మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 18-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 18-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 18-06-2021,శుక్రువారం నాడు మొత్తం 6 కేసులు నమోదు అయ్యాయి. వాటా వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 6 కేసులు నమోదు అయ్యాయి . 

ఎం.వి నారాయణ పురంలో - 1

వెంగళరెడ్డి నగర్ లో  - 1

సుబ్బయ్యతోట లో - 1

సుగాలని కాలనీ లో - 1

మద్ది నగర్ లో - 2 గా నమోదు అయ్యాయి 


చిలకలూరిపేట మండల గ్రామంలో ఈ రోజు ఎలాంటి  కరోనా కేసు నమోదు కాలేదు 



































Share:

అక్రమాలకు అడ్డాగా చిలకలూరిపేట - స్థానిక నేత దళిత భూములు పైన ఎందుకు మౌనంగా ఉన్నారు - ప్రత్తిపాటి పుల్లారావు

అక్రమాలకు అడ్డాగా చిలకలూరిపేట -  స్థానిక నేత దళిత భూములు పైన ఎందుకు మౌనంగా ఉన్నారు - ప్రత్తిపాటి పుల్లారావు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - మాజీ మినిష్టర్ ప్రత్తిపాటి పుల్లారావు ఏంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో నేను అధికారంలో ఉన్నపుడు ఎన్నిక ప్రచారంలో దళిత భూముల విషయంలో తన పైన విమర్శలు చేసిన జగన్ మోహనరెడ్డి  ఈ రోజు అధికారంలో ఉండి అదే దళిత భూములను ప్రభుత్వం ఏ విధంగా స్వాధీనం చేసుకుంటుంది అని ప్రశ్నించారు. స్థానిక నాయకులు నేతలు కూడా దీని పైనా మౌనం వహించటం ఏంటని, అలాగే దీని పైనా జగన్ మోహన రెడ్డి స్పష్టత ఇవ్వాలి అని అన్నారు. దళితులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని దిని పైనా పోరాటం చేస్తాం అని తెలిపారు. అలాగే చిలకలూరిపేట అధికారం అడ్డం పెట్టుకొని అక్రమ దందా సాగిస్తున్నారు అని 175 నియోజకవర్గాలలో ఎక్కడ లేని విధంగా అక్రమ మద్యం,పేకాట, గుట్కా వ్యాపారాలకు కేరాఫ్ గా మార్చారు, ఎక్కడో పక్క జిల్లా పోలీసులు ఇక్కడ అక్రమ గుట్కాలు పట్టుకునే వరకు ఎక్కడ పొలిసువారు ఎందుకు పట్టించుకోలేదు అని ప్రశ్నించారు. 

సెంట్రల్ గవర్నమెంట్ జర్నలిస్ట్ లను ఫరంట్ లైన్ వర్కర్లుగా గుర్తించినా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అని , మరణించిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు 50 లక్షల ఆర్ధిక నష్టం చెలించాలి అని డిమాండ్ చేసారు.  












































Share:

చిలకలూరిపేటలో రేపు 19-06-2021,శనివారం విధ్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు

చిలకలూరిపేటలో రేపు 19-06-2021,శనివారం విధ్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 19-06-2021 శనివారం నాడు మద్దినగర్ నందు ఫీడర్ మరమ్మతుల కారణంగా మధ్యాహం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మద్దినగర్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, బాలాజీ సినిమాహాల్ రోడ్డు,వెంగళరెడ్డి నగర్,వెంకటప్పయ్య కాలనీ,వెంకటాచారి నగర్,దాసరి కాలనీ,శ్రీనివాస కాలనీ,క్రిస్టియన్ కాలనీ,కొమరవెల్లిపాడు,చీరాల రోడ్డు,రహమత్ నగర్, ఈ ప్రాంతాలలో వారికీ విధ్యుత్ అంతరాయం ఏర్పడును 


















































Share:

