మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - ఆక్రమించిన రోడ్డును తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం - రహదారి ఆక్రమణ బాధితుల సంఘం

చిలకలూరిపేట - ఆక్రమించిన రోడ్డును తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం - రహదారి ఆక్రమణ బాధితుల సంఘం

చిలకలూరిపేట - ఆక్రమించిన రోడ్డును తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం - రహదారి ఆక్రమణ బాధితుల సంఘం

చిలకలూరిపేట :- గత కొన్ని రోజులుగా వివాదాస్పదమైన గొర్రెల మండి నుండి పసుమర్తి డొంక రోడ్డు వ్యవహారం ఉద్యమ రూపం దాల్చింది. పసుమర్రు గ్రామ సర్వేనెంబర్ 16/A కి సంబంధించిన స్థలం వ్యవహారం ఇప్పుడు పట్టణంలో హార్ట్ టాపిక్ గా మారింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మామ అయిన విడుదల లక్ష్మీనారాయణ గతంలో గొర్రెల మండి వెనుక ఉన్న స్థలాన్ని కొనుగోలు చేశారని తనకు సంబంధించిన స్థలంలో అతాను గోడ కట్టుకున్నట్లు వారికి సంబంధించిన వ్యక్తులు తెలియజేస్తున్నారు. అయితే అతనికున్న స్థలం కాకుండా ముందు వైపు ఉన్న రోడ్డును కూడా ఆక్రమించి దానిపై గోడను నిర్మించారని, ఇప్పటికే గొర్రెల మండి పక్క నుండి పసుమర్తి గ్రామానికి తారు రోడ్డు శాంక్షన్ అయినా కూడా పనులు జరగపోవడానికి కారణం ఈ ఘటనేనని, దీనివల్ల గ్రామ అభివృద్ధికి కుంటుపడుతుందని రహదారి ఆక్రమ బాధితుల సంఘం తెలిపారు. ఇదేంటని ప్రశ్నిస్తే కోటి రూపాయలు ఇస్తే కానీ రోడ్డు వదలను విడుదల లక్ష్మీనారాయణ బాధితులకు తెలిపినట్లు వారు తెలియజేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అఖిలపక్షం నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నేడు చిలకలూరిపేట మరియు పసుమర్తి గ్రామ ప్రజలు సుమారు 100 మంది ఆక్రమించిన రోడ్డు వద్ద టెంటును ఏర్పాటు చేసి దీక్షను చేపట్టారు. వీరితో పాటుగా అఖిలపక్ష నాయకులు, వివిధ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొని ఈ ఆక్రమించిన రోడ్డుని తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలిపారు. 

వేగంగా వార్తలను పొందడం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5


Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.