మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

నేటి బంద్ కు మేము సహకరించము - చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట

నేటి బంద్ కు మేము సహకరించము - చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- నేడు జరగబోయే బంద్ కు తాము సహకరించమని చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట అధ్యక్షులు కూనాల వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వారు ప్రకటించిన బంద్ అది వారి వ్యక్తిగత దూషణలతో అప్రయోజనాత్మకంగా ఉన్న కారణంగా మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించుట సహేతుకంగా లేనందున మేము  బంద్ కు మద్దతు తెలియపర్చుటలేదు. ఈ కరోనా కష్టకాలంలో వ్యాపారస్తులు అనేక వ్యాపార మరియు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నందువలన, ఈ బంద్ వలన సమాజానికి సరైన ఉపయోగం లేనందున చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట వారు ఈ బంద్ కు సహకరించుట లేదు అని చిలకలూరిపేట చాంబర్‌ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తెలిపారు.





Share:

చిలకలూరిపేట:- నియోజకవర్గంలో నిరసన చేపట్టిన టిడిపి కార్యకర్తలు

చిలకలూరిపేట:- నియోజకవర్గంలో నిరసన చేపట్టిన టిడిపి కార్యకర్తలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని టిడిపి కార్యకర్తలు మంగళగిరి కేంద్ర టిడిపి కార్యాలయం పై జరిగిన దాడుల కారణంగా నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని టిడిపి కార్యాలయం నుండి నరసరావుపేట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అలాగే నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండల టిడిపి అధ్యక్షుడు బండారు సత్యనారాయణ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం పట్టణంలో టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగబోయే బంద్ ను విజయవంతం చేయాలని తెలిపారు.



Share:

రేపు చిలకలూరిపేట బంద్ కు అందరూ సహకరించాలి - ముద్దన నాగేశ్వరరావు

రేపు చిలకలూరిపేట బంద్ కు అందరూ సహకరించాలి - ముద్దన నాగేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని యడ్లపాడు మండల అధ్యక్షులు ముద్దన నాగేశ్వర రావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త బందులో భాగంగా బుధవారం తలపెట్టిన చిలకలూరిపేట బందుకు అందరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా ముద్దన నాగేశ్వర రావు  మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అదే విధంగా విశాఖ, కడప, హిందూపురం, విజయవాడ తదితర కార్యాలయాలు, నాయకుల ఇళ్ల పై భౌతిక దాడులు చేయడమే కాకుండా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇంటి పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో  ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఊరు,ఊరు తిరుగుతూ ఇచ్చిన హామీలను అమలు పరచకపోవడమే కాకుండా ప్రజల పై అనేక రకాలుగా మోపుతున్న పన్నుల భారాన్ని ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని అధికారపక్షం భౌతిక దాడులు చేయడం నీచమైన చర్య అన్నారు. ప్రశ్నించిన వారి పై భౌతిక దాడులు చేయడం అదే విధంగా కార్యాలయాలు ధ్వంసం చేయడం అంటే వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడమే అని, ప్రతిపక్ష పార్టీలుగా తాము చేస్తున్న ఆరోపణలకు సరైన సమాధానం చెప్పాల్సింది పోయి ఇటువంటి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న నేతలపై దాడి చేయడం,తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పై చేసిన దాడి అని అన్నారు. ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకతను రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి ప్రజల దృష్టి మార్చాలనే వైసీపీ లక్ష్యమని,ఇది ఒక ప్లాన్ ప్రకారం పక్కా వ్యూహంతో జరిగిన దాడిగా భావిస్తున్నామని ప్రభుత్వము తన విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై కేంద్రం ప్రభుత్వం దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్టప్రతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.



Share:

రేపు ఏపీ బంద్ కు టిడిపి పిలుపు

 రేపు ఏపీ బంద్ కు టిడిపి పిలుపు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ :-  మంగళవారం నాడు ఏపీ బంద్ కు టిడిపి పిలుపునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే .. మంగళవారం సాయంత్రం సమయంలో మంగళగిరి కేంద్ర టిడిపి కార్యాలయాన్ని YSRCP కార్యకర్తలు ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా రేపు అనగా బుధవారం నాడు ఏపీ రాష్ట్ర బంద్ కు టిడిపి పిలుపునిచ్చింది. మంగళగిరి తో పాటు  రాష్ట్రంలోని పలు జిల్లాల టిడిపి ప్రధాన కార్యాలయాలపై దాడికి యత్నించడంతో పాటు  టిడిపి నేత పట్టాభి ఇంటిని ధ్వంసం చేయడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని పోలీస్ శాఖ మరియు ప్రభుత్వం విఫలం అయిందని మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంగళగిరి జాతీయ రహదారిపై టిడిపి కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Share:

