మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట :- తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తుతో బస్సు యాక్సిడెంట్

చిలకలూరిపేట :- తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తుతో బస్సు యాక్సిడెంట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని తాతపూడి జాతీయ రహదారి సమీపంలోని లక్కీ రోడ్ లైన్స్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 30 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి విజయవాడ వెళుతున్న ఇందు బస్ ట్రావెల్స్ తెల్లవారుజామున గం 4:15 ఈ సమయంలో జాతీయ రహదారి పైన రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఈ ఘటనకు ముఖ్యకారణం డ్రైవర్ నిద్ర మత్తు వలన ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన లో ఐదుగురికి స్వల్ప గాయాలు అవగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఒక హుటిన ఘటనా స్థలానికి చేరుకొని స్వల్ప గాయాలైన వారికి అక్కడే చికిత్స అందించి తీవ్రగాయాలైన చంద్రమోహన్, కటారి సురేష్ బాబులను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.



Share:

ఓడరేవు - చిలకలూరిపేట - పిడుగురాళ్ల హైవే పనులు త్వరగా మొదలు పెట్టాలని గడ్కరిని కోరాం - చిలకలూరిపేట పర్యటనలో రాజ్యసభ సభ్యుడు G V L నరసింహారావు

ఓడరేవు - చిలకలూరిపేట - పిడుగురాళ్ల హైవే పనులు త్వరగా మొదలు పెట్టాలని గడ్కరిని కోరాం - చిలకలూరిపేట పర్యటనలో రాజ్యసభ సభ్యుడు G V L నరసింహారావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంతాలలో పర్యటిస్తూ ఆయా ఏరియాలలో ఉండే సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు సోమవారం నాడు చిలకలూరిపేటలో పర్యటించారు రాజ్యసభ సభ్యుడు GVL నరసింహారావు. పట్టణంలోని బిజెపి నాయకులతో నిర్వహించిన చర్చల అనంతరం ఆయన విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణానికి ప్రభుత్వం అనేక నిధులను కేటాయించిందని ముఖ్యంగా చిలకలూరిపేట బైపాస్ పనులు త్వరగా పూర్తిచేయాలని.. ఆలస్యానికి గల కారణాలను రాష్ట్ర మంత్రులతో చర్చించి త్వరగా బైపాస్ పనులు పూర్తిచేయాలని.. అలాగే చీరాల ఓడ రేవు నుండి చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట, పిడుగురాళ్ల వరకు బైపాస్ పనులను త్వరగా మొదలు పెట్టాలని కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని కోరామని.. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత పథకం కింద సుమారు 180 కోట్ల రూపాయలను కేటాయించిందని దానిద్వారా పట్టణంలోని అన్ని ఏరియాలకు త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని.. అలాగే ప్రధానమంత్రి  ఆవాస్ యోజన కింద 4500 ఇళ్లను కేటాయించామని కానీ వాటిని ఇంకా అర్హులకు అందలేదని వాటిపై చర్చిస్తామని ఆయన తెలిపారు. అలాగే పట్టణంలోని పలు సమస్యలపై ఆయన చర్చించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పట్టణంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించారు.



Share:

అయ్యప్ప మాల ధారణ ఎప్పుడు చేయాలి ? ఎప్పుడు చేయకూడదు ?

అయ్యప్ప మాల ధారణ ఎప్పుడు చేయాలి ? ఎప్పుడు చేయకూడదు ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


1. తల్లిదండ్రులు గతించినచో ఏడాదికాలము వరకు మాల ధరించరాదు.

2. సవతి తల్లిదండ్రులు గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.

3. భార్య గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.

4. సవతి భార్య (రెండవ భార్య) గతించినచో 3 నెలల వరకు మాల ధరించరాదు.

5. పెదతండ్రులు , పినతండ్రులు , పెద్దతల్లులు , పినతల్లులు , గతించినచో 3 పక్షములు (45  రోజులు) మాల ధరించరాదు.

6. సోదరులు , పుత్రులు , మేనత్తలు , మేనమామలు , తాత (తండ్రి తండ్రి), బామ్మ (తండ్రి తల్లి) గతించినచో  41 దినములు  మాల ధరించరాదు. 

7. కన్నకూతురు , కోడళ్ళు , అల్లుళ్ళు , మరదళ్ళు , వదినెలు , మరుదులు , బావలు , బావమరుదులు  గతించినచో 30 దినములు (1 నెలపాటు) మాల ధరించరాదు.

