మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - బడ్డీ కొట్టుని కూడా వదలని దుండగులు - లక్ష రూపాయల ఆస్థి నష్టం

చిలకలూరిపేట - బడ్డీ కొట్టుని కూడా వదలని దుండగులు - లక్ష రూపాయల ఆస్థి నష్టం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలోని పండరీపురం 10 వ లైన్ లో గత రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం గురించి మా రిపోర్టర్ అక్కడికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. అది అగ్ని ప్రమాదం కాదు అని గతంలో కూడా రెండు సార్లు ఇలాంటి చర్యలకు పాల్బడ్డారు అని బాధితులు తెలిపారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆరికట్ల నరసమ్మ అనే 60 సంవత్సరాల మహిళా పొట్టకూటి కోసం అని చిలకలూరిపేట పండరీపురం 10వ లైన్ నందు బడ్డీ కొట్టు పెట్టుకొని బ్రతుకు సాగిస్తుంది. బుధవారం రాత్రి సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు ఆమె బడ్డీకొట్టు తగలబడటం చూసి ఆమెకు సమాచారం అందించే లోపే బంకు మొత్తం కాలిపోయేది. గత మూడు నెలల క్రితం 20 వేల రూపాయలతో చిన్న పాక నిర్మించుకున్నారు. బంకు లోని సరుకులు సామానులు, బంకు తో కలిపి లక్ష రూపాయల ఆస్థి నష్టం జరిగినట్లు ఆమె చెప్పి కన్నీరుమున్నీరు అయ్యారు. ముసలదానిని ఎవరిపైన ఆధార పడకుండా ఇలా బ్రతుకుతుంటే ఎవరో కావాలి అని ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె తెలిపారు. గతంలో కూడా ఇలాగే రెండు సార్లు బంకు తాళాలు పగులగొట్టిన ఘటనలు ఉన్నాయి అలాంటి వారి పైన చర్యలు తీసుకోవాలి అని ఆమె కోరారు. అసలే కరోనా కష్ట కాలం మళ్ళి ఈ ఘటనతో నేను ఎలా బతకాలి అని ఆమె బాధపడ్డారు. అధికారులు చొరవతీసుకుని ఆమెకు ఆర్ధిక సాయం చెయ్యాలి అని స్థానికులు కోరారు 















































Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Powered by Blogger.