మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించిన ప్రత్తిపాటి

రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించిన ప్రత్తిపాటి

రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించిన ప్రత్తిపాటి

పట్టణంలోని ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పర్వం మొదలైంది, నేడు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు నామినేషన్ దాఖలు చేయగా రేపు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భారీ ర్యాలీతో నామినేషన్ వేనున్నారు. అందులో భాగంగా నేడు ప్రత్తిపాటి స్వగృహంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికల్లో మంచి-చెడుల మధ్య యుద్ధంలో కూటమిదే విజయమన్నారు మాజీమంత్రి, కూటమి చిలకలూరిపేట అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. మంగళవారం చిలకలూరిపేట కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నేపథ్యంలో విజయం సాధించాలని సంకల్పిస్తూ పట్టణంలోని తన నివాసంలో సోమవారం సుదర్శన నరసింహస్వామి హోమం వైభవంగా నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ క్రతువులో ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి వెంకటకుమారి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు హోమాలు, వైదిక కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిపించారు. నారసింహ, సుదర్శన యంత్రాలతో హోమం నిర్వహించారు. హోమ ద్రవ్యాలను యజ్ఞ గుండాల్లో సమర్పించి పూర్ణాహుతి జరిపించారు. చిలకలూరిపేటతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు. పలువురు కుటుంబసభ్యులు ఈ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి చెడు గెలిచిన సందర్భాలు చరిత్రలోనే కాదు పురాణేతిహాసాల్లో ఎక్కడ వెదికినా కనిపించవన్నారు. కూటమి తరపున ప్రజాబలానికి దైవ సంకల్పం కూడా తోడు కావాలనే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ప్రత్తిపాటి.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5


Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో - పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ చాటిన విద్యార్థులు వీరే

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో - పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ చాటిన విద్యార్థులు వీరే

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో

బొప్పూడి గ్రామంలోని శ్రీ పూసల సుబ్బయ్య గుంటూరు వెంకటప్పయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని పరీక్షకు హాజరైన 58 మంది విద్యార్థులలో 51 మంది ఉత్తీర్ణులై 88% సాధించారు దీనిలో షేక్ అప్పాపురం షబ్బీర్ 571 షేక్ ఆసిఫ్ 554 కొమ్మూరి వాసవి 553 మార్కులు సాధించి ప్రథమ ద్వితీయ స్థానాలు పొందారు ఈ సందర్భంగా తల్లిదండ్రుల కమిటీ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ హైస్కూల్లో చదివిన కార్తీక్ రెడ్డి 585 మార్కులతో మండలం టాపర్గా నిలిచాడు.

పట్టణంలోని పాఠశాలలో


ఈరోజు ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో  విజయభేరి మ్రోగించిన వికాస్ విద్యార్థులు ఏ శరణ్య, బాల సాయిరాం, అష్రఫ్.


ఈరోజు వెలువడిన 2023 -24 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వికాస్ విద్యార్థులు ఏ శరణ్య 600 కి 591 మార్కులు , బాల సాయిరాం 589,

Sk. Md. అశ్రాప్ 587

 స్కూల్ టాపర్లగా నిలిచారు.


 *ఈ పరీక్షకు మొత్తం 87 మంది విద్యార్థులు హాజరు కాగా 87 మంది  విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణత శాతం* సాధించి వికాస్ విజయ పతాకాన్ని ఎగురవేశారు. 


వీరిలో 590 కి పైగా మార్కులు సాధించిన వారు.....1

585 కి పైన...3 

580 కి పైన....7

 575 కి పైన.....14 

570 కి పైన...... 20 

550 కి పైన.......36 

500 కి పైన....... 61.


VIIT THE SCHOOL సుబ్బయ్య తోట, VIKAS SCHOOL

 పెదనందిపాడు రోడ్డు  క్యాంపస్లలో  విద్యార్థులు అద్భుతంగా ప్రతిభ కనబరిచారని విద్యాసంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్ తెలియజేశారు.


 నిరంతర కృషి పట్టుదల ఉంటే ఇలాంటి ఫలితాలు సాధించవచ్చని తెలియజేస్తూ  ఇంతటి చక్కని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, కష్టపడి పనిచేసినఉపాధ్యాయులను అదేవిధంగా *ప్రిన్సిపాల్స్ కల్పనా , ప్రమీల ను డైరెక్టర్లు దండా పవన్ కుమార్ , దండా రోజశ్రీ  అభినందించారు* మరియు విద్యార్థులకు మిఠాయిలు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.



నేడు ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో మోడరన్ విద్యాసంస్థల విద్యార్ధులు మరొక సారి వారి విజయ పరంపరని కొనసాగించారు. అత్యధికంగా నాయుడు వర్షిత 583 మార్కులు,షేక్ తస్నీమ్ 580 మార్కులు సాధించారు

మొత్తం పరీక్షకు హాజరైన 89 మంది విద్యార్ధులకు 27 మంది విద్యార్ధులకు 550కి పైగా, 50 మందికి పైగా 500 మార్కులను సాధించారు. 100శాతం ఉత్తీర్ణతతో 84 మంది ప్రధమ శ్రేణిలో 5గురు ద్వితీయశ్రేణి లో ఉత్తీర్ణత సాధించారు. 