చిలకలూరిపేట - బడ్డీ కొట్టుని కూడా వదలని దుండగులు - లక్ష రూపాయల ఆస్థి నష్టం

చిలకలూరిపేట - బడ్డీ కొట్టుని కూడా వదలని దుండగులు - లక్ష రూపాయల ఆస్థి నష్టం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలోని పండరీపురం 10 వ లైన్ లో గత రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం గురించి మా రిపోర్టర్ అక్కడికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. అది అగ్ని ప్రమాదం కాదు అని గతంలో కూడా రెండు సార్లు ఇలాంటి చర్యలకు పాల్బడ్డారు అని బాధితులు తెలిపారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆరికట్ల నరసమ్మ అనే 60 సంవత్సరాల మహిళా పొట్టకూటి కోసం అని చిలకలూరిపేట పండరీపురం 10వ లైన్ నందు బడ్డీ కొట్టు పెట్టుకొని బ్రతుకు సాగిస్తుంది. బుధవారం రాత్రి సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు ఆమె బడ్డీకొట్టు తగలబడటం చూసి ఆమెకు సమాచారం అందించే లోపే బంకు మొత్తం కాలిపోయేది. గత మూడు నెలల క్రితం 20 వేల రూపాయలతో చిన్న పాక నిర్మించుకున్నారు. బంకు లోని సరుకులు సామానులు, బంకు తో కలిపి లక్ష రూపాయల ఆస్థి నష్టం జరిగినట్లు ఆమె చెప్పి కన్నీరుమున్నీరు అయ్యారు. ముసలదానిని ఎవరిపైన ఆధార పడకుండా ఇలా బ్రతుకుతుంటే ఎవరో కావాలి అని ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె తెలిపారు. గతంలో కూడా ఇలాగే రెండు సార్లు బంకు తాళాలు పగులగొట్టిన ఘటనలు ఉన్నాయి అలాంటి వారి పైన చర్యలు తీసుకోవాలి అని ఆమె కోరారు. అసలే కరోనా కష్ట కాలం మళ్ళి ఈ ఘటనతో నేను ఎలా బతకాలి అని ఆమె బాధపడ్డారు. అధికారులు చొరవతీసుకుని ఆమెకు ఆర్ధిక సాయం చెయ్యాలి అని స్థానికులు కోరారు 















































Share:

చిలకలూరిపేట - ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణి

చిలకలూరిపేట - ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - కరోనా వలన ప్రైవేట్ టీచర్లు ఆర్ధికంగా బాగా నష్టపోయారు. ఆత్మభిమానం చంపుకొని బయట పనులు చెయ్యలేక ఎవరికీ ఏమి చెప్పుకోలేక ఏ పని చెయ్యాలో తెలియక సతమతం అవుతున్న ప్రైవేట్ టీచర్లకు చిలకలూరిపేట మునిసిపల్ సిబ్బంది మునిసిపల్ కౌన్సిల్ హాలు నందు నిత్యావసర సరుకులు పంపిణి చేసారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న MLA రజిని 1లక్ష 30 వేల రూపాయల నిత్యావసర సరుకులను ప్రైవేట్ టీచర్లకు అందజేశారు. తమకు అవసరాన్ని తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాన్ని చేసిన మునిసిపల్ సిబ్బందికి ప్రైవేట్ టీచర్లు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్, ప్రైవేట్ టీచర్లు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. 









































Share:

చిలకలూరిపేట - డాక్టర్ల పైనా దాడి కి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన - ప్రతి ఆసుపత్రిని పోలీసులతో రక్షణ కల్పించాలి

 చిలకలూరిపేట - డాక్టర్ల పైనా దాడి కి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన - ప్రతి ఆసుపత్రిని పోలీసులతో రక్షణ కల్పించాలి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలోని డాక్టర్ లావు సతీష్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయిన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు  మంది తమ యొక్క సహనాన్ని కోల్పోయాయి డాక్టర్ల పైన దాడికి పాల్పడటం నిజంగా వైద్య రంగానికి సిగ్గు చేటుగా అని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితిలో ఇంట్లో వాళ్ళకి దూరముగా ఉంటూ పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంటే కొంత మంది ఇలా దాడులకు పాల్పడటం ఏంటి అని బాధని వ్యక్తం చేసారు. 

కరోనా వలన చనిపోయిన వైద్య కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించాలి అని కోరారు, అలాగే హాస్పిటలను రక్షణ కేంద్రాలుగా ప్రకటించి ప్రతి ఆసుపత్రి వద్ద కొంత మంది పోలీసులను తో రక్షణ చర్యలు చేపట్టాలి అని కోరారు. ఈ సమావేశంలో కొల్ల రాజమోహన్, కొల్ల అమర్, గణేశుని పరశురామ్, ముద్దన రమేష్,లావు సతీష్,లావు అరుణ,వెల్లటూరు రాణి, సురేష్ బాబు, వ్ కిషోర్, గారు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు 









































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.