మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట- మానుకొండవారిపాలెం,ఏలూరు గ్రామ ప్రజల ధర్నా- కొంత సేపు ట్రఫిక్ అంతరాయం, MLA రజని చొరవతో అంతా సర్దుబాటు

చిలకలూరిపేట- మానుకొండవారిపాలెం,ఏలూరు గ్రామ ప్రజల ధర్నా- కొంత సేపు ట్రఫిక్ అంతరాయం, MLA రజని చొరవతో అంతా సర్దుబాటు  

https://chilakaluripetspeednews.blogspot.com/


ఏలూరు- మానుకొండవారిపాలెం గ్రామస్థులు ధర్నా - వివరాలలోకి వెళ్తే గణపవరం లోని ప్రముఖ కంపెనీ,స్పిన్నింగ్ మిల్లుల నుండి వచ్చే వ్యర్ధాలను గణపవరం గ్రామం మీదుగా వచ్చే కుప్పగంజి వాగు లోకి కలుపుతున్నారు. అందువలన వాగులో నీరు కాలుష్యం ఎర్పడి రంగు మరి , అందులో ఉండే జలచరాలు చేపలు,కప్పలు భారీగా చనిపోతున్నాయి, అంతేకాకుండా ఆ వాగు నుండి వచ్చే నీరును మానుకొండవారిపాలెం , ఏలూరు ప్రజలు పంటల సేద్యానికి వాడుతుంటారు, కొందరు త్రాగునీరుగా వాడుతుంటారు. అయితే అక్కడి గ్రామ ప్రజలు ఈ కాలుష్యానికి అడ్డుకట్ట వేయటానికి  నిరసనగా ధర్నా చేపట్టారు. దాని వలన  రోడ్లు పైన ట్రాఫిక్ అంతరాయం ఎర్పడింది. విషయం తెలుసుకున్న MLA రజని గారు హుటా హుటిన అక్కడికి చేరుకొని వాగుని పరిశీలించారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

దీనిపైనా స్పందించిన రజని ఈ కాలుష్యానికి కారణం అయిన  కంపెనీల పైన తగు చర్యలు తీసుకుంటాని హామీ ఇచ్చారు. అలాగే ఆయా నీటిని శాంపిల్ తెలుసుకొని ల్యాబ్ కి పంపాలి అని ఆదేశించారు, రైతులకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని , ఏ కంపెనీ నుండి వ్యర్ధాలు నీటిలో కలవకూడదు అని , నీటిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపైనా ఉన్నది అని, MLA రజని తో పాటుగా పోలీస్,పొల్యూషన్ అధికారులని, తహశీల్ధార్ సుజాత గారు,అక్కడికి చేరుకున్నారు. 

పొల్యూషన్ అధికారి AE శ్రీనివాసరావు మాట్లాడుతూ శాంపిళ్లను విజయవాడ ల్యాబ్ లకు పంపారు అని, ఒక వారం రోజులలో రిపోర్ట్స్ వస్తాయి అని, అప్పుడు ఆయా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటాం అని అవసరం అయితే మూసివేస్తాం అని హామీ ఇచ్చారు. అప్పటికిగాని గ్రామ ప్రజలు శాంతించారు. ఈ ధర్నాలో గ్రామా పెద్దలు , గ్రామ సర్పంచ్ లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు . 
https://chilakaluripetspeednews.blogspot.com/

  
https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/










Share:

చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు

చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట రూరల్, అర్బన్ ప్రాంతాలకు  కు కొత్త SI లు. పట్టణంలో అర్బన్ SI గా బాధ్యతలు నిర్వహిస్తున్న SI రాంబాబు గారిని యడ్లపాడు పోలీస్టేషన్ SI గా , పెదకూరపాడు SI గా విధులు నిర్వహిస్తున్న వేజండ్ల అజయ్ బాబు గారిని చిలకలూరిపేట టౌన్ SI గా, అలాగే గుంటూరు రూరల్ డి ఎస్ బి గా విధులు నిర్వహిస్తున్న ఆళ్ళ మోహన్ రెడ్డి గారిని చిలకలూరిపేట రూరల్ SI గా  బాధ్యతలు స్వీకరించనున్నారు. 








Share:

యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS

యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS 

https://chilakaluripetspeednews.blogspot.com/

గత కొంతకాలంగా చిలకలూరిపేట లో SI గా తన కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వహిస్తూ. పట్టణ ప్రజల రక్షణకై శ్రమిస్తూ ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయంలో చిలకలూరిపేటకు  విశిష్టమైన సేవలు అందించిన SI పైడి రాంబాబు గారికి పట్టణ ప్రజల తరుపున ప్రత్యేక  ధన్యవాదాలు.  లాక్ డౌన్ సమయంలో అక్రమ మద్యం పైన ఉక్కు పాదం, పేకాట శిబిరాల పైనా దాడులు,  అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టలు వేసి, విధి నిర్వహణలో తనకి తానే సాటి అనీ విధంగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మన యంగ్ డైనమిక్ పోలీస్ SI రాంబాబు గారు యడ్లపాడు SI గా బదిలీ అయ్యారు. ఎక్కడ ఉన్న మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటు -- చిలకలూరిపేట ప్రజల తరుపున CHILAKALURIPETA SPEED NEWS తరుపున శుభాకాంక్షలు. 







