మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

ఫీజు కట్టని విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు పంపిణీ చేయండి - చిలకలూరిపేట AISF

ఫీజు కట్టని విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు పంపిణీ చేయండి - చిలకలూరిపేట AISF

ఫీజు కట్టని విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు పంపిణీ చేయండి - చిలకలూరిపేట AISF

చిలకలూరిపేట :- త్వరలో టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షల సమయం రానున్నటంతో చిలకలూరిపేట లోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సంవత్సరకాలం మొత్తం కష్టపడి చదువుకున్న విద్యార్థులు ఆర్థిక స్తోమత వలన ఫీజులు కట్టకపోతే వారికి హాల్ టికెట్లు నిలిపివేయకుండా విద్యార్థులకు అందించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఆర్థికపరమైన చిక్కుల వలన వెనక్కి వెళ్ళకూడదు అని, అలాగే ప్రభుత్వం తల్లి ఖాతాలో కాకుండా విద్యార్థుల పాఠశాలల ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చట్టం తీసుకురావాలని దీని ద్వారా విద్యార్థులు చదువుకి ఆటంకం కలగకుండా విద్యా దీవెన సక్రమంగా స్కూళ్లకు మరియు కాలేజీలకు చేరుతుందని వారు కోరారు. ఇలా చేయడం వలన హాల్ టికెట్లు, విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకునే సమయంలో ఇబ్బందులు పడకుండా ఉంటారని వారు తెలిపారు. విద్యార్థులకు కాలేజీలలో, స్కూల్లలో హాల్ టికెట్లు పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే తమను సంప్రదించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని చిలకలూరిపేట తాసిల్దార్ కార్యాలయానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ మేకపోతుల నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ సాయి నాయక్, బొంత భగత్ సింగ్, సహాయ కార్యదర్శి పృద్వి, త్రిపురం సురేంద్ర మరియు మండాది ఫణి పాల్గొన్నారు.

వేగంగా వార్తలను పొందటం కోసం క్రింది లింకు పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

Share:

చిలకలూరిపేట - ACB అధికారుల దాడి - 55,000రూ..లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి

చిలకలూరిపేట - ACB అధికారుల దాడి - 55,000రూ..లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి

చిలకలూరిపేట - ACB అధికారుల దాడి - 55,000రూ..లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి

చిలకలూరిపేట:- మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో కరెంట్ కనెక్షన్ కోసం చిలకలూరిపేట రూలర్ ఏపీ సీపీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రకాష్ రావు నాయక్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సదరు 55,000 లంచం అడగగా బాధితుడు ఏసీబీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. వెంటనే రంగంలోకి దిగిన ACB అధికారులు లంచం తీసుకుంటుండగా ప్రకాష్ రావు నాయక్ ను పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్ మత్తె, డీఎస్పీ సత్యానంద్ రైడ్ లో పాల్గొన్నారు. లంచాలకు పాడుపడుతున్న అధికారుల సమాచారాన్ని తమతో పంచుకోవాలని వారు తెలిపారు.


మరిన్ని వార్తలు వేగంగా పొందడం కోసం కింది ఉన్న లింక్ పై క్లిక్ చేసి వాట్స్అప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

https://chat.whatsapp.com/GJSIoeRYDkBLAgjWVh6RlO

Share:

చిలకలూరిపేట - ఆక్రమించిన రోడ్డును తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం - రహదారి ఆక్రమణ బాధితుల సంఘం

చిలకలూరిపేట - ఆక్రమించిన రోడ్డును తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం - రహదారి ఆక్రమణ బాధితుల సంఘం

చిలకలూరిపేట - ఆక్రమించిన రోడ్డును తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం - రహదారి ఆక్రమణ బాధితుల సంఘం

చిలకలూరిపేట :- గత కొన్ని రోజులుగా వివాదాస్పదమైన గొర్రెల మండి నుండి పసుమర్తి డొంక రోడ్డు వ్యవహారం ఉద్యమ రూపం దాల్చింది. పసుమర్రు గ్రామ సర్వేనెంబర్ 16/A కి సంబంధించిన స్థలం వ్యవహారం ఇప్పుడు పట్టణంలో హార్ట్ టాపిక్ గా మారింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మామ అయిన విడుదల లక్ష్మీనారాయణ గతంలో గొర్రెల మండి వెనుక ఉన్న స్థలాన్ని కొనుగోలు చేశారని తనకు సంబంధించిన స్థలంలో అతాను గోడ కట్టుకున్నట్లు వారికి సంబంధించిన వ్యక్తులు తెలియజేస్తున్నారు. అయితే అతనికున్న స్థలం కాకుండా ముందు వైపు ఉన్న రోడ్డును కూడా ఆక్రమించి దానిపై గోడను నిర్మించారని, ఇప్పటికే గొర్రెల మండి పక్క నుండి పసుమర్తి గ్రామానికి తారు రోడ్డు శాంక్షన్ అయినా కూడా పనులు జరగపోవడానికి కారణం ఈ ఘటనేనని, దీనివల్ల గ్రామ అభివృద్ధికి కుంటుపడుతుందని రహదారి ఆక్రమ బాధితుల సంఘం తెలిపారు. ఇదేంటని ప్రశ్నిస్తే కోటి రూపాయలు ఇస్తే కానీ రోడ్డు వదలను విడుదల లక్ష్మీనారాయణ బాధితులకు తెలిపినట్లు వారు తెలియజేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అఖిలపక్షం నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నేడు చిలకలూరిపేట మరియు పసుమర్తి గ్రామ ప్రజలు సుమారు 100 మంది ఆక్రమించిన రోడ్డు వద్ద టెంటును ఏర్పాటు చేసి దీక్షను చేపట్టారు. వీరితో పాటుగా అఖిలపక్ష నాయకులు, వివిధ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొని ఈ ఆక్రమించిన రోడ్డుని తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలిపారు. 

వేగంగా వార్తలను పొందడం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5


Share:

చిలకలూరిపేటలో అర్ధరాత్రి దొంగల బీభత్సం

చిలకలూరిపేటలో అర్ధరాత్రి దొంగల బీభత్సం

https://chilakaluripetspeednews.blogspot.com/search?updated-max=2021-03-21T10:15:00-04:00&max-results=14&reverse-paginate=true&m=1

చిలకలూరిపేట టౌన్ :- పట్టణంలోని సుభాని నగర్ లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని సుభాని నగర్ నందు లహరి పిల్లల హాస్పిటల్ రోడ్డులోని జండా చెట్టు ఎదురుగా ఉన్న పటాన్ సుభాని అనే వ్యక్తి ఇంట్లో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. పఠాన్ సుభాని మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం విజయనగరంలోని ఉరుసు కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఇది అదునుగా భావించిన దొంగలు అర్ధరాత్రి సమయంలో తలుపులు పగలగొట్టి 25 వేల రూపాయలు నగదు, బంగారు దుద్ధులు, వెండి పట్టీలు దొంగిలించి పారిపోయారు. తెల్లవారుజామున తలుపులు తెరిచి ఉండటానికి గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో సామాన్లు అన్ని కింద పడేసి ఉండటానికి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వార్తలను వేగంగా పొందడం కోసం కింది ఉన్న లింకు పై క్లిక్ చేసి వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.