చిలకలూరిపేట:- గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉచిత ఫిజియోథెరపీ సేవలు - పట్టణ ప్రజలు సేవలు సద్వినియోగం చేసుకోవాలి

చిలకలూరిపేట:- గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉచిత ఫిజియోథెరపీ సేవలు - పట్టణ ప్రజలు సేవలు సద్వినియోగం చేసుకోవాలి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిల‌క‌లూరిపేట :  చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని చీరాల రోడ్డులో ఉన్న‌ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఉచితంగా ఫిజియోథెర‌పి సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు డాక్ట‌ర్ భ‌వ్య‌శ్రీ తెలిపారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అఖిల భారత అవినీతి నిర్మూలన , వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వవైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన  ఫిజియోథెరపీ సేవలపై స్థానిక బాపూజీ వృద్ధాశ్ర‌మం ఆవ‌ర‌ణ‌లో మంగ‌ళ‌వారం అవగాహనసదస్సు నిర్వ‌హించారు.  వినియోగదారుల సంఘం అధ్యక్షుడుమురికిపూడి ప్రసాద్ అధ్యక్షత వహించారు.  ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ భవ్యశ్రీ మాట్లాడుతూ వృద్దులకు వయసు రీత్యా వచ్చే నొప్పులు, పక్షవాతం వచ్చిన వారికి,  షుగర్ పేషెంట్లకు,  బీపీ పేషెంట్లకు వచ్చే నొప్పుల గురించి వివ‌రించారు. మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు, మెడ నొప్పులు, ఛాతి నొప్పి, ఎలర్జీలు గురించి తెలియ‌జేశారు. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా డైట్ చార్ట్ ఇస్తామని, గుండె సంబంధిత వ్యాధుల వారికి E.C.G చేస్తామని, ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులకు ప్రత్యేక  క్యు ఉంటుందని ఎవరూ నిలబడనవసరం లేదని  వచ్చిన వెంటనే వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నొప్పులు ఎక్కువగా ఉన్నవారు తమను సంప్రదిస్తే వెంటనే వైద్య సహాయం చేస్తామని ప్రధాన మంత్రి మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా  అన్ని వయసుల వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల నొప్పులకు సంబంధించిన పరికరాలు, మెషిన్ అందుబాటులో ఉన్నాయ‌న్నారు.    ప్రతి ఒక్కరు ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమం ఏఎన్ఎం పరమేశ్వరి, వినియోగదారుల సంఘం గౌరవ సలహాదారు ఆరాధ్యుల రామకృష్ణ పాల్గొన్నారు.



Share:

చిలకలూరిపేట:- ముఖ్య రహదారి పై భారీ గుంత - మున్సిపల్ అధికారులు దీనిపై దృష్టి పెట్టండి అని స్థానికుల ఆవేదన !

చిలకలూరిపేట:- ముఖ్య రహదారి పై భారీ గుంత - మున్సిపల్ అధికారులు దీనిపై దృష్టి పెట్టండి అని స్థానికుల ఆవేదన !

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- పట్టణంలోని శారదా హైస్కూల్ రోడ్డు నందు ఏర్పడిన భారీ గుంత వలన వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు. చీరాల నుండి వచ్చే బస్సులు, లారీలు, కార్లు, పెద్ద వాహనాలు శారదా హైస్కూల్ మీదుగా కళామందిర్ సెంటర్కు చేరుతాయి. అయితే శారద హై స్కూల్ ఎదురుగా ఉన్న ఆ గుంత వలన ట్రాఫిక్ సమస్యల ఏర్పడటమే కాక చాలా ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అర్ధరత్రి సమయాల్లో గుంత లో ఉన్న ఇనుప చువ్వలు వలన వాహనాల టైర్లు పంచర్లు అవుతున్నాయని. నిత్యం రద్దీగా ఉండే ఇలాంటి రోడ్లను మున్సిపల్ అధికారులు గుర్తించి మరమ్మతులు చేయించి వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని స్థానికులు కోరారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.