8. మనవాళ్ళు , మనవరాళ్ళు , దాయాదులు   గతించినచో 21 దినములు  మాల ధరించరాదు.

9. ఇంటిపేరు గలవారు , రక్తసంబంధీకులు గతించినచో  21 దినములు  మాల ధరించరాదు.

10. వియ్యాలవారు , దూరపుబంధువులు గతించినచో 13 దినములు మాల ధరించరాదు.

11. ఆత్మీయులు , మిత్రులు  గతించినచో 13 దినములు (దుఃఖము అనుష్ఠించి) మాల ధరించరాదు.

12. ఒకరు దత్తపుత్రులై వెళ్ళిన పిమ్మట దత్తత తీసుకున్న తల్లిదండ్రులు గతించినను అతనికి ఏడాదికాలము సూతకముండును కావున మాల ధరించరాదు.          దత్తతకు వెళ్ళిన తరువాత వాని కన్న తల్లిదండ్రులు గతించినచో 6 నెలలు సూతకముండును , కావున మాల ధరించరాదు.

13. పైన తెలిపిన వారిలో ఎవరు గతించినను వారికి విధిగా కర్మకాండలు నిర్వహించే వారసులు లేక ఇంకెవరైనా కర్మలు చేసినచో అట్టివారికి కుడా ఏదాడి సూతకముండును. కావున అట్టివారు ఏడాది కాలము మాల ధరించరాదు.

14. తల్లి , భార్య , కూతురు , కోడలు , మరదళ్ళు , సోదరి , మున్నగువారు 7 నెలల గర్భిని అయినచో మాల ధరించి దీక్ష తీసుకొనరాదు , ఏలనగా దీక్షలో ఉండగా     వారు (7వ నెల , 8వ నెల , 9వ నెలలో ఎప్పుడైనా) ప్రసవించినచో శుభ సూతకము వస్తుంది , కావున మాలను విసర్జన చేయవలసి వచ్చును. అందువలన మాల ధరించరాదు.

15. మాల ధరించి దీక్షలో ఉండగా కన్నకూతురు రాజ్వరాలు అయితే ఆ వార్త వినగానే తాను ఎన్ని దినములు దీక్ష ముగించినానను , వెంటనే దీక్ష విరమించి , గురుస్వామి ద్వారా మాల విసరర్జించి , మాలను కడిగి , దేవును వద్ద వుంచి , పై సంబరాలలో పాల్గొని , కూతురుకి న్యాయము చేకూరునట్లు తన కర్తవ్యాన్ని ఆచరించాలి. అదియే అయ్యప్పకు ఆనందదాయకము , భక్తులకు శ్రేయదాయకం.

16. దీక్షలో ఉండగా బందువర్గాదులలో ఎవరైన గతించినను ఆ వార్త తెలియగానే  మాల విసర్జన చేసి వారి దుఃఖములో పాలు పంచుకోవలయును , అలా కాక మాలో మాకు మాటలు , పలకరింపులు , రాకపోకలు అసలే లేవు మాకు ఆ మరణముతో ఎలాంటి పట్టింపులు లేవు నేను మాలలో ఉన్నాను రాకూడదు అని సాకులు చెప్పి మాల విసర్జింపక సూతకముతో పావన శబరిగిరి ఎక్కుట అపచారము అని మన పెద్దలు ఆదేశించి యున్నారు , కావున శుభాశుభ  సూతకములు కలవారు పైన చెప్పిన సూచనల ప్రకారము తమ గురుస్వాములను సంప్రదించి,మాల విసర్జించి,శబరియాత్ర చేసి సద్గురునాధుడైన శబరిగిరీశుని అనుగ్రహము పొందుటకు ప్రయత్నించవలయును.

17. కుటుంబములో శుభసూతకము లేదా అశుభసూతకము కలిగి మద్యలో దీక్ష విరమించవలసి వచ్చినవారు,తదుపరి వెంటనే మాల వేసుకొనక పావన పద్దెనిమిది మెట్లు ఎక్కే రోజు నాటికి మండలకాలము అనగా 41 దినములు దీక్ష వహించే అవకాశము ఉంటేనే మరల మాల ధరించవలయును,అలా వీలుకాని పక్షములో వారు ఆ సంవత్సరం ఇరుముడి లేకుండా శబరిమలై సన్నిధానములోనే ఉత్తరవైపు మెట్లెక్కి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి వారిని దర్శించి వచ్చుటకు దోషము లేదు.