Share:

చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

 చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం  పట్టివేత 


https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణంలో అక్రమంగా  రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. వివరాలలోకి వెళ్తే బుధవారం పట్టణంలోని శాంతినగర్ లో ఓ మిని లారీ లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు అనే సమాచారం తెలుసుకున్న పోలీసులు . హుటాహుటిన అక్కడికి చేసుకొని వాహనాన్ని అర్బన్ పోలీసుస్టేషన్ కి తరలించారు. ఆయా వాహనంలో సుమారు 150 క్వింటా బియ్యం ఉన్నట్లు సమాచారం. 









Share:

ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు లేదా నేరుగా కలవొచ్చు --- MLA రజని

 ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు లేదా నేరుగా కలవొచ్చు --- MLA రజని 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట మున్సిపల్ తొలి సమావేశంలో చాలా సమస్యలపైనా చర్చించారు. అలాగే రోడ్లు , నీటి సమస్యల పైనా చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి అధ్యక్షలుగా రఫాని గారు, ఎక్స్ అఫీషియా సభ్యురాలి హోదా లో MLA రజని గారు పాల్గొన్నారు. రఫాని గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కౌన్సిలర్ తమ వార్డు పైన పూర్తి అవగాహనా కలిగి ఉండాలి అని, వార్డు లో ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తెలుసుకురావాలి అని, పార్టీలకు అతీతంగా కలసి చిలకలూరిపేట పట్టణాన్ని అభివృద్ధి పధంలో తెలుసుకు వెళ్లాలి అని అన్నారు. ఇప్పటికే మానుకొండవారిపాలెం కి 75 లక్షలు , పసుమర్రు కి 2 కోట్లు, గణపవరంకి 5 కోట్లు తో పరిశుద్ధ,త్రాగునీరు సమస్యల పరిష్కారానికి అంచనా వేసి ప్రభుత్వానికి పంపటం జరిగింది అని చెప్పారు. పార్టీ ఏది అయినా ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉండాలి అని, చౌకబారు మాటలతో దిగజారుడు తనగా ఉండకూడదు అని, ప్రజలలో మంచి పేరు తెచ్చుకొని ముందుకు సాగాలి అని  అన్నారు. 

MLA రజని మాట్లాడుతూ వార్డు సమస్యలు ఏవైనా చైర్మెన్ గారికి లేదు అంటే తన దృష్టికి తెలుసుకురావాలి అని,  ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు అని, ప్రజలు తమ సమస్యలని తీరుస్తారు అని మిమ్మల్ని ఎన్నుకున్నారు అని, ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి అని, పాత బకాయిగా ఉన్న 82 కోట్ల రూపాయలని సిఎం జగన్ గారితో మాట్లాడటం జరిగింది అని ఆ భారం మన మున్సిపాల్టీ పైన పడకుండా తగు చర్యలు తీసుకుంటాం అని, కౌన్సిలర్లలో చాలా వరకు కొత్త వారు కనుక ఒక రోజు సభ్యుల హక్కులు, విధులు, సమస్యలని ఎలా ప్రస్తావించాలి, అనే అంశాల పైనా శిక్షణ ఇస్తారు అన్నారు. 

అలాగే సభ్యులు తమ తమ  వార్డులలో సమస్యలను చైర్మెన్ దృష్టికి తీసుకువచ్చారు.     







 

Share:

చిలకలూరిపేట 52 ఎకరాలలో 6500 ఇల్లు శిధిలం చేసిన అసమర్ధ నాయకురాలివి -- టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలలో టీడీపీ నాయకులు

 చిలకలూరిపేట 52 ఎకరాలలో  6500 ఇల్లు శిధిలం చేసిన అసమర్ధ నాయకురాలివి -- టీడీపీ 40వ  ఆవిర్భావ వేడుకలలో టీడీపీ నాయకులు 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులూ , అభిమానుల మధ్య టీడీపీ పట్టాన అధ్యక్షులు పఠాన్ సమ్మద్ ఖాన్ పార్టీ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులూ మాట్లాడుతూ 4000 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక్క మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుగారికి మాత్రమే సాధ్యం అన్నారు. అలాగే 52 ఎకరాలలో ఎర్పాటు చేసిన 6500 ఇళ్ల నిర్మాణం 90%  పూర్తి అయినా మిగిలిన 10 % నిర్మాణాలని పూర్తిచేయకుండా శిధిలా లుగా మిగిల్చిన ఘనత ఒక్క రజనికి మాత్రమే సాధ్యం అని అన్నారు . అలాగే పట్టణంలో త్రాగు నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ఎన్టీఆర్ సృజల పధకం ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసారు సదరు ప్లాంట్ సామాగ్రిని తూకం వెయ్యటానికి కూడా పనికిరాకుండా చేసారు అని అన్నారు. ప్రత్తిపాటి హయాం లో వచ్చిన కేంద్రీయ విశ్వ విద్యాలయం, గురుకుల పాఠశాల, మైనారిటీ విద్యార్థుల వసతి నివాసం, ఎస్సి సాంఘిక సంక్షేమ విద్యాలయం, పురపాలక సంఘం అనుమతు పొందిన రోడ్ల్ , డ్రైనేజీలు రాబోవు మూడు సంవత్సరాలలో పూర్తిచేసి MLA గా మీ కనీస ధర్మం పాటించాలి అని అన్నారు. ప్రత్తిపాటి ని విమర్శిస్తే మీ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది అని అనుకుంటే అది మీ భ్రమే అని, ఇక MLA  భర్త కుమారస్వామి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య  ఆధిపత్య పోరు తట్టుకోలేక ఏమి మాట్లాడుతున్నాడో తనకే అర్ధం కావటం లేదు అని, మైనారిటీ వర్గానికి పురపాలక మున్సిపల్ ఛైర్మెన్ సీటు MLA రజని ఇవ్వలేదు అని , కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇవ్వవలసి వచ్చింది అని, 30 సీట్ల మెజారిటీ ఇచ్చిన పురప్రజలకి న్యాయం చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యూత్ నాయకులూ, సీనియర్ నాయకులూ, అభిమానులు పాల్గొని ర్యాలీ గా నర్సరావుపేట సెంటర్ నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసారు. 













Share:

మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో MLA రజనిని , చైర్పర్సన్ రఫ్ఫాని ని సత్కరించిన TDP కౌన్సిలర్లు

మున్సిపల్ కౌన్సిల్  సమావేశంలో MLA రజనిని , చైర్పర్సన్ రఫ్ఫాని ని సత్కరించిన TDP కౌన్సిలర్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఈ రోజు నిర్వహించిన తొలి మున్సిపల్ సమావేశంలో టీడీపీ తరుపున గెలుపొందిన 8 వార్డుల కౌన్సలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ చైర్మెన్ షేక్ రఫాని గారిని మరియు MLA రజని గారిని సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఎన్నిక అయినా టీడీపీ,వైస్సార్సీపీ కౌన్సిలర్లకు అభినందనలు తెలియచేసారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/





 











Share:

చిలకలూరిపేటలో నేడు తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - పట్టణంలోని పలు అభివృద్ధి , మరమత్తుల కార్యక్రమాలకి కాంట్రాక్టు టెండర్లు పైన చర్చలు

చిలకలూరిపేటలో నేడు  తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - పట్టణంలోని పలు అభివృద్ధి , మరమత్తుల  కార్యక్రమాలకి కాంట్రాక్టు టెండర్లు పైన చర్చలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు అంశాల పైనా చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా పట్టణంలో మంచినీటి పైపుల లీకేజీలు , రోడ్ల మరమ్మతులు, పట్టణాన్ని పరిశుబ్రముగా ఉంచటం, పొట్టి శ్రీరాముల,YS రాజశేఖర్ రెడ్డి  విగ్రహం ఏర్పాట్లు,  మంచినీళ్ల పైపు లైన్ లేని వార్డులకు ఆయా పైపు లైన్ ఏర్పాటు. పలు అభివృద్ధి కార్యకర్మల పైనా చర్చలు. కాంట్రాక్టు టెండర్ల పైన చర్చలు జరిగే అవకాశం ఉంది  


   

Share:

చిలకలూరిపేట మండలంలోని దండమూడిలో -- పేకాట రాయుళ్లు

చిలకలూరిపేట మండలంలోని దండమూడిలో -- పేకాట రాయుళ్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట మండలంలో రూరల్ SI భాస్కర్ గారి  ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో దండమూడి గ్రామంలో పేకాట స్థావరాల పైనా దాడులు నిర్వహించారు. గ్రామ శివారు పొలాలలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 34 వేల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా SI భాస్కర్ మాట్లాడుతూ రూరల్ పరిధిలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పైన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు అని అన్నారు. 








Share:

చిలకలూరిపేట లో మంగళవారం సాయంత్రం భాస్కర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రయిలర్ - భారీగా పాల్గొన్న జనసైనికులు, మెగా అభిమానులు

చిలకలూరిపేట లో మంగళవారం సాయంత్రం భాస్కర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రయిలర్ - భారీగా పాల్గొన్న జనసైనికులు, మెగా అభిమానులు


https://chilakaluripetspeednews.blogspot.com/


పవన్  కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రయిలర్ నిన్న మంగళవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని థియేటర్స్ లో రిలీజ్ అయింది. అందులో భాగంగా మన చిలకలూరిపేట లోని భాస్కర్ సినిమాస్ లో రిలీజ్ అయింద. పెద్ద ఎత్తున మెగా అభిమానులు,  జన సైనికులు పాల్గొని కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. అలాగే జన సేన పార్టీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గడియారస్థంభం సెంటర్లో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేసారు. 


చిలకలూరిపేట లో మంగళవారం సాయంత్రం భాస్కర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రయిలర్ - భారీగా పాల్గొన్న జనసైనికులు, మెగా అభిమానులు








Share:

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్ళీ మోగుతున్న కరోనా డేంజర్ బెల్స్ - చాలా రోజుల తర్వాత 1000 ధాటిన కేసులు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్ళీ మోగుతున్న కరోనా  డేంజర్ బెల్స్ - చాలా రోజుల తర్వాత 1000 ధాటిన కేసులు :-


https://chilakaluripetspeednews.blogspot.com/


ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తగా 31,142 సాంపిల్స్ పరీక్షించగా అందులో 1005 కేసులు నమోదు అయ్యాయి.  ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు . గత కొన్ని రోజులగా వెయ్యి లోపు కేసులు నమోదు అవుతుండగా. ఆదివారం 1000 మార్కుని టచ్ చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర లో నలబై వేల కేసులు నమోదు అవుతుండగా. అక్కడ లాక్ డౌన్ పెట్టె ఆలోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం.కాబట్టి మాస్క్ లు వాడండి కరోనా నుండి దూరంగా ఉండండి. 






Share:

చిలకలూరిపేటలో నిన్ను ఓడించి నేను గెలుస్తా అని చేసిన శపథాన్ని నిజం చేసిన మన లేడీ సూపర్ స్టార్ రజని -- సినీనటుడు ఆలీ

చిలకలూరిపేటలో నిన్ను ఓడించి నేను గెలుస్తా అని చేసిన శపథాన్ని నిజం చేసిన మన లేడీ సూపర్ స్టార్ రజని -- సినీనటుడు ఆలీ 


https://chilakaluripetspeednews.blogspot.com/

శనివారం పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా హాజరు అయిన సినీనటుడు ఆలీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య వ్యక్తి కి మున్సిపల్ చైర్మెన్ పదవి దక్కటం అది వైస్సార్సీపీ ప్రభుత్వం తోనే సాధ్యం అని. చాలా మంది చైర్మెన్ కోసం పోటీపడి డబ్బుల బ్యాగ్ లతో పార్టీ  ఆఫీస్ చుట్టు తిరిగారు అని కానీ ఒక సామాన్య వ్యకికి చైర్మెన్  పదవి రావటం చైర్మెన్ అయిన రఫాని గారికే నమ్మశక్యం గా లేదు అని.  ఎలక్షన్ ముందు రజని గారు చేసిన శపథం గుర్తుచేశారు. " నిన్ను ఓడించి నేను MLA గా గెలుస్తా " అన్న మాటలు గుర్తుచేశారు. తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్. మన చిలకలూరిపేట లేడీ సూపర్ స్టార్ రజని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ కంటే స్థానిక ఎలక్షన్ లో డబల్ మెజారిటీ ఇచ్చారు అని పట్టణ ప్రజలని కొనియాడారు.  





 
Share:

చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ సాక్షిగా 2024 లో నిన్ను ఓడించేది నేనే -- విడదల రజని

చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ సాక్షిగా 2024 లో నిన్ను ఓడించేది నేనే -- విడదల రజని 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో శనివారం సాయంత్రం వైస్సార్సీపీ ఆధ్వర్యంలో  జరిగిన భారీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీ గా తరలి వచ్చారు.  MLA విడదల రజని చేసిన వ్యాఖ్యలు పార్టీ  శ్రేణులలో  కొత్త ఉత్సహం తీసుకువచ్చాయి. ఈ సందర్భంలో ఆమె మట్లాడుతూ "2024 లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్ లో జగన్ ఆశీసులతో BC మహిళగా చిలకలూరిపేట MLA అభ్యర్థి నేనే నిన్ను ఓడించేది కూడా నేనే" అని ప్రతిపక్ష నాయకులకి సవాళ్లు విసిరారు. ఒక SC వక్తి కి  మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ పదవి , ఒక మైనారిటీ వక్తికి మున్సిపల్ ఛైర్మెన్ పదవి ఒక జగన్ అన్న ప్రభుత్వం లోనే సాధ్యం అని ఆమె అన్నారు. 




 

Share:

చిలకలూరిపేటలో నేడు జరగనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా సినీ నటుడు ఆలీ

చిలకలూరిపేటలో నేడు జరగనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా సినీ నటుడు ఆలీ 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిలర్ విజయోత్సవ సభకు సినీ నటుడు ఆలీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. గడిచిన మున్సిపల్ ఎన్నిలలలో పట్టణములో వైస్సార్సీపీ 38 వార్డులకి గాను 30 వార్డులతో విజయఢంకా మోగించింది. ఎప్పుడు లేని విధంగా 12 వార్డులలో ముస్లిం మైనారిటీలు గెలుపు గుర్రాలు అయ్యారు. అయితే సినీనటుడు ఆలీ రావటం ప్రాధాన్యత సంతరించుకున్నది. మధ్యాన్నం 3:30 నిమిషాకి ఎన్ ఆర్ టి సెంటర్ లోని వైస్సార్సీపీ కార్యాలయము  నుండి భారీ బైక్ ర్యాలీ గా కళామందిర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆలీతో పాటు జిల్లా ఇంచార్జీ , గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, MLA ముస్తఫా, మద్దాలి గిరి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. చిలకలూరిపేట వైస్సార్సీపీ నాయకులూ కార్యకర్తలు భారీ గా తరలిరావాలి అని మున్సిపల్ చైర్మెన్ రఫాని పిలుపునిచ్చారు.  






 

Share:

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థకు పోటీగా TDP సొంత టీమ్ ఏర్పాటుకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థకు పోటీగా TDP సొంత టీమ్ ఏర్పాటుకు రంగం సిద్ధం


https://chilakaluripetspeednews.blogspot.com/

గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీడీపీ తన యాక్షన్ ప్లాన్ మార్పుపైన కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ వాలంటరీ వ్యవస్థకు పోటీగా టీడీపీ సొంత టీమ్ను రెడీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి 50 కుటుంబాలకు ఒక కార్యకర్తను ఎంపికచేసి ఎలక్షన్ బాధ్యత అప్పగించాలి అని చూస్తుంది. ఇప్పటికే ఈ యాక్షన్ ప్లాన్కు చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలలో ఈ వ్యూహాన్ని అమలుపరచాలి అని అనుకుంటున్నట్లు సమాచారం. 



   

Share:

చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ భూముల పరిశీలన

 చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం  జిల్లా కలెక్టర్ భూముల పరిశీలన :-


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం గురువారం  మండలంలోని పోతవరం, బొప్పూడి గ్రామాల పరిధిలోని భూములను పరిశీలించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు. ఆసుపత్రి ఎర్పాటు చెయ్యాలి అంటే 5 ఎకరాల భూమి అవసరం.  అయితే పోతవరం గ్రామా పరిధిలోని త్రాగునీరు చెరువు సమీపం లో 275,276 సర్వ్ నంబర్లలో 15 ఎకరాలని పరిశీలించారు . అయితే ఆ  భూమి ప్రజారోగ్య శాఖకు కేటాయించారు. ఆ భూమి లో నిర్మాణం చెయ్యాలి అంటే కేటాయించిన భూమిలో 5ఎకరాల భూమి కోసం చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ పర్మిషన్ తీసుకోవాల్సిఉంది . లేదా బొప్పూడి గ్రామా ప్రాంతంలో బొప్పూడి రాజాపేట మార్గంలో 513 సర్వే నెంబర్ కొంత పోరంబోకులో ఉన్న 29. 04 ఎకరాలను పరిశీలించారు. ఈ సందర్భంలో తసీల్ధార్ సుజాత, మండల సర్వేయర్ , ఆర్ఐ , విఆర్వోలు పాల్గొన్నారు.  




Share:

AP కొత్త SEC గా నీలం సాహ్ని- ఆమోదముద్ర వేసిన గవర్నర్ హరిచందన్

 AP కొత్త SEC గా నీలం సాహ్ని- ఆమోదముద్ర వేసిన గవర్నర్ హరిచందన్ 


https://chilakaluripetspeednews.blogspot.com/

ప్రస్తుత SEC గా వున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెల చివరకు ముగియనున్నది. అందువలన SEC గా ఎవరిని నియమిస్తారు అనే ప్రశ్న కు తెర దిన్చుతూ నీలం సాహ్ని గారి పేరు ఖరారు చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు పేర్లను సిఫార్సు చెయ్యగా గవర్నర్ హరిచందన్ గారు నీలం సాహ్ని గా నియమిస్తూ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం సీఎం జగన్ కి ముఖ్య సలహాదారుగా ఉన్న ఆమె ఆయా పదవికి రాజీనామా చేసి SEC గా బాధ్యతలు స్వకరించనున్నారు . 





Share:

చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో రేపు శనివారం జరగబోవు భారీ బహిరంగ సభ పరిశీలించిన చైర్మెన్,వైస్ చైర్మెన్

 చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో రేపు శనివారం జరగబోవు భారీ బహిరంగ సభ పరిశీలించిన చైర్మెన్,వైస్ చైర్మెన్ :--


https://chilakaluripetspeednews.blogspot.com/2021/03/blog-post_6.html

పట్టణంలో కళామందిర్ సెంటర్ నందు  రేపు శనివారం జరగబోయే భారీ బహిరంగ సభ ఎర్పాట్లను పరిశీలించిన ఛైర్మెన్ రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు, బూత్ కన్వీనర్ విడదల గోపిగారు, పట్టణ అధ్యక్షులు తలహఖాన్ గారు. ఈ సందర్భంగా రేపు జరగబోయే సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చెప్పాలి అని తెలిపారు. 


https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/











Share:

చిలకలూరిపేటలో శారదా హైస్కూల్ నందు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన మున్సిపల్ ఛైర్మెన్,వైస్ ఛైర్మెన్

చిలకలూరిపేటలో శారదా హైస్కూల్ నందు  ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన మున్సిపల్ ఛైర్మెన్,వైస్ ఛైర్మెన్ :--


https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణంలోని శారదా హైస్కూల్ నందు మున్సిపల్ చైర్మెన్ రఫాని,వైస్ చైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు గార్ల  పర్యటన ప్రాధాన్యతని సంతరించుకున్నది. ఈ పర్యటనలో భాగంగా పాఠశాలలోని ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల మర్మతుల పైనా చర్చించారు. అలాగే పాఠశాలలోని విధ్యార్ధులతో మాట్లాడి మధ్యాహ్నం భోజన పథకం నాణ్యతని అడిగి తెలుసుకున్నారు.  కరోనా కారణంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి అని , శానిటైజర్ వాడాలి అని . అలాగే భౌతిక దూరం పాటించాలి తెలిపారు. 









Share:

చిలకలూరిపేట పట్టణంలో శనివారం మున్సీపల్ కౌన్సిల్ సభ్యుల విజయోత్సవ ర్యాలీ - భారీ ఎత్తున అభిమానులు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు చైర్పర్సన్ - రఫాని

 చిలకలూరిపేట పట్టణంలో శనివారం  మున్సీపల్ కౌన్సిల్ సభ్యుల విజయోత్సవ ర్యాలీ - భారీ ఎత్తున అభిమానులు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు చైర్పర్సన్ - రఫాని 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట లో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో వైస్సార్సీపీ విజయఢంకా మోగించింది. మొత్తంగా 38  వార్డులకి గాను 30 వార్డులలో ఫ్యాన్ గాలి బాగా వీచింది అనే చెప్పాలి. ఆయా వియజానికి గుర్తుగా శనివారం నాడు పట్టణంలో ఒక భారీ ర్యాలీ ని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ లో పట్టణములోని వైస్సార్సీపీ అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చెయ్యవలసినదిగా కోరారు మున్సిపల్ చైర్మెన్ రఫాని గారు 







Share:

చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్ బంద్ - రోడ్ల పైకి రాని RTC బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు

చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్  బంద్ - రోడ్ల పైకి రాని RTC  బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు 


https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణములో  టీడీపీ,వైస్సార్సీపీ,సిపిఐ,సిపిఎం, కాంగ్రెస్ మద్దతుతో ఈరోజు బంద్ జరుగుతుంది. బంద్ సందర్భంగా పట్టణంలోని కాలేజీలు,స్కూలు మూతపడ్డాయి.  ఉదయం నుండే  APSRTC బస్సులు నిలిపివెయ్యబడ్డాయి. అలాగే వ్యాపారులు బంద్ కి సహకరిస్తూ షాప్స్ మూసివేశారు. అయితే పొద్దున చలివేంద్రం బజార్,మెయిన్ రోడ్  లో కొంచం హడావిడి కనిపించినా తర్వాత దుకాణాలు అన్ని మూసివేసి వారీ మద్దతు తెలియచేసారు. పట్టణంలో అఖిలపక్షం, కార్మికసంఘాలు,ప్రజాసంఘాలు  భారీ ర్యాలీ తో పురవీధులలో తిరిగి కొత్తగా ఎర్పాటుచేసిన రైతు చట్టాలను , పెరుగుతున్న  పెట్రోల్ & డీజిల్, నిత్యవసర సరుకుల ధరలు , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ  ప్రదర్శనలూ చేస్తూ దుకాణాలను,బ్యాంకులను స్వచ్చంధంగా మూసివేసి బంద్ కి సహకరించాలి అని కోరారు. 



https://chilakaluripetspeednews.blogspot.com/












Share:

చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది !!! ???

చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది  !!! ???


https://chilakaluripetspeednews.blogspot.com/


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగరపాలక, పురపాలక సంస్థల చట్టాలను సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్సుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్సు ప్రకారం నగరపాలక సంస్థలకు రెండవ డిప్యూటీ మేయర్, పురపాలక సంస్థలకు రెండవ వైస్  ఛైర్మెన్ నియమితులు కానున్నారు. 
 అయితే చిలకలూరిపేట కు రెండవ వైస్ ఛైర్మెన్ గా ఎవరిని ఎన్నుకోవాలి  అనే ఆలోచనలో ఉన్నారు పాలకవర్గం . రిజర్వేషన్ ఖరారు అయితే ఎవరికీ దక్కుతుందో చెప్పలేము. మొన్న జరిగిన ఎన్నికలలో అత్యధికంగా మహిళా కౌన్సిలర్లు  గెలిచారు . అయితే ఈసారికి రెండవ వైస్ ఛైర్మెన్ పదవి మహిళలకి దక్కవచ్చు. 






Share:

26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది

26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది :--


https://chilakaluripetspeednews.blogspot.com/

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ  మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలిపు మేరకు 26-03-2021 న జరిగే భారత్ బంద్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షడు అయిన శ్రీ కొనకళ్ల విద్యాధరావు లేఖ విడుదల చేసారు. కనుక దుకాణాలు&వ్యాపార సంస్థలు మూసివేసి భారత్ బంద్ కి సహకరించవల్సినదిగా కోరుతున్నారు.  ఇప్పటికే టీడీపీ , వైస్సార్సీపీ,కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. 








Share:

దేశంలో రెండవరోజు కూడా స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

 దేశంలో రెండవరోజు కూడా  స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు :--


https://chilakaluripetspeednews.blogspot.com/

దేశంలో వరుసగా రెండవ రోజు తగ్గిన పెట్రోల్, డిజిల్ ధరలు. ఈ రోజు పెట్రోల్ పైన 21పైసలు , డిజిల్ పైన 20 పైసలు తగ్గినది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం అక్కడ అక్కడ  లాక్ డౌన్  , బ్రెజిల్ లో కరోనా బీభత్సము, ప్రపంచంలో కరోనా, స్ట్రైన్, తాకిడి వలన వాహనం వినియోగం తగ్గటం  మరియు  దేశంలో 5 రాష్ట్రాలలో  ఎలక్షన్ వంటి ప్రభావాలు పెట్రోల్ రెట్లపైన పడ్డాయి అనే చెప్పొచ్చు. గత 4 వారాల నుండి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. 







Share:

చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య

చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పసుమర్రులో సూర్యనారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చిమటావారిపాలెం కి చెందిన సూర్యనారాయణ (61) అనే వ్యక్తి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం పైన పసుమర్రు వెళ్ళాడు. పసుమర్రు శివారుల్లో  రహదారి పక్కనే ఉన్న  సిమెంట్ బల్లపై గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ గా తెలుస్తుంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వలన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వారు ప్రాధమిక నివేదికలో తేలిచ్చారు. మృతుడు కొంతకాలంగా చిలకలూరిపేట లో నివాసం ఉంటున్నాడు. చిలకలూరిపేట అర్బన్ పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. 




 

Share:

చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు

 చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు :--

https://chilakaluripetspeednews.blogspot.com/
 
నేటి యువత మత్తుకి బానిస అవకుండా ఉండటం కోసం పట్టణంలోని ప్రముఖ మోడరన్ డిగ్రీ కళాశాల నందు రురల్ CI  సుబ్బారావు గారి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రురల్ SI రాంబాబు గారు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సుభాని గారు, కళాశాల ఉపాధ్యాయులు, పెద్ద ఎత్తున విధ్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలూ కావద్దు అని , వాటివల్ల కలిగే దుష్పరిణామాలు తెలియచేసారు. అయితే నిన్న పట్టుబడ్డ గంజాయి అమ్మే వ్యక్తి నుండి రాబట్టిన సమాచారం మేరకు విద్యార్థులు ఈ మత్తు పధార్ధాలకి దూరంగా ఉంచటం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించటం పట్ల CHILAKALURIPET SPEED NEWS తరుపున పోలీస్ వారికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 





Share:

చిలకలూరిపేటలో నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు

చిలకలూరిపేటలో నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు  

https://chilakaluripetspeednews.blogspot.com/


గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం చిలకలూరిపేటలో నూతనముగా ఎన్నుకోబడిన మున్సిపల్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ పదవుల అనంతరం బుధవారం ఉదయం ఆయా సేఖలలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ ఛైర్మెన్ గా షేక్ రఫాని గారు మరియు వైస్ ఛైర్మెన్ గా కొలిశెట్టి శ్రీనివాసరావు గారు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యకరంలో MLA  రజని గారు, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బోలేదు చిన్నగారు , పట్టణ వైస్సార్సీపీ బూత్ కన్వీనర్ విడదల గోపిగారు, ముస్లిం నాయకులూ, మతపెద్దలు, వైస్సార్సీపీ నాయకులూ పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. 




Share:

చిలకలూరిపేటలో ఓగెరు వాగు సమీపంలో రోడ్ ప్రమాధం -- వ్యక్తి మృతి

చిలకలూరిపేటలో ఓగెరు వాగు సమీపంలో రోడ్ ప్రమాధం -- వ్యక్తి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట ఓగేరు వాగు సమీపంలో జాతీయ రహదారి పైనా ద్విచక్ర వాహనాన్ని డీ కొన్న టాటా ఏసీ వాహనం వ్యక్తి మృతి. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని పాటిమీద ప్రాంతానికి చెందిన పుల్లంశెట్టి కోటేశ్వరావు అనే వ్యక్తి ఓగేరు వాగు సమీపంలోని అయ్యప్ప స్వామి గుడికి వెళ్లి ఇంటికి  వచ్చేటప్పుడు డివైడర్ దాటుతూ రోడ్ అవతలవైపుకి వెళ్తున్న క్రమంలో అటుగా వెళ్తున్న టాటా మినీ ఏసీ  వాహనం ఢీ కొన్నది. స్థానికుల సంచారంతో అక్కడికి వచ్చిన 108 వాహనంలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే  అనంతరం ఆయనని గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యలో కనుమూశాడు. 






Share:

చిలకలూరిపేట బాలికకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు

 చిలకలూరిపేట బాలికకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు :--


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలోని బాలికకు గిన్నిస్ బుక్ లో చోటు. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని ఫజిలాతబస్సుమ్ అనే తొమ్మిది సంవత్సరాల బాలిక  రికార్డు నెలకొల్పింది . బాలికకు పిరియాడికల్ టేబుల్ లోని   (ఆవర్తన పట్టిక ) మూలకాలని  1.57 నిమిషాలలో అమర్చింది. గతంలో ఈ రికార్డును పాకిస్తాన్ కి చెందిన ఒక అమ్మాయి 2.27 గా  ఉన్నా రికార్డను ఇప్పుడు మన ఫజిలా రికార్డుని బ్రేక్ చేసింది. ఇప్పటికే ఇండియా బుక్ అఫ్ రికార్డు లో చోటు దక్కించుకుంది. త్వరలో గిన్నిస్ బుక్ లో దక్కనుంది. 


https://chilakaluripetspeednews.blogspot.com/
ఆవర్తన పట్టిక 

ఫజిలా, తండ్రి రహీమ్ స్థానిక వైస్సార్సీపీ కార్యాలయం నందు MLA రజని ని కలిసి మరోసారి తన ప్రతిభని చూపించింది. అయితే ఈసారి 1. 27 నిమిషాలలో అమర్చి తన ప్రతిభ చాటుకున్నది ఈ చిన్నారి. ఈ సందర్భంగా MLA  రజని మాట్లాడుతూ బాలిక ప్రతిభను కొనియాడారు. అలాగే విద్యార్థి భవిషత్ కు  అన్ని విధాలుగా సహకారం అందచేస్తాం అని అన్నారు.  





Share:

గుంటూరు జిల్లా రురల్ ఎస్పీ కార్యాలయ పునః ప్రారంభోత్సవంలో లో పాల్గొన్న MLA రజని గారు

 గుంటూరు జిల్లా రురల్ ఎస్పీ కార్యాలయ పునః ప్రారంభోత్సవంలో లో పాల్గొన్న MLA రజని గారు 


https://chilakaluripetspeednews.blogspot.com/

బ్రిటిష్ వారి కాలంలో 1907 లో  నిర్మించబడిన గుంటూరు జిల్లా రురల్ SP  కార్యాలయం జగనన్న నాడు-నేడు అనే కార్యక్రమం తో అన్ని హంగులతో రీ మోడలింగ్ చేపించి ఈ రోజు  పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MLA రజని,డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా ఇంచార్జి శ్రీ రంగనాథ్ రాజు గారు,సుచరితగారు, మోపి దేవి వెంకటరమణ గారు. కోన రఘుపతిగారు,నందిగం సురేష్ గారు,పిన్నెళ్లి రామకృష్ణరెడ్డి గారు పాల్గొన్నారు. 




Share:

గుంటూరు జిల్లా వార్డ్,గ్రామ వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి అవకాశం - దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

గుంటూరు జిల్లా వార్డ్,గ్రామ వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి అవకాశం - దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి:--

https://chilakaluripetspeednews.blogspot.com/

జిల్లాలో కాళిగా ఉన్న 407 గ్రామ , వార్డు వాలెంటీర్ పోస్టులకి నేడే చివరి తేదీ. ఆసక్తి కలవారు ఇక్కడ ఇచ్చిన లింకును క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు . 

https://gswsvolunteer.apcfss.in/

పైన లింక్ ఉపయోగించి దరఖాస్తు చేసుకోగలరు. 24న దరకాస్తు పరిశీలన. 25&26 తేదీలలో మండల పరిషత్ కార్యాలయాలలో ఇంటర్వూస్ నిర్వహిస్తారు. 30వ తేదీన ఎంపిక అయిన వారికి సంచారం ఇస్తారు


Share:

రేపటి నుండి స్కూళ్లు తాత్కాలికంగా మూసివేత - విద్యశాఖ మంత్రి

రేపటి నుండి స్కూళ్లు తాత్కాలికంగా మూసివేత - విద్యశాఖ మంత్రి :--


https://chilakaluripetspeednews.blogspot.com/

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లోని అన్ని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీ విద్యాశాఖ మంత్రి అయినా సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీలు తప్ప మిగతా అన్నింటిని తాత్కాలికంగా మూసివేస్తునట్లు తెలిపారు. ఆన్లైన్ క్లాసులు యధావిధిగా జరుగుతాయి అని చెప్పారు 


Share:

చిలకలూరిపేటలో గంజాయి గుట్టురట్టు - ఇంజనీరింగ్ విద్యార్హులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం

చిలకలూరిపేటలో గంజాయి గుట్టురట్టు - ఇంజనీరింగ్ విద్యార్హులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట ఎక్క్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చాకచక్యంగా  గంజాయి అమ్మేవారిని ప్రీ ప్లాన్డ్ గా పట్టుకున్నారు. వివరాలలోకి వెళ్తే చిలకలూరిపేట మండలం కోమటినేని వారిపాలెం గ్రామములో కోటేశ్వరరావు అనే వ్యక్తిని ఎక్క్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఆ వ్యక్తికి సప్లై ఎక్కడనుండి వస్తుందో ఆరాతీసారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లెకు చెందిన మస్తాన్ రావు అనే వ్యక్తి దగ్గిర నుండి గంజాయి వస్తుంది అని తెలుసుకొని కోటేశ్వరరావు నుండి మస్తాన్ రావు కి ఫోన్ చేపించి గంజాయి అయిపోయింది తీసుకురమ్మని చూపించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి 25kgల గంజాయి తీసుకొని వస్తుండగా మార్గమధ్యలో బొప్పూడి గుడి వద్ద అతనిని పట్టుకున్నారు. 
 ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ఈ గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి అని ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడేవాళ్ళ పైన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. అలాగే ఎక్సైజ్ బ్యూరో CI కర్ణ , SI ప్రసాద్ గారిని మరియు సిబ్బందిని అభినందించారు.   




Share:

చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో పుర ప్రజలు :--

 చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో  పుర ప్రజలు :--


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు  - ఒకప్పుడు పట్టనములోని చౌత్ర సెంటర్కు , మదినగర్ వెళ్లే దారులలో ప్రజలు అటువైపుగా వెళ్ళాలి అంటే భయపడేవారు, పెద్ద పెద్ద గుంతలు ఆగుంట్టలు తపించుకోవటానికి చిన్నగా వెళ్తూ ట్రాఫిక్ జాంలో చిక్కుకునేవారు వాహనదారులు. రోడ్లు సరిగాలేక దుమ్ము ధూళితో పుర ప్రజలు ఇబ్బంది పడేవారు. కానీ కొన్ని రోజుల క్రితం మరమ్మతులు  చేసిన రోడ్లు (నరసరావుపేట సెంటర్ నుండి చౌత్ర సెంటర్ మీదుగా కళామందిర్ సెంటర్ వైపు ) వలన పట్టణములో ట్రాఫిక్ కష్ఠాలు తగ్గాయి మరియు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 



Share:

చిలకలూరిపేట నేషనల్ హైవే పైన గంజాయి పట్టివేత

 చిలకలూరిపేట నేషనల్ హైవే పైన  గంజాయి పట్టివేత :--


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట లో గంజాయి పట్టివేత. స్థానిక సమాచారం మేరకు చిలకలూరిపేట బొప్పూడి గుడి సమీపంలో నేషనల్ హైవే పైన ఒక వక్తి బైక్ పైన తరలిస్తున్న క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకి వచ్చిన సమాచారంతో ఆయా వ్యక్తిని పట్టుకున్నారు. అతడి నుండి  సుమారు 20 kgల గంజాయి ని పట్టుకున్నారు. దాని విలువ సుమారు లక్షలలో ఉండవచ్చు. ఎక్కడనుండి ఎక్కడికి తరలిస్తున్నారు అనే దానిపైన విచారణ మొదలుపెట్టారు. 




Share:

చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ :--

 చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ  :--

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ లో  ఉన్న మహాలక్ష్మి e టికెట్స్ అనే మనీ ట్రాన్సఫర్ దుకాణంలో చోరీ జరిగినది. దుండగులు షట్టర్ తలుపులు పగులకొట్టి షాప్ లో ఉంచిన సుమారు నాలుగువేల రూపాయల నగదుని తీసుకొని పారిపోయారు. షాప్ యజమాని బాల మురళీకృష్ణ స్థానిక పోలీస్టేషన్ కి సమాచారం అందించారు. పోలీసులు వారు ఘటన స్థలానికి చేరుకొని  కేసు నమోదుచేసి  విచారణ చేపట్టారు. 

 

Share:

చిలకలూరిపేట D R N S C V S డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకటరాయలు గారు మృతి చెందారు

చిలకలూరిపేట  D  R N S C V S  డిగ్రీ కాలేజీ  రిటైర్డ్  ప్రిన్సిపాల్ వెంకటరాయలు గారు మృతి చెందారు 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని డి ఆర్  ఎన్ ఎస్  సి వి ఎస్ డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ అయిన శ్రీ తోటకూర వెంకటరాయులుగారు బెంగళూర్ లోని ఒక ప్రముఖ వైద్యశాలలో ఈరోజు మృతి చెందారు. వెంకటరాయులుగారి మృతికి DNRNSCVS పూర్వ విద్యార్థులు సంతాపం తెలిపారు. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం సాయంత్రానికి పండరీపురం 5వ లైన్ లోని నివాసానికి తీసుకువస్తారు అని సమాచారం. 
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.