలకలూరిపేటలో ప్రత్తిపాటి గెలుపు ఖాయమని సర్వేల్లో సుస్పష్టంగా తెలిసిందని.. ప్రజల్లో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడిగా ప్రత్తిపాటి నిలిచారని అన్నారు. ఇది గమనించి రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక, జీర్ణించుకోలేక ప్రత్తిపాటిని ఏమీ చేయలేక కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నీతిమాలిన రాజకీయాలకు ఇది పరాకాష్ట అని అభిప్రాయపడ్డారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఇటువంటి సవాళ్లు ఎన్నో చూశామని.. భయపడేది ప్రసక్తే లేదని తెదేపా నేతలకు తెలిపారు. నేను గానీ నా కుటుంబసభ్యులు గానీ తప్పు చేయలేదు.. తలవంచేది లేదన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కక్షకట్టి చిన్న పిల్లోడిని జైలులో పెట్టారనే బాధ ఉందన్నారు. శరత్ ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు... ఉన్నత విద్యావంతుడు. రాజకీయాలకు దూరంగా తన పని ఏదో తాను చేసుకుంటున్నాడని అని పేర్కొన్నారు. ఎక్కడా తెరపై కనిపించరు.. అత్యంత సౌమ్యుడు... అలా అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడిపై అక్రమ కేసు పెట్టి జైలులో పెట్టారనే బాధ ఉందన్నారు. తన రాజకీయ జీవితం కోసం కుటుంబసభ్యులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ కష్టసమయాన్ని తమ కుటుంబం మొత్తం కలిసి ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తెదేపా కుటుంబం మొత్తం అండగా ఉంటుందని చంద్రబాబు, లోకేశ్ కూడా భరోసా ఇచ్చారని అన్నారు. ఈ సమయంలో తమకు మద్దతుగా సంఘీభావం తెలుపుతున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రత్తిపాటి.

Share:

ప్రత్తిపాటి కుమారుడుపై 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి - విజయవాడ సబ్ జైలుకు తరలింపు - అరెస్ట్ కు అసలు కారణం ఇదేనా ?

 ప్రత్తిపాటి కుమారుడుపై 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి - విజయవాడ సబ్ జైలుకు తరలింపు - అరెస్ట్ కు అసలు కారణం ఇదేనా ?

ప్రత్తిపాటి కుమారుడుపై 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి - విజయవాడ సబ్ జైలుకు తరలింపు - అరెస్ట్ కు కారణం ఇదేనా ?

పల్నాడు జిల్లా :- చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్ కు జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. శరత్ పై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసి అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో, ప్రాసిక్యూషన్ వాదోపవాదాలు విన్న అనంతరం న్యాయమూర్తి 14 రోజులు రిమైండర్ విధించారు. అనంతరం విజయవాడ సబ్ జైలుకు తరలించారు. తెలంగాణలో కూడా ఇదే తరహా కేసుని నమోదు చేసినట్లు, ఒకే రకం కేసు పై రెండు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం విరుద్ధమని, 409 సెక్షన్ వర్తించదు అని ప్రత్తిపాటికి సంబంధించిన బెనర్జీ లక్ష్మీనారాయణ వాదించారు. దీంతో 409 సెక్షన్ ను కేసు నుంచి తొలగించారు.

అసలు జీఎస్టీ ఎగవేత కేసులు ఇంత హడావిడిగా పోలీసులు అరెస్టు చేసి అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో అసలు కారణం జీఎస్టీ ఎగవేత లేదా ఇంకేమైనా ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం వద్ద నుండి వెయ్యని రోడ్డుకు ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందినట్లు విచారణలో తేలింది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో పాటు మొత్తం ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 420, 409, 467,471, 477(A),120 B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లపై కేసు ఫైల్ అయ్యింది. శరత్ తో పాటు మరో ఆరుగురిపై పై కేసు నమోదు అయ్యింది. అలెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పన్ను ఎగవేసారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.