మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట పట్టణంలో రేపు శనివారం నాడు చికెన్, మటన్, చేపల మార్కెట్ లు మూసివేయాలి - మున్సిపల్ కమిషనర్

చిలకలూరిపేట పట్టణంలో రేపు శనివారం నాడు చికెన్, మటన్, చేపల మార్కెట్ లు మూసివేయాలి - మున్సిపల్ కమిషనర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలో రేపు అనగా 02 -10 -2021 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా చికెన్,మటన్, చాపల మార్కెట్ తోపాటుగా బార్ అండ్ రెస్టారెంట్లు,నాన్ వెజ్ హోటల్స్ మూసి వేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన దుకాణాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Share:

చిలకలూరిపేట మున్సిపల్ పాఠశాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

 చిలకలూరిపేట మున్సిపల్ పాఠశాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని మునిసిపల్ పాఠశాలలను మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పరిశీలించారు. అందులో భాగంగా వడ్డెర కాలనీలో ఉన్న మున్సిపల్ పాఠశాలను సందర్శించి స్కూల్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అలాగే తరగతి గదుల్లోనే విద్యార్థులతో కొంచెం సేపు ముచ్చటించి విద్యార్థులతోపాటు క్లాస్ రూమ్ లోనే బెంచీల పై కూర్చొని పాఠాలను విన్నారు.

Share:

చిలకలూరిపేట... ప్రాణాల మీదకు తెచ్చిన ఫోన్ EMI

చిలకలూరిపేట... ప్రాణాల మీదకు తెచ్చిన ఫోన్ EMI

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణం లోని చౌత్ర సెంటర్లోని ఒక ప్రముఖ మొబైల్ షో రూమ్ నందు గురువారం ఉదయం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని ఒక ప్రముఖ మొబైల్ షో రూమ్ నందు ఫైనాన్స్ EMI కి సంబంధించిన విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంలో ఇరువురు బాహాబాహీకి దిగి ఒకరినొకరు పరస్పరం దాడికి పాల్పడ్డారు. ఇందులో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడగా మరొక వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. సదరు తీవ్రంగా గాయాలు అయిన వ్యక్తి గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు మరొక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Share:

చిలకలూరిపేట పట్టణంలో యూజర్ చార్జీలు ఏ వ్యాపారులు ఎంత కట్టాలి ?

 చిలకలూరిపేట పట్టణంలో యూజర్ చార్జీలు ఏ వ్యాపారులు ఎంత కట్టాలి ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


పట్టణంలోని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీ నుండి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఏ వ్యాపారులు ఎంత కట్టాలి అనేది ఈ క్రింది చూడండి.

గృహాలకు- 60

ఫంక్షన్ హాల్స్ కు- 2500

చిన్న హాస్పిటల్స్ కు- 1000

కమర్షియల్ మాల్స్ కు- 2500 

వెజిటేబుల్స్ దుకాణాలకు- 100 

స్వీట్ షాప్ బేకరీ లకు- 1000 బార్ 

అండ్ రెస్టారెంట్ లకు- 2000 

రెస్టారెంట్ హోటళ్లకు- 1000 

మ్యారేజ్ హాల్స్ కు- 7500 

40 బెడ్రూం హాస్పిటల్స్ కు- 7500 

విద్యా సంస్థలకు- 400 నుండి 2000 

కమర్షియల్ కాంప్లెక్స్ కు- 1500 

చికెన్ స్టాల్ కు- 300

ఫైవ్ స్టార్ పెద్ద లాడ్జి లకు- 10000 

త్రీ స్టార్ చిన్న లాడ్జ్ లకు- 7500 

50 రూమ్ లాడ్జి లకు- 2500 

20 రూమ్ లో లాడ్జిలు లకు- 2000 

ఫాస్ట్ ఫుడ్- 200 

చిన్న రెస్టారెంట్లు- 250 

మీడియం రెస్టారెంట్లకు- 750 గా నిర్ణయించారు. అక్టోబర్ 1వ తేదీ నుండి యూజర్ చార్జీలు అమలులోకి వస్తాయి.

Share:

చిలకలూరిపేట పురపాలక శాఖ ఆధ్వర్యంలో యూజర్ చార్జీల వసూళ్లకు రంగం సిద్ధం చేశారు

 చిలకలూరిపేట పురపాలక శాఖ ఆధ్వర్యంలో యూజర్ చార్జీల వసూళ్లకు రంగం సిద్ధం చేశారు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ క్రింద అక్టోబర్ 1వ తేదీ నుండి యూజర్ చార్జీల వసూళ్లు చేయనున్నారు. దీంతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో లో అక్టోబర్ ఒకటో తేదీ నుండి మన చిలకలూరిపేట పట్టణంలో కూడా యూజర్ చార్జీలు ప్రతి ఇంటి నుండి 60 రూపాయలు వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ షేక్ రఫ్పాని తెలిపారు. 30వ తేదీ గురువారం నాడు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే నెల 19వ తేదీన చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ నందు పట్టణంలోని 38 వార్డు లో తడి చెత్త పొడి చెత్త సేకరణకు మున్సిపల్ సభ్యులు ఆమోదం తెలపడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. చిలకలూరిపేట లోని 38 వార్డు లో గానూ మొత్తం 27 వేల గృహాల నుంచి తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం కోసం 39 ఆటోలను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. దీని ద్వారా సుమారు 16 లక్షల 20 వేల రూపాయలు ఆదాయం రానున్నది .దీంతోపాటు చికెన్ స్టాల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్, బేకరీలు, హోటల్స్, లాడ్జిలు, వ్యాపార వాణిజ్యపరమైన  38 వ్యాపార వర్గాల నుండి ఈ చెత్త సేకరణకు సర్వం సిద్ధం చేశారు

Share:

చిలకలూరిపేట ఎలక్ట్రానిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం - భారీగా ఆస్తి నష్టం

 చిలకలూరిపేట ఎలక్ట్రానిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం - భారీగా ఆస్తి నష్టం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణం లోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం అతి సమీపంలోని ఎలక్ట్రానిక్ గోడౌన్ నందు గురువారం రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే చౌత్ర  సెంటర్ లోని ప్రముఖ విజయలక్ష్మి ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన  ఏసీలు, ఫ్రిట్జ్ ,కూలర్స్ ,టీవీలు వంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ స్టాక్ ఉంచటం కోసం ఆర్య వైశ్య కళ్యాణ మండపం పక్కనే ఉన్న ఒక గోడౌన్లో ఉంచారు. అయితే గురువారం రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి గోడౌన్ యజమాని సమాచారం మేరకు హుటాహుటిన అక్కడికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే చేసే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ రఫ్పాని మరియు వైయస్సార్సిపి నాయకులు విడుదల గోపి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి గోడౌన్ యజమాని మధును పరామర్శించారు. ప్రాథమిక సమాచారం మేరకు 30 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.