18. ఎవరైనా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాలవేసుకొని దీక్షలో ఉండగా పొరపాటున గర్భము పోవడము కాని , గర్భస్రావము గాని , లేదా జన్మించిన తరువాత శిశువు పోవడము కాని జరిగినట్లయితే 10 రోజులు సూతకముండును. కావున మాలను విసర్జించవలయును. అలాగే మరల మండల కాలము సమయమున్నచో దీక్షబూని శబరియాత్ర చేయవచ్చును.

19. స్త్రీలు మాత్రము 10 సంవత్సరాల వయస్సు దాటినా వారు మాల ధరించరాదు,ఏలనగా వారు ఏ సమయాన్నైనా ప్రథమ రజస్వ అయ్యే అవకాశముంది దాని వలన శుభసూతకం ఏర్పడుతుంది. అందువలన పావన శబరిగిరిని అపవిత్రం చేయరాదు. అలానే 50 సంవత్సరాలు వయస్సు దాటని వారు మాల ధరించి దీక్ష (41 రోజులు) పూర్తి కాదు. అందువలన వారికి శబరియాత్ర చేసే అర్హత లేదు.

20. దీక్షా సమయములో మన సన్నిదానము దరిలో ఎవరైనా గతించినచో విన్న వెంటనే ఎవరైనా అందరూ స్నానమాచరించి శరణుఘోష చెప్పుతూ అఖండ దీపము ఆ రోజు వెలిగించి సన్నిదానము మూసివేయవలెను. సన్నిదానము స్వాములంతా కలిసి వేరే సన్నిదానములో ఉండవలెను. ఆ కళేబరము తీసిన తరువాత సన్నిదానమంతా శుభ్రపరచి ఆవు పంచకముతో శుద్ధి చేసి మరల పూజలు విధి విధానంగా జరుకోవలెను.

21. మండల దీక్షలో ఉండగా గ్రహణములు (సూర్యగ్రహణము,చంద్రగ్రహణము) ఏర్పడినపుడు విధివిధానంగా పట్టు స్నానము విడుపుస్నానము చేయాలి. అలాగే మన సన్నిదానములో కలశం వద్ద , గ్రహణము విడిచిన తరువాత కుశదర్భరేకులు వేసి ఉంచవలెను. గ్రహణము విడిచిన తరువాత స్నానమాచరించి  సన్నిదానము శుభ్రపరచి స్నానమాచరించి విధిగా దేవుని పూజలు జరిపించాలి. అలాగే గ్రహణ సమయమున తిను బండారము భిక్షలు చేయరాదు.

ఇంకా ఏవైనా తెలియని విషయాలు ఉంటే మీ గురుస్వామి ద్వారా తెలుసుకొని ఆయనగారు చెప్పినట్లు నడుచుకుని సద్గురునాధుని కటాక్షాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటు - మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

పైన సూచించిన అన్నియు చాలా వరకు ఏ దీక్ష చేపట్టిన సుమారుగా ఇవే నియమాలు ఉంటాయి.

ఓం శ్రీ అనాధ రక్షకనే శరణం అయ్యప్ప



Share:

తగ్గేదే లే ! బిల్లులో సమగ్రమైన మార్పులు చేసి మళ్లీ తీసుకొని వస్తాము - అమరావతి ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉంది - సీఎం జగన్

తగ్గేదే లే ! బిల్లులో సమగ్రమైన మార్పులు చేసి మళ్లీ తీసుకొని వస్తాము - అమరావతి ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉంది - సీఎం జగన్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

మధ్యాహ్నం నుండి మూడు రాజధానుల విషయమై రాష్ట్రం మొత్తం చర్చలకు దారి తీసింది - వాటన్నిటికీ తెరదించుతూ ఏపీ అసెంబ్లీ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయ భేదాలు, న్యాయపరమైన చిక్కులు, ఆందోళనలను... దృష్టిలో పెట్టుకొని సమగ్రమైన విచారణలను సేకరించి అందరి ఆమోదయోగ్యం తో బిల్లులను మార్పు చేసి మళ్లీ తీసుకువస్తామని సీఎం తెలిపారు. ఈ సభలో అమరావతి ప్రజల పట్ల తనకు అపారమైన ప్రేమ ఉందని... కానీ ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మూడు రాజధానులు అంశాన్ని తెర మీదకు తీసుకు వచ్చినట్లు తెలిపారు.




Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.