గణితంలో నూటికి నూరు మార్కులు 10మంది, 90కి పైగా 50మంది. సైన్స్,సోషల్ లో 41మంది మార్కులు సాధించారు.ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్ధులను,ఉపాధ్యాయులను మోడరన్ విద్యాసంస్థల అధినేత చేబ్రోలు మహేష్ అభినందించారు.            

 కార్యక్రమంలో మోడరన్ విద్యాసంస్థల ఛైర్మన్  చేబ్రోలు మహేష్ ,గ్రీన్ వ్యాలీ కుమార్, ప్రిన్సిపాల్స్ సురేష్, ఫణికుమార్, హేమ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయిలు,విద్యార్ధినీ విద్యార్ధులు వారి తల్లిదండ్రులు పాల్గొని అందరినీ అభినందించారు.

కింది లింక్ ని ఫాలో అవ్వండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5


Share:

10,000 మంది కార్యకర్తలతో భారీ రోడ్ షో - నామినేషన్ దాఖలు చేసిన కావటి - అనంతరం ప్రత్తిపాటి పై ధ్వజమెత్తిన మనోహర్ నాయుడు

10,000 మంది కార్యకర్తలతో భారీ రోడ్ షో - నామినేషన్ దాఖలు చేసిన కావటి - అనంతరం ప్రత్తిపాటి పై ధ్వజమెత్తిన మనోహర్ నాయుడు

10,000 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన కావటి

చిలకలూరిపేట :- నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నామినేషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా నేడు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటీ మనోహర్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరి మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు 10,000 మందితో కలిసి అంగరంగ వైభవంగా సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కావటి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఈరోజున స్వచ్ఛందంగా  నామినేషన్ కార్యక్రమానికి పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజలంతా మరలా జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతిజ్ఞ చేసుకున్నారన్నారు. ప్రజలు కనివిని ఎరుగని రీతిలో జగనన్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలు ఇంటి వద్దకే పంపిన ఘనత జగనన్నకే దక్కుతుందని తెలియజేశారు.  ఎన్నికల ప్రచారంలో మేము పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కరూ మాకు జగనన్న ఈ ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారని జగనన్న మేము ఓట్ల రూపంలో రుణం తీర్చుకోని జగనన్ననే మరల ముఖ్యమంత్రిగా చేసుకుంటామన్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం మేము జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేపించుకున్నామన్నారు. అదేవిధంగా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు కూడా లబ్ధి పొందామని స్వచ్ఛందంగా ప్రతిపక్ష పార్టీలు వారు కొంతమంది పరోక్షంగా కొంతమంది ప్రత్యక్షంగా వైసీపీ కి మద్దతు తెలుపుతున్నారన్నారు. ఖచ్చితంగా రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కావటి అనే నేను అత్యధిక మెజార్టీతో చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగురు వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా మూడు పర్యాలు చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ప్రత్తిపాటి పుల్లారావు పనిచేశారని ఈ మూడు పర్యాలో పేట అభివృద్ధికి నోచుకోక పోగా ఎన్నో అవస్థలు ప్రజలు పడ్డారని కావటి తెలియజేశారు. ఈరోజున నామినేషన్ కార్యక్రమానికి వచ్చే మా నాయకులను కొంతమంది టీడీపీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వదిలేది లేదని తెలిపారు. పుల్లారావు అనే వాడు 2019లో ఓడిపోతే నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రజలను, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వేరే రాష్ట్రంలో తలదాచుకున్నారన్నారు. పేటలో పుల్లారావు అతని భార్య వెంకాయమ్మ చేసిన అరాచకాలు పేట ప్రజలు ఇంకా మర్చిపోలేదని కావటి గుర్తు చేశారు. చివరికి ఆర్యవైశ్యులు దీపావళి మందులు అమ్ముకుంటే వాళ్ల దగ్గరికి కూడా పుల్లారావు అతని భార్య వెంకాయమ్మ అధికారులు పంపించి షాపులు మూపించి వాళ్ళని నానారకాలుగా ఇబ్బందులకు గురి చేశారని తెలియజేశారు. పుల్లారావు గతంలో వైసిపి తీర్థం పుచ్చుకుందామని ప్రయత్నాలు చేస్తే అవి జగనన్న దగ్గర పారకపోయేసరికే మరలా చంద్రబాబు దగ్గరికి వెళ్లి కాళ్ళ వేల పడి టిడిపి టికెట్ తీసుకున్నారని తెలిపారు. పుల్లారావు మాట్లాడుతూ నేను స్థానికుడిని కాదు అని తెలియజేస్తున్నారు. కానీ పుల్లారావు ఎక్కడ నుంచి వచ్చారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ప్రకాశం జిల్లా బొబ్బేపల్లి నుంచి సొసైటీ చైర్మన్గా ఓడిపోతే చిలకలూరిపేట వచ్చి ఎన్టీఆర్ హయాంలో టీడీపీ టికెట్ తెచ్చుకొని రాజకీయ రంగం ప్రవేశం చేసిన నీచమైన రాజకీయ జీవిత చరిత్ర పుల్లారావుదని కావటి తెలిపారు. పుల్లారావు ఈరోజున ఎన్ని బూటకపు మాటలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కనీసం పుల్లారావు కి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి రేపు జరిగే ఎన్నికల్లో ఉంటుందని కావటి తెలిపారు.

క్రింది లింకు పై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.