మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట 52 ఎకరాలలో 6500 ఇల్లు శిధిలం చేసిన అసమర్ధ నాయకురాలివి -- టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలలో టీడీపీ నాయకులు

 చిలకలూరిపేట 52 ఎకరాలలో  6500 ఇల్లు శిధిలం చేసిన అసమర్ధ నాయకురాలివి -- టీడీపీ 40వ  ఆవిర్భావ వేడుకలలో టీడీపీ నాయకులు 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులూ , అభిమానుల మధ్య టీడీపీ పట్టాన అధ్యక్షులు పఠాన్ సమ్మద్ ఖాన్ పార్టీ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులూ మాట్లాడుతూ 4000 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక్క మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుగారికి మాత్రమే సాధ్యం అన్నారు. అలాగే 52 ఎకరాలలో ఎర్పాటు చేసిన 6500 ఇళ్ల నిర్మాణం 90%  పూర్తి అయినా మిగిలిన 10 % నిర్మాణాలని పూర్తిచేయకుండా శిధిలా లుగా మిగిల్చిన ఘనత ఒక్క రజనికి మాత్రమే సాధ్యం అని అన్నారు . అలాగే పట్టణంలో త్రాగు నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ఎన్టీఆర్ సృజల పధకం ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసారు సదరు ప్లాంట్ సామాగ్రిని తూకం వెయ్యటానికి కూడా పనికిరాకుండా చేసారు అని అన్నారు. ప్రత్తిపాటి హయాం లో వచ్చిన కేంద్రీయ విశ్వ విద్యాలయం, గురుకుల పాఠశాల, మైనారిటీ విద్యార్థుల వసతి నివాసం, ఎస్సి సాంఘిక సంక్షేమ విద్యాలయం, పురపాలక సంఘం అనుమతు పొందిన రోడ్ల్ , డ్రైనేజీలు రాబోవు మూడు సంవత్సరాలలో పూర్తిచేసి MLA గా మీ కనీస ధర్మం పాటించాలి అని అన్నారు. ప్రత్తిపాటి ని విమర్శిస్తే మీ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది అని అనుకుంటే అది మీ భ్రమే అని, ఇక MLA  భర్త కుమారస్వామి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య  ఆధిపత్య పోరు తట్టుకోలేక ఏమి మాట్లాడుతున్నాడో తనకే అర్ధం కావటం లేదు అని, మైనారిటీ వర్గానికి పురపాలక మున్సిపల్ ఛైర్మెన్ సీటు MLA రజని ఇవ్వలేదు అని , కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇవ్వవలసి వచ్చింది అని, 30 సీట్ల మెజారిటీ ఇచ్చిన పురప్రజలకి న్యాయం చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యూత్ నాయకులూ, సీనియర్ నాయకులూ, అభిమానులు పాల్గొని ర్యాలీ గా నర్సరావుపేట సెంటర్ నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసారు. 